విదేశీ సంస్కృతి పై మోజులో - స్వదేశీ సంస్కృతి నాశనం !

విదేశీ సంస్కృతి పై మోజులో - స్వదేశీ సంస్కృతి నాశనం : Fascination with foreign culture - Destruction of indigenous culture
Fascination with foreign culture - Destruction of indigenous culture

విదేశీ సంస్కృతి పై మోజులో - స్వదేశీ సంస్కృతి నాశనం

సరైన అవగాహన అనేది లేకుండా పాశ్చాత్య పోకడలపై మోజు పెంచుకుంటున్నాం మనం. అన్నింటా మంచిగా పేరొందిన మన సంస్కృతికి మెల్లమెల్లగా దూరమౌతున్నాం. మేధావులమంటూ బోరచాచుకుని తిరిగే ఆర్భాట రాయుళ్లందరూ ముందుగా ఈ విషయాన్ని గ్రహించాలి.

మన భారతీయ సంస్కృతి నుండి మనమే మన పిల్లల్ని దూరం చేస్తున్నాం.. చిరుప్రాయం నుండి కూడా !! సుమారు 30 సంవత్సరాల క్రితం వరకూ మనన పిల్లలు “శుక్లాంబరధరం”, “శాంతాకారం భుజగశయనం” వంటి భక్తి శ్లోకాలు, మరెన్నో నీతిపద్యాలూ, విరివిగా తమ తల్లిదండ్రుల వద్ద నేర్చుకొని, గడగడా అప్పగించేవారు. ఆ శ్లోకాలు వగైరాలు నేటి తల్లిదండ్రులకే రావు. ఇక పిల్లలకేం చెప్తారు? ఆధ్మాత్మిక, నీతి పద్యాల్ని '“అనాగరికంగానూ, ఓల్డ్‌ ఫ్యాషన్‌గానూ' భావిస్తున్నారు నేటి పెద్దలు. నేటి బిడ్డడికి 3వ సంవత్సరం రాగానే, విధిగా కాన్వెంట్‌ ప్రవేశం జరిగిపోతోంది. కాన్వెంట్‌లో వాడు నేర్చిన “ట్వింకిల్‌ ట్వింకిల్‌
లిటిల్‌ స్టార్‌” “డింగ్‌ డాంగ్‌ బెలొ, “బాబా బాబా బ్లాక్‌షీప్‌” మొదలైన పద్యాలను వింటూ తల్లితండ్రులు పరవశించిపోతున్నారు. “ఆ ఇంగ్లీషు పద్యాలలో ఒక నీతి గాని, పనికొచ్చే ఒక చక్కని అర్హంగానీ ఉందా" అని ఆలోచించేవారే లేరు.

అలనాటి వేమన, సుమతీ, భాస్కర, దాశరథీ శతకాలు నేర్పే నీతి, ఆధ్యాత్మికత ఈనాటి ఇంగ్లీష్‌ కాన్వెంట్స్‌లో ఎలా దొరుకుతాయి? అందువల్లనే ఈనాటి విద్యార్దులు, విదేశీ వ్యామోహం పట్ల ఆకర్షితులౌతున్నారు తప్ప, స్వదేశీ సంస్కృతిని గురించి ఆలోచించే స్టితిలో లేరు.
  నేటి మన తల్లులు తమ పిల్లలచే “అమ్మా” అని ఆప్యాయంగా పిలిపించుకునే భాగ్యాన్ని కోల్పోతున్నారు. “అమ్మ అనే కమ్మనైన పిలుపుకు బదులుగా - ఈజిప్ట్‌ వారి పిరమిడ్లనూ, శవాలనూ గుర్తుకుతెచ్చే “మమ్మీ” అనే పిలుపునే నేడెంతోమంది తల్టులు కోరుకుంటున్నారు. (ప్రాచీన ఈజిస్ట్‌ పిరమిడ్లలో జాగ్రత్త చేసి ఉంచే శవాలను “మమ్మీ' అని అంటారు.) 
1. మన సంస్కృతిని ప్రేమిస్తున్న పాశ్చాత్యులు - 2. భారతీయ సంస్కృతిని నాశనం చేస్తున్న భారతీయ యువతరం !
1. మన సంస్కృతిని ప్రేమిస్తున్న పాశ్చాత్యులు - 2. భారతీయ సంస్కృతిని నాశనం చేస్తున్న భారతీయ యువతరం ! 
ఈ తరం భారతీయులకు.... ముఖ్యంగా యువతరానికి పాశ్చాత్య సంగీతం, డాన్స్‌లే తప్పు- మన సాంప్రదాయ సంగీత నృత్యాలు నచ్చవు. మన భారతీయ పద్దతిలో 'నమస్కారం, నమస్తే, రాంరాం” చెప్పే అలవాటు నేడు మనలో తగ్గిపోతోంది. వీటికి బదులుగా “హలో.... హాయ్‌ .... టాటా .... ఛీరియో .... బాయ్‌ .... బాయ్‌.... వావ్‌... ౯” అంటూ ఏవో చిత్ర విచిత్ర పదాలు వాడుతున్నారు. 'నమస్కారం” అంటూ వందనం ఆచరించడంలో ఉన్న సభ్యత, విధేయత “హలో .... హాయ్‌ ....! అనే ఆధునిక పదాల్లో ఉంటాయా?

ఇక ఈనాటి కట్టు, బొట్టు, జుత్తు సంగతి మనకందరికీ తెలిసిందే! ఈ విషయాల్లో నున యువతులు మరీ దారుణంగా స్వసంస్కృతికి విముఖత చూపించడం మన దుర్భాగ్యం. మరి ఇటువంటి పరిస్థితుల్లో స్త్రీలపై గౌరన భావం పెరగాలంటే ఎలా సాధ్యం? వినయపూర్వక వేషధారణ, ప్రవర్తన గల స్త్రీలను గౌరవించకుండా ఉండగలమా?
  వేషభాషలు, ప్రవర్తన, ఆహార విహారాలూ అన్నింటిలోనూ విదేశీ అనుకరణనే ఇష్టపడుతున్నారు మనవాళ్ళు. ప్రాచీన హైందవ సంస్కృతీ సాంప్రదాయాలకు విదేశాల్లో ఒక ప్రత్యేక గౌరవం ఉందనే మాట మనవాళ్ళు మరచిపోతున్నారు. పండుగలను అనుసరించే పద్దతులలో కూడా విదేశీ అలవాట్లకు బానిసలౌతున్నారు. మన పండుగల నిర్వహణా విధానాల్లో ఉన్న విజ్ఞానాంశాల్ని గ్రహించలేక మూర్థపు ధోరణులకు, నాస్తిక ధోరణులకు అసభ్య నడవడికలకూ బలి అవుతున్నారు. తస్మాత్‌ జాగ్రత్త !!

..పోలిశెట్టి బ్రదర్స్‌

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top