'భగవద్గీత' యధాతథము: రెండవ అధ్యాయము - " గీతాసారము " - Bhagavad Gita' Yadhatathamu - Chapter Two, Page-14

'భగవద్గీత' యధాతథము: రెండవ అధ్యాయము - " గీతాసారము " - Bhagavad Gita' Yadhatathamu - Chapter Two, Page-14
కురుక్షేత్ర 

శ్లోకము - 39
ఏషా తేఃభిహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శ్రుణు |
బుద్ధా యుక్తో యయా పార్థ కర్మబన్ధం ప్రహాస్యసి || 

ఏషా - ఇదంతా; తే - నీకు; అభిహితా - వర్ణించబడింది; సాంఖ్యే - విశ్లేషణాత్మక అధ్యయనం ద్వారా; బుద్ధిః - తెలివి; యోగే - ఫలాపేక్ష లేనట్టి కర్మతో; తు - కాని: ఇమాం - దీనిని; శ్రుణు - విను; బుద్ద్యా - తెలివితో; యుక్తః - కూడినవాడవై; యయా - దానిచే; పార్థ - ఓ పృథాకుమారా; కర్మబన్దం - కర్మబంధము నుండి; ప్రహాస్యసి - విడివడతావు.

ఇప్పటివరకు ఈ జ్ఞానమును నేను సాంఖ్యము ద్వారా నీకు వివరించాను. ఇప్పుడు ఫలాపీక్ష లేనట్టి కర్మరూపంలో దీనిని వివరిస్తాను విను. ఓ పృథాకుమారా! అటువంటి  జ్ఞానంతో పనిచేసినప్పుడు నీవు కర్మబంధం నుండి విడివడతావు. 

