![]() |
| సంచార జాతులు కళాత్మక నిపుణులు | San̄cāra jātulu kaḷātmaka nipuṇulu | Sanatan Hindu Nomads |
సంచార జాతులు కళాత్మక నిపుణులు
మేదరి - మహేంద్ర కులంవారు
మహేంద్రగిరి పర్వతం పై శివుడు విసిరిన వాసుకి పాము యే వెదురుగా మారిందని,ఆ వెదురుతో పార్వతీ దేవీ వ్రతం ఆచరిస్తుందని,శివ గణాలు వెదురుతో బుట్టలు అల్లుతారని మహేంద్ర కులాల పురాణ కథనం.శ్రీ శైలం లోని శ్రీ కేతేశ్వరస్వామిని,ఆసిఫాబాద్ జిల్లాలోని కంకాలమ్మ దేవిని ఆరాధించి,వెదురుతో అద్భుత కళాత్మక వస్తువులను తయారు చేయగల నేర్పరులు మెదరి / మహేంద్రుల కులం వారు.
- ఇంటి పేర్లు : పిల్లి, ప్యారసాని, పాత కోటి, వాసం, వనమాల, నంది కంటి..మొదలైనవి.
- గోత్రం : హన్మంతగోత్రం, పులివరసు, రేగాకుల..
- వృత్తి ; ఇప్పటికీ 45 శాతం మహేంద్రులు వెదురు తోనే వస్తువులను తయారు చేసే పనిలో వున్నారు. నదీ తీరాల్లో మొలిచే వెదురు మొక్క సమాజ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషిస్తుందనడానికి ప్రతీకలు మహేంద్ర సంచార జాతులు. బ్రిటిష్ పాలనా కాలంలో 1871 క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ క్రింద వీరిని నిర్భంధించి హింసించారు. వీరి కళా నైపుణ్యం ఎవరితో పోల్చలేము. వెదురు బొంగులు తీసుకుని రావటం, నరకటం చేసి, నానబెట్టి వాటిని చీరటం ఇలా దశల వారీగా వెదురు బొంగుతో పుల్లలతో తట్టలు, చాటలు, బుట్టలు, నిచ్చెనలు, చాపలు, తడకలు, చాటలు ఇలా గృహాపయోగ వస్తువులు, వ్యవసాయ సంబంధిత వస్తువులను తయారు చేయటంలో మహేంద్రులు ప్రతిభావంతులు. వెదురుతో వెయ్యి లాభాలన్నట్లు వెదురుతో వందల రకాల వస్తువులను తయారు చేసి,పర్యావరణ మిత్రులుగా ఎదిగిన వారు మహేంద్రులు.
తెలంగాణాలోని అన్ని జిల్లాల్లో నివాసం ఏర్పరచుకుని జీవనయాపన చేస్తున్న మహేంద్రులు మేడ్చల్, హైదరాబాద్, సిద్దిపేట, మిర్యాలగూడ, నల్గొండ, జమ్మికుంట, మంచిర్యాల, ఖమ్మం ఇలా అన్ని జిల్లాల్లో విస్తరించారు. శారీరక శ్రమ చేస్తూ సమాజ పునర్ నిర్మాణంలో ప్రధాన పాత్రధారులు మహేంద్రులు.
నక్కల వాళ్లు
జీవనోపాధి కోసం ఒక చోటు నుండి మరొక చోటికి వలస వెళ్తూ కంజు పిట్టలను గువ్వల పక్షులను వేటాడే వాళ్లే నక్కల వాళ్ళు. ప్రారంభంలో మహారాష్ట్ర లో ఉంటూ అక్కడి నుండి మద్రాసు మీదుగా చిత్తూరు నెల్లూరు కడపలో జీవనం సాగించి మెదక్ వరంగల్ నల్గొండ నిజామాబాద్ ఆదిలాబాద్ మహబూబ్‌నగర్ ఖమ్మం మొదలైన ఉమ్మడి జిల్లాల్లో అలాగే హైదరాబాద్ పరిసరాల్లో 50 60 సంవత్సరాలుగా ఏర్పరచుకొని జీవిస్తున్నారు.
