ఆత్మహత్య మాహా పాపం - నరకం-Atmahatya : Suicide is a Sin

0
ఆత్మహత్య మాహా పాపం - నరకం-Atmahatya : Suicide is a Sin
: ఆత్మహత్యలపై విశ్లేషణాత్మక వ్యాసం :

తల్లిదండ్రులారా యువతి యువకుల్లారా దయచేసి ఒక్కసారి  ఇదితప్పకుండా చదవండి ఇది మీకు ఎంతో ఉపయోగపడుతుంది
.
ఆత్మ ఇక్కడ ఎన్ని రోజులుఉండాలి అనే దైవ నిర్ణయం ఉంటుందో ఆ ప్రకారం అనుకున్నన్ని రోజులు ఉండనివ్వాలి అలా కాదు మధ్యలో హత్య(ఆత్మహత్య) చేసి పంపిస్తాను అంటే ఆత్మను హత్యచేస్తే మహాపాపం నరకం కూడా.. అయితే ప్రతీ సమస్యకు పరిష్కారం ఉంటుంది పరిష్కారం లేని సమస్యే ఉండదు కొన్నిటిని కాలమే తప్పకుండా పరిష్కారం చేస్తుంది ఎటొచ్చి కొంచెం ఓపిక సహనం అవసరం సమస్యలు రాని మనిషoటూ ఎవ్వరు ఉండరు ప్రతీ సమస్యకు భయపడి చస్తే ఈ భూమిమీద ఏఒక్కరు కూడా బ్రతికి ఉండరు.

దిక్కు ఉన్న మనమే హడలి పోతే! ఏ దిక్కులేని దేవుడు ఇంకెంత భయపడాలి మనకు ఆపద వస్తే మన అనుకునేవాళ్లకు చెప్పుకుంటాం దేవునికి మొరపెట్టుకుంటాం మరి దేవుడు ఎవరికి చెప్పుకోవాలి, దేవునికి దిక్కెవ్వరు,ఆయనకూడా లోకకల్యాణం చేయుటకు అవతరించినప్పుడు ఆయనకు కూడా ఎన్నెన్నో కష్టాలు వచ్చాయి

రామావతారంలో చూస్తే గనుక పసిప్రాయoలో అడవులకు వెళ్లి విశ్వామిత్రుని యజ్ఞరక్షణకై నిర్విరామంగా కాపాలావుండడం మహా బలశాలులైన మాయలమారి రాక్షసులతో పోరాటం
ఆపై14 సంవత్సరాలు వనవాసం, బార్యవియోగం,లక్షలాది రాక్షసులతో పోరాటం (మనం ఒక్కరిద్దరితో పోరాటానికే చస్తున్నాం)ఇలా చూస్తే రాముడు ఏ ఒక్కరోజు కూడా సుఖంగా లేడు మనకే అలాంటి పరిస్థితి వస్తే మనం ఒక్కరోజైనా అడవుల్లో గడపగలమా ఆలోచించండి.

కృష్ణావతారం చూస్తే గనుక జన్మనెత్తడమే జైలులో కఠిక నేలపై పుట్టాడు పుట్టిన పసికందు తల్లి ఆలనా పాలనకు నోచుకోకుండా ఎక్కడికో తీసుకుపోయి పరాయివారి వద్ద ఉంచారు పోనీ అప్పుడైన అక్కడైన సుఖంగా ఉన్నడా అంటే అదీలేదు చిఱుప్రాయంలోనే  హత్య చేయడానికి పూతన, బకాసురుడు,మొదలగు ఎందరెందరో రాక్షసులు వేధించారు వెంటపడ్డారు. అలాగే ఒకానొక సందర్భంలో తనను నమ్మిన వారిని రక్షించేందుకు గోవర్ధన పర్వతాన్ని గోటిపై వారం రోజులు నిద్రాహారాలు మాని మోయాల్సిరావడం తర్వాత కంసునితో పోరాటం. జరాసంధునితో యుద్ధం , జరాసందుడు17 సార్లు దండయాత్రచేస్తే ఎదురుకొని పోరాటంచేసి17సార్లు ఓడించాడు అయినా జరాసందుడు 18 వసారిమళ్ళీ దండయాత్రకు వస్తేపోరాటంలో అనేక మందిప్రాణాలు పోతున్నాయని ఎందరెందరో అవిటివాళ్ళు అవుతున్నారని యుద్ధం నుండి రాజ్యమును కాపాడాలనే ఒకేఒక్క కారణంగా అపర భగవానుడైన,ఆదిదేవుడైన శ్రీకృష్ణుడు సముద్రం అవతలకు వెళ్లిపోయి పర్వతంపై కొన్నిరోజులు నివాసం ఉన్నాడు