భాష్యము : వేదనిఘంటువైన నిరుక్తి - ననుసరించి సాంఖ్యమంటే విషయాలను విపులంగా వివరించేదని అర్థం. సాంఖ్యమనేది ఆత్మయొక్క నిజస్వభావాన్ని వర్గించే తత్త్వానికి అన్వయిస్తుంది. ఇక 'యోగము' ఇంద్రియనిగ్రహాన్ని కూడి ఉంటుంది. యుద్ధం చేయకూడదనే అర్జునుని ఆలోచన ఇంద్రియప్రీతిపై ఆధారపడియున్నది. తన ప్రధాన ధర్మాన్ని మరచి అతడు యుద్ధాన్ని విడిచిపెట్టాలని అనుకున్నాడు. ఎందుకంటే ధృతరాష్ట్రుని పుత్రులైన తన జ్ఞాతులను, సోదరులను జయించి రాజ్యాన్ని భోగించడం కంటే తన బంధువులను చంపకపోతేనే తాను ఎక్కువగా ఆనందం పొందగలనని అతడు అనుకున్నాడు. అయినా ఈ రెండు మార్గాలలోను ఇంద్రియప్రీతియే మూలసూత్రంగా ఉన్నది. వారిని జయించడం ద్వారా పొందే ఆసందము, వారిని సజీపులుగా చూడడం ద్వారా కలిగే ఆనందం రెండూ కూడ జ్ఞానధర్మాలను పణంగా పెట్టేస్వీయేంద్రియభోగము పైననే ఆధారపడి ఉన్నాయి. 
     అందుకే పితామహుని దేహాన్ని వధించడం ఆత్మను చంవడం కాదని శ్రీకృష్ణుడు అర్జునునికి వివరింగోరాడు. తనతో సహా అందరు వ్యక్తులు నిత్యంగా వ్యక్తిగతులని, అందరు గతంలో వ్యక్తిగతులుగా ఉన్నారని, ప్రస్తుతము వ్యక్తిగతులేనని, భవిష్యత్తులో వ్యక్తిగతులుగా కొనసాగుతారని ఆతడు వివరించాడు. ఎందుకంటే మనమందరము శాశ్వతంగా వ్యక్తిగత ఆత్మలము. మనం మన దేహాలనే వస్త్రాలను కేవలము భిన్నరీతులలో మార్చినా భౌతికదేహబంధం నుండి ముక్తిని పొందిన తరువాత కూడ నిజానికి వ్యక్తిత్వాన్ని నిలుపుకొని ఉంటాము. ఆత్మ, దేహము గురించిన ఈ విశ్లేషణాత్మక అధ్యయనము శ్రీకృష్ణభగవానునిచే స్పష్టంగా వివరించబడింది.
    ఆత్మ, దేహము గురించి వివిధ కోణాలలో చేయబడిన ఈ వివరణాత్మకమైన జ్ఞానము నిరుక్తి నిఘంటువును బట్టి సాంఖ్యముగా ఇక్కడ వర్ణించబడింది. ఈ సౌంఖ్యముకు నాస్తికుడైన కపిలుని సాంఖ్యతత్త్వముకు ఎటువంటి సంబంధము లేదు. మోసగాడైన కపిలుని సాంఖ్యానికి చాలాముందే శ్రీకృష్ణుని అవతారమైన నిజమైన కపిలభగవానునిచే శ్రీమద్భాగవతంలో సాంఖ్యతత్త్వము బోధించబడింది. ఆతడు దానిని తన తల్లి దేవహూతికి వివరించాడు. పురుషుడు అంటే భగవంతుడు సచేతనుడని, ప్రకృతిపై దృష్టిని సారించడం ద్వారా ఆతడు సృష్టికార్యం చేస్తాడని ఆతనిచే.. స్పష్టంగా వివరించబడింది. ఇది వేదాలలోను, గీతలోను అంగీకరించబడింది.
   భగవంతుడు ప్రకృతిపై దృష్టి సారించి అణు వ్యక్తిగతాత్మలను అందులో నిలిపాడని వేదవర్ధన సూచిస్తున్నది. ఆ వ్యక్తిగత జీవులందరు ఇంద్రియభోగార్థము భౌతికజగత్తులో పనిచేస్తూ మాయాప్రభావంలో తమను భోక్తలుగా తలుస్తున్నారు. ఈ భావనే చివరిదైన ముక్తి వరకు కొనసాగుతూ జీవుడు భగవంతునితో ఏకము కావాలని కోరుకుంటాడు. ఇదే మాయ, అంటే ఇంద్రియభోగభరాంతి యొక్క చివరి వల. అటువంటి ఇంద్రియభోగ కలాపాలతో కూడిన అనేకానేక జన్మల తరువాతనే మహాత్ముడైనవాడు వాసుదేవునికి అంటే శ్రీకృష్ణభగవానునికి శరణుజొచ్చి చరమ సత్యాన్వేషణమ నఫలం చేసికొంటాడు.
