నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

పండుగలు

పండుగలు
Showing posts with label జాతీయవాది. Show all posts
Showing posts with label జాతీయవాది. Show all posts

Sunday, September 27, 2020

పండిత దీన్‌దయాళ్ ఉపాధ్యాయ – భారతీయ జాతీయవాదం - Pandit Deendayal Upadhyay

పండిత దీన్‌దయాళ్ ఉపాధ్యాయ – భారతీయ జాతీయవాదం - Pandit Deendayal Upadhyay

 – మనీష్ మోక్షగుండం
పండిత దీన్‌దయాళ్ ఉపాధ్యాయ (సెప్టెంబర్ 25, 1916 – ఫిబ్రవరి 11, 1968) ఒక భారతీయ తత్వవేత్త, ఆర్థికవేత్త, సామాజిక శాస్త్రవేత్త, చరిత్రకారుడు, పాత్రికేయుడు, రాజకీయ కార్యకర్త. ప్రస్తుత భారతీయ జనతా పార్టీకి ముందున్న భారతీయ జనసంఘం ముఖ్య నాయకులలో ఆయన ఒకరు. సంపూర్ణ మానవీయతకు ఆయన ఒక దిక్సూచి, ఆయన ఒక సిద్ధాంతకర్త, పరిపాలన, రాజకీయాల ప్రత్యామ్నాయ నమూనాకు మూలం.

ఆయన కేవలం మాటల మనిషి కాదు, చెప్పినది తాను ఆచరించి చూపే ఆదర్శ స్వయంసేవకుడు, కార్యనిర్వాహకుడు, సామాజిక చింతకుడు, ఆర్థికవేత్త, విద్యావేత్త, రాజకీయవేత్త, రచయిత, జర్నలిస్ట్ , వక్త. పండిత దీన్‌దయాళ్ జీవితం పరోపకార ధర్మపు నిజమైన ఆచరణ, అలాగే సనాతన సాంప్రదాయం, భారతీయ సాంస్కృతిక విలువల ప్రతిబింబం. భారతీయ జాతీయవాద ఆకాశంలో ఒక ప్రకాశవంతమైన నక్షత్రం దీనదయాళ్ జీ. రాజకీయాల్లో భారతీయ విలువలకు ఆయన ఒక ఆదర్శ ప్రతినిధి. స్వాతంత్ర్యం తరువాత రాజకీయ శూన్యత తొలగించాల్సిన అవసరాన్ని గుర్తించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ద్వితీయ సర్ సంఘచాలక్ గురూజీ గోల్వాల్కర్ ఆ బాధ్యతను దీనదయాళ్ జీ కి అప్పగించారు. 

జాతీయవాద రాజకీయ పార్టీ అయిన భారతీయ జన సంఘ్, 1951 లో డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ప్రారంభించినప్పుడు సంస్థాగత నిర్మాణం కోసం దీనదయాళ్ గారినే నియమించారు. ప్రజాస్వామ్యం, పాలనకు సంబంధించిన పాశ్చాత్య భావనలను భారతీయం చేయడంలో గొప్ప నైపుణ్యం, అవగాహన చూపిన దీనదయాళ్ ఉపాధ్యాయ పశ్చిమాన ప్రజాస్వామ్యపు ప్రాథమిక సిద్ధాంతాలు పెట్టుబడిదారీ విధానానికి ప్రతిచర్య అని అభిప్రాయపడ్డారు. కనుక వేదాలు, పురాణాలు, ధర్మ శాస్త్రాలు ఇతర సాంస్కృతిక జ్ఞాన వ్యవస్థల నుండి జాతీయవాద నైపుణ్యాన్ని భారతీయ సూత్రాలను అనుసరించాలని ఆయన సూచించారు.

మలుపు
దీనదయాళ్ జీ 1937 లో కాన్పూర్ లోని సనాతన్ ధర్మ కళాశాలలో విద్యార్థిగా ఉన్నప్పుడు, తన సహధ్యాయి బలూజీ (బల్వంత్) మహాషాబ్డే ద్వారా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) తో పరిచయం కలిగింది. అక్కడ ఆయన ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకుడు డాక్టర్ హెడ్గేవర్ (డాక్టర్‌జీ) ను కలిశారు, ఇది దీన్‌దయాల్జీ జీవితంలో ఒక మలుపు . డాక్టర్‌జీ అదే హాస్టల్‌లో ఉండేవారు. సంఘ్ మేధోపరమైన ప్రేరణతో దీనదయాళ్ జీ ఎంతగానో ఆకర్షితులైయ్యారు. తన కళాశాల జీవితమంతా ఆర్‌ఎస్‌ఎస్‌ పనిలో నిమగ్నమయ్యారు.

దీనదయాళ్ జీ ప్రయాగ్ నుండి బిటి డిగ్రీని సంపాదించారు. అయినా ఉద్యోగం చేయకూడదని నిర్ణయించుకున్నారు. అప్పుడే నాగ్‌పూర్‌లోని 40 రోజుల ఆర్‌ఎస్‌ఎస్ శిక్షణ శిబిరానికి హాజరయ్యారు. తరువాత 1942 నుండి ఆర్‌ఎస్‌ఎస్‌లో పూర్తి సమయం పనికి తనను తాను అంకితం చేసుకున్నారు.

పాత్రికేయునిగా…
దీనదయాళ్ జీ రాష్ట్ర ధర్మ, స్వదేశ్, ఆర్గనైజర్, పాంచజన్య వంటి పత్రికలలో తన రచనల ద్వారా జాతీయ ఆలోచనవిధానానికి బీజాలు జల్లారు. ఆయన ప్రసిద్ధ వ్యాసాలు ‘పొలిటికల్ డైరీ’ తరువాత అత్యధికంగా అమ్ముడైన పుస్తకం గా ప్రచురించబడింది.

దీనదయాళ్ జీ 1940 లో లక్నోలో ‘రాష్ట్ర ధర్మ ప్రకాశం’ అనే ప్రచురణ సంస్థ స్థాపించారు. తను నమ్మిన సూత్రాలను ప్రచారం చేయడానికి ‘రాష్ట్ర ధర్మం’ అనే మాస పత్రికను ప్రారంభించారు. ఈ పత్రిక ఏ సంచికలోనూ ఆయన పేరు సంపాదకుడిగా ముద్రించబడనప్పటికీ, ఆలోచనను రేకెత్తించే రచనల ద్వారా ఎంతో ప్రభావాన్ని చూపారు.