ఆ తరువాత శమంతకమణిని ఎత్తుకపోయాడని సత్రాజిత్తు రాజు దొంగతనం నింద వేయడం. దేవదేవుడి మీద దొంగతనం నిందపడితే ఎంత అవమానం నిజంగా మరి ఆ అమానానికి తాళలేక కృష్ణుడు ఆత్మహత్య చేసుకున్నాడా, లేదే ఆ నింద తొలిగిపోవడానికి ఎంత శ్రమించాడు ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద కధే అవుతుంది. 
  సమస్య వచ్చినప్పుడు సమస్య వెనక పడాలి మార్గం అన్వేషించాలి అవకాశం లేనిచోట అణువుగాని వేళ రెండు అడుగులు వెనక్కి వేయాలి, సమస్య మూలలను శోధించి దానికి కారణాలను కనుక్కోవాలి, మన ప్రవర్తనా లోపాలు ఉంటే ముందుగా వాటిని త్యజించాలి, తర్వాత సమస్యను సాధించాలి, జీవిత గమనాన్ని సాగించాలి.

ముఖ్యంగా సమస్యవచ్చిన వారి ఆలోచనలు వేధనాభరితమైన మనస్సు వలన ముందుకు సాగవు, అలాంటప్పుడు, నిష్కల్మషంగా నీకు సహకరించే నలుగురికి చెప్పుకోవాలి పరిష్కార మార్గాలు అన్వేషించాలి. కానీ కోటానుకోట్ల జన్మల తరువాత వచ్చే ఈ అరుదైన అమూల్యమైన మానవజన్మను మధ్యలో త్రుంచేయవద్దు. ఎన్నో చూడాలి ఎన్నో అనుభవించాలి నిన్ను దేవుడు ఏ కారణంచేత పుట్టించాడో నీవల్ల ఏమి సందేశం ఇవ్వాలి అనుకున్నాడో నీతో ఏ కార్యములు చేయించాలి అనుకున్నాడో దానిని ఆపే హక్కు, అధికారం మనకు లేనేలేదు, మధ్యలో పిరికితనంతో ఆత్మహత్య చేసుకోవటం, నిండు జీవితాన్ని అర్దాంతరంగా ముగించటం సమంజసమే కాదు, ఏ సమస్య వచ్చినా చావు పరిష్కారం కాదు మీ సమస్యని మీ ఆప్తులతోటి, హితులతోటి చెప్పుకుంటే ఎవరో ఒకరు తప్పకుండా సానుకూలంగా స్పందిస్తారు, అది మీకు సాధ్యం కాకుంటే అందరికి ఆప్తుడు, హితుడు, స్నేహితుడు, మన భారం మోసే భగవంతుడే ఉన్నాడు ఆయనను ఆశ్రయించoడి ఆయనే తీరుస్తాడు. 
   ఇది సత్యం,మనసా వాచా కర్మేణ అతనిపై పూర్తిగా భారం వేసి మకరం బారిన పడ్డ గజేంద్రునిలా సాగిలపడి "సంరక్షించు భద్రాత్మక"అని గొంతెత్తి పిలవండి, సమస్తం వదిలి మీ కోసం వస్తాడు ఆ నారాయణుడు, ఇక్కడ మీకోక సందేహం రావచ్చు స్వయంగా తానే కష్టాలు పడ్డవాడు మనలనేమి రక్షిస్తాడని అనుకుంటారేమో, కానీ ఆ జగన్నాటక సూత్రధారి తను అనుభవించి చూపింది మనకు స్ఫూర్తినివ్వడానికే తప్ప, పరిస్థితులను మార్చలేక కాదని గ్రహించండి, ఆ పరమాత్మ అపరిమిత శక్తిని ఈ విశ్వంలోని ఏ అవరోధమూ నిరోదించలేదు.

