ఖురాన్ లో ఉగ్రవాదాన్ని ప్రేరేపించే ఆ 26 ఆయాత్ లను భారత్ లో తొలగించాలి – సుప్రీంకోర్టులో PIL దాఖలు చేసిన ముస్లిం మేథావి

0
వసీమ్ రజ్వీ
వసీమ్ రజ్వీ
PIL దాఖలు చేసిన వ్యక్తి ఒక ముస్లీం. ఆయన పేరు వసీమ్ రజ్వీ. ఈ PIL ఏ విషయం పై దాఖలు చేశాడో వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఇక ఈ పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ గురించి తెలుసుకుందాం.

వసీమ్ రజ్వీ అనే చదువుకున్న నిజమైన సెక్యులర్ ముస్లీం ఖురాన్ గురించి సుప్రీం కోర్టు తలుపులు తట్టాడు. పైగా ఈయన షియా వక్ఫ్ బోర్డు చైర్మన్ గా కూడా పనిచేశారు. ఇంతకు ముందు కూడా ఈయన ముస్లీములలోని దురాచారాలను వ్యతిరేకిస్తూ నినదించాడు. ఇప్పుడు ఖురాన్ లో 26 ఆయాత్ లు టెర్రరిజాన్ని ప్రేరేపించేవిగా ఉన్నాయని, వాటిని భారతదేశంలో రద్దు చేయాలని. ఈ 26 ఆయాత్ లు మహమ్మద్ ప్రవక్త చెప్పని ఆయాత్ లని, అవి తరువాతి కాలంలో వచ్చిన ఖలీఫాలు చొప్పించిన ఆయాతులని కాబట్టి వీటిని తొలిగించాలని వసీమ్ రజ్వీ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు.

ఈ 26 ఆయాత్ ల వల్ల ముస్లీం సమాజం టెర్రరిస్టు సమాజంగా చూడబడుతోందని, ఈ 26 ఆయాతుల వల్లే ముస్లీం సమాజంలో టెర్రరిస్టులు తయారౌతున్నారని కాబట్టి ఈ 26 ఆయాతులను ఖురాన్ నుండి భారత్ లో తొలగించమని అభ్యర్థించాడు.

“ఈ 26 ఆయాత్ లలో ముస్లీం కాని వాడిని కాఫిర్ అనాలని, కాఫిర్ ని చంపినా తప్పులేదని, ఎక్కువ మంది కాఫిర్లను చంపితే వారికి జన్నత్ (స్వర్గం) దొరుకుతుందని చెబుతాయి. జిహాద్(కాఫిర్లపై యుద్దం) అనేది జన్నత్ కి(స్వర్గానికి) మార్గం అనే యుద్దానికి ప్రేరేపిస్తాయి.” అని పేర్కొనబడి ఉంది. వాటిని తొలగించాలి. అని సుప్రీంకోర్టును కోరాడు. ఇక సుప్రీం కోర్టు ఎటువంటి నిర్ణయాన్ని ఇస్తుందనేది వేచి చూడాల్సిన విషయం.

__విశ్వ సంవాద కేంద్రము - 
Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top