జర్నలిస్టుల కోసం ఆయన సందేశం స్పష్టంగా ఉంది, “వార్తలను వక్రీకరించవద్దు”. దీన్ని వివరించడానికి ఇక్కడ ఒక కధ ఉంది; 1961 లో రైల్వే ఉద్యోగులు జాతీయ సమ్మెకు పిలుపునిచ్చారు, జన సంఘ మద్దతు ఇచ్చింది , కాని పాంచజన్య పత్రికలో మాత్రం సమ్మె ని విమర్శిస్తూ వ్యాసం వచ్చింది . దాంతో కాంగ్రెస్ పత్రిక నవజీవన్ జనసంఘ నాయకులపై వ్యంగ్య దాడికి దిగింది. ప్రధాన కార్యదర్శిగా జోక్యం చేసుకుని దీనదయాళ్ జీ తన ప్రకటనతో సమస్యను పరిష్కరించారు ” పార్టీ ప్రయోజనాల కోసం చెయ్యాల్సిన ఏదైనా కార్యక్రమం, దేశ ప్రయోజనాలకు అడ్డు అనుకుంటే , అప్పుడు ఏమి చేయాలి? సమ్మెకు మద్దతు ఇవ్వడానికి పార్టీకి తప్పనిపరిస్థితి ఉండవచ్చు, కాని పాంచజన్యకు అలాంటి అనివార్య కారణాలు ఉండకూడదు. ప్రతి ఒక్కరూ తమ స్థానంలో సరైన నిర్ణయం తీసుకున్నారని నా అభిప్రాయం. పార్టీలు సమాజం లేదా దేశం కంటే పెద్దవి కావు. జాతీయ ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఒక జర్నలిస్ట్ దేశానికి విధేయుడిగా ఉండాలి. ” అని స్పష్టం చేశారు.

పుస్తక రచయిత
దీనదయాళ్ జీ “చంద్రగుప్త మౌర్య” అనే నాటకాన్ని కూడా వ్రాసారు. శంకరాచార్యుల జీవిత చరిత్రను హిందీలో వ్రాసారు. ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకుడు డాక్టర్ హెడ్గెవార్ జీవిత చరిత్రను మరాఠీ నుండి హిందీకి అనువదించారు. ఆయన రచనలు సామ్రాట్ చంద్రగుప్తుడు (1946), జగత్గురు శంకరాచార్య (1947), అఖండ్ భారత్ క్యో?, రాష్ట్ర చింతన్, ఏకాత్మ మానవవాదం, రాష్ట్ర జీవన్ కి దిశా మొదలైనవి.

రాజ ధర్మ నిపుణుడు
“ధర్మం తన శక్తిని ఉపయోగిస్తుంది. జీవితంలో ధర్మం ముఖ్యం. ధర్మ రక్షణ చెయ్యాలని, తన ఆత్మ ప్రబోధాన్ని అనుసరించి ధర్మాన్ని వ్యాప్తి చేయాలని సమర్ధ రామదాస స్వామి శివాజీ మహారాజుకు బోధించారు. తన రాజ్యాన్ని విస్తరించడానికి శివాజీని ప్రేరేపించారు; ఎందుకంటే రాజ్యం సమాజంలో ఒక ముఖ్యమైన సంస్థ. ” – పండిత దీనదయాళ్ ఉపాధ్యాయ
స్వతంత్ర దేశంగా భారతదేశం వ్యక్తివాదం, ప్రజాస్వామ్యం, సోషలిజం, కమ్యూనిజం, పెట్టుబడిదారీ విధానం మొదలైన పాశ్చాత్య భావనలపై ఆధారపడలేదని ఆయన నమ్మకం. ఈ దేశం అభివృద్ధి చెందాలని ఆయన కోరుకున్నా అది బ్రిటిష్ వారు వదిలిపెట్టిన పాశ్చాత్య భావనలపై కాదనే స్పష్టమైన అవగాహన ఆయనకు ఉంది. స్వాతంత్య్రం వచ్చిన వెంటనే భారతదేశంలో ప్రజాస్వామ్యం స్థాపించబడినప్పటికీ, సుదీర్ఘ బానిసత్వం తరువాత దేశపు తీరుతెన్నులు ఎలా ఉంటాయోననే సందేహం ఆయనలో ఉండేది. పాశ్చాత్య సిద్ధాంతాలు, భావజాలాలవల్ల భారతీయ మేధస్సు దెబ్బతింటుందని ఆయన భావించారు. సమర్ద నాయకత్వం వల్లనే ఈ దేశంమళ్లీ ఊపిరి పీల్చుకుంటుందని ఆయనకు ఖచ్చితంగా తెలుసు. అందుకనే అసలైన భారతీయ ఆలోచన పెరుగుదల, విస్తరణ కోసం ఎంతో కృషి చేశారు.

దీనదయాళ్ జీ నిర్మాణాత్మక విధానాన్ని విశ్వసించారు. ప్రభుత్వం సరైనది అయినప్పుడు సహకరించాలని, తప్పు జరిగినప్పుడు నిర్భయంగా వ్యతిరేకించాలని ఆయన తన అనుచరులను ప్రోత్సహించారు. కాలికట్ సమావేశాల్లో ఆయన ఇచ్చిన సందేశం ఇప్పటికీ వారి చెవుల్లో మోగుతుంది: “మనం ఏ ప్రత్యేక సమాజం లేదా విభాగం కాదు, మొత్తం దేశపు సేవకు ప్రతిజ్ఞ చేస్తున్నాము, ప్రతి దేశస్థుడు మన రక్తంలో రక్తం, మాంసంలో మాంసం. ప్రతి ఒక్కరూ తాము భరతమాత సంతానమని గర్వించగలిగేంతవరకు విశ్రాంతి తీసుకోము . భారత దేశాన్ని నిజంగా సుజలాం, సుఫలాం (స్వచ్చమైన నీటితో ప్రవహించే, పండ్లతో నిండిన దేశం) గా చేస్తాము . భరత మాత దశ ప్రహరణ ధారిణి దుర్గ (ఆమె 10 ఆయుధాలు ధరించిన దేవత దుర్గ), ఆమె చెడు పై విరుచుకు పడే దుర్గ ; లక్ష్మిగా ఆమె సమృద్ధిని అందజేయగలదు, సరస్వతిగా ఆమె అజ్ఞానపు చీకటిని పోగొట్టి జ్ఞాన ప్రకాశాన్ని వ్యాప్తి చేస్తుంది. అంతిమ విజయంపై విశ్వాసంతో, ఈ పనికి మమ్మల్ని అంకితం చేద్దాం ”.

