వాల్మీకి మహర్షి, నారద మహర్షిని ఏమని ప్రశ్నించాడు? - What did Maharshi Valmiki and Maharshi Narada ask?

0
వాల్మీకి మహర్షి, నారద మహర్షిని ఏమని ప్రశ్నించాడు? - What did Maharshi Valmiki and Maharshi Narada ask?
Maharshi Narada 
సుగుణాలు గల నరుడెవరు? ఈ ప్రశ్న ఉదయించిన మహర్షి పేరు వాల్మీకి అయితే, ఆ ప్రశ్నకు బదులుగా రాముడు గురించి, రాముడు నడిచిన మార్గము గురించి వివరించిన మహర్షి నారదుడు. ఇద్దరి మహర్షుల మాటలలో శ్రీరాముడు గొప్పతనమే కీర్తింపబడింది. ఎంతటి కష్టం వచ్చినా, ఎవరు అవకాశం చూపినా, కేవలం ధర్మమునే ఆచరించి చూపిన మార్గదర్శకుడు శ్రీరాముడు. కాబట్టి నరుడు రామాయణం చదవాలని పండితులు తరచూ ప్రస్తావిస్తూ ఉంటారు.
 1. గుణవంతుడు
 2. వీరుడు
 3. ధర్మజ్ఞుడు
 4. కృతజ్ఞుడు
 5. సత్యం పలికేవాడు
 6. దృఢమైన సంకల్పం ఉన్నవాడు
 7. ఉత్తమ చరిత్ర కలిగినవాడు
 8. అన్ని ప్రాణుల మంచి కోరేవాడు
 9. విద్యావంతుడు
 10. సమర్థుడు
 11. సౌందర్యం కలిగిన వాడు
 12. ధైర్యవంతుడు
 13. క్రోధాన్ని జయించినవాడు
 14. తేజస్సు కలిగినవాడు
 15. అసూయ లేనివాడు, ఇతరుల్లో మంచిని మాత్రమే చూసేవాడు
 16. ఈ సృష్టిలో ఎవరి కోపాన్ని చూసి దేవతలు కూడా భయపడతారో అటువంటి వ్యక్తి!
పైన చెప్పబడిన పదహారు సుగుణాలు గల నరుడు ఎవరు?

అందుకు నారద మహర్షి, వాల్మీకి మహర్షితో శ్రీరాముడు గుణగణాలను చెబుతాడు. క్లుప్తంగా శ్రీరామాయణం వివరిస్తాడు. కొద్దిగా విన్న శ్రీరామాయణం వాల్మీకి మహర్షి మనసులో మంచి ముద్రను వేస్తుంది. శ్రీరామాయణం రచించాలనే తపనకు ప్రేరణ అవుతుంది. తత్ఫలితంగానే శ్రీరామాయణం గ్రంధ రచనను చేశారని అంటారు. అంటే రామాయణం సంక్షిప్తంగా విన్నా, శ్రద్దగా వింటే, పూర్తిగా తెలుసుకోవాలనే తపన మనసులో పుడుతుంది.

దేవుడిచ్చిన బంధువులు తల్లిదండ్రులు, అన్నదమ్ములు అయితే, వారితో ఎలా ప్రేమతో ఉండాలో… రాముడు ఆచరించి చూపాడని చెబుతారు. ఎంత కష్టంలోనూ ఏ బంధుత్వాన్ని దూరం చేసుకోకుండా ధర్మమార్గములోనే నడిచిన పురాణ పురుషుడుగా శ్రీరాముడు కీర్తిగడించాడు.

తండ్రిమాటను మీరని పుత్రుడిగా, సోదరులను ప్రేమించే అన్నగా, భార్య దూరమైనా నిత్యమూ భార్య కొరకు పరితపించే భర్తగా, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల మాటకు విలువిచ్చిన మహారాజుగా, ఎక్కడా ధర్మం తప్పకుండా మనిషి అనేవాడు ఇలా జీవించాలని ఆచరించి చూపించినవాడు శ్రీరాముడు అని అంటారు.

అలా శ్రీరాముడు గురించి విన్న వాల్మీకి రామాయణం రచిస్తే, శ్రీరాముడు గురించి చదవినవారికి శ్రీరాముడు మదిలో కొలువై ఉంటే, అలా కొలువుదీరిన రాముడు అంతరంగంలో ఎప్పుడూ ధర్మమార్గమునే బోధిస్తాడు. కాబట్ఠి శ్రద్ధగా శ్రీరామాయణం చదవడం అంటే, రాముడు నడిచిన మార్గములో మన మనసు కూడా మమేకం కావడమే.

మంచి గుణములతో మనసు మమేకం కావడం జరిగితే….
అనగననగ రాగ మతిశయిల్లుచునుండు, తినగ తినగ వేము తియ్యగుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వధాభిరామ వినుర వేమ… ఈ పద్యసారాంశము… అనగ అనగా రాగము బాగా వచ్చును… తినగ తినగా చేదుగా ఉండే వేపాకు కూడా తీయగా ఉంటుంది… అలాగే చేయగ చేయగా పనులు కూడా సులభంగా జరుగుతాయని… అలా శ్రీరామాయణం చదువుతూ ఉండడం వలన రాముని మార్గము మనసులో పదే పదే మెదలడంతో మంచి మార్గములోనే మనసు పయనించే అవకాశం ఉంటుంది. కావునా రామాయణం చదవడం శ్రేయష్కరం అని పెద్దలు అంటారు.

రామాయణం అంటే రాముడు నడిచిన మార్గమని చెబుతారు. రాముడు మార్గమునకు మూలం ధర్మము. ధర్మమార్గమే రాముడు మార్గము.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
Translate this post ⬇

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top