   మానవులకు కర్మానుసరణ ప్రాధాన్యతను, ఆత్మ పరమాత్మలో ఏకమయ్యే ఆవశ్యకతను తెలియచెప్పటంలో భాగంగా కష్టాలు ఎలా ఎదుర్కోవాలో దృశ్యాత్మకంగా తెలుపుతూ మానవులకు స్ఫూర్తినిచ్చే కొరకు మాత్రమే తాను స్వయంగా మానవ జన్మనెత్తి మనకోసం కష్టాలు అనుభవించి ఆదర్శంగా నిలిచిన కరుణాపయోనిధి ఆ సర్వేశ్వరుడు.

సర్వధర్మాన్ పరిత్యజ్యా మామేకం శరణంవ్రజా | 
అహంత్వా సర్వ పాపేభ్యో మోక్షఇష్యామి మాశూచహః || 

 ఈ వాఖ్యాన్ని స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మయే చెప్పాడు దీని అర్థం ఏమంటే ఇతరములైన ఉపాయములన్నిటిని సావాసనగా విడిచి నన్నే అన్నీ ఉపాయలకు ఉపేక్షకునిగా నమ్మి ఉండుమా సర్వశక్తి సంపన్నుడనైన నేను నిన్ను అన్నీ ప్రతిభందాకాల నుండి విడిపింతును దుఃఖింపకుమా అనీ భగవంతుడు ప్రతిజ్ఞా పూర్వకంగా ఉపదేశించాడు భగవత్గీతలో

ఒక్కసారి పై శ్లోకంలో నిజానిజాలు తెలుసుకుందాం :
   ఈ సకల చరాచర జగత్తులో కోటానుకోట్ల గ్రహాలు నక్షత్రాలు ఉన్నాయి, అలాంటి అనేక నక్షత్రాలు కల్గిన ఒక సమూహం పాలపుంత అందులో ఒక్క నక్షత్రం సూర్యుడు సూర్యుని చుట్టూ తిరుగుతున్న తొమ్మిది గ్రహాలలో ఒకటి భూమండలం దానిలో పీపీలికం అంతకూడా లేని మనం, ఇన్ని వైవిద్యాలున్న విశ్వంలో ఇన్ని గ్రహాలను ఆ గ్రహాలను తిప్పుకుంటున్న సూర్యునిలాంటి నక్షత్రాలను ఆ నక్షత్రాలను కలిగిన పాలపుంతలాంటి సమూహాలను ఒక క్రమపద్ధతిలో నిలిపి ఉంచి వేటి పని అవి సవ్యంగా చేసేలా చూస్తున్న శక్తే పరమాత్మ.