ఏకాత్మ మానవ దర్శన్
“మన దేశంలో ఏ విదేశీ సిద్ధాంతాన్ని యధాతధంగా స్వీకరించడం సాధ్యం కాదు లేదా తెలివైనది కాదు. ఇతర సమాజాలలో, గత లేదా ప్రస్తుత పరిణామాలను పూర్తిగా విస్మరించలేము అలా విస్మరించడం కూడా ఖచ్చితంగా అవివేకం”
– పండిత దీనదయాళ్ ఉపాధ్యాయ

దీనదయాళ్ ఉపాధ్యాయ ఏకాత్మ మానవవాదాన్ని ప్రతిపాదించారు. ఇందులో రెండు ప్రధాన అంశాలు ఉన్నాయి: 1) రాజకీయాల్లో నైతికత; 2) స్వదేశీ.
“సమగ్ర మానవతావాదం తప్పనిసరిగా భారతీయ మరియు పాశ్చాత్య భావజాలాల గురించి సమతుల్య అంచనా వేయాలి. ఈ మూల్యాంకనం ఆధారంగా, మనిషి తన ప్రస్తుత ఆలోచన, అనుభవం, సాధించిన స్థానం నుండి మరింత పురోగతి సాధించే మార్గాన్ని చూపించడానికి ప్రయత్నిస్తాడు. పాశ్చాత్య ప్రపంచం గొప్ప భౌతిక పురోగతిని సాధించింది, కానీ ఆధ్యాత్మిక సాధన రంగంలో అది పెద్దగా ముందుకు సాగలేదు. భౌతిక శ్రేయస్సు లేకుండా ఆధ్యాత్మిక మోక్షం ఉండదు. అందువల్ల, మనం బలం, భౌతిక ఆనందం కోసం కృషి చేయడం అవసరం, తద్వారా మనం జాతీయ ఆరోగ్యాన్ని పెంపొందించుకోగలుగుతాము, ప్రపంచ పురోగతికి దోహదం చేయగలము. అందువల్ల మన కార్యక్రమం వాస్తవికతలో ఉండాలి.”

ఒక యుగం ముగిసింది
దీనదయాళ్ జీది దేశానికి అంకితమైన జీవితం. 11 ఫిబ్రవరి 1968 న, మొఘల్సరై స్టేషన్ యొక్క రైల్వే ట్రాక్లలో ఆయన మృతదేహం కనబడింది. ఆ తరువాత ఆయన పార్ధివదేహాన్ని ఢిల్లీ తీసుకు వచ్చినప్పుడు ఆర్ ఎస్ ఎస్ సర్ సంఘచాలక్ శ్రీ గురూజీ తదితరులు శ్రద్ధాంజలి ఘటించారు. సాధారణంగా గంభీరంగా, స్థితప్రఙతతో ఉండే గురూజీ కూడా దీనదయాళ్ జీ మృతదేహాన్ని చూసినప్పుడు నీళ్ళు నిండిన కళ్ళ తో, గద్గదమైన స్వరంతో ఇలా అన్నారు –
“నాకు కుటుంబం లేదు అందుకే ఈ బాధను సరైన పదాలతో చెప్పలేను. నాకు ఈ పవిత్ర ఆత్మతో అనుబంధం వివరించలేనిది. అయితే దేవుడు తనకు ప్రియమైన వ్యక్తులను తొందరగా పిలుచుకు వెళతాడు”.

అటల్ బిహారీ వాజ్‌పేయి తన మనోభావాలను ‘మేము సవాలును అంగీకరిస్తున్నాము’ అనే వ్యాసం ద్వారా వ్యక్తీకరించారు. అందులో ఆయన ఇలా వ్రాశారు:
“ఆయనపై దాడి మన జాతీయవాదంపై దాడి. ఆయన శరీరంపై గాయాలు మన ప్రజాస్వామ్యానికి తగిలిన దెబ్బలు. దేశ వ్యతిరేక, ప్రజాస్వామ్య శత్రువుల ఈ సవాలును మేము స్వీకరిస్తున్నాము ”


అనువాదం చంద్రమౌళి కళ్యాణచక్రవర్తి
Source : arise bharath.Org - విశ్వ సంవాద కేంద్రము

Wednesday, June 17, 2020

క్రైస్తవ మాఫియాపై విల్లునెక్కుపెట్టిన మహావీరుడు బిర్సా ముండా - Birsa Munda great hero who has set a bow on the Christian Mafiaక్రైస్తవ మిషనరీల అకృత్యాలపై జార్ఖండు ప్రాంతంలోని బిర్సా కొండల్లో విప్లవోద్యమాన్ని రేకెత్తించిన బిర్సా ముండా భగవాన్ బిర్సా ముండాగా ప్రసిద్దుడు. 

ఈయన 1875 నవంబరు 15న జార్ఖండు ప్రాంతంలోని చోటా నగర్ సమీపాన ఓ కుగ్రామంలో జన్మించాడు. తండ్రి సుగ్లా ముండా క్రిష్టియన్ మతం పుచ్చుకున్నాడు. బిరసా స్వతహాగా తెలివితేటలున్నవాడు. పలు భాషలలో ప్రవేశం వుంది. గణిత శాస్త్రంలో దిట్ట. ఒక క్రైస్తవ మత గురువు బిరసాను కూడా మతం మార్చాడు. అయినా బిరసాలో స్వధర్మాభిమానం చావలేదు. ఒకసారి పాఠశాల హాష్టలులో ఆవు మాంసం వడ్డించారు. దానిని తినడానికి బిరసా తిరస్కరించాడు. ఆ ప్రదేశంలో ఉండటానికి మనస్కరించక చదువు మానేసి వచ్చేశాడు. “ఊహ తెలిసిన కొద్దీ వనవాసీ ప్రాంతంలోని వనవాసీలను మతం మార్చడంలో మిషనరీలకున్న శ్రద్ధ సహజ సిద్దంగా వారికి సంక్రమించిన హక్కులను కాపాడటంలో లేదని తెలుసుకున్నాడు. వనవాసీల హక్కులను కాలరాసే ప్రభుత్వ చట్టాలను కూడా వాళ్ళు సమర్దిస్తున్నారని గ్రహించాడు. వెంటనే ఉద్యమానికి శ్రీకారం చుట్టాడు. బిర్సాకు ఒక వైష్ణవాచార్యుడు అండగా నిలిచాడు.

అడవి బిడ్డల జీవితాలలో వెలుగులు నింపేందుకు నిరంతరం శ్రమించాడు బిర్సా ముండా. సాంఘిక సంస్కరణల ఆవశ్యకత గురించి వివరించాడు. బాధితులైన తోటివారిని ఆడుకోవడం ఉత్తమ ధర్మం అన్నాడు. వాటిని తన జీవితంలో ఆచరణలోనికి తెచ్చాడు. తెల్లవారిపై తిరుగుబాటు చేశాడు. మిషనరీల కార్యకలాపాలను అడ్డుకున్నాడు. బిర్సా మూలికా వైద్యం కూడా చేసేవాడు. క్రైస్తవ మతాధికారుల ప్రోద్బలంతో ఆంగ్లేయులు బిర్సాను కారాగారంలో బంధించారు. ఆయన విడుదలకై పెద్ద ఎత్తున ఉద్యమం నడిచింది. జైలు నుంచి విడుదలై వచ్చాక మిషనరీల దేశద్రోహ చర్యలకు వ్యతిరేకంగా విప్లవ శంఖం పూరించాడు. తన ఆశయాల ప్రచారానికి ఒక జెండాను కూడా రూపొందించాడు.

