తెలంగాణ: ప్రలోభాలకు గురిచేస్తూ మతమార్పిడులకు పాల్పడుతున్న పాస్టర్ పై కేసు నమోదు.

0
మతమార్పిడుల ముఠా
మతమార్పిడుల ముఠా 
తెలంగాణలోని వనస్థలిపురంలో హిందువులను మత మార్పిడులు చేస్తున్నారని ఓ పాస్టర్ పై ఆరోపణలు వచ్చాయి. వనస్థలిపురంలోని హస్తినపురంలోని జెరూసలేం చర్చిలో పాస్టర్ గా పని చేస్తున్న జి.చంద్ర మౌలి తన భార్యతో కలిసి జయమ్మ అనే వ్యక్తి ఇంటికి వెళ్లి 'ప్రార్థన' చేశాడు.
   ఆ సమయంలో "హిందూ ధర్మ రక్షకులు" అక్కడికి వచ్చి పాస్టర్ ను అడ్డుకొన్నారు. అనంతరం చంద్ర మౌళి వనస్థలిపురం పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ఐపీసీ 295(ఏ), 323, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.ఈ కేసు ప్రస్తుతం పోలీసుల విచారణలో ఉంది. 

మతమార్పిడుల పై మరుసటి రోజు, బిజెపి, ఆర్ ఎస్ ఎస్ తో సహా వివిధ సంస్థల కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేసారు. మత విద్వేషాలను వ్యాప్తి చేస్తున్న వారిపై పోలీసులు మౌనదీక్ష చేస్తున్నారని ఆరోపిస్తూ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో నిరసన వ్యక్తం చేశారు.

హౌస్ చర్చిలు :
క్రైస్తవ మిషనరీ సంస్థలు మతమార్పిడిల కోసం ఇళ్లమధ్య ఉండేటట్టుగా ఒక ఇంటిని అద్దెకు తీసుకుని ఆరాధన కోసమంటూ ప్రజలను మభ్యపెట్టి మతమార్పిడి చేయడానికి ఉపయోగించే సాధనలలో 'హౌస్ చర్చిలు'అనేవి వారి మతమార్పిడి  వ్యూహాలలో ఇది ఒకటి.
    అటువంటి కేంద్రాల్లో జరిగే ‘ప్రార్థన సమావేశాలలో’ హిందూ మతాన్ని అవమానించడం, దూషించడం హిందూ దేవతామూర్తులను నాశనం చేయమని చెప్పడం, హిందువు దేవుళ్లను ‘ సాతాను - రాక్షసులు’  తద్వారా హిందూ ద్వేషులుగా, దేశ విశ్చిన్నకర శక్తులుగా అక్కడికి వచ్చిన వారిని తయారుచేయడం దారుణాలు అక్కడ జరుగుతున్నాయి. 

Source: Hindu Post

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top