'భగవద్గీత' యధాతథము: రెండవ అధ్యాయము - " గీతాసారము " - Bhagavad Gita' Yadhatathamu - Chapter Two, Page-15

'భగవద్గీత' యధాతథము: రెండవ అధ్యాయము - " గీతాసారము " - Bhagavad Gita' Yadhatathamu - Chapter Two, Page-15

శ్లోకము - 41
వ్యవసాయాత్మికా బుద్ధిరేకేహ కురునన్థన |
బహుశాఖా హ్యనస్తాశ్చ బుద్ధయోఃవ్యవసాయినాం ||

వ్యవసాయ ఆత్మికా - కృష్ణభక్తిభావనలో సుస్థిరులు; బుద్ధిః - బుద్ధి; ఏక - కేవలము ఒక్కటే; ఇహ - ఈ ప్రపంచములో; కురునన్దన - ఓ ప్రియమైన కురుపుత్రా; బహుశాఖాః - బుశాఖలు కలిగినదై; హీ - నిజంగా; అనన్తాః - అనంతముగా; - కూడ; బుద్ధయః - బుద్ధి; అవ్యవసాయినాం - కృష్ణభక్తిభావనలో లేనివారి.

ఈ మార్గంలో ఉన్నవారు స్థిరమైన ఉద్దేశంతో ఉంటారు, వారిది ఒక్కటే లక్ష్యం. ఓ కురునందనా! అస్థిరులైనవారి బుద్ది బహుశాఖలుగా ఉంటుంది.

భాష్యము : కృష్ణభక్తిభావన ద్వారా మనిషి మహోన్నతమైన జీవనపూర్ణత్వాన్ని చేరుకుంటాడనే దృఢమైన విశ్వాసమే వ్యవసాయాత్మికాబుద్ధి అని పిలువబడుతుంది. చైతన్య చరితామృతము (మధ్యలీల 22.62) ఈ విధంగా చెబుతున్నది :

శ్రద్ధా శబ్దే విశ్వాస కహే సుదృఢ నిశ్చయ |
కృష్ణే భక్తి కయిలే సర్వకర్మ కృత హోయ ||

ఉదాత్తమైన ఏదేనివిషయంలో మ్రోక్కనోవినమ్మకమేవిశ్వాసము. మనిషికృష్ణభక్తిభావనతో కూడిన కర్మలలో నెలకొనినప్పుడు వంశాచారాలు, మానవాళి లేదా దేశమునకు చెందిన బాధ్యతలతో భౌతికజగత్తు సంబంధములో పనిచేయవలసిన అవసరము లేదు. మనిషి యొక్క గత శుభకర్మలు లేదా అశుభకర్మల ఫలితాలే సకామకర్మలు. మనిషి కృష్ణభక్తిభావనలో జాగృతుడు కాగానే శుభకర్మలకై ప్రయత్నించవలసిన అవసరమే ఉండదు. అతడు కృష్ణభక్తిభావనలో నెలకొనినప్పుడు సమస్త కర్మలు పరిపూర్ణస్థితికి చేరుకుంటాయి. ఎందుకంటే అవి ఇక ఏమాత్రము శుభము, అశుభము వంటి ద్వంద్వాలకు ప్రభావితము కావు. జీవిత భౌతికభావనను విడిచిపెట్టడమే మహోన్నతమైన కృష్ణభక్తిభావనా పూర్ణత్వము. కృష్ణభక్తిభావన పురోగతి ద్వారా ఈ స్థితి అప్రయత్నంగా సిద్ధిస్తుంది.
     కృష్ణభక్తిభావనలో వ్యక్తి యొక్క సుస్థిరమైన ఉద్దేశము జ్ఞానము పైననే ఆధారపడి ఉంటుంది. "వాసుదేవ సర్వమితి సమహాత్మా నుదుర్గభః" వాసుదేవుడే, అంటే శ్రీకృష్ణుడే సమస్త కారణాలకు మూలమని పరిపూర్ణంగా తెలిసినట్టి కృష్ణభక్తిభావనాయుతుడు అతిదుర్గభుడైన మహాత్ముడు. చెట్టు వేరుకు నీళ్ళు పోయడం ద్వారా మనిషి అప్రయత్నంగా ఆకులకు, కొమ్మలకు నీరు అందించినట్లుగా, కృష్ణభక్తిభావనలో పనిచేయడం ద్వారా అతడు ప్రతియొక్కరికీ, అంటే తనకు, కుటుంబానికి, సంఘానికి దేశానికి, మానవాళికి మహోన్నతమైన సేవ చేసినవాడౌతాడు. మనిషి కలాపాల ద్వారా శ్రీకృష్ణుడు సంతుష్ఖడైతే ప్రతియొక్కడు సంతుష్టుడౌతాడు.
     అయినా కృష్ణభక్తిభావనలో సేవ శ్రీకృష్ణుని ప్రామాణిక ప్రతినిధియైనట్టి గురుదేవుని సమర్థవంతమైన నిర్దేశంలో చక్కగా ఆచరింపబడుతుంది. అట్టి గురువు శిష్యుని స్వభావాన్ని ఎరిగి కృష్ణభక్తిభావనలో పనిచేసేటట్లు అతనికి మార్గదర్శనము చేయగలుగుతాడు. కృష్ణభక్తిభావన గురించి పూర్తిగా తెలిసికోవడానికి మనిషి సుస్థిరంగా వర్తిస్తూ కృష్ణప్రతినిధికి విధేయుడై ఉండాలి; ప్రామాణిక గురుదేవుని ఆదేశాన్ని అతడు - జీవనకార్యంగా స్వీకరించాలి. శ్రీల విశ్వనాథచక్రవర్తి ఠాకూరులు తమ సుప్రసిద్ధమైన గుర్వష్టక స్తోత్రములో మనకు ఈ విధంగా ఉపదేశించారు :