నుదుట బొట్టు, మెడలో జంధ్యం దహరించిన బిర్సా వనవాసీలు సంప్రదాయాలను విడిచిపెట్టరాదని, నైతిక వర్తన కలిగివుండాలని బోధించేవాడు. బిరసా ప్రభావం రోజురోజుకూ ఎక్కువవుతుండడంతో క్రైస్తవ మత మార్పిడులకు ఆటంకం ఏర్పడింది. మిషనరీలు కుట్రపన్ని మరళా జైల్లో వేయించారు. ఆంగ్ల ప్రభుత్వం అతని మీద విషప్రయోగం చేసి కలరావల్ల చనిపోయాడని నిర్లజ్జగా ప్రకటించింది. ఆంగ్ల ప్రభుత్వం, క్రైస్తవ మిషనరీల కుట్ర కారణంగా క్రీ.శ.1900 సంవత్సరం జూన్ 9న బిరసా ముండా అశువులు బాశాడు. భారత దేశ స్వాతంత్ర్యం కోసం, స్వధర్మం కోసం, కన్న భూమి కోసం బలిదానం చేసిన భగవాన్ బిరసా ముండా చిరస్మరణీయుడు. నేడు భగవాన్ బిర్సా ముండా వర్ధంతి.

మూలము: విశ్వ సంవాద కేంద్రము

Wednesday, June 10, 2020

'ఈ కల్పన బాగుంది' గ్రంథం - రచన: ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్, గారి పరిశోధనకు నమస్సుమాంజలి - E Kalpana Bagundi, Prof.Mudigonda Shiva Prasad'ఈ కల్పన బాగుంది' గ్రంథం - రచన: ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్, గారి పరిశోధనకు నమస్సుమాంజలి - E Kalpana Bagundi, Prof.Mudigonda Shiva Prasad

 • పుస్తకం: ఈ కల్పన బాగుంది,
 • రచన: ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్,
 • వెల:250/-,
 • 2-2-647, 132-బి, సెంట్రల్ ఎక్సైజ్ కాలనీ, హైదరాబాద్-500013.
 • ప్రతులకు:
 • అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు.

నిండుగా నీరున్నపుడు తటాకం అంటాము. ఎండిపోతే అది కబరస్థాన్‌గా మారవచ్చు. అపార్ట్‌మెంట్స్, మాల్స్ కట్టే వ్యాపార స్థలమూ కావచ్చు. భారతదేశంలో హిందువులు మెజారిటీలో వున్నపుడు ఇది హిందూస్థాన్ అని పిలువబడుతుంది. లేకుంటే? ఇది పెద్ద క్లాసులు చదువుకోని పిల్లలకు కూడా అర్థమయ్యే అతి సరళ రాజకీయ సామాజిక సూత్రం. ఐనా మన నాయకులకు ఎందుకు అర్థం కానట్లు నటిస్తున్నారు? అప్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్- ఇవన్నీ నిన్న మొన్నటివరకూ భారతదేశంలో అంతర్భాగాలే. ఎప్పుడైతే అక్కడ హిందువులు అల్పసంఖ్యాకులైనారో వెంటనే అవి భారత్ నుండి విడిపోయాయి. 

ఇరాన్ ఒకప్పుడు ఆర్యభూమి. అయతుల్లా ఖొమేనీ విప్లవంతో 20వ శతాబ్దంలో అక్కడ ఇస్లామీకరణం జరిగిపోయింది.

గ్రీసు ఒకప్పుడు భారతదేశపు చిన్నకూతురు. ఇవ్వాళ అక్కడ దుర్గామాత లేదు- పోలో మాసిడాన్ (పశునాధ), ఎథీనాలు కూడా లేరు. ఈ విగ్రహాలన్నీ మ్యూజియంలో వున్నాయి. అక్కడ రోమన్ కాథలిక్ చర్చి రాజ్యం చేస్తున్నది. ఈ పరిణామం గ్రీసులో రోమ్‌లో క్రీ.శ.3వ శతాబ్దంలో ప్రారంభమై మొత్తం యూరపును కబళించింది. 1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చేనాటికి ఇండియాలో క్రైస్తవులు 0.8 శాతం ఉన్నారు. 

ఇవ్వాళ (2019) 15 శాతం దాటారు. వేదనాదం వినిపించే కోనసీమలో బ్రాహ్మణులు లేరు. చర్చ్‌లు వచ్చాయి. వేద పండితుల పిల్లలంతా అమెరికాలో ఆస్ట్రేలియాలో ఉన్నారు. ఎందువల్ల? ఇక్కడవారికి ఉద్యోగాలు ఇవ్వకపోవటంవల్ల. వేదవిద్యకు గౌరవం లేకపోవటంవల్ల. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సనాతన భారతీయ సాంస్కృతిక జాతీయ జీవనం వికసించి ప్రపంచానికి దీపస్తంభంగా నిలబెడతారని ఆశించినవారి ఆశలు అడియాశలైనాయి. అందుకు నాయకత్వం ఎంత కారణమో వారిని ఎన్నుకొన్నవారికీ అంతే బాధ్యత వుంటుంది. 2019 జూలై నెలలో ఋషిపీఠం మత సామరస్య ప్రత్యేక సంచిక విడుదల చేసింది. దానిని చదివి ఎందరో సంతోషించారు. కారుచీకటిలో ఓ కాంతిరేఖ మెరిసినట్లు అనిపించింది. ఆత్మవిశ్వాసం కోల్పోయి న్యూనతాభావంలో పడిపోయిన జాతికి కొంచెం ధైర్యం వచ్చింది. ఈ అంశం గురించి చాలా దశాబ్దాలు ఈ రచయిత ఆలోచించారు. ఏకం సత్ విప్రాః బహుధా వదంతి- ఇది ఋగ్వేద సూక్తి. ఉన్న పరతత్వమొక్కటే. పండితులు భిన్న భిన్న పరిభాషలతో వ్యాఖ్యానిస్తారు. అది మనం నమ్మాము. 3త్రరుూసాంఖ్యం యోగం - రుచీనాం వైచిత్య్రాత్2 - ఇది పుష్పదంతుని శ్లోకం. దీనినే చికాగోలో స్వామి వివేకానంద తన తొలి ఐదు నిమిషాల ప్రసంగంలో ఉదాహరించి క్రైస్తవులను దిగ్భ్రాంతికి గురిచేశారు. 

