|  | 
| Sabarimala Temple | 
శబరిమల యాత్ర మార్గములు
శబరిమలై వెళ్ళడానికి ముఖ్యముగా మూడు మార్గములున్నాయి.
ఎరుమేలి మార్గం :
ఇది అతి ప్రాచీనమైన మార్గం. ఇక్కడ నుండి శబరిమలైలో అయ్యప్ప ఆలయమునకు డెబ్భై కిలోమీటర్లు నడువ వలసి ఉంటుంది. కేరళలో పునలూరు, కొట్టయాం స్టేషన్లకి ఎరుమేలి సుమారు ఏభై కిలోమీట్ల దూరములో వుంటుంది. ఎరుమేలి చేరడానికి ాక్సీలు, వ్యానులు, బస్సులు విరివిగా క్టొాయాంలో లభిస్తాయి. విజయవాడ, హైదరాబాద్ల నుండి ట్రైన్లో క్టొయాం డైరెక్టుగా వెళ్ళవచ్చును. ఎరుమేలి మార్గము గుండా అడవిలో నడచి ప్రయాణం చేస్తే హరిహరసుతుడైన మణికంఠుడు వీరవిహారం చేసినట్లు పురాణగాధలలో చెప్పబడిన పుణ్యస్థలములన్నీ దర్శించవచ్చు. పురాతనమైన స్నానఘ్టాలలో స్నానము చేయవచ్చును. మోహినీసుతుడైన అయ్యప్పస్వామి ఈ మార్గముగుండానే పులిపాలకొరకు వెళ్ళినట్లు చెప్పుతారు. అందుచేత లక్షలాది అయ్యప్పలు ఎరుమేలిలో పేటతుళ్ళై (నృత్యం) సలిపి, ధర్మశాస్త్ర దర్శనం చేసికొని ఈ మార్గముగుండానే ప్రయాణం సాగిస్తారు. ఈ మార్గము జనవరి మాసములో పన్నెండు రోజులు మాత్రమే (జనవరి 1వ తేది నుండి 12వ తేది వరకు) తెరచి వుంటుంది. మిగతా మాసములలో ఈ మార్గము మూసి ఉంటుంది.
వండి పెరియారు మార్గము :
తేని, కంభం దోవగుండా వెడితే వండి పెరియారులో గల శబరిమలై యాత్రలోని మొది తావళానికి సులువుగా చేరవచ్చు. ఇక్కడ నుండి సుమారు నలభైయైదు కిలోమీటర్లు పైగా నడిస్తే శబరిమలైలో అయ్యప్ప స్వామి దేవాలయమునకు చేరవచ్చు. (ఇప్పుడు ీ ఎస్టేట్సు ఉండడం వలన సుమారు ఇరువైఐదు కిలో మీటర్లు దూరము ప్రైవ్ే జీపులు వచ్చుచున్నవి) ీ ఎస్ట్ే నుండి సుమారు ఇరవై కిలోమీటర్లు నడచిన శబరిమలై చేరవచ్చును. ఇది చాలా కష్టతరమైన మార్గం. ఈ మార్గం గుండా పయనిస్తే హరిహరసుతుడైన ధర్మశాస్త్రలీలలు, స్వామి విహరించిన స్థలాలు, స్నానఘ్టాలలో స్నానం చేయడానికి వీలు కలుగదు. అందుచేత అయ్యప్పలు కొందరు ఈ మార్గాన్ని తిరుగు ప్రయాణమునకు మాత్రం ఉపయోగిస్తారు. 
పంబ :
కొట్టయాం నుండి పంబ సుమారు 120 కిలోమీటర్ల దూరంలో వుంటుంది. కొట్టయాం నుండి బస్సులు, వ్యానులు, ాక్సీలు విరివిగా లభిస్తాయి. అయ్యప్పలు తొందరగా ఇల్లు చేరాలనుకొనేవారు. అనారోగ్యము చేత దూరము నడువలేనివారు, బాగా వయసు మళ్ళిన ముదుసలులు పంబవరకు బస్సులో వచ్చి, పవిత్ర పంబా నదిలో స్నానము చేసి (సద్ది వండుకు తినేవారు వండుకుని తిని) నీలిమల ద్వారా శబరిమల చేరుతారు. కఠోరదీక్షను అవలంబించిన అయ్యప్పలు ఈ మార్గము గుండా వెళ్ళడానికి ఇష్టపడరు. (ఎరుమేలి మార్గము గుండా నడచి వచ్చినవారు కూడా పంబ మీదుగా శబరిమలై చేరాలి) అన్ని విధములా కష్టభూయిష్టమైన శ్రేష్ఠమైన ఎరుమేలి మార్గము గుండానే లక్షలాది అయ్యప్పలు ప్రయాణం సాగిస్తారు. శబరిమలై వెళ్ళే అయ్యప్పలు కనీసం ఒకసారియైనా ముఖ్యంగా కన్ని అయ్యప్పలు ఎరుమేలి మార్గము ద్వారా పయనించటం చాలా మంచింది. శ్రేష్ఠము పంబ మార్గము నుండి అయ్యప్పలు ఎప్పుడైనా యాత్ర సాగించ వచ్చును. పంబ నుండి శబరిమలై సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరం వుంటుంది.

 
 



 