యస్య ప్రసాదాద్ భగవవత్ప్రసాదో యస్యాప్రసాదా న్న గతిః కుతోఃపి |
ధ్యాయన్ స్తువంస్తస్య యశస్త్రిసంధ్యం వన్దే గురోః  శ్రీచరణారనిన్ధం ||

    " గురుదేవుని సంతృప్తి ద్వారా భగవంతుడు సంతృప్తి చెందుతాడు. గురువును సంతృప్తిపరుపకుండ కృష్ణభక్తిభావనాస్థితికి ఎదిగే అవకాశమే లేదు. కనుక నా గురుదేవుని అనుగ్రహానికై రోజుకు మూడుసార్లు ధ్యానించి, ప్రార్థించి, నమస్కరిస్తాను. "
 అయినా ఈ పద్ధతి మొత్తం దేహభావనకు అతితమైనట్టి పరిపూర్ణ ఆత్మజ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. అది సిద్ధాంతపరమైనది గాక ఆచరణాత్మకమైనదై ఉండాలి. అప్పుడు కామ్యకర్మలలో గోచరించే ఇంద్రియభోగానికి తావుండదు. స్థిరచిత్తము లేనివాడు నానారకాలైన కామ్యకర్మల వైపుకు మళ్ళుతాడు.

శ్లోకములు - 42 - 43
యామిమాం పుష్బితాం వాచం ప్రవదన్త్యవిపశ్చితః | 
వేదవాదరతాః పార్థ నాన్యదస్తీతి వాదినః ||
కామాత్మానః స్వర్గపరా జన్మకర్మఫలప్రదామ్ |
క్రియావిశేషబహులాం భోగైశ్వర్యగతిం ప్రతి ||

యామిమాం - ఈ అన్ని; పుసష్చితాం - అలంకృతమైన; వాచం - వాక్కులు; ప్రవదన్తి - పలుకుతారు; అవిపశ్చితః - అల్పజ్ఞానము కలిగిన జనులు; వేదవాదరతాః - వేదాలను అనుసరించవలసిన వారు; పార్థ - ఓ పృథాకుమారా; అన్యత్ - వేరొక్కటి; న అస్తి - లేదు; ఇతి - అని, వాదినః - అంటారు; కామ ఆత్మానః - ఇంద్రియభోగాన్ని కోరుతూ; స్వర్గపరాః - స్వర్గలోకాలను పొందగోరుతూ; జన్మకర్మఫలప్రదామ్ - ఉత్తమజన్మము; ఇతర సకామఫలము ఇచ్చునట్టి; క్రియావిశేష - ఆడంబరమైన కార్యక్రమాలు; బహులాం - నానారకాలైన; భోగ - ఇంద్రియభోగములో; ఐశ్వర్య - ఐశ్వర్యము; గతిం - పురోగతి; ప్రతి - వైపుకు.