ఎందుకంటే, ఏసు నమ్మనివారంతా నరకానికి పోతారు అనే ఏకవాక్య సిద్ధాంతం మీద ప్రాతిపదికమీద పునాదిమీద ఆ మత నిర్మాణం జరిగింది. ఇదుగో ఈ కారణం చేతనే శ్రీ శివప్రసాద్ ఇప్పుడొక గ్రంథాన్ని వెలువరించారు. దీని పేరు "ఈ కల్పన బాగుంది". ఇందులో నాలుగు అధ్యాయాలున్నాయి. ప్రామాణికంగా శాస్ర్తియంగా బైబిలునుండే వాక్యాలు ఉదాహరిస్తూ శాస్త్ర చర్చ చేశారు. ఎట్టి స్వార్థమూ మొండితనమూ లేకుండా జరిపిన తాత్విక విశే్లషణ. ఆదియందు ఒక వాక్యముండెను. ఆ వాక్యమే దేవుడై వుండెను- ఆదికాండము. ఆ వాక్యమేమిటో వారు చెప్పలేదు. ఓమ్ ఇతి ఏకాక్షరం బ్రహ్మమ్ అని భారతీయ శాస్త్రం స్పష్టంగా చెప్పింది. భారతదేశానికి లోగడ ఆహార పదార్థాలు దిగుమతి చేసుకునేవారు. కిరోసిన్, గ్లాస్కో వస్త్రాలు దిగుమతి చేసేవారు. ఐతే సెమిటిక్ మతాలు కూడా దిగుమతి చేసుకోవలసినంత కరువు ఆధ్యాత్మికంగా ఇండియాలో ఉందా? ఇక్కడ ప్రతివాడూ ఒక తత్వవేత్తయే కదా!

గాంధీగారి శిష్యుడు జె.సి.కుమారప్ప ఇలా అన్నారు.34బ్రిటీషువారికి చతురంగ బలగాలున్నాయి, పదాతి సైన్యం, వాయుబలం, నౌకాబలంతోపాటు నాల్గవది చర్చి22అన్నాడు. నా ఆధ్యాత్మిక తృష్ణను తీర్చడానికి భగవద్గీత చాలు, మరో అన్యమతం ఎందుకు?22 అన్నాడు మహాత్మాగాంధీ.

భారతదేశంలో సనాతన వైదిక విశ్వాసాలు గోబ్రాహ్మణ భక్తి నశించిపోతున్నాయి. ఇపుడు ఈ దేశాన్ని మన మతం ఆక్రమించుకోకపోతే తప్పు ఎవరిది? అని సూటిగా ప్రశ్నించాడు.
ఇదిగో ఈ నేపథ్యంలోనే 3ఈ కల్పన బాగుంది2 రచన చేశారు.

భారత రాజ్యాంగంలోని 19ఏ అధికరణం వ్యక్తి స్వేచ్ఛను వాక్ స్వాతంత్య్రాన్ని భావ స్వాతంత్య్రాన్ని ప్రసాదించింది. దాని అర్థం ఏమిటి? తిరుమల తిరుపతి దేవస్థానంలో పయనించే బస్సు టిక్కెట్లపై శిలువ ముద్ర వేసి జెరుసలేం యాత్రకు వెళ్ళండి అని బోధించటం మత స్వాతంత్య్రం భావ స్వాతంత్య్రం కిందికి వస్తుందా? ఆలోచించండి. వినాయక చవితికి తయారుచేసే గణేశుని విగ్రహాల నెత్తిమీద మేరీమాత విగ్రహం పెట్టడం మత స్వాతంత్య్రం క్రిందికి వస్తుందా? ఆలోచించండి.

అన్ని మతాలూ సమానమే అయితే హిందువులను హిందూ దేవీ దేవతలు పూజించకూడదు, మంగళసూత్రాలు తీసివేయాలి అని పాస్టర్ల ప్రచారం చేయటం దేనికి?

ఈ అంశంపైన విశే్లషణాత్మకంగా గణాంకాలతో 2000 సంవత్సరాల చారిత్రక నేపథ్యంలో 3ఈ కల్పన బాగుంది2 వ్రాశారు. చదివి స్పందించండి.

ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ చేసిన పరిశోధనకు నమస్సుమాంజలి. అందరూ చదివి తీరవలసిన గ్రంథం ఈ కల్పన బాగుంది.

ఈ గ్రంథం అంతర్జాలం (online) ద్వారా కొనాలనుకున్నవారు ఈ నెంబర్ కు: 09701656861 Whatsapp లో సందేశాన్ని పంపించండి..

సంకలనం: -జొన్నాభట్ల నరసింహ ప్రసాద్

Tuesday, June 9, 2020

ప్రజా నాయకుడు బిర్సా ముండా - Birsa Munda

ప్రజా నాయకుడు బిర్సా ముండా - Birsa Munda
బిర్సా ముండా 19వ శతాబ్దానికి చెందిన ఒక ప్రముఖ వనవాసీ ప్రజా నాయకుడు. ఆయన నేతృత్వంలో 19వ శాతాబ్దంలో చివరి సంవత్సరాల్లో ఉల్గులాన్ అనే పేరుతో ఒక గొప్ప ఉద్యమం నడిపించారు. ముండా జనజాతి వారు బిర్సాను సాక్షాత్ భగవత్స్వరూపంగా భావిస్తారు.

