అరటితో పులిపిర్లు మాయం.! - REMOVE SKIN TAGS WITH BANANA

అరటితో పులిపిర్లు మాయం.! - REMOVE SKIN TAGS OVERNIGHT WITH BANANA
రటిపండు ఆరోగ్యానికి మంచిదన్న విషయం అందరికి తెలిసిందే. ఉదర సమస్యలతో బాధపడేవారు రోజుకో పండు చొప్పున తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇకపోతే సౌందర్యాన్ని మెరుగుపరచడానికి కూడా ఈ అరటి ఎంతో మేలు చేస్తుంది. అంతే కాదండోయ్ పులిపిర్లను కూడా తగ్గిస్తాయని ఆయుర్వేద వైద్యులు అంటున్నారు. ఇక ఆలస్యం ఎందుకు ఒకసారి చూద్దాం..

సాదారణంగా ఈ పులిపిర్లను ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పిలుస్తారు, పులిపిర్లను కొంతమంది ఉలిపిరి కాయలు అని కూడా అంటారు.పులిపిర్లు ఎక్కువగా చేతి వేళ్ళ మధ్యలో, కాలి వేళ్ళ మధ్యలో, మెడదగ్గర, వస్తూ ఉంటాయి, ఇది కూడా ఒక రకమైనటువంటి వైరస్, ఇమ్యూనిటీపవర్ తగ్గినప్పుడు, శరీరంలో కొవ్వు పెరిగినప్పుడు ఇలాంటివి వస్తూ ఉంటాయి.. ఒకప్పుడు తమలపాకులను ఉపయోగించి వీటిని తగ్గించేవారు. ఇప్పుడు అరటి పండు తో కూడా పులిపిర్లను తగ్గిస్తున్నారు.. ఎలాగంటే.. ముందుగా పులిపిర్లను నీళ్ళతో కడిగి, పొడి క్లాత్ తో తుడిచి కాసేపు ఆరనివ్వాలి. బాగా పండిన పండు యొక్క గుజ్జును పులిపిర్లు ఉన్న ప్రదేశంలో ఐదు నిమిషాల పాటు మర్దన చేయాలి.. అలా అరగంట తరువాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండు, మూడు సార్లు చెయ్యడం వల్ల పులిపిర్ల సమస్య మాయం అవుతుంది..

గమనిక:
పై నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top