![]() |
| Non-Hindus are not allowed into the Kedarnath and Badrinath temples |
బదరీనాథ్, కేదార నాథ్ ఆలయ కమిటీ అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. బదరీనాథ్, కేదరనాథ్ సహా ఆలయ కమిటీ పరిధిలోకి వచ్చే అన్ని దేవాలయాలలోకి హైందవేతరులకు (హిందువులు కానివారు) ప్రవేశాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే జరగబోయే ఆలయ కమిటీ బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనను ఆమోదించనున్నామని కమిటీ చైర్మన్ హేమంత్ ద్వివేదీ ప్రకటించారు.
దేవభూమి ఉత్తరాఖండ్ కి సంబంధించిన సాంస్కృతిక, మతపరమైన సంప్రదాయాలను రక్షించడం అత్యంత ముఖ్యమైందననారు. కేదార ఖండ్ నుంచి మొదలు పెడితే, మానస ఖండ్ వరకూ వున్న ఆలయాల్లో హిందువులు కానివారి ప్రవేశం అనేది సంప్రదాయంగా వస్తున్నదే అని గుర్తు చేశారు. అయితే బీజేపీయేతర ప్రభుత్వాలు వున్న సమయంలో వీటిని ఘోరంగా ఉల్లంఘించారని మండిపడ్డారు. తాము మాత్రం ప్రస్తుతం ఈ సంప్రదాయాలను తిరిగి పునరుద్ధరిస్తామని ప్రకటించారు.
ఇప్పటికే గంగోత్రి ధామ్ లోకి హైందవేతరుల ప్రవేశాన్ని నిషేధించారు. గంగోత్రి టెంపుల్ కమిటీ సమావేశంలో దీనిపై ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే బద్రీనాథ్ కేదార్ నాథ్ ఆలయల విషయం కూడా ప్రస్తావనకు వచ్చింది.