సుగుణా ముండా, కర్మీ హాతుల కుమారుడైన బిర్సా, 1875 నవంబర్ 18వ తేదీన ఝార్ఖండ్ రాష్ట్రం రాంచీలో ఉలీహతు గ్రామంలో జన్మించారు. సాల్గా గ్రామంలో ప్రాధమిక విద్య తర్వాత ఆయన ఛైబాసా ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చదువుకున్నారు. ఆయన ఆ సమయంలో ఎప్పుడూ బ్రిటిష్ పాలకుల అరాచకం వల్ల తన సమాజం ఎదుర్కొంటున్న దుస్థితి గురించి ఆలోచించేవారు. ముండా జనజాతివారిని ఆంగ్లేయుల నుంచి విముక్తి చేసేందుకు ఒక ఉద్యమానికి నేతృత్వం వహించారు. కాలేజీలో, స్కూల్ లో జరిగే వక్తృత్వం, చర్చా కార్యక్రమాల్లో ఆయన ఎప్పుడూ వనవాసీల నీరు, అడవి, భూమి హక్కుల గురించి ఎంతో గట్టిగా వాదించేవారు.
ప్రజలను చైతన్య పరుస్తున్న బిర్సా ముండా 
ఆ రోజుల్లో ఒక క్రైస్తవ ప్రచారకుడు ఫాదర్ నోట్రేట్ అనే ఆయన ముండా సర్దారులు కనుక క్రైస్తవ మతంలోకి మారి, ఆ మతం అనుసరిస్తూ ఉంటే, వారు కోల్పోయిన భూములను తిరిగి ఇప్పిస్తానని ప్రలోభం చూపడం ప్రారంభించాడు. అయితే, 1886-87సంవత్సరాల్లో ముండా సర్దారులు తమ పోయిన భూముల కోసం ఉద్యమం చేస్తే, ఆ నిరసనను అణిచివేయడమే కాదు, క్రైస్తవ మిషనరీల ద్వారా వారివై తీవ్ర దూషణ, దాడి చేయించారు. ఇది బిర్సా ముండాని ఎంతగానో గాయపరిచింది. ఆయన తిరుగుబాటు చూసి, ఆయనను విద్యాలయం నుంచి బహిష్కరించారు. తత్ఫలితంగా 1890లో బిర్సా, ఆయన తండ్రి చైబాసా నుంచి తిరిగి వచ్చారు. 1886 నుంచి 1890 వరకు చైబాసా మిషన్ లో ఉన్న కాలం ఆయన వ్యక్తిత్వ నిర్మాణంలో ఒక కీలక దశ.  ఈ కాలంలోనే ఆయన వ్యక్తిత్వంలో మార్పు వచ్చి ఆత్మాభిమానం అనే దీపం ప్రజ్వరిల్లింది. సంతాల్ ఉద్యమం, చువార్ ఉద్యమం,కోల్ విప్లవం ప్రభావం కూడా ఆయన మీద ఎంతగానో ఉంది. తన జాతి ఏ దుర్దశలో ఉందో, తమ సామాజిక, సాంస్కృతిక,మతపరమైన అస్తిత్వానికి ఎటువంటి ముప్పు ఉందో చూసి, ఆయన మనసులో విప్లవ భావాలు పెల్లుబికాయి. ముండా జాతివారి పాలన వెనక్కి తీసుకురావాలని, తన తోటివారిని జాగృతం చేయాలని ఆయన నిశ్చయించారు. 1894లో అనావృష్టి కారణంగా ఛోటా నాగపూర్ ప్రాంతంలో భయంకరమైన కరువు ఏర్పడి, అంటువ్యాధులు వ్యాపించాయి. ఆ సమయంలో బిర్సా పూర్తి అంకితభావంతో తన వారికి సేవలందించారు.
చిత్రం: బిర్సా ముండా
ముండా సమాజాన్ని ఏకం చేసేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు బ్రిటిష్ పాలకులకు పెద్ద సవాల్ గా పరిణమించాయి. బిర్సాయిత్ మతాన్ని స్థాపించి ఆయన ప్రజలకు ఒక కొత్త ఆలోచనను ఇచ్చారు. సాత్వికత, ఆధ్యాత్మికత,పరస్పర సహకారం, ఐక్యత, సౌభ్రాతృత్వం ఆ మతానికి ప్రాతిపదికలు.  ‘తెల్లవాళ్లు వెనక్కి పోవాలి’ అన్న నినాదం ఇచ్చి ఆయన  మన సాంప్రదాయ ప్రజాస్వామ్య స్థాపన జరగాలని పిలుపునిచ్చారు. ‘మహారాణీ పాలన పోతుంది – మన రాజ్యం వస్తుంది’అని ఆయన అంటుండేవారు.

1894  అక్టోబర్ 1 నాడు ఒక యువనేతగా ముండా ప్రజలను ఐక్యం చేసి ఆయన భూమి శిస్తు మాఫీ కోసం బ్రిటిష్ వారిపైన ఒక ఉద్యమం ప్రారంభించారు. 1895లో ఆయనను అరెస్ట్ చేసి, రెండేళ్లు హజారీబాగ్ కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవించాలని తీర్పునిచ్చారు. కానీ బిర్సా, ఆయన శిష్యులు కరువుపీడిత ప్రజలకు సహాయపడాలన్న సంకల్పాన్ని కొనసాగించి తమ జీవితకాలంలోనే మహాపురుషులుగా ఒక ఘనత సంపాదించుకున్నారు. ఆ ప్రాంత ప్రజలు ఆయనను ధర్తీ బాబా అని పిలుస్తూ ఆయనను గౌరవించేవారు. ఆయన ప్రభావం పెరిగే కొద్దీ ఆ ప్రాంతంలోని ముండా ప్రజలందరిలో సమైక్యత తో నిలవాలన్న ఒక చైతన్యం బలపడింది.

1897 నుంచి 1900 వరకు ముండా ప్రజలకు బ్రిటిష్ సిపాయిలు మధ్య పోరాటం జరుగుతూనే ఉంది. బిర్సా, ఆయన సహచరులు తెల్లవారికి పెద్ద తలనెప్పిగా పరిణమించారు. 1897 ఆగస్టు లో బిర్సా, ఆయన వెంట 400 మంది సైనికులు విల్లంబులు ధరించి ఖూన్టీ పోలీస్ స్టేషన్ పైన దాడి చేశారు. 1898లో తాంగా నది ఒడ్డున ముండా దళాల బ్రిటిష్ సేనతో ఘర్షణ పడగా ముందు పరాయి సేనలు ఓడిపోయినా ఆ తర్వాత ప్రతీకారంగా ఆ ప్రాంతంలోని అనేకమంది వనవాసి నాయకులను నిర్బంధించడం జరిగింది.

బిర్సా ముండాని మహాత్ములైన దేశభక్తుల సరసన గౌరవిస్తారు. ఆయన వనవాసీలను ఏకం చేసి, శ్వేతా జాతీయుల పాలనను ఎదురొకొనేలా సంసిద్ధులను చేశారు. అంతే కాకుండా ఆయన భారతీయ ఆదివాసీ సంస్కృతిని కాపాడేందుకు మతమార్పిడి చేసే క్రైస్తవ మిషనరీలను ఎదిరించారు. క్రైస్తవులుగా మారిన వనవాసీలకు ఆయన మన నాగరికత, మన సంస్కృతి గురించి తెలియచెప్పే, బ్రిటిష్ ప్రభుత్వ కుట్రలు, పన్నాగాల గురించి వారిని అప్రమత్తం చేశారు.

1900 జనవరిలో డొమబాడీ పర్వతంపైన మరొక పోరాటం జరిగింది. ఈ పోరాటంలో ఎంతో మంది మహిళలు, పిల్లలు మరణించారు. ఆ ప్రదేశంలో బిర్సా ఒక బహిరంగ సభనుద్దేశించి ప్రసంగిస్తున్నారు. 1900 సంవత్సరం ఫిబ్రవరి 3వ తేదీన  సెంతారా లో పశ్చిమ అటవీప్రాంతంలో ఒక శిబిరం నుంచి బిర్సాని అరెస్ట్ చేశారు. తాత్కాలికంగా రాంచీ కారాగారంలో బంధించారు. ఆయనతో పాటు మరో 482 మంది నిరసనకారులను కూడా అరెస్ట్ చేశారు. వారి మీద 15 అభియోగాలు మోపారు. మిగిలిన బందీల్లో 98 మందికి వ్యతిరేకంగానే చేసిన ఆరోపణలు మాత్రమే రుజువయ్యాయి. బిర్సాకి అత్యంత సన్నిహితుడైన గయా ముండా, అతని కుమారుడు సాన్రే ముండాకి ఉరి శిక్ష విధించారు. గయా ముండా భార్య మాంకీ కి రెండేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు.

