దేవుడి ఎదుట చెంపలు ఎందుకు వేసుకుంటారు ?

దేవుడి ఎదుట చెంపలు ఎందుకు వేసుకుంటారు ? - Why slaps cheeks before God?
గుంజీలు

దేవుడి ఎదుట గుంజీలు ఎందుకు తీస్తారు ?

సహజంగా దైవ దర్శనానికి వెళ్లినపుడు చెంపలు వేసుకుంటారు? ఇదేం ఆచారం? అని చాలామందికి అనుమానం వస్తుంది. చెంపల్ని/దవడలు సంస్కృతంలో హనువు’ లని పిలుస్తారు.
మాట్లాడటానికి ఎంతో ఎక్కువగా సహకరించేవి ఈ దవడలే.

ఎవరయినా ఈ హనువులతో ఏదైనా తప్పు చేసి ఉంటే (చాడీలు, అబద్దాలు, అపనిందలు) వాటిని క్షమించవలసిందని .. ఇక ఎప్పుడు అలా చేయకుండా చేయుమని భగవంతుడిని అడగటమే చెంపలు వేసుకోవడంలోని పరమార్థం. ఎవరైనా తెలిసో తెలియకో తప్పులు ,పాపకార్యాలు చేసినా ,అపచారం చేసినా తప్పులు క్షమించి,మమ్ము కాపాడు తండ్రీ అని వేసుకునే ఆచారం/ నమ్మకం కూడా ఇది ఒక పద్ధతి అని పెద్దలు చెబుతారు .

అసలు నిజం ఏమిటంటే...గుంజీలు తీయడం వెనుక సైన్స్ /శాస్త్రీయత దాగిఉంది గుంజీలు తీసినట్టైతే మనసుకు కుదురోస్తుంది, స్థిరత్వం కలుగుతుంది. చాంచల్యం కుదుటపడుతుంది. చపల బుద్ధి పోతుంది గుంజీలు ఎక్కువగా వినాయకుడి దగ్గర తీస్తారు ఎందుకంటే మూలాధారానికి ఈయన అధిపతి వినాయకుడు,(మూలాధార చక్రం చక్కగా కలిగినవారు చక్కని రూపం ఆకృతి కలిగి ఉంటారు ) అంతే కాకుకుండా మన శరీర ఆకృతిలో ఉండే ఎముకలు,మాంసం చక్కగా ఉండేది కూడా మూలాధారం మీద ఆధారపడి ఉంటుంది. అందువల్ల గుంజీలు తీసినట్టైతే మూలాధారం చక్కగా పనిచేసి శరీర ధారూఢత్వం /నిశ్చలత లభిస్తాయి.

కనుకనే మామూలు సమయంలో వ్యాయామం లాంటి గుంజీలు చేయమంటే
చేయరని భావించి మన పూర్వీకులు దేవాలయంలో దైవభక్తిలో భాగముగా గుంజీలు తీయాలని చెప్పేవారు. ఈ గుంజీలు అనే పదానికి మన హిందూపురాణాలలో ఒక కధకూడా ఉంది ...
ఒక సారి విష్ణుమూర్తి కైలాసానికి రాగా గ‌ణ‌ప‌తి చిలిపి ప‌నులు చేస్తూ... విష్ణుమూర్తి చేతిలోని విష్ణుచ‌క్రాన్ని మింగేస్తాడు. విష్ణువు ఎంత ప్రార్థించినా గ‌ణ‌ప‌తి దానిని ఇవ్వ‌క మారాం చేస్తాడు . విష్ణుచ‌క్రం కొర‌కై విష్ణువు, గ‌ణ‌ప‌తిని బ్ర‌తిమ‌లాడి చివ‌ర‌కు.. శివుడి ఆజ్ఞ మేర గుంజీలు తీయ‌గా ఆ ఘ‌ట‌న చూసిన గ‌ణ‌ప‌తి ప‌క‌ప‌కా.. నవ్వుతాడు . 

ఆ స‌మ‌యంలో గ‌ణ‌ప‌తి పొట్ట ఊగి #విష్ణుచ‌క్రం బ‌య‌టప‌డుతుంది, విష్ణువు వైకుంఠానికి వెళతాడు . కావున కోరిక‌లు నెర‌వేర్చుకొనుట‌కు భ‌క్తులు గ‌ణ‌ప‌తి ప్రీతికై గుంజీలు తీస్తారు, అని ప్రతీతి .
పాఠశాలలో పిల్లలకు భోధన సరిగా అబ్బనపుడు, వారు తప్పుచేసినపుడు. 

గుంజీలు శిక్ష కింద తీయించేవారు ..
  • చెవితమ్మెల చివరిభాగాలు చేతివ్రేళ్ళతో. కుడి ,ఎడమలుగా పట్టుకుని కిందకు -పైకి వంగి లేస్తూ గుంజీలు చేయించడం వలన చెవులు సాగుతాయి.
  • చెవులు సాగి ఉండడం వలన అనారోగ్యం దరిదాపులకు రాదు ఆరోగ్యం కూడా బాగుపడుతుంది,
  • (అందుకే స్త్రీలకు దుద్దులు,కమ్మలు లాంటి బరువైనవి అనాదిగా ఆభరణంగా ధరింప జేస్తారు) చపలత్వం పోతుంది. గురువులు పెద్దలు చెప్పే విద్యాబుద్ధులు బాగా అబ్బుతాయి,చదువు /విద్యలయందు ఏకాగ్రత కుదురుతుంది,
  • అందువలననే పూర్వకాలపు గురుకులాల ఆశ్రమాలలో విద్యార్థులకు బోధనా సమయంలో ,విద్యార్థి (ని) తప్పుచేసినపుడు దండనగా #గుంజీలు తీయించేవారు. ఇదీ రహస్యం

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top