శివరాత్రి నాడు చేయవలసినవి , చేయకూడని కార్యములు - Shivratri

0
శివరాత్రి నాడు చేయవలసినవి , చేయకూడని కార్యములు - Shivratri
శివరాత్రి
: శివరాత్రి నాడు చేయవలసినవి , చేయకూడనివి :
   శివరాత్రి అనగానే అందరికీ గుర్తుకువచ్చేది.. లింగోద్భవం. అసలు లింగోద్భం గురించి పురాణాగాథలు ఏమిటో తెలుసుకుందాం… శివరూపం లింగరూపం అందులోనూ వృత్తాకారం శివుడు , పానవట్టం పార్వతీరూపం అని ఆగమ వాక్యం. 
   ఒకప్పుడు హరిబ్రహ్మాదులకు చైతన్యకారకం గురించి స్పర్థ వచ్చినప్పుడు వారిమధ్య ఒక పెద్ద జ్యోతి రూపం ఏర్పడింది. ఆ రూపం పై కొన చూడటానికి హంస రూపంలో బ్రహ్మ , వరాహంగా విష్ణువు వెళ్లారు ఎంతసేపటికీ అంతు తెలియక అలసిపోయి ప్రార్థన చేయగా ఆజ్యోతి శివలింగాకారం ప్రతీకగా ఏర్పడినది. జ్ఞానరూపియైన శివుడు చైతన్యజ్యోతిగా ఆవిర్భవించిన రాత్రి అమావాస్యగా చెపుతారు దానిముందురోజు శివరాత్రిగా చెపుతారు. కాబట్టే లోకంలో ఇప్పటికీ త్రయోదశి చతుర్దశి కలిసిన రోజుని శివరాత్రిగా చెపుతారు. ఇది ప్రతిమాసంలో వస్తుంది. కానీ పాలసముద్రం చిలికినపుడు హాలాహలభక్షణం చేసి ఒక చిన్న రేగుపండు అంతగా చేసి కంఠంలో ధరించిన రాత్రి, లోకాల్ని కాపాడిన మహా శివుడిని ఆ రాత్రి  దేవతలు జనులు జాగరణతో ప్రార్థించిన రాత్రిగా మహాశివరాత్రి అని చెపుతారు. లోకమంతా శివరక్షణవల్ల మంగళాన్ని పొందుటవల్ల దానికి ప్రతీకగా శివ కళ్యాణాన్ని కూడ జరుపుతారు.

లింగోద్భవ పుణ్యకాలంలో శివరాత్రి నాడు చేయవలసిన విధులు ఇవే..
  అన్నం కాకుండా పాలు , పండ్లు పలహారం మాత్రమే తీసుకోవాలి తక్కువ ఆహారం తీసుకోవాలి ఇతరులతో మాటల్లోకూడా దైవసంబంధమైనవే ఎక్కువగా ఉండటం వీలైనంత తక్కువ మాట్లాడటం ఎక్కువసేపు పంచాక్షరీ ఓం నమశ్శివాయ జపం చేయటం పండ్లు పలహారాలు దేవునికి నివేదించటం వాటిని ఇతరులకు పంచిపెట్టటం వీలైనంత వరకు జాగరణచేయటం శివునికి అభిషేకం చేస్తే చాలా మంచిది. చాపమీద పడుకోవాలి , స్త్రీ లైనా పురుషులైనా బ్రహ్మచర్యం పాటించాలి. లింగోద్భవపుణ్యకాలం వరకూ మేల్కొని ఉండాలి. వీలైతే మరుసటి రోజువరకూ ఉండాలి.

శివరాత్రిరోజు చేయకూడనివి ఇవే..
   అనారోగ్యంతో ఉపవాసం చేయకూడదు సాత్విక ఆహారం కాకుండా ఇతర ఆహారం స్వీకరించి పూజించకూడదు. ప్రాతస్సంధ్య , సాయం సంధ్యలో నిద్రపోకండి , శివ పూజకి మొగలిపూవు వాడకండి. నీటిని అభిషేకానికి ఎక్కువగా వాడండి ఇతరపదార్థాలు (పంచామృతం , పండ్లరసాలు , సుగంధ పరిమళ పదార్థాలు) తక్కువగా వాడండి. సిమెంట్ రాతివంటి అన్నిలింగాలకన్నా పుట్టమన్నుతో చేసినశివలింగానికి అభిషేకిస్తే ఎక్కువ ఫలితం వస్తుంది. తినాల్సిన స్థితివస్తే పిండిపదార్థాలు తీసుకోవచ్చు. పండ్లు , పాలు తీసుకోండి. అవీ తక్కువ మోతాదులో శరీరానికి అవసరమైన కనీసస్థాయిలో మాత్రమే.ఓం నమః శివాయ

టెలిగ్రామ్‌లో తెలుగు-భారత్ ను అనుసరించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి. ప్రతిరోజు మేము అందించే ఉత్తమ కథనాలను పొందండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
Translate this post ⬇

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top