జాతర సీజన్లలో బతుకమ్మలాట దసరా దీపావళి మొదలైన పండుగల సమయంలో పూలు పండ్లు తాయెత్తులు సూదులు బొమ్మలు సౌందర్య సాధనాలు అమ్మి జీవి గడించి ఆదాయం గురించి జీవిస్తారు వీరికి నక్కల భాష అనే సొంత మాండలిక ఉంది. స్త్రీ పురుషుడు తమ శరీరాలపై పువ్వులు, జంతువులు దేవతల బొమ్మలను పచ్చబొట్లుగా వేయించుకుంటారు వీరిని దూకుడు మారువాల బేకో అనే రెండు సమూహాలుగా వర్గీకరించారు జాంబలల్ గుజరాతి మరియు పవార్ అనే సమూహాలు నామకరణ వేడుక చేస్తారు కేశఖండనం విషయంలో ప్రత్యేక ఆచారం ఏమీ లేదు వీరు సక్కతి దేవి సేల్ దేవి వైశాలి దేవి నౌకరిదేవి దుగావు దేవి వాదాయిదేవి మొదలైన దేవతలను పూజిస్తారు ప్రతి కుటుంబం పండుగ రోజున దూరపు బంధువుల్ని ఆహ్వానిస్తారు మధుర మీనాక్షి దుర్గాదేవి కాళీమాత పార్వతి ఈశ్వరి మారెమ్మ పోచమ్మ మైసమ్మ ఎల్లమ్మ దేవతలను కొలుస్తారు వీళ్ళ ప్రధానమైన పండుగ దసరా మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు హోలీ పండుగ కూడా పెద్ద ఎత్తున చేసుకుంటారు కుటుంబ దేవత ఆశీర్వాదం తీసుకొని వీరు పనులు కొనసాగిస్తారు తెలంగాణ ఏర్పడక ముందు ఏర్పడిన తర్వాత కూడా ప్రభుత్వ బడ్జెట్లో ఈ నక్కల వాళ్ళందరూ షెడ్యూల్డ్ ట్రైబ్ ఎస్టీ కింద 32 వ నెంబర్ కి చెందిన వారిని స్పష్టంగా పేర్కొనబడింది.
మొండి బండ
మొండి బండ వారు తెలంగాణలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లాలో నివసిస్తున్నారు.
- వృత్తి : ఊరూరా సంచారం చేస్తూ తాత్కాలికంగా పూరి గుడిసెలు వేసుకొని భిక్షాటనం చేయడం వీరి ప్రధాన వృత్తి. మొండి అంటే పట్టుదల గల వాడని అర్థం ఇంటింటికి భిక్షాటనకు వెళ్ళినప్పుడు ఇంటి ముందు బండల మీద తిష్ట వేసుకొని బిక్ష తీసుకునేంతవరకు కూర్చుని ఉంటారని నమ్మకం. చాతిని బాదుతూ నాలుకలు తెగేసుకుంటూ కత్తులతో చేతులను కోసుకుంటూ వాంతులు చేసుకుంటూ ఈ విధంగా వింత రీతుల్లో ప్రదర్శన చేస్తూ భిక్షాటన చేస్తారు.
- ఇంటి పేర్లు : నండూరి, మేకల, జవాబు, ఆవుల, గోరు, గాని ఎడ్ల మర్రి మొదలైనవి.
మొండి బండవాళ్లు మూడు ఉప కులాలుగా వర్గీకరించబడ్డారు తెల్లగా మొండివాడు గుండాల వాళ్లు సాగండి వాళ్లు వీళ్లంతా విభూతి దారులే పరమశివుని ఆరాధించేవాళ్లు ఎల్లమ్మను ప్రత్యేకంగా పూజిస్తారు పోచమ్మ మరమ్మ ముత్యాలమ్మలను కూడా ఆరాధిస్తారు భాగ్యనగర్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తారు అలాగే కొత్తగూడెం మెట్టు పోచంపల్లి కొయ్యలగూడెం నల్లగొండ ఆమనగల్ నకిరేకల్ పెద్ద అంబర్‌పేట రాపోలు పంతంగి చర్లగొండ నల్గొండ అనాజిపూర్ దండు మైలారం పోల్కంపల్లి లింగోటం చర్లపల్లి ఎలిమినేడు మొదలైన గ్రామాలలో కొన్ని కొన్ని కుటుంబాలు సమూహాలుగా నివసిస్తున్నారు.
వడ్డెరలు
తెలంగాణ రాష్ట్ర మంతట అన్ని జిల్లాల్లో నివసిస్తున్నారు వడ్డెర వడ్డే వడ్డేవాళ్లు కళకోలా అని పిలవబడుతున్నారు. గతంలో నల్గొండ జిల్లా అని వడ్డెరలు కొన్ని సంవత్సరాల పాటు పరిపాలించారని చెప్తారు.
వడ్డెరలు 8 ఉపదేగలుగా వర్గీకరించబడ్డారు. చిలకా కుండ లగువల్ల గోదండల మట్టి బండి సాతరు వారు ఉప్పర మొదలైనవి.
- వీరి ఇంటి పేర్లు : పీటల, దేరేముల, కుంచాల, పన్నీరు, బండారు, మొదలైనవి.
- కులదైవం : ఆంజనేయ స్వామి, అంకమ్మ తల్లి,ని కొలుస్తారు.
- వీరి ప్రధాన వృత్తి : రాళ్లు కొట్టడం, ప్రహరీ గోడల నిర్మాణం ,చెరువులు, బావుల తవ్వకం, గృహ నిర్మాణం, అలాగే పందులను కూడా పెంచుతారు.
