మతం మారినా సనాతన ధర్మ మూలాలు మరువని ఇండొనేషియన్లు !

మతం మారినా సనాతన ధర్మ మూలాలు మరువని ఇండొనేషియన్లు - Indonesians who do not forget the roots of the sanatan dharma, even though religion changes
పూర్వం హిందూ వైభవంతో వెలుగొందిన జావాద్వీపమే నేటి ఇండోనేషియా. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక ముస్లింలు ఉన్న దేశమది. 14 వ శతాబ్దం వరకూ హిందూ దేశంగా ఉన్న ఇండోనేషియా, అరబ్బులు సుగంధ ద్రవ్యాల వ్యాపార నిమిత్తం అక్కడకు వచ్చి అక్కడి హిందువుల ఆర్దిక మూలాల్లోకి చొచ్చుకి వెళ్లి, మెల్లిగా వారి మూలాలను లోబరచుకుని, మత మార్పిడి ద్వారా వారి మతాన్ని విస్తరింపజేశారు.
    అయినప్పటికీ అక్కడి దేవాలయాలు , సంస్కృతి, కళలు, చివరికి ప్రభుత్వము, పాలనతో సహా అన్నీ కూడా ఇప్పటికీ హిందూత్వపు మూలాలతో ఒకప్పటి హిందూత్వపు ఆనవాళ్ళకు సజీవ సాక్ష్యాలుగా మనకు కనిపిస్తూనే ఉన్నాయి..

” మచ్చుకు ఒక ఉదాహరణ ”
ప్రస్తుతం వారి దేశపు సైనిక వ్యవస్థలో సంస్కృత నినాదాలు ( motto ) చూడండి.
 • ఇండోనేషియన్ నేషనల్ ఆర్మడ్ ఫోర్స్ – త్రి ధర్మ ఏక కర్మ
 • ఇండోనేషియన్ ఆర్మీ – కార్తీక ఏక పక్షీ
 • ఇండోనేషియన్ నావీ – జలస్వేవ జయామహే :
 • Indonesian Marine Corps – జలేషు భూమ్యాచ జయామహై మాయానేత యామాధిపతి
 • Navy Submarine Unit- వీర అనంత రుధిర
 • Indonesian Naval Academy- శ్రీ ధర్మశాంతి
 • ఇండోనేషియన్ ఏయిర్ ఫోర్స్ – స్వభువన పక్ష
 • ఇండోనేషియన్ నేషనల్ పోలీస్ – రాష్ట్ర సేవకోత్తమ
 • ఇండోనేషియన్ NADFC – లబ్డ ప్రకాశ నిర్వికార
 • Infantry army – యుద్ద వస్తు ప్రముఖ
 • Field Artillery – త్రి సంధ్య యుద్ద
 • Air Defense Artillery – వ్యక్తి రక్షా బల శక్తి
 • Cavalry – త్రిదయ శక్తి
 • Army Military police – సత్య వీర విచక్షణ
 • Corps of Engineers- యుద్ధ కార్య సత్య భక్తి
 • Signal Corps – శీఘ్ర ఆప్త నిర్భయ
 • Psychological Corps – ఉపక్రియ లబ్ద ప్రయోజన బలోత్తమ
 • Ordnance Corps – ద్విశక్తి భక్తి
 • Topography Corps – లిఖిత భూతల యుద్ధ కార్య
 • Army Research and Development – సతితి శక్తి భక్తి
 • Army Strategic Command – ధర్మ పుత్ర
 • 1st Kostrad Infantry Division – ప్రకాశ వీర గుప్తి
 • 2 st Kostrad Infantry Division – వీర శక్రి యుద్ధ
 • 18th Paratrooper Brigade – సర్వత్ర ఏవ యుద్ధ
 • Army Special Forces Command – త్రిభువన చంద్రస సత్యధర్మ
 • Special Forces Education – త్రియుద్ధ శక్తి
 • 1st Para Commandos – ఏక వస్తు బలాధిక
 • 2nd Para Commandos – ద్వి ధర్మ బిరవ యుద్ధ
 • 3rd Group (Combat Intelligence unit)-కోట్టమాన్ వీరనరచాబ్యుహ
 • Indonesian Military Academy- అధితకార్య మహాత్వవీర్య నగరభక్తి
 • Indonesian Police Academy – ధర్మ విచక్షణ క్షత్రీయ
 • Traffic Police Corps – ధర్మకేర్త మార్గ రక్ష్యక
 • Air force Doctrine, Education and Training Development Command – విధ్యసేన వివేక వర్ధన
 • Air Force Staff and Command school – ప్రజ్ఞ పరమార్ద జయ    చరిత్రలో ఎక్కడ చూసినా, ఏ దేశ‌ంలోనైనా ఎడారి మతాలు విస్తరించడానికి కారణం ఒక్కటే కారణం. వారు ఏ దేశం వెళ్ళినా ఆ దేశపు ఆర్దిక వ్యవస్థలోకి, వ్యాపారాల ద్వారా చొచ్చుకొని వెళ్లి, వారు మార్చాలి అనుకున్న వర్గాన్ని విడదీసి, తద్వారా పట్టు సాధించి వారి మతాన్ని విస్తరింపజేయడం. ప్రస్తుతం భారతదేశంలో కూడా ఆ కార్యక్రమం చాపకింద నీరులా సాగుతోంది. తస్మాత్ జాగ్రత్త.

రచన: నవీన్ కుమార్ సిరిమల్లె - 9966342460
__విశ్వ సంవాద కేంద్రము (ఆంధ్ర)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top