హిందూ ధర్మంలోకి మారితేనే ఓ ముస్లిం మహిళ, హిందూ పురుషుడి మధ్య జరిగిన వివాహం చెల్లుతుంది

0
హిందూ మతంలోకి మారితేనే ఓ ముస్లిం మహిళ, హిందూ పురుషుడి మధ్య జరిగిన వివాహం చెల్లుతుంది - Muslim woman’s marriage with Hindu man invalid till she converts, observes Punjab and Haryana High Court.
Muslim woman’s marriage with Hindu man invalid till she converts, observes Punjab and Haryana High Court.
March 13, 2021:: వధువు హిందూ మతంలోకి మారేవరకు ముస్లిం మహిళ, హిందూ పురుషుడి మధ్య జరిగిన వివాహం చెల్లదని పంజాబ్, హర్యానా హైకోర్టు వ్యాఖ్యానించింది.

18 ఏళ్ల ముస్లిం మహిళ, 25 ఏళ్ల హిందూ వ్యక్తి వేసిన పిటిషన్‌ను విచారించిన పంజాబ్, హర్యానా హైకోర్టు ధర్మాసనం, వధువు హిందూ మతంలోకి మారే వరకు చట్టరీత్యా వారి వివాహం చెల్లదని ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే వాళ్ళు మేజర్లు (పెద్దవారు) అయినందున ఏకాభిప్రాయతో అన్యోన్యమైన జీవితంతో ఉండవచ్చని కోర్టు తెలిపింది. ఈ వివాహానికి వ్యతిరేకంగా తమ కుటుంబ సభ్యులు బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ ఈ జంట రక్షణ కోసం కోర్టును ఆశ్రయించారు.

తాము సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంబాలా ను కూడా ఆశ్రయించినట్లు దంపతులు కోర్టుకు తెలిపారు. అంబాలాకు భద్రత కల్పించినా ఎలాంటి చర్యలు తీసుకోక చివరకు హైకోర్టును ఆశ్రయించక తప్పలేదని కోర్టుకు విన్నవించారు. దంపతుల భద్రతపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోర్టు ఎస్పీ అంబాలాను ఆదేశించింది.

ముస్లిం చట్టం ప్రకారం రజస్వల అయిన తర్వాత బాలికలను వివాహం చేసుకోవడానికి అనుమతిస్తు గత నెలలో పంజాబ్, హర్యానా హైకోర్టు ఓ మైనర్ ముస్లిం బాలిక వివాహాన్ని ధ్రువీకరించింది. 

Source input: he
Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top