బాలనాగమ్మ వంశీకురాలే వడ్డెరలు అని చెప్తారు. పసుపులేటి మొదలైన గోత్రాలు కలిగిన వాళ్లు వడ్డెరలు, ఎక్కువగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వికారాబాద్ లో అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లాలో నివసిస్తున్నారు. శ్రీనాథ మహాకవి ఉన్న కాలంలో రెడ్డి రాజుల పాలన తర్వాత వడ్డెరలు నల్గొండ జిల్లా పానగల్ మరియు కొన్ని ప్రాంతాలను పరిపాలించినట్లుగా చెప్తారు. అలాగే బ్రిటిష్ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జరిపిన పోరాటంలో ప్రధాన సేనాధిపతిగా వడ్డెర కులానికి చెందిన ఓబన్న నాయకత్వం వహించాడని చరిత్ర చెబుతుంది.
వీరభద్రయ్య - వీరముష్టి
ఈ పేరు సంస్కృత శబ్దమైన వీర యోధుడి ముష్టి ఘాతము నుండి ఈ పేరు వచ్చింది. రాజమహేంద్రవరంలో 11 వ శతాబ్దం లో రాజపుత్ర రాజైన విష్ణువర్ధనుని కాలంలో వీరముష్టులు సైనికులుగా పనిచేశారు.
వీరముష్టి మూడు గోత్రాలుగా విభజించబడింది:
- వీరభద్ర,
- దీక్షకుల,
- విభూతి పిండాల
వీరముష్టి వీరభద్రులు ప్రభలు తయారు చేసి శివాలయాల ముందు ప్రదర్శన చేస్తారు. శివ దండకాలు చదువుతారు. పోచమ్మ ముత్యాలమ్మ లను కొలుస్తారు. దక్షయజ్ఞంలో సతి దేవి అగ్నికి ఆహుతి అయినప్పుడు శివుని జటాజూటము నుండి ఉద్భవించిన వీరభద్రుడి వంశము వారే వీరముష్టివారు అని అంటారు.
ఇంటి పేర్లు ఇలా ఉంటాయి: మహంకాళి, మిరియాల, కాటా, రావాలా, పూసంపట్టి, చీకొండల, బొమ్మల, వారు, గుములాపురం, మోనాల, గుండ, కటిర, కాశం, కంది, కోరి, దావల, సారంగా, చెవ్వ, అగోలా, మిట్టపల్లి, బొంతపల్లి, మల్లూరి, తినాలి.
హిందూ వివాహ చట్టం ప్రకారం వారసత్వ హక్కులు లభిస్తాయి. వీళ్లంతా విభూతి దారులు ఆరాధ్యులను గురువులుగా భావిస్తారు. మహాశివరాత్రి రోజున పెద్ద ఉత్సవాన్ని జరుపుతారు కోమట్లు. బలిజల. వద్ద బిక్ష స్వీకరిస్తారు. నేటి కాలంలో వీరభద్ర వీరముష్టులు కొందరు వ్యవసాయం చేస్తూ మరికొందరు ఎక్కువ శాతం వాణిజ్య వ్యాపార రంగాల్లో ముందంజలో ఉన్నారు.
బేడ బుడగ జంగాలు
తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఎక్కువలో ఎక్కువ అన్ని మండలాల్లోకి వీరు విస్తరించి నివసిస్తున్నారు మీరు ప్రధానంగా బుర్రకథను ఆధారం చేసుకుని దైవభక్తిని దేశభక్తిని ప్రజల్లో చాటి చెప్పే సాంస్కృతిక సారథులుగా వ్యవహరిస్తున్నారు అలాగే జాతకాల పేరుతో సోది చెప్పటం కూడా వీరు చేస్తారు. ప్రారంభంలో భిక్షాటన వృత్తిని కొనసాగించినప్పటికీ ప్రస్తుతం దానిని వదిలేశారు.
స్వయంకృషితో స్వాభిమానంతో స్వయం ఉపాధి అవకాశాలు వెతుక్కుంటున్నారు మూలికా వైద్యము ద్వారా ఔషధాలను ఆయుర్వేద మందులను అమ్మి ఆదాయం గడిస్తున్నారు. ఈ బుడగజంగాలలో తాటాకుల పంచాంగం చెప్పేవారు ఉన్నారు ఇప్పటికీ చిలుక జోస్యం కూడా చెప్తారు మహా శివుడిని కులదేవతగా పూజిస్తారు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా సుమారు పదివేల మందికి పైగా రాష్ట్రమంతటా ఔషధాలు అమ్మే జీవనాన్ని కొనసాగిస్తున్నారు.
