అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణ నిధి విషయమై బాధ్యతా రహితమైన ట్వీట్ చేసినందు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి పై VHP మండిపాటు !

0
VHP Slams 'irresponsible' Kumaraswamy Alleging 'Nazi Tactics' In Ram Mandir Fundraising
 VHP Slams 'irresponsible' Kumaraswamy Alleging 'Nazi Tactics' In Ram Mandir Fundraising
'అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణ నిధి సమర్పణలో భాగస్వాములు కాని వారి ఇళ్లను ఆర్ ఎస్ ఎస్ గుర్తించింది. జర్మనీలో నాజీలు చేసిన దానికి ఇది సమానం.” అంటూ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్ డి కుమారస్వామి ట్విట్టర్ లో చేసిన వ్యాఖ్యలపై విశ్వహిందూ పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇవి పూర్తిగా బాధ్యతా రహితమైన వ్యాఖ్యలని, ప్రకటనలు చేసే ముందు వాస్తవాలను పరిశీలించాలని వీహెచ్ పీ కుమార స్వామికి హితవు పలికింది.
“ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు వాస్తవాలను పరిశీలన చెయ్యాలి. ఇది పూర్తిగా బాధ్యతా రహితమైన ట్వీట్. రాష్ట్రంలో అత్యున్నత పదవిలో పని చేసిన వ్యక్తి చేసిన ఇటువంటి ఆరోపణలను వీహెచ్ పీ తీవ్రంగా పరిగణిస్తోంది. ఆర్ఎస్ఎస్ అనేది దేశభక్తిని గట్టిగా విశ్వసించే సంస్థ. ప్రపంచంలోనే అత్యున్నత సేవలు అందించే సంస్థ. ఇటువంటి సంస్థ గురించి కుమారస్వామి చేసిన అనవసర వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.” అని వీ హెచ్ పీ ఒక ప్రకటనలో తెలిపింది.
“ప్రభు శ్రీరాముడు భారతదేశం యొక్క స్వాభిమానానికి చిహ్నమని, ఆయన నడచిన మార్గం ప్రపంచానికే ఆదర్శమని భావించి వారు చూపిన ధర్మ మార్గంలో ఈ దేశ ప్రజలు నడవాలని విశ్వసిస్తారు. 500 ఏళ్ల నాటి కల 4,50,000 మంది ప్రాణ త్యాగం ఈ మందిరం నిర్మాణం. అందువల్ల దేశంలో ప్రతి కుటుంబాన్ని మందిర నిర్మాణంలో భాగస్వామ్యం చెయ్యాలని వీ హెచ్ పీ కోరుకుంటోంది” అని ఆ సంస్థ ప్రకటించింది.

__విశ్వ సంవాద కేంద్రము (ఆంధ్ర) - Republicworld

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలు, సూచనలు క్రింద ఉన్న గడిలో తెలియపరచగలరు !

ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలు, సూచనలు క్రింద ఉన్న గడిలో తెలియపరచగలరు !

Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top