విచారణ ప్రారంభం అయ్యే ముందు ఆయన జైల్లో ఆహారం తీసుకునేందుకు అనాసక్తి చూపించారు. కోర్టులో అనారోగ్యం పాలుకావడంతో ఆయనను మళ్ళీ జైలుకి పంపివేశారు. జూన్ 1వ తేదీన జైలు ఆసుపత్రిలో డాక్టరు బిర్సాకి కలరా వచ్చిందనీ,ఆయన ఇంకా బ్రతికి ఉండే అవకాశం లేదని చెప్పేసాడు.

1900 జూన్ 9వ తేదీన బిర్సా తుది శ్వాస విడిచినట్లు సమాచారం ఇచ్చారు.

ఆ విధంగా  ఒక విప్లవాత్మకమైన జీవితం ముగిసిపోయింది. బిర్సా చేసిన పోరాటం వల్ల 1908లో చోటా నాగపూర్ కౌలు చట్టం అమల్లోకి వచ్చింది. నీరు, అడవి, భూమి పైన వారసత్వ హక్కుల పరిరక్షణ కోసం ప్రారంభమైన పోరాటాలు ఒక దాని తర్వాత ఒకటి కొనసాగుతూనే ఉన్నాయి.

అనువాదం: విశ్వ సంవాద కేంద్రము
మూలము: Arise Bharat

Wednesday, June 3, 2020

గొప్ప ధార్మికురాలు.. రాజమాత రాణి అహల్యాబాయి హోల్కర్ - Rajamatha Raani Ahilyabai holkarగొప్ప ధార్మికురాలు.. రాజమాత రాణి అహల్యాబాయి హోల్కర్ - Rajamatha Raani Ahilyabai holkar

“రాజమాత రాణి అహల్యాబాయి హోల్కర్ రాజ్య పరిపాలన మొదలయింది.  బ్రహ్మ సృష్టి జరిగిన రోజుల్లో, దేశం పాలించే అర్హతతో, దైవం పంపిన అవధూత రాజమాత దేవీ అహల్య “ అంటూ ఆవిడ రాజ్యంలో ఆబాలగోపాలం ఆవిడని కీర్తిస్తారని జొన్నా బిల్లీ అనే ఆంగ్లేయుడు ( 1849 ) లో కీర్తించారు . రాజమాత దేవీ అహల్యాబాయి     18వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్త చరిత్రలో దాదాపు 30 సంవత్సరాలు  అత్యంత ప్రశాంతంగా, అత్యంత సాధికారతతో, అత్యంత వైభవంగా రాజ్యపాలన చేసిన మహారాణి.

ఇది రాజ్యపాలనకు సంబంధించిన విషయం అయితే, అఖండ భారతదేశంలో ప్రసిద్ది  పొందిన ఏ దేవాలయం దర్శించినా అక్కడ రాజమాత దేవీ అహల్యాబాయి జీర్ణోద్దరణ చేయించారనో,  రహదారి బాగుచేయించారనో,  సత్రాలు కట్టించారనో ఉంటుంది. దేశం నలుమూలలా ఈ మహత్కార్యాలు జరిగాయి. కాశీ విశ్వేశ్వర ఆలయం, కేదారనాథ్, గయ, ప్రయాగ, శ్రీశైలం, రామేశ్వరం, పూరి  జగన్నాథ ఆలయం, బద్రీనాథ్, బేలూరు, నాసిక్  ఇలా చెప్పుకుంటూ పోతే ఆ దైవమూర్తి చేసిన ధర్మ కార్యాలు లెక్కలేనన్ని. ఇప్పటికి దాదాపు 157పుణ్య తీర్థాలలో, ప్రసిద్ద క్షేత్రాలలో దేవీ అహల్యాబాయి ఆధ్వర్యంలో నిర్మితమైన దేవాలయాలు, సత్రాలు, ఘాట్ లు ధార్మిక కేంద్రాలు, చారిత్రక కట్టడాలను చరిత్రకారులు గుర్తించారు. ఇంకా పరిశోధన జరుగుతూ ఉంది. కేవలం 70ఏళ్ళ జీవితంలో ఒక వ్యక్తి ఇన్ని సాధించటం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది . అందుకే ఆ స్త్రీ మూర్తిని దైవంగా కొలవటం జరుగుతోంది.

దేవీ అహల్యాబాయి హోల్కర్ జననం 31 మే నెల 1725 వ సంవత్సరం ప్రస్తుతం అహ్మద్ నగర్ జిల్లా ,  జమ్ఖేడ్ తాలుకాలోని చోండిగ్రామంలో, గ్రామాధికారి మంఖోజి షిండే ఇంట జరిగింది. ఈ గారాలపట్టి తండ్రి ఒడిలో ఓనమాలు దిద్దుకుంది. తల్లి దగ్గర పురాణఇతిహాసాలు చదువుకుంది. ఎనిమిదో ఏట జరిగిన ఒక నాటకీయ పరిణామం ఆమె జీవితాన్ని మార్చేసింది. ప్రఖ్యాత మరాఠా సేనాని మల్హర్ రావు హోల్కర్ ( మాల్వా ప్రాంతాన్ని పాలించిన జాగీర్దార్ ) పేష్వాను దర్శించటానికి పూణే వెళ్ళే మార్గంలో చోండి గ్రామం సమీపంలో విశ్రాంతి తీసుకోవడం కోసం ఆగినప్పుడు దేవాలయంలో అహల్యాబాయి దైవభక్తీ, చిన్న వయస్సులోనే సేవా భావం గమనించి ముగ్ధుడై తన కుమారునికి వధువుగా సంబంధం కుదుర్చుకున్నాడు. 1733 వ సంవత్సరం ఖండేరావు హోల్కర్ తో వివాహం జరిగింది.  1745 లో పుత్రుడు మలేరావు జన్మించాడు.  మరో మూడేళ్ళ తరువాత పుత్రిక ముక్తాబాయి పుట్టింది. మామగారు ఆహల్యాబాయి ప్రతిభను గమనించి రాజ్యపాలనలో, యుద్ద వ్యుహాలలోనూ పూర్తి సలహాలు, సంప్రదింపులు జరిపేవారు. ఈ తర్ఫీదు వల్లనే అహల్యాబాయి తను రాజ్యం చేస్తున్నప్పుడు అనేక యుద్దాలలో స్వయంగా పాల్గొన్నది. ఆవిడ ఏనుగు అంబారీ నాలుగువైపులా నాలుగు ధనస్సులు బాణాలతోకూడిన తూణీరాలతో ఉండేది. ఆమె సవ్యసాచిలా బాణాలతో శత్రువులపై విరుచుకుపడేవారు. సైన్యం ఆవిడ నాయకత్వాన్ని పూర్తిగా సమర్ధించి విధేయంగా ఉండేది.