జాతకాలు చిలుక జోస్యం చెప్పేవారు. సుమారుగా రెండు మూడు వేల మంది ఉన్నారు గుజరాత్ గుజరాత్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఢిల్లీ ప్రాంతాలకు ఖమ్మం వరంగల్ జిల్లాల నుండి అలాగే తెలంగాణ ప్రాంతం నుండి 3000 మందికి పైగా ఔషధాల అమ్మకం కొనసాగిస్తున్నారు. మానుకోట జిల్లా తొర్రూరు దగ్గరలో ఉన్న అమ్మాపురం గ్రామం నుండి 1000 కి మందిపైగా బుడగజంగాలు మిగతా రాష్ట్రాలకు వెళ్లినట్లుగా ఖమ్మం జిల్లా బి ఎం బంజర చెందిన అబ్బదాసు అనే వ్యక్తి చెప్పటం జరిగింది.
వీరి ఇంటిపేర్లు : దూరపాటి, పస్తం, కిన్నెర, కొండపల్లి, గంధం, విభూది, పెల్లూరి, మోటం, కొండపల్లి, నరకోటి, కడ, వంచి, తళ్లెం, మొదలైనది.
ఉమ్మడి వరంగల్ జిల్లా లో తొర్రూరు అమ్మాపురం కంటే పాలెం మేడిపల్లి ఏ ఊరు దాట్ల దంతాలపల్లి దురిశెట్టి గూడెం బియ్యం బంజర ఖమ్మం గందగిరి మహాదేవపురం మొదలైన చోట్ల బుడిగజంగాలు నివసిస్తున్నారు.
ఎరుకల వారు
బ్రిటిష్ పాలనా కాలంలో వీరిని 1871 క్రిమినల్ రైట్స్ యాక్ట్ క్రింద నిర్బంధించి సంచారజాతులైన ఎరుకల వాళ్ళని నిర్బంధించి హింసించారు ఎరుకల కులం వారు తమిళం తెలుగు మాట్లాడతారు మహారాష్ట్రలో వీరిని కైకాడి అని పిలుస్తారు వీరు రేణుక ఎల్లమ్మ ఆరాధకులు ప్రతి మంగళ వారం శుక్రవారం అమ్మవారికి పూజలు చేస్తారు ఎరుకల జాతిలో 25 ఉపజాతులు ఉన్నాయి .
వీరి ప్రధాన వృత్తి పందులు మరియు గొర్రెల పెంపకం తమ కులదేవతలకు ఈ జంతువులను బలి ఇచ్చే ఆచారం ఉంది మహాశివుని హనుమంతుని ఆరాధిస్తారు ఎరుకల జాతిలో మహిళలు ఒక దేవతను ఉంచిన బుట్టను వెంటపెట్టుకొని ఎరుక చెప్తానమ్మా ఎరుక అంటూ జ్యోతిష్యం చెప్తారు, అంటే వ్యక్తుల భవిష్యత్తుపై జాతకాలు చెప్తారు ఎరుకల జాతి వారు బుట్టలు చాపలు తయారు చేస్తూ జీవనం గడుపుతున్నారు మహాభారతంలోని ఏకలవ్యుని భంషంగా తమను తాము భావిస్తారు వీరు ఆరితేరిన విల్లుకాండ్రుగా యుద్ద నిపుణులుగా పేరు పొందారు 1871 78 సంవత్సర కాలంలో వీరి వేటను మీరు తయారు చేసే అటవీ ఉత్పత్తులను బ్రిటిష్ వారు నిషేధించారు వీరిని శాశ్వత నేరస్తులుగా ముద్ర వేశారు. 1911లో చెన్నై పట్టణంలో హక్కులను బ్రిటిష్ వారు కాలరాశారు స్వాతంత్రం వచ్చిన తర్వాత 1952లో ఈ చట్టాన్ని రద్దు చేయడం జరిగింది . ఆ తరువాత వ్యవసాయ కూలీలుగా మీరు జీవనోపాధి ప్రారంభించారు ఎరుకల భాష వేరుగా కుర్రు భాష అని పిలుస్తారు వెదురు పుల్లలతో ఈత పుల్లలతో బుట్టలను తయారుచేస్తారు ఆకుకూరలు కూరగాయలు ఉప్పును కూడా అమ్ముతారు.
వీరి గోత్రం : కావాడి, సాతుబడి మానుబడి మింద్రభూతి అను నాలుగు గోత్రాల వారు ఉన్నారు వీరి ఇంటి పేర్లు ఇలా ఉన్నాయి కొరకల కేంసారం అలిగే దేవరకొండ దేవుడు సారి నెమలి బాదనపురి మార్కల్ రాష్ట్రపురం మేతాడి రేవెల్లి దుద్యాల కేతిరి కీమసారం మొదలైనది వీరి మతాచారం హిందూ దేవతలైన పరమశివుడు వెంకటేశ్వర స్వామి లక్ష్మీనరసింహస్వామి శ్రీరామచంద్రుని ఆరాధిస్తారు వీరి కులంలో తగాదాలు వచ్చినప్పుడు కుల పెద్దలు కూర్చుని పంచాయతీ చెప్తారు కుల పెద్దల తీర్పే అందరికీ శిరోధార్యం.
