TTD News: శ్రీవారి భక్తులకు ఈరోజు నుండి మొక్కుబడి టోకెన్లు విడుదల !

0
TTD News: శ్రీవారి భక్తులకు ఈరోజు నుండి మొక్కుబడి టోకెన్లు విడుదల - TTD News: Mokkubadi Tokens to be Released for Shrivari Devotees from Today
తిరుమల
గస్ట్‌కు సంబంధించిన అంగప్రక్షిణం టోకెన్లను బుధవారం ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు తెలిపింది. శుక్రవారం మినహా మిగతా అన్ని రోజుల్లో 750 టోకెన్ల చొప్పున కేటాయించనున్నది. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని కోరింది. ఇందులో భాగంగా ప్రతి రోజూ శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేసి, తడిబట్టలతో ఆనంద నిలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు.
(ads1)
కరోనా కారణంగా తిరుమలలో రెండేళ్లుగా అంగప్రదక్షిణం టోకెన్లు నిలిచిపోయాయి. కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మళ్లీ ఈ టోకెన్లను జారీ చేస్తున్నారు. సీఆర్‌వో కార్యాలయంలో ఆఫ్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చారు. ఇక జూలై నుంచి ఆన్‌లైన్‌లో అంగప్రదక్షిణం చేస్తున్నారు. అయితే అంగప్రదక్షిణం టోకెన్లు రేపటి నుండి శుక్రవారం మినహా వారంలో మిగిలిన రోజుల్లో ఒక్కొక్కరికి 750 చొప్పున కేటాయిస్తారు. ఆగస్టు నెలకు సంబంధించి మొత్తం 20,250 టోకెన్లను భక్తులకు అందుబాటులో ఉంచనుంది. ఇందుకు సంబంధించిన టీటీడీ వెబ్ సైట్  ద్వారా అంగప్రదక్షణ టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పించింది టీటీడీ. అంగప్రదక్షిణం టోకెన్లతో భక్తులు అర్ధరాత్రి దాటిన తర్వాత పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి తడి బట్టలతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మీదుగా ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఆలయంలోకి ప్రవేశించే భక్తులు ముందుగా వెండి వాకిలి దాటి బంగారు వాకిలికి చేరుకోవాలి. సుప్రభాత సేవలో భక్తులు అంగప్రదక్షిణ మొక్కులు తీర్చుకుంటారు.

Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
"తెలుగు-భారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. మన సంస్కృతీ, సంప్రదాయాలను మరింత లోతుగా విశ్లేషించి ప్రపంచానికి తెలియచేస్తూ మన ధర్మాన్ని కాపాడేందుకు మీ వంతు సహాయం చేయండి.
Supporting From Bharat:



#buttons=(Accept !) #days=(20)

Our website uses cookiesLearn..
Accept !
To Top