తెలుగు సమాసముల - Telugu Samasamulu

0
తెలుగు సమాసముల - Telugu Samasamulu
Telugu Samasamulu
వేరు వేరు అర్ధములు కలిగిన పదములు కలిసి ఒక పదముగా అగుటను సమాసము అంటారు.సాధారణంగా సమాసమునందలి రెండు పదములు ఉండును.మొదటి పదమును పూర్వపదమని, రెండవ పదాన్ని ఉత్తర పదమని అంటారు. ఉదా - అన్న,తమ్ముడు = అన్నదమ్ములు 

1.తత్పురుష సమాసము - 

 • ఉత్తర పదము యొక్క అర్ధము ప్రధనముగా గలది తత్పురుష సమాసము. 
 • ప్రధమా తత్పురుష సమాసము - పూర్వకాయము = కాయము యొక్క పూర్వ భాగము. 
 • ద్వితియా తత్పూరుష సమాసము - నెలతాల్పు = నెలను దాల్చినవాడు 
 • తృతియ తత్పురుష సమాసము - ధనాడ్యుడు = ధనము చేత ఆఢ్యుడు. 
 • చతుర్ధీ తత్పురుష సమాసము - భూతబలి = భూతము కొరకు బలి. 
 • పంచమీ తత్పూరుష సమాసము - చోరభయము = చోరుని వల్ల భయము. 
 • షష్టీ తత్పురుష సమాసము - రాజభటుడు = రాజు యొక్క భటుడు. 
 • సప్తమీ తత్పురుష సమాసము - మాటనేప్పరి = మాట యందు నేర్పరి 
 • నై తత్పురుష సమాసము - అధర్మము - ధర్మము కానిది. 

2.కర్మధారయ సమాసము - 

 • విశేషణము, విశేష్యములతో కూడినది కర్మధారయ సమాసము.
 • విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము - ప్రియమిత్రుడు = ప్రియమైన మిత్రుడు.
 • విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసము - కపోతవృద్దము = వృద్దమైన కపోతము .
 • విశేషణ ఉభయపద కర్మధారయ సమాసము - మృదుమధురము = మదువును, మధురమును.
 • ఉపమాన పూర్వపద కర్మధారాయ సమాసము - తేనెపలుకు = తేనెవంటి పలుకు. 
 • ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసము - ముఖపద్మము = పద్మము వంటి ముఖము.
 • ఆవధారణా పూర్వపద కర్మధారయ సమాసము - సంసారసాగరం = సంసారమనెడి సాగరము.
 • సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము - పెన్నానది = పెన్నా అను పేరు గల నది. 

3. ద్విగు సమాసము - 

సంఖ్యా పూర్వము ద్విగువు సంఖ్యావాచక విశేషణముతో విశేష్యము సమచినచో అది ద్విగువగును. ఇందు సంఖ్యావాచక విశేషణమే పూర్వ మందుండును. 
ఉదాహరణకు - ముల్లోకములు = మూడగులోకములు 

4.బహువ్రీహి సమాసము - 

అన్యపదము యొక్క అర్ధము ప్రధానంగా గలది బహువ్రీహి సమాసము. 
దీని అర్ధము చెడినపుడు కలది కలవాడు అని వచ్చును. 

5.ద్వంద్వ సమాసము - 

ఉభయపదముల యొక్క అర్ధము ప్రధానముగా కలది ద్వంద్వ సమాసము ఉదా - సీతారాములు = సీత, రాముడు, కృష్ణార్జనులు = కృష్ణుడును, అర్జునుడును 6.అవ్యయూభావ సమాసము - సూర్వపదము యొక్క అర్ధము ప్రధానముగా గలది అవ్యయూభావ సమాసము. ఇందు పూర్వపదములు సామాన్యముగా అవ్యయములై ఉండును. 
ఉదాహరణకు - యధాశక్తి = శక్తికి తగినట్లు 
ఉదాహరణకు - పద్మనేత్రి = పద్మమువంటి నేత్రములు కలది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
"తెలుగు-భారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. మన సంస్కృతీ, సంప్రదాయాలను మరింత లోతుగా విశ్లేషించి ప్రపంచానికి తెలియచేస్తూ మన ధర్మాన్ని కాపాడేందుకు మీ వంతు సహాయం చేయండి.
Supporting From Bharat:#buttons=(Accept !) #days=(20)

Our website uses cookiesLearn..
Accept !
To Top