   "శివ్యస్తేఃహం సాధిమాం త్వాం ప్రపన్నం" అని పలికి శ్రీకృష్ణునికి శరణుజొచ్చడం ద్వారా అర్జునుడు ఇదివరకే ఆతనిని గురువుగా స్వీకరించాడు. కనుక బుద్ధియోగంలో లేదా కర్మయోగంలో, అంటే కేవలము భగవత్ప్రీత్యర్దమే అయినట్టి భక్తియోగంలో పనిచేసి విధానాన్ని శ్రీకృష్ణుడు ఇప్పుడు ఆతనికి చెప్పబోతున్నాడు. ప్రతియొక్కని హృదయంలో పరమాత్మ రూపంలో నిలిచి ఉన్నట్టి భగవంతునితో ప్రత్యక్ష అన్యోస్య సంబంధంగా ఈ  బుద్ధియోగము పదియప అధ్యాయంలోని వదవ శ్లోకంలో స్పష్టంగా వివరించబడింది. కాని అటువంటి అన్యోన్య సంబంధము భక్తియుతసేవ లేకుండ చేకూరదు. కనుక భక్తిలో లేదా దివ్యమైన భగవత్సేవలో నెలకొనినవాడు, అంటే కృష్ణభక్తిభావనలో ఉన్నవాడు భగవంతుని ప్రత్యేకాసుగ్రహముచే ఈ బుద్ధియోగ స్థితిని పొందగలుగుతాడు. అందుకే దివ్యమైన ప్రేమతో నిరంతరము భక్తియుతసేవలో నెలకొన్నవారికే ప్రేమతో విశుద్ధ భక్తియోగజ్ఞానాన్ని ప్రసాదిస్తానని భగవంతుడు అన్నాడు. ఈ రకంగా భక్తుడు నిత్యానందమయమైన భగవద్రాజ్యంలో ఆ దేవదేవుని సులభంగా చేరుకోగలుగుతాడు.
    అనగా ఈ శ్లోకంలో పేర్కొనబడిన బుద్ధియోగము భగవంతుని భక్తియుతసేవయే ఇక్కడ పేర్కొనబడిన సాంఖ్యమనే వదానికి మోసగాడైన కపిలుడు చెప్పిన నాస్తిక సాంఖ్యతత్త్వానికి ఎటువంటి సంబంధము లేదు. కనుక ఇక్కడ చెప్పబడిన సాంఖ్యయోగానికి, నాస్తిక సాంఖ్యతత్త్వానికి ఏదో సంబంధము ఉన్నదని ఎవ్వరూ పొరబడకూడదు. ఆ కాలంలో అట్టి తత్త్వము ఎటువంటి ప్రభావం చూపలేదు. అయినా అటువంటి భగవద్రహిత తాత్త్విక కల్పనలను శ్రీకృష్ణుడు ప్రస్తావించడు. నిజమైన సాంఖ్యతత్త్వము కపిలభగవానునిచే శ్రీమద్భాగవతంలో వర్ణించబడినా ఆ సాంఖ్యానికి కూడ ప్రస్తుత విషయాలతో సంబంధము లేదు. ఇక్కడ సాంఖ్యమంటే దేహము, ఆత్మ అనేవాటి విశ్లేషణాత్మక వర్ణనము. అర్జునుని బుద్ధియోగ స్థితికి  అంటే భక్తియోగస్థితికి తీసికొని రావడానికే శ్రీకృష్టభగవాసుడు ఆత్మ గురించిన విశ్లేషణాత్మక వివరణను ఇచ్చాడు. కనుక శ్రీకృష్ణభగవానుని సాంఖ్యము, భాగవతంలో వర్ణించబడినట్టి కపిలభగవానుని సాంఖ్యము ఒక్కటే, సమానమే. అవి- భక్తియోగమే. కేవలము అల్పబుద్ధి కలిగిన మానవులే సాంఖ్యయోగానికి, భక్తియోగానికి భేదము చూస్తారని శ్రీకృష్ణభగవానుడు అందుకే అన్నాడు (సాంఖ్యయోగౌ పృథగ్ బాలాః ప్రవదన్తి న పండితాః).
   అయినా నాస్తిక సాంఖ్యయోగానికి, భక్తియోగానికి ఎటువంటి సంబంధము లేదు. కాని బుద్ధిహీనులు నాస్తిక సాంఖ్యయోగము భగవద్గీతలో చెప్పబడిందని అంటారు. కనుక బుద్ధియోగమంటే భక్తిమయ పూర్ణానందముతో, జ్ఞానంతో కృష్ణభక్తిభావనలో పనిచేయడమేనని మనిషి అర్థం చేసికోవాలి. కార్యము ఎంత కష్టమైనదైనప్పటికీ కేవలము భగవంతుని ప్రీత్యర్థము పనిచేసేవాడే బుద్ధియోగ సిద్ధాంతములో పనిచేస్తూ సర్వదా దివ్యానందములో నెలకొని ఉంటాడు. అటువంటి దివ్యకర్మ ద్వారా మనిషి భగవత్కృవచే దివ్యావగాహనను అప్రయత్నంగా పొందుతాడు. ఆ విధంగా జ్ఞానప్రాప్తికి అన్యప్రయత్నాలు లేకుండానే అతని ముక్తి పరిపూర్ణమౌతుంది. కృష్ణభక్తిభావనలొ కర్మకు, కామ్యకర్మకు ముఖ్యంగా సాంసారిక లేదా లౌకికసుఖము పొందడానికి చేసే ఇంద్రియభోగవిషయ కర్మకు ఎంతో తేడా ఉంది. కనుక బుద్ధియోగమనేది మనం చేసే కర్మ యొక్క దివ్యగుణము అవుతుంది.

