![]() |
| రామయోగి |
అన్నారెడ్డిపాళెం రామయోగి (1895-1962)
చదువు లేకపోయినా సంస్కారవంతులు కావడం, విద్యలు నేర్చుకోలేక పోయినా విజ్ఞాన ఖనులు కావడం పూర్వజన్మసుకృతం. ఆ కోవకు చెందిన సత్పురుషుడు అన్నారెడ్డి పాళెం రామయోగి. ఆయన నెల్లూరు జిల్లా వేదాద్రి సమీపంలోని మోపూరులో చేపూరు రామమ్మ, పిచ్చిరెడ్డి దంపతులకు మన్మథ నామ సంవత్సర శ్రావణ శుద్ధ అష్టమి సోమవారం (29-7-1895)న జన్మించారు. ఆ శిశువుకు రామిరెడ్డి అని పేరు పెట్టారు.
![]() |
| రమణ మహర్షికి ఎడమ వైపున నేలపై కూర్చున్న యోగి రామయ్య |
పసితనంలోనే తండ్రి చనిపోవటంతో రామిరెడ్డి మేనమామల ఆశ్రయంలో అన్నారెడ్డిపాలెంలో పెరిగి చతువుసంధ్యలు సాగించారు. భారత, భాగవతరామాయణాలు, వాటిలోని సత్యదృష్టి, ధర్మ విచక్షణ ఆయనకు ఒంటబట్టాయి. రామాయణ కర్త వాల్మీకి, మాదిరిగా తపోనిష్ఠుడు కావాలని, పరమభక్తుడు కబీర్ దాసు వలె వైరాగ్య సంపన్నుడు కావాలనే తపనతో రామిరెడ్డి
గంటల తనబడి ధ్యానంలో నిమగ్నమయ్యారు. భగవత్ సాక్షాత్కారం కోసం ఆవేదన ఎక్కువై
ఈశ్వర చింతన, రామనామ స్మరణం, ధ్యాన నిరతిలను ఏకాగ్రచిత్తంతో సాధించారు.
| యోగి రామయ్య సమాధి |
బాపట్ల బ్రహ్మానంద తీర్ణులు నెల్లూరులో ఆధ్యాత్మిక ఉపన్యాసాలు పండిస్తున్న రోజులో రామిరెడ్డి
ఆయనను ఆశ్రయించి రామతారక మంత్రోపదేశం పొందారు. గురువు ఆదేశం మేరకు రోజుకు
ఐదువేల సార్లు ఆ మంత్రాన్ని జపించడంతో జ్ఞానపిపాస, ఆత్మజిజ్ఞాస ఎక్కువై వైరాగ్యం
పూర్ణమైనది. సర్వం త్యజించి దూరంగా హిమాలయాల్లో తపస్సుకు బయలుదేరారు. అయితే
దారిలో గురువు ఆదేశం మేరకు స్వగ్రామానికి తిరిగి వచ్చి తోటలో కుటీరం నిర్మించుకుని
ఏకాంతంగా జపధ్యానాలు తీవ్రతరం చేశారు. రాత్రిపూట 6మైళ్ళు నడిచి నరసింహులు కొండకు
వెళ్ళి తపస్సు చేసి తెల్లవారే సరికి ఆశ్రమానికి వచ్చేవారు.
![]() |
| కుడి నుండి రెండవ యోగి రామయ్య |
ప్రాణాయామం, మౌనం, యోగాసనాలు, తితిక్ష చిత్త నిరోధం, సహన శీలత, ఏకాంతవాసం, నిష్కామవృత్తి, సమభావం, అష్టాంగయోగం సాధించారు. నిర్వికల్ప సమాధిలో ఆయనకు ఏకం నిత్యం అయిన స్వస్వరూపమే ప్రకాశించింది. కొంతకాలం రమణ మహర్షిని గురువుగా సేవించారు. మామిడి గుహలో తపస్సు చేసి అనంతరం అన్నారెడ్డిపాలెంలో ఆశ్రమం నిర్మించుకున్నారు. 12 ఏళ్ళు మోనవ్రతం పాటించారు 1936 ఫిబ్రవరిలో పల్లెపాడు ఆశ్రమంలో ఉన్న రామయోగి చతుర్భుజాలతో మహా విష్ణుమూర్తి సాక్షాత్కారం పొందారు. రమణ మహర్షి సందేశాన్ని రామయోగి ప్రతి పల్లెకు అందించారు. ప్లవ సంవత్సరం మాఘశుద్ధ అష్టమి సోమవారం 12-2-1962న రామయోగి తమ శరీరాన్ని వదిలి పరబ్రహ్మ స్వరూపులయ్యారు. ఒక భక్తురాలు కట్టించిన మందిరంలో శ్రీవారిని సమాధి చేశారు.