అల్పజ్ఞానవంతులు స్వర్గలోకప్రాప్తి, ఉత్తమ జన్మము, అధికారము మున్నగువాటి కొరకు నానారకాలైన సకామకర్మలను ఉపదేశించే వేదాల అలంకృత వాక్కులకే అతిగా అనురక్తులౌతారు. ఇంద్రియభోగమును, ఐశ్వర్యవంతమైన జీవితమును కోరుతూ వారు దానికి మించినది వేరొక్కటి లేదని అంటారు.

భాష్యము : జనసామాన్యము ఎక్కువ తెలివిగలవార్డె ఉండరు. అజ్ఞానవశంగా వారు వేదాలలోని కర్మకాండ విభాగంలో చెప్పబడిన సకామకర్మలకే ఎక్కువగా అనురక్తులై ఉంటారు. మదిరమగువలు లభ్యమై యుండి లౌకిక ఐశ్వర్యము విరివిగా లభించే స్వర్గంలో జీవితాన్ని అనుభవించడమనే ఇంద్రియభోగ ఆలోచనలు తప్ప వారికి ఇంకేదీ అక్కరలేదు. స్వర్గలోకప్రాప్తికి వేదాలలో అనేక యజ్ఞాలు, విశేషంగా జ్యోతిష్ణోమ యజ్ఞాలు ఉపదేశించబడ్డాయి. స్వర్గాన్ని పొందగోరేవాడు ఎవ్వడైనా ఈ యజ్ఞాలను చేసి తీరాలని నిజంగా చెప్పబడింది. ఇక అల్పజ్ఞానం కలిగిన జనులు అదే వేదజ్ఞానము యొక్క సంపూర్ణ ఉద్దేశమని అనుకుంటారు. అటువంటి అనుభవశూన్య జనులకు సుస్థిరమైన కృష్ణభక్తిభావన కార్యంలో నెలకొనడం చాలా కష్టం, విషవృక్షాల పువ్వుల పట్ల ఆకర్షణ ఫలితము ఎరుగక మూర్ఖులు వాటి పట్ల ఆసక్తులైనట్లుగా జ్ఞానహీనులు అటువంటి స్వర్గేశ్వర్యాలకు, వాటి నుండి కలిగే ఇంద్రియభోగానికి ఆకర్షితులౌతారు.
      వేదాలలోని కర్మకాండ విభాగంలో "అపామ సోమమమృతా అభూమ, అక్షయ్యం హ వై చాతుర్మాస్యయాజినః సుకృతం భవతి” అని చెప్పబడింది. అంటే ఎవరైతే చాతుర్మాస్య వ్రతాన్ని చేస్తారో వారు సోమరసపానానికి అర్హులై అమరులు, శాశ్వతంగా సుఖభాగులు అవుతారు. ఇంద్రియభోగాన్ని అనుభవించడానికై బలవంతులు యోగ్యులు కావడానికి సోమరసపానం చేయాలని ఈ భూమి మీద కూడ కొందరు ఉవ్విళ్ళూరుతారు. అటువంటి వ్యక్తులు భవబంధ విముక్తి పట్ల శ్రద్ధను కలిగియుండక ఆడంబరమైన వైదిక యజ్ఞక్రతువుల పట్లనే అతిగా అనురక్తులై ఉంటారు. వారు సాధారణంగా భోగలాలసులై ఉండి స్వర్గసౌఖ్యాలను తప్ప వేరేదీ కోరుకోరు. అందమైన దేవతాస్త్రీలతో సాంగత్యానికి మంచి అవకాశము, పుష్కలంగా సోమరసము లభించే
నందనకాననమని పిలువబడే వనాలు ఉన్నట్లుగా తెలుస్తున్నది. అట్టి దేహసౌఖ్యాలు  నిక్కముగా ఇంద్రియభోగానికి సంబంధించినవి. అందుకే భౌతికజగత్తుకు ప్రభువులుగా అటువంటి లౌకిక, తాత్కాలిక సుఖానికే అతిగా అనురక్తులైనవారు ఉంటారు.

« Page - 14  మునుపటి పేజీ. 

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top