పతంజలి ‘కొరోనిల్‌’కు డ‌బ్ల్యూ.హెచ్.‌వో ఆమోదం - WHO approves Patanjali 'Coronel' Ayurveda medicine

0
పతంజలి ‘కొరోనిల్‌’కు డ‌బ్ల్యూ.హెచ్.‌వో ఆమోదం - WHO approves Patanjali 'Coronel' Ayurveda medicine
‌రోనా నివార‌ణ‌కు పతంజలి ఆయుర్వేద సంస్థ రూపొందించిన ఔషధం ‘కొరోనల్’ను ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ(డ‌బ్ల్యూ.హెచ్.‌వో) ఆమోదించింద‌ని యోగా గురువు బాబా రామ్‌దేవ్ తెలిపారు. ఈ మేర‌కు పతంజలి రూపొందించిన ‘ఎవిడెన్స్ బేస్ట్ మెడిసెన్’ పరిశోధనా పత్రాన్ని రామ్‌దేవ్ బాబా శుక్రవారం ఢిల్లీలోని ఒక కార్య‌క్ర‌మంలో కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, మ‌రో మంత్రి నితిన్ గడ్కరి సమక్షంలో విడుదల చేశారు. ఈ సంద‌ర్భంగా బాబా రామ్‌దేవ్ మాట్లాడుతూ పతంజలి కోవిడ్ మెడిసిన్ ‘కొరోనిల్’కు చెందిన అన్ని అనుమానాలను ఈ పరిశోధనా పత్రం పటాపంచలు చేస్తుందన్నారు. శరీరంలో రోగనిరోధ‌న శ‌క్తిని పెంచేందుకు, కోవిడ్-19ను అదుపు చేసేందుకు కొరోనిల్‌ సమర్ధవంతంగా పని చేస్తుందని ఆయ‌న తెలిపారు. ప‌తంజ‌లి రూపొందించిన ఔషధానికి భారత ప్రభుత్వంతో పాటు, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.హెచ్‌.వో) గ్రీన్‌సిగ్నల్ ఇవ్వ‌డం ప‌ట్ల ఆయ‌న సంతోషం వ్య‌క్తం చేశారు. 150 దేశాల‌కు పైగా ఈ ఔష‌దాన్నిసరఫరా చేసేందుకు, కోవిడ్-19ని అదుపు చేసేందుకు ‘కొరోనిల్’ సిద్ధంగా ఉందని చెప్పారు.

గ‌తేడాది జూన్‌లో కొరోనిల్ లాంచ్ అయినప్పుడు ‘ఇమ్యూనో బూస్టర్’గా త‌యారు చేయ‌డానికి లైసెన్స్ వ‌చ్చింద‌ని, ఆ తర్వాత క్లినికల్, కంట్రోల్, ట్రయిల్ రీసెర్చ్ జరిపామని బాబా రాందేవ్ తెలిపారు. అయితే ఈ ప్రక్రియకు సమయం పడుతుందని డ్రగ్ లెసెన్స్ అధికారి తమకు చెప్పాడని అన్నారు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి ఆరు నెలలు పట్టిందని, మొదట ఇమ్యునిటీ బూస్టర్ లైసెన్స్‌ను లైసెన్సింగ్ అధికారి ద్వారా తాము పొందామన్నారు. ఇప్పుడు కోవిడ్-19 చికిత్సకు, కోవిడ్‌ అనంతర సమస్యలను కూడా సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు కొరోనిల్ ఉపయోగపడుతుదని రాందేవ్ బాబా తెలిపారు.

దేశ‌వ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సిన్ పంప‌ణీ గత జనవరి 16న మొదలైంది, కొరోనిల్ మార్కెట్లోకి ఆల‌స్యంగా రావ‌డానికి కారణం అడిగినప్పుడు, ” నిజానికి ఔషధం ముందుగానే వచ్చినప్పటికీ, దాని చుట్టూ వివాదం ముసురుకుందని, ఆ అపోహలన్నీ ఇప్పుడు తొలగిపోయాయి.” అని రామ్‌దేవ్ బాబా సమాధానమిచ్చారు.

త‌మ వైపు నుంచి ఎటువంటి జాప్యం జ‌ర‌గ‌లేద‌ని, కొన్ని శక్తుల కారణంగా కొరొనిల్ ఆల‌స్య‌మైంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. డ్రగ్ మాఫియా, మెడికల్ టెర్రరిజం వంటివి కొరొనిల్‌ను అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశాయ‌న్నారు. మొత్తానికి ప్రజల అపోహలు కూడా ఇప్పుడు తొలగిపోవడం చాలా సంతోషంగా ఉంద‌న్నారు. యోగా, ఆయుర్వేదం ప్రపంచాన్ని శాసించే కొత్త శకం రాబోతోందని, ఆరోగ్య రంగంలో ప్రపంచానికి భారతదేశం మార్గనిర్దేశం చేయబోతోందని ఆయ‌న చెప్పారు.

__విశ్వ సంవాద కేంద్రము (తెలంగాణ)

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలు, సూచనలు క్రింద ఉన్న గడిలో తెలియపరచగలరు !

ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలు, సూచనలు క్రింద ఉన్న గడిలో తెలియపరచగలరు !

Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top