 అయితే, ఇంతటి అనంత విశ్వంలో ఒక భూమిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే భూమిపై 70% శాతంనీరు 30%భూమి ఉంది ఈ భూమిపై సుమారుగా 280 కిపైగా దేశాలు ఉన్నాయి అందులో మనదేశం ఎంత, మనదేశంలో మన రాష్ట్రమెంత, రాష్ట్రంలో మన జిల్లా ఎంత,  మనజిల్లాలో మన మండలమెంత, మన మండలంలో మన గ్రామం ఎంత,మనగ్రామంలో మన వీధి, మన వీధిలో మన ఇల్లు,మనఇంట్లో మనమెంత....????
   మరి ఇంత నిశితంగా భూమిని సూర్య చంద్రాది సకల గ్రహాలను మోసేవాడు మనభారం మోయలేడా మన భారం అయనకో లెక్కా ఒకసారి ఆలోచించండి, ఎటొచ్చి మనలో కొందరు  దైవాణ్ణి నమ్మక పోవడం ఆయనపై ఆయనశక్తి సామర్థ్యాలపై విశ్వాసం ఉంచకపోవడమే ఒక కారణం!
   కాబట్టి ప్రతీ తల్లిదండ్రులు పిల్లలకు ఆధ్యాత్మిక జీవనం అలవరచాలి పూర్తిగా లౌకికంగానే పెంచకూడదు. వారి సమస్యలను మీ సమస్యలుగా తీసుకోండి వారికి మీరు పూర్తి ధైర్యం ఇవ్వండి దేనికైనా మేమున్నాం అనే భరోసాను ఇవ్వండి తమ కుటుంబాల నుండి సంపూర్ణంగా మద్దతు భరోసా లేకపోవడం వల్లనే వ్యక్తులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు  ఈ రోజు మన కళ్ళముందు తిరిగే  ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడంటే దానికి కారణం అతనికి ఇంట్లో వాళ్ల మద్దతు సమాజం మద్దతు లేకపోవడమే, అదే గనుక అతనికి ఉండి ఉంటే ఆత్మహత్య చేసుకొనే పరిస్థితి రాదు, అతన్ని ఒంటరివాన్ని చేసి అతని భాధలు కష్టాలు,అతనిపై ఉన్న ఒత్తిడిని ఎవరూ పట్టించుకోక పోవడంతో, మానసికంగా ఒంటరివాడై తనను ఎవ్వరు పట్టించుకోవడం లేదు అనీ ఇక ఎందుకు బ్రతకాలి అనే క్షణికావేశంలో తప్పుడు నిర్ణయం తీసుకుంటాడు. కాని ఇది సరైన మార్గం కాదు, అలాంటి సమయంలో వారికి స్థైర్యాన్ని ఇవ్వడంలో కుటుంబం సమాజం ముందుండాలి.

కానీ మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి..
   ఏ సమస్యకైనా చావు పరిష్కారం కాదు ప్రతీ సమస్యను శోధించి సాధించాలి, ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్నవారు అర్థాoతరంగా అసువులు బాయడం సరైంది కాదు, ఆత్మహత్య ఏ సమస్యకు పరిష్కారం కాదు ఒకరి చావుతో సమస్యలు తీరిపోవు, కనిపెంచిన తల్లితండ్రులను లేదా మీ కడుపున పుట్టిన పిల్లల్ని అనాదలుగా చేయకండి, వారి ఆశలు అడియాశలు చేయకండి వారి కలలు కల్లలు చేయకండి!

తల్లిదండ్రులారా మీ పిల్లలకు మీరు ధైర్యం, నమ్మకం, భరోసా, ఇవ్వండి వారి కష్టనష్టాలు మీవిగా భావించి వారికి అండగా నిలవండి. మనో ధైర్యాన్ని ఇవ్వండి, మంచి మార్గంలోకి రావడానికి ఆసరా ఇవ్వండి,అవకాశం ఇవ్వండి, అన్నీటికీ మేమున్నాం అనే ధైర్యాన్ని ఇవ్వండి ఆత్మహత్యలు నివారించండి.

||  ఆత్మహత్య వలన ఒక ఆత్మీయుని అకాల మృతి  వార్త విన్నప్పుడు నా మనస్సు పొందిన ఆవేదనకు అక్షరరూపం ఈ వ్యాసం. || 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top