నిత్య దీపారాధన - Nitya Deeparadhana

0
నిత్య దీపారాధన - Nitya Deeparadhana
నిత్య దీపారాధన - Nitya Deeparadhana

దీపారాధన చేయడం అనేది హిందువైన ప్రతి ఇంటిలోనూ సర్వ సాధారణంగా జరుగుతుంది. నిత్యం చేసే ఈ దీపారాధనలో కొన్ని నియమాలు పాటిస్తే ఫలితం బాగుంటుందంటారు. పంచ లోహాలు, వెండి లేదా మట్టితో చేసిన ప్రమిదలలో దీపం వెలిగిస్తే ఎంతో శ్రేష్ఠం. తెల్లవారుజామున మూడు గంటలు- అయిదు గంటల మధ్య దీపారాధన చేస్తే శుభకరంగా వుంటుంది. సూర్యాస్తమయం తరువాత దీపం వెలిగించి, మహాలక్ష్మిని స్తుతిస్తే సర్వకార్యసిద్ధి కలుగుతుంది.
   తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే ఈతి బాధలు, గ్రహ బాధలు, దుఃఖాలు తొలగిపోతాయి. పడమటి వైపు ముఖం దీపం వెలిగిస్తే ఋణ బాధలు తొలగిపోతాయి. ఇంకా శనిగ్రహ దోష నివారణ కలుగుతుంది. ఉత్తర ముఖంగా దీపం వెలిగిస్తే సిరిసంపదలు కలుగుతాయి. ఇంకా విద్యకు, వివాహానికి ఆటంకాలు ఏమైనా వుంటే తొలగిపోతాయి. దక్షిణ ముఖంగా దీపారాధన చేస్తే అపశకునాలు ఎదురై, దుఃఖ బాధలు కలుగుతాయి.

దీపారాధనకు చేసే వత్తులు, తామర కాడతో వత్తులు చేసి వెలిగిస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయి. తెల్ల జిల్లేడు చెట్టు కాడతో వత్తులు చేసి దీపారాధన చేస్తే పిశాచాల భయం తొలగుతుంది. కొత్త తెల్ల వస్త్రం మీద పన్నీరు జల్లి, ఎండలో ఆరబెట్టి, తరువాత ఆ వస్త్రాన్ని వత్తులుగా చేసి దీపారాధన చేస్తే అన్ని పనులు పూర్తిచేయగలుగుతారు. కొత్త పసుపు చీర తునకనుంచి వత్తులు చేసి దీపాలను వెలిగిస్తే వివాహానికి ఆటంకాలు ఏమైనా వుంటే అవి తొలగిపోతాయి.
దీపారాధన
దీపారాధన
దీపం వెలిగించటానికి ఆవు నెయ్యి వాడితే ఎంతో శ్రేష్ఠమని చెప్పబడింది. ఆవు నేతితో దీపం వెలిగించటంవల్ల శుభప్రదంగా వుంటుంది. దీపారాధనలో ఆముదపు నూనె ఉపయోగిస్తే దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగుతుంది. విప్పనూనె, వేప నూనె, ఆవు నెయ్యిలతో దీపారాధన చేస్తే ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆవునెయ్యి, విప్పనూనె, వేప నూనె, ఆముదపు నూనె, కొబ్బరి నూనెల మిశ్రమంతో 48 రోజులపాటు క్రమం తప్పకుండా దీపారాధన చేస్తే, అమ్మవారి అనుగ్రహం లభించి, సకల సంపదలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.

తెల్లవారి కాలకృత్యాల తర్వాత దీపారాధన చేసి భగవంతుడి నిశ్చలబుద్ధితో ధ్యానించడం వల్ల మానసిక ప్రశాంతి కలుగుతుంది. ఆరోజంతా మంచి చేయాలన్న తలంపులు కలిగి భగవంతుని ప్రీతికరమైన కార్యాలు చేస్తామని పెద్దలంటారు. అలానే సాయంసంధ్యవేళ చేసే దీపరాధన ఆ రోజు చేయలేకపోయన మంచికార్యాలు ఏవైనా మిగిలుంటే వాటిని రేపటిరోజున చేసే శక్తిని పుంజుకోవడానికి పనికివస్తుంది. మనసు ప్రశాంతంగా దైవధ్యానానికి ఉపకరిస్తుంది. అందుకే రెండుపూటలా దీపారాధన చేసి భగవంతుడిని ప్రార్థిస్తే ఎవరికి వారికే కాక చుట్టూ ఉన్న పరిసరాలు కూడా ప్రశాంత వాతావరణానికి దగ్గరవుతాయ.

- మనస్విని

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
"తెలుగు-భారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. మన సంస్కృతీ, సంప్రదాయాలను మరింత లోతుగా విశ్లేషించి ప్రపంచానికి తెలియచేస్తూ మన ధర్మాన్ని కాపాడేందుకు మీ వంతు సహాయం చేయండి.
Supporting From Bharat:#buttons=(Accept !) #days=(20)

Our website uses cookiesLearn..
Accept !
To Top