బైల్ కమ్మరులు
ఈ దిగవారు మహారాణా ప్రతాప్ కాలంలో రాజస్థాన్‌లోని మేవారు ప్రాంతంలో రాణా ప్రతాప్ సైన్యానికి ఆయుధాలు తయారు చేసి ఇచ్చేవారు రాణా ప్రతాప్ పాలన అనంతరం మొగుడు దండయాత్రలు జరిగినప్పుడు ఈ బయలు కమ్మరులు స్త్రీనివాసం లేక దేశం అంతా ఎడ్లబండ్లపై సంచారం చేస్తూ వచ్చారు ఆయుధాలతోపాటు వ్యవసాయ పనిముట్లు కూడా తయారు చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు తాము వెళ్లినచోట తాత్కాలికంగా గుడిసెలు వేసుకుని జీవిస్తారు తమదైన ఆచార సంప్రదాయాల పట్ల నమ్మకం కలిగి ఉంటారు కళాత్మక నైపుణ్యం కలవారుగా వీరు ప్రసిద్ధి చెందారు కరీంనగర్ నిజామాబాద్ హైదరాబాదులలో బయలు కమ్మరులు నివసిస్తూ ఉంటారు.
సిక్ లిగార్
ఇది ఒక ప్రత్యేకమైన సంచార జాతి. ఈ తెగకు చెందిన వారు వస్తాదులుగా, ఆయుధ తయారీ దారులుగా ఇనుప పని వాళ్ళుగా ప్రసిద్ధి పొందారు. వీరు సిక్కు మతాన్ని అవలంబిస్తారు.
గురుగోవిందుని కాలంలో ఔరాంగజేబు తో యుద్ధం జరుగుతున్న సమయంలో ఈ సిక్ లిగార్ లు ఆయుధాలు తయారు చేసి అందించేవారు. అలాగే ఆయుధాల సంరక్షణ, పదును పెట్టడం, మరమ్మత్తులు చేయడం వంటి పనులు చేసేవారు. గురు గోవిందుని మరణం తర్వాత వీరు వేరే వేరే ప్రాంతాలకు వలస వెళ్లారు.గురుద్వారాలలో పాఠం లో పాల్గొనడం, సిక్కు మత పండుగల్లో ఆచారాలు పాటించటం జరుగుతుంది.
దొమ్మేర వాళ్ళు
- ఇంటి పేర్లు : కంసాని,ఆరే,ముసుకు,జూపల్లి,మేకల మొదలైనవి
- కళలు : త్రాడు మీద కర్ర పట్టుకుని విన్యాసాలు,
సన్న రింగ్ నుండి దూరటం, జిమ్నస్టిక్స్, శారీరక ప్రదర్శనలు చేసి బిక్ష స్వీకరించటం.
గ్రామ గ్రామాన సర్కస్ ప్రదర్శనలు చేస్తారు. వారి కుటుంబంలోని చిన్న పిల్లలతో పాటు అందరికి శిక్షణ ఇస్తారు.
- ఉత్పత్తులు: దువ్వెనలు, చీపురులు, బొమ్మలు, తల దిండులు తయారు చేయటంలో నిపుణులు.
- కులదైవం : పోచమ్మ,ఎల్లమ్మ దేవతలను కొలుస్తారు.
బ్రిటిష్ కాలంలో వీరిని 1871 క్రిమినల్ ట్రైబ్స్ క్రింద అరెస్ట్ చేసి నానా యాతనలు పెట్టారు.
డక్కలి వారు
వీరు మాదిగలకు ఆశ్రీత కులంగా వున్నారు. నాటు వైద్యం - మూలికా వైద్యం చేస్తారు. ఆదిలాబాద్, కరీంనగర్ తో పాటు హైదరాబాద్ దగ్గరలో చుట్టుప్రక్కల గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు.
- సంస్కృతి : తాటాకులపై రాసిన జాంబవ పురాణం చెప్తారు.
- ఇంటిపేర్లు : భవానీ, చారుగొండ, బాణాల, కర్ణి, జడ, అంతేని, నల్లమోళ్ల మొదలైనవి.
- గోత్రాలు : 12 వున్నాయి.
కర్నె, భవానీ, అల్లం, పోటేటి, జడ, కస్తూరి, రేణి గుంట, చారగొండ, బాణాల, గౌరారపు, డాకూరి,
భోగ, మేకల మొదలైనవి.
