|  | 
| Sri Kanakadurgamma | 
అశ్వారావుపేట మండలంలోని గుర్రాలచెరువు గ్రామ శివారులో స్వయంభూగా వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని శుక్రవారం ప్రత్యేకంగా అలంకరించారు. 
   ఏపీలోని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడేనికి చెందిన గుడిపాటి గోపాలరావు, స్రవంతి దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారిని గాజులతో చేసిన చీరతో అలంకరించగా, భక్తులు అమ్మవారిని దర్శించుకుని వివిధ రకాల పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు.

 
 



 