శ్లోకము - 40
నేహాభిక్రమనాశోఃస్తి ప్రత్యవాయో న వీద్యతే |
స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ ||

ఇహ - ఈ యోగంలో; అభిక్రమ - ప్రయత్నంలో; నాశః - నష్టము; న అస్తి - లేదు; ప్రత్యవాయః - తక్కువ కావడం; న విద్యతే - లేదు; స్వల్పం - అతి తక్కువ; అపి - అయినా; అస్య - ఈ; ధర్మస్య - ధర్మము; త్రాయతే - విడుదల చేస్తుంది; మహతః - మహత్తరమైన; భయాత్ - భయము నుండి.

ఈ ప్రయత్నంలో నష్టము కాని, తక్కువ కావడం గాని లేదు. ఈ మార్గంలో స్వల్ప పురోగతియైనా మనిషిని మహత్తరమైన భయం నుండి కాపాడుతుంది.

భాష్యము : కృష్ణభక్తిభావనలో కర్మ, అంటే ఇంద్రియభోగవాంఛ లేకుండ కృష్ణుని లాభం కొరకే పనిచేయడం మహోన్నతమైన దివ్యకార్యం. అటువంటి కార్యంలో చిన్న ఆరంభమైనా నిరాటంకంగా సాగుతుంది, అంతేకాదు అటువంటి చిన్న ఆరంభము ఏ స్థితిలోనూ నశించదు. భౌతికపరిథిలో ప్రారంభమయ్యే ఏ కర్మనైనా పూర్తి చేయవలసి ఉంటుంది. లేకపోతే ఆ ప్రయత్నమంతా వృథా అవుతుంది. కాని కృష్ణభక్తిభావనలో ప్రారంభమైన ఏ కర్మయైనా పూర్తి చేయనప్పటికిని శాశ్వత ప్రభావాన్ని కలిగి ఉంటుంది. కనుక అటువంటి కర్మ చేసేవాడు కృష్ణభక్తిభావనలోని తన కర్మ పూర్తి కాకపోయినా  నష్టపోడు. కృష్ణభక్తిభావనలో ఒక శాతం పూర్తయిన పని శాశ్వతమైన ఫలితాలనే ఇస్తుంది. అంటే తదుపరి ప్రారంభము రెండవ శాతం నుండి మొదలౌతుంది. కాగా భౌతికకలాపంలో నూటికినూరుపాళ్ళు సాఫల్యం లేనిదే లాభం కలుగదు. అజామిళుడు కృష్ణభక్తిభావనలో కొంతశాతం తన ధర్మాన్ని నిర్వర్తించినా భగవత్కరుణచే చివరకు నూరుశాతం ఫలితాన్ని పొందాడు. దీని సంబంధములో శ్రీమద్భాగవతములో (1.5.17) ఒక చక్కని శ్లోకం ఇలా ఉన్నది :

త్యక్త్వా స్వధర్మం చరణామ్పుజం హరేః
ర్భజన్నపక్వోకథ పతేత్తతో యది |
యత్ర క్వ వాభద్రమభూదముష్య కిం
కో వార్థ ఆప్తోఃభజతాం స్వధర్మతః || 

  ఎవడేని తన స్వధర్మాలను విడిచి కృష్ణభక్తిభావనలో పనిచేస్తూ తన కర్మను పూర్తి చేయని కారణంగా పతనం చెందినా అతనికి కలిగే నష్టమేమున్నది? ఇక మనిషి తన లౌకిక కలాపాలను పరిపూర్ణంగా నిర్వహిస్తే పొందే లాభమేమున్నది?" లేదా క్రైస్తవులు పలికినట్లుగా మనిషి సమస్త ప్రపంచాన్ని సాధించినా తన నిత్యమైన ఆత్మను కోల్పోతే పొందే లాభమేముంటుంది.
    భౌతికకర్మలు, వాటి ఫలితాలు దేహంతోనే ముగుస్తాయి. కాని కృష్ణభక్తిభావనలోని కర్మ మనిషిని దేహనశింపు తరువాత కూడ తిరిగి కృష్ణభక్తిభావనకే తీసికొనిపోతుంది. తదువరి జన్మలో అతడు కనీసం ఉత్తమ సంస్కారం కలిగిన బ్రాహ్మణుల ఇంటిలో గాని, ధనిక కుటుంబములో గాని తిరిగి మానవునిగా జన్మించే అవకాశాన్ని తప్పకుండ పొందుతాడు, అది అతని మరింత పురోగతికి అవకాశము కలిగిస్తుంది. ఇదే కృష్ణభక్తిభావనలో చేసిన కర్మ యొక్క అద్వితీయమైన గుణము.

« Page - 13  మునుపటి పేజీ. 

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top