పూసలమ్మె వారు
పూసలు, కుంకుమ, బుక్క, గంధం, కాటుక వంటి వస్తువులను ఊరురా అమ్మకం చేస్తూ జీవన యాపన చేసేవారే పూసల వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ లో వీరిని కృష్ణ బలిజ అంటారు.
- ఇంటిపేర్లు : పగిడిపల్లి,కోనేటి,పన్నీరు,ముదరవొళ్ళ,కావేటి,మద్దె బోయిన,గుడ్లోళ్ళు,బోశెట్టి వాళ్ళు, పిల్లి మొదలైనవి.
- కులదైవం : శ్రీ కృష్ణుడు..బుట్టలో కూర్చోపెట్టి పూజలు చేస్తారు.దుర్గాదేవిని కొలుస్తారు.
- నివాసం : హైదరాబాద్ చుట్టు ప్రక్కల, జనగాం,మచుపహాడ్,నర్మేట, కడవేండి, సిద్దిపేట, గజ్వెల్, బూర్గుపల్లి, దుబ్బాక, నిజామాబాదు, మెదక్, కామారెడ్డిలలో పూసల కుటుంబాలు వున్నాయి.నిర్మల్ లోనైతే 300 కుటుంబాలు వున్నారు. ఒక శ్రీ కృష్ణాశ్రమం నిర్మించి పూజలు చేస్తూ వుంటారు.
హోలీయా దాసరి
దాసరి అంటే సంస్కృత శబ్దమైన 'దాస ' నుండి వచ్చింది. భగవత్ భక్తుడని కూడా అర్థం. శతాబ్దాలుగా ఆలయాల వద్ద భజనలు,హరినామ సంకీర్తనలు, ధార్మిక సేవలు చేస్తూ,జీవిస్తూ,వైష్ణవ మతాన్ని అనుసరించే బిక్షాటన తెగ హోలీయా దాసరి వాళ్ళు.
- ఇంటి పేర్లు : కావేటి,సూదనవేన,పెండ్యాల,కర్రే,బండ, అబ్బనవొయిన,బొమ్మనవైన,దామన వైన
- గోత్రం : రామాంజనేయ గోత్రం,సుదర్శన గోత్రం.
- కుల దైవం : లక్ష్మీ నర్సింహా స్వామి.
- వేషాలు వేసి చెప్పే కథలు : భూ కైలాసం,సత్య హరిశ్చంద్ర,పాండవ వనవాసం,శ్రీ కృష్ణా ర్జున యుద్ధం,ధనంజయ, భక్త ప్రహ్లాద మొదలైనవి.
మెదక్ జిల్లా లో రామాయం పేట,మేడ్చల్ జిల్లా, భూంపల్లి, రామంచ, పెద్దగుండవెల్లి, కామారెడ్డి, నిజామాబాదు, మెట్టుపల్లి, జగిత్యాల ధర్మారం, ఇందల వాయి, సిద్దిపేట, కాజీపురం, హైదరాబాద్ ఇలా అన్ని జిల్లాల్లోను నివాసం వున్నారు.
అవకాశం వస్తేనే కళా రూపాల ప్రదర్శన చేస్తారు.రోజు బొమ్మలు,ప్లాస్టిక్ వస్తువులు,బొట్టు బిళ్ళలు,అమ్మకం సాగిస్తూ పొట్ట గడుపుకుంటున్నారు.
ఓడ్ కులం
భరతదేశంలోని పురాతన కులం ఇది.ఓడ్ తెగ వారు రాజస్థాన్ నుండి మహారాష్ట్ర, గుజరాత్, మరియు తెలంగాణ ప్రాంతాలకు వలస వచ్చారు.
వీరికి శివుడు ఆరాధ్య దైవం. కుల దేవత "కానుసతీ మాత " మహారాష్ట్ర లో బుల్డానా జిల్లాలో పనరక్షేటి అను గ్రామంలో ఈ మాత దేవాలయం ఉంది. దీపావళి తర్వాత 11 రోజులకు పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతాయి.
తెలంగాణాలోని ఆదిలాబాద్ లో 1000 కుటుంబాలు,నిర్మల్ లో 400,ఇందూరు ( నిజామాబాదు) జిల్లాలో 200 కుటుంబాలు నివసిస్తున్నాయి. నిజామాబాదు జిల్లాలోనవీపేట, నందిపేట, ఏడవల్లి, బోధన్, దర్ పల్లి, ఆర్మూరు, గోవింద్‌పల్లి, చౌటిపల్లి, సుంకేటి, సికింద్రాపూర్, చిన్న దుబ్బాక గ్రామాల్లో ఓడ్ కులస్తులు వున్నారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్, కరీంనగర్ లలో కూడా ఓడ్ వాళ్ళున్నారు.
- ఇంటిపేర్లు : జాదవ్,రాథోడ్,పవార్,సాలూంకే,చౌహన్
- గోత్రాలు : కుదావలే,బహరు,బోగర్,బ్యావత్
- ఆచారం: ప్రతి సంవత్సరం దీపావళి మరుసటి రోజు ఓడ్ కులస్తులు ఎక్కడెక్కడ నదులు వుంటాయో అక్కడక్కడ రొట్టె ముక్కలతో పాటు నీటిని దోసిల్లోకి తీసుకుని నదులలో పితృ తర్పణాలు చేస్తారు.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 77 సంవత్సరాలు గడిచినప్పటికి ఓడ్ కులం ప్రభుత్వం గుర్తింపును పొందలేదు.ఫలితంగా ఎన్నో ఓడ్ కుటుంబాలు ప్రభుత్వ పథకాలకు,విద్యకు దూరమయ్యారు. కొన్ని సంవత్సరాల నిరంతర పోరాటం తర్వాత 2022-23 లో ఈ ఓడ్ ని బీసీ గా గుర్తించి కుల సర్టిఫికెట్స్ ని అందజేసిందని ఓడ్ నాయకులు శరత్ జాదవ్ ( నిజామాబాదు జిల్లా) తెలిపారు.
బుడబుక్కల వారు
వీరు తెలుగు,మరాఠీ భాషలో మాట్లాడుకుంటారు. చేత ధరించిన చిన్న డమరుకం నుండి వచ్చే బుడక్ బుడక్ అనే శబ్దం వల్ల వీరికి బుడ బుక్కల అని పేరొచ్చింది.ఋతువుల వీరి ప్రకారం సంచారజీవనం సాగుతుంది.మెడలో రుద్రాక్షలు,భుజాన జోలే సంచి వేసుకుని పగటి వేష దారులై సహజంగా నటిస్తూ ఇంటింటికి వెళ్లి బిక్షాటన చేస్తారు.ఇంటింటా జోష్యం చెప్తారు."ఓం అంబ పలుకు,జగదాంబ పలుకు " అంటూ పాటలు పాడతారు.నల్లని కోటు ధరించి,తల పాగా చుట్టి,ముంజెతికి కడియం ధరించి,నొసట కుంకుమ బొట్టు పెట్టి దర్పంతో యాచన చేస్తారు.పాత గుడ్డలు తీసుకుని పోయి, పెద్ద బొంతలు తయారు చేసి అమ్ముతారు.చిన్న పిల్లలకు తాయేత్తు కట్టి,చెడు దగ్గరికి రాకుండా చేస్తారు.రాత్రి మొదలు పెట్టి తెల్లారే వరకు భిక్షాటన చేస్తారు.పురాణ గ్రంథాలోని కథలు ఉదాహరణలుగా చెప్తూ,సామెతలు వివరిస్తూ వీరి సంచార జీవనం సాగుతుంది.
బహు రూపులు
వివిధ రకాల వృత్తుల వారిని అనుకరిస్తూ వివిధ వేషాలు వేసి ప్రదర్శనలు చేసేవారే బహురూపులు.లంబాడా వేషం వేసి తర్వాత వెంటనే మార్వాడి వేషం వేస్తారు. ముసలమ్మ వేషం వేసి ఆ తర్వాత వెంటనే నృత్యం చేసే అమ్మాయి వేషం వేసి,తమ నటనా చాతుర్యం తో మెప్పించి,బిక్షాటన చేసే వారే బహురూపులు.వీరు శైవారాధకులు.అలాగే పోచమ్మను కూడా కొలుస్తారు.వారి కుటుంబంలో ఎవరైనా చనిపోతే శవాన్ని కూర్చోపెట్టి ఖననం చేసే ఆచారం ఉంది.
రాముడు,ఆంజనేయుడు,గొర్రెలు కాచే గొల్లల వేషాలు వేసి వినోదాన్ని,హాస్యాన్ని అందిస్తారు.
బాల సంతులు
ప్రతి రోజూ సూర్యోదయానికి ముందే శైవ కథలు పాడుతూ వుంటారు. చిన్న గాజు ముక్కలతో అల్లిక చేసిన పొడవాటి గౌను ధరించి,గంట మ్రోగిస్తూ,శంఖం పూరిస్తూ పాటలు పాడుతూ,ఇల్లిళ్లు తిరుగుతూ బాల బాలికలను అలరించి సంతోషపెట్టే వారే బాలసంతులు.రామాయణ కాలం నాటి లక్ష్మణునికి తాము వారసులమని,శ్రీరాముని పుత్రులైన లవ కుషులను లక్ష్మణుడు ఆడించి అలరించినట్లుగానే తాము కూడా గ్రామ గ్రామానికి సంచరించే ఈ బాలసంతులు తమ సామానులు అన్ని కర్రెలతో చేసిన కవాడిపై మోసుకుని వెళ్తారు.ఊరికి దూరంగా జీవన యాపన చేస్తూ,ఈత చాపలు అల్లి అమ్మకాలు కొనసాగిస్తారు.వారి స్వంత లిపి లేని భాషలో మాట్లాడుకుంటారు.బిక్షాటన వృత్తిగా జీవించే వారు నేడు చిరు వ్యాపారాల్లో జీవనం గడుపుతున్నారు.
వంశ రాజుల ( పిచ్చుక కుంట్ల)
పాల్కూరికి సోమనాథుడు రచించిన పండితారాధ్య చరిత్ర లో పిచ్చుకుంట్ల కులాల ప్రస్తావన వస్తుంది.సోమనాద్రి,సదాశివ రెడ్డి,ఎల్లారెడ్డి మున్నగు కథా గేయాలు ఆలపిస్తారు.త్రిమూర్తుల వివాహం జరుగుతున్న వేళ గోత్రాలు చెప్పడానికి ఒక వ్యక్తిని సృష్టించడానికి ఒక బొమ్మను చేసి ప్రాణం పోస్తారు.వారే తర్వాతి కాలంలో పిచ్చుకుంట్ల వారయ్యారని నమ్మకం.
ఈ కులం 7 ఉప కులాలుగా వర్గీకరించబడింది.
అవి:
- గొల్ల,
- తెలగ,
- గంట,
- తురక,
- తొగరు,
- మంద,
- తిత్తి..
అలాగే గోత్రాలు : గంటెడు,బండారు,పిడం,బాణం మొదలైనవి.ఇంటి దైవం : శ్రీ మల్లికార్జున స్వామి,పోచమ్మ,ఎల్లమ్మ,ఇదమ్మ ను కూడా కొలుస్తారు.
ఈ వంశరాజులకు జంగమలు పురోహితులుగా వ్యవహారిస్తారు.తెలుగు జానపద సంగీతానికి ప్రాణ భిక్ష పెట్టిన వారు భిక్షక గాయకులే అని గట్టిగా చెప్పవచ్చును.పిచ్చుకుంట్ల,శారద కాండ్రు,వీర ముష్టులు,జంగాలు, దాసర్లు,బుడబుక్కల వారు,తోలు బొమ్మలాట వాళ్ళు మొదలైన వారంతా ఆయా కులాల కుల గోత్రాలు వివరిస్తూ పురాణ కథలను అందరికీ ప్రచారం చేసి,బదులుగా ధాన్యం సేకరించేవారు.శ్రీనాథ మహాకవి రచించిన పల్నాటి వీర చరిత్రను 15 రాత్రులు ఏక ధాటిగా చెప్పగల ప్రతిభా సంపన్నులు వంశరాజులు. 1995 లో పిచ్చుకుంట్ల అనే పదం వంశరాజులుగా ప్రభుత్వం మార్చింది.
క్షత్రియ రామజోగి :
(రామజోగి/రామజోగుల) కులానికి చెందిన వారు ప్రదానంగా తెలుగు, హిందీ, మాట్లడుతారు. రామజోగుల వారకి ఇతర ప్రత్యేక భాష ఏమి లేదు.
పుట్టుక: రామనామ స్మరణతో రామనామ సేవతో క్షత్రియ వర్గ సేవికులుగా శ్రీ క్షత్రియ రామజోగిగా పేరు గాంచడమైనది. పూర్వము త్రేతాయుగకాలము నుండి సాక్షాత్తు భగవత్ స్వరుపుడైన శ్రీ రాముడు, వారి పూర్వికుల నుండి శ్రీ క్షత్రియ రామజోగి (రామజోగి/రామజోగుల) వారు ప్రత్యక్ష, పరోక్ష సేవలు చేస్తున్నారు.
శ్రీ క్షత్రియ రామజోగి కులానికి ఈ పేరు రాముని పేరుమీద నామకరణం చేయడం జరిగింది. సంచార జీవనములో భాగంగా పురాణం ఇతిహాసాలని పాతాళ రూపకంగా కీర్తనల రూపకంగా కథల రూపకంగా సమాజానికి తెలియజేస్తూ వృత్తి పరంగా ఆయుర్వేదిక చెట్ల పసరికల ద్వారా వివిధ వ్యాదులని నయం చేయడంలో సిద్ద హస్తులు. రామజోగులు ప్రదానంగా మానసికమైన శారీరక వ్యాదులకి, మానసికమైన వ్యాదులని నయం చేస్తారు. శ్రీ క్షత్రియ రామజోగి ( రామజోగి/రామజోగుల ) కులానికి చెందిన వారు ప్రదానంగా కరీంనగర్, మహబూబాబాద్, సిద్ధిపేట, బద్రాద్రికొత్తగూడెం, సూర్యాపేట, మేడ్చెల్ జిల్లాల్లో జీవిస్తున్నారు.