ప్రశాంతంగా సాగుతున్న ఆహల్యాబాయి జీవితంలో వరసగా జరిగిన మరణాలు, తదనంతర పరిణామాలు ఆవిడ గొప్పతనాన్ని, త్యాగాన్ని, బాధ్యతాయుతప్రవర్తనకు అద్దంపడతాయి మొదట 1754లో కుంభేర్ కోటను ముట్టడించినప్పుడు ఫిరంగిగుండు ప్రమాదవశాత్తు తగిలి  ఖండేరావు మరణిస్తారు. సహగమనం చేస్తానని అహల్యాబాయి అనుమతి అడిగినప్పుడు, మామగారు మల్హార్ రావు హోల్కర్ ఖిన్నుడై “కన్నకొడుకు దూరమై ఇప్పటికే నా కుడిబుజం విరిగిపోయింది, ఈ కష్ట సమయంలో నువ్వూ నీ దారి చూసుకుంటే ఈ రాజ్యం ఏమి కావాలి. ఈ ప్రజలను ఎవరు చూసుకోవాలి, చిన్న వయస్సులో తండ్రిని పోగొట్టుకున్న నీ పిల్లలకి కన్నతల్లిని కూడా దూరం చేస్తావా?? ఇంత కఠిన నిర్ణయం తీసుకోకు. ఇప్పుడు నువ్వే నా కొడుకులా నా తదనంతరం బాధ్యతవహించాలి”అని అన్నారు.  మనస్సు దిటవు చేసుకొన్నఅహల్యాబాయి ‘ సతీ సహగమనం ‘ విరమించుకొని మామగారి ఆజ్ఞ మేరకు రాజ్యపాలనలో సహాయ సహకారాలు అందించింది. ఆ తరువాత దాదాపు పది, పన్నెండు ఏళ్ళ వ్యవధిలో మొదట మామగారు చనిపోవటం, సింహాసనం అధిష్టించిన కొన్ని రోజులకే కుమారుడు వ్యాధిగ్రస్తుడై మరణించడం వెంటవెంటనే జరిగి పొయాయి. ఈ విషాద సమయంలో రాజ్యంలో లుకలుకలు మొదలైనాయి. ఒక స్త్రీ చేతిలో ఉన్న  రాజ్యాన్ని సులభంగా గెలవచ్చన్న అత్యుత్సాహం చూపిన రాఘోబా వంటివారికి బుద్ధిచెప్పి, అహల్యాబాయి రాజ్యాన్ని చక్కదిద్దిన తీరు రాజనీతిశాస్త్ర విద్యార్థులు తప్పక తెలుసుకోవాలి. అటు తోటి మరాఠా సేనానులకి లేఖలు వ్రాసి వారి సహాయం కోరటం ద్వారా రాఘోబాను ఒంటరిని చెయ్యడం, పీష్వా వద్దకు తన దూతను పంపి రాజ్యంపై హక్కు కోసం అనుమతిని కోరటం , ఈలోపు రాఘోబా ఎలాంటి దుస్సాహసం చెయ్యకుండా సూటిగా హెచ్చరికలు పంపడం. రాఘోబాతో యుద్దానికి సైన్యాన్ని సిద్దం చెయ్యటం వంటి చర్యలన్నీ  ఆమెలోని అపారమైన నాయకత్వ లక్షణాలను ప్రపంచానికి పరిచయం చేసాయి. అది మొదలు దాదాపు 30 సంవత్సరాలు ఆమె మాల్వా రాజ్యాన్ని పరిపాలించింది.

రాజమాత అహల్యాబాయి చాలా నిరాడంబర జీవితాన్ని గడిపింది. సుఖోజి రావు హోల్కర్ ను సేనానిగా నియమించి తాను పూర్తిగా ధార్మిక జీవితాన్ని గడుపుతూ ప్రజల బాగోగులు చూసేది. ప్రస్తుతం మనం చూస్తున్న  ఇండోర్ ఒక నగరంగా అభివృద్దిచెందటానికి ముఖ్యకారణం ఆమెనే. తన రాజ్య రాజధానిని పురాణ కాలం నుంచి ప్రసిద్ది గాంచిన మాహిష్మతీనగరం అనే పేరుగల మహేశ్వరం ప్రాంతానికి మార్చి ఆ ప్రాంతం ఆర్ధికంగా, సాంస్కృతిక పరంగా, ధార్మికంగా , పారిశ్రామికంగా అభివృద్ధి చేసింది. మహేశ్వరం చీరలకు ఎంతో ప్రసిద్ధి. భిల్లులు, గోండులు వంటి సంచార  జాతులకు స్థిరమైన నివాసం ఏర్పాటుచేయడమేకాక  వారికి కొన్ని హక్కులను కూడా ఇచ్చారు .

ఆవిడ ప్రతి రోజు నర్మదా నదిలో స్నానం ఆచరించి మట్టితో శివలింగాన్ని తయారు చేసి ఆ లింగం సాక్షిగా న్యాయనిర్ణయం చేసేవారు. సామాన్య ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యలను ఓపిగ్గా వినేవారు. చక్కటి నిర్ణయాలను ప్రకటించేవారు. అహల్యాబాయి పాలనలో ఖజానా నిండుగా వుండేది. ప్రజలకు ప్రణాళికబద్దమైన పన్నుల విధానం ఉండేది. వైధవ్యం పొందిన మహిళలు దత్తత తీసుకునే హక్కు , భర్తల ఆస్తిలో హక్కు మొదలైన మార్పులు అహల్యాబాయి హోల్కర్ పాలనలోనే మొదలైనాయి. ధార్మిక విషయాలలో అహల్యాబాయి సాధన వల్ల ఆమెను దైవంగా పరిగణించేవారు. అది ఇప్పటికీ  మనం గమనించ వచ్చు, స్వయంగా శివభక్తురాలు అవటం వల్ల అఖండ భారతావనిలో ఉన్న జ్యోతిర్లింగస్థానాలలో విదేశీ మ్లేచ్చుల దాడిలో ద్వంసం అయిన అనేక ప్రసిద్ద శివాలయాల గర్భాలయాలను తిరిగి పునర్నిర్మించారు. ఒక్కొక్క ధార్మిక కార్యం చూస్తే హిందూసమాజం దేవీ అహల్యాబాయి హోల్కర్ కి ఎంత ఋణపడిందో అర్ధమవుతుంది. సరిచేసి, తిరిగి వ్రాసుకోవాల్సిన మన