రామ మందిరం ట్రస్టు : ఇంటింటి వెళ్లి విరాళాల సేకరణను నిలిపివేసిన రామ మందిరం ట్రస్టు బోర్డు

0
రామ మందిరం ట్రస్టు
యోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం ఇంటింటికీ వెళ్లి చందాలు స్వీకరించే కార్యక్రమాన్ని నిలిపి వేసినట్టు రామజన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్టు కార్యదర్శి చంపత్‌ రాయ్‌ వెల్లడించారు. ప్రజలు ఆన్‌లైన్‌లో తమ ట్రస్ట్‌ వెబ్‌సైట్‌ ద్వారా విరాళాలు ఇవ్వొచ్చన్నారు. మూడేళ్లలో రామమందిరం నిర్మాణం పూర్తవుతుందని వెల్లడించారు. ఆలయం ముందు మరికొంత స్థలం కోసం చర్చలు జరుపుతున్నట్టు ఆయన తెలిపారు.

రామ మందిరం నిర్మాణం కోసం నిధులు సేకరించాలని ట్రస్టు వీహెచ్‌పీని కోరింది. దీంతో దేశ వ్యాప్తంగా జనవరి నుంచి విరాళాల సేకరణ ప్రక్రియ మొదలైంది. సామాన్యులతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు తమకు తోచినంత మొత్తాన్ని అయోధ్య రాముడి మందిరం నిర్మాణం కోసం విరాళాలుగా అందజేశారు. గతేడాది ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోదీ రామమందిరం నిర్మాణానికి భూమి పూజ చేసిన విషయం తెలిసిందే.

__విశ్వ సంవాద కేంద్రము 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top