రాబోయే ఎన్నికలలో BJP కూటమికే మా మద్దతు – క్రిస్టియన్ అసోసియేషన్ అండ్ అలయన్స్ ఫర్ సోషల్ యాక్షన్

0
Our support for the BJP alliance in the upcoming elections - Christian Association and Alliance for Social Action
త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏకు మద్దతు ఇస్తామని క్రిస్టియన్ అసోసియేషన్ అండ్ అలయన్స్ ఫర్ సోషల్ యాక్షన్ (కాసా) తెలిపింది. ఇప్పటి వరకు కేరళ క్రైస్తవ సమాజం  రెండు పార్టీలకు మద్దతు ఇస్తూ వస్తుంది. ఒకటి కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ కి, రెండు కమ్యూనిస్టుల నేతృత్వంలోని ఎల్డిఎఫ్ కి,  ఈ రెండు కూటములే ఎల్లప్పుడూ క్రైస్తవ సమాజంలో పెద్ద భాగంగా ఉంటూ వచ్చేవి…

కానీ క్రిస్టియన్ అలయన్స్ ఫర్ యాక్షన్(కాసా) ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తూ… గత కొన్ని సంవత్సరాలుగా, ఈ రెండు ఫ్రంట్లు క్రైస్తవ సమాజాన్ని పూర్తిగా విస్మరిస్తూ వస్తున్నాయని, కేరళను ఇస్లామిక్ షరియా రాష్ట్రంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నా… లవ్ జిహాద్ తో ముస్లిం సమాజం మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా వారి మద్దతు పొందడానికి రెండు కూటములూ పోటీ పడుతున్నాయని. ఒకప్పుడు లౌకిక ఫ్రంట్ అయిన యుడిఎఫ్ ఇప్పుడు ముస్లిం మతతత్వ కేంద్రంగా మారిందని చెప్పుకొచ్చారు.
ముస్లిం సమాజాన్ని ప్రసన్నం చేసుకోవటానికి క్రైస్తవ సమాజం ఎదుర్కొంటున్న బ్యూరోక్రసీలో 80:20 రిజర్వేషన్లు, వివక్షను పరిష్కరించడంలో రెండు పార్టీలు విఫలమయ్యాయని. తీరప్రాంత పిల్లలు ఎదుర్కొంటున్న ఇఎఫ్ఎల్ చట్టం, వన్యప్రాణుల వేధింపులు, రాబడి, అటవీ, కొండ రైతులపై పోలీసుల వేధింపులు వంటి సంక్లిష్ట సమస్యలను పరిష్కరించడంలో వరుసగా ఈ ప్రభుత్వాలు విఫలమయ్యాయని వాటిని పరిష్కరించడానిక ఏనాడు మనస్ఫూర్తిగా ప్రయత్నం కూడా చేయలేదని వారు అన్నారు.

రాబోయే 20 ఏళ్లలో కేరళను ఇస్లామిక్ రాజ్యంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు ముస్లిం సమాజంలోని ఒక విభాగం చేత ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నాయని మాజీ ముఖ్యమంత్రి వి.ఎస్. అచ్యుతనందన్ చేసిన ప్రకటనను కూడా వీళ్ళు తీవ్రంగా పరిగణించలేదని వారు ఫేస్‌బుక్‌లో ఆరోపించారు.

స్వచ్ఛమైన వ్యక్తులైన ఇ.శ్రీధరన్, జాకబ్ థామస్, టిపి సెంకుమార్ మరియు ఆనందబోస్ నాయకత్వంలో న్యాయమైన పాలనా వ్యవస్థను స్థాపించడానికి క్రైస్తవ సమాజం దేశం కోసం భిన్నంగా ఆలోచించాల్సిన అవసరం వచ్చిందని ఫేస్‌బుక్‌లో కాసా నొక్కి చెప్పింది.

___విశ్వ సంవాద కేంద్రము

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
Translate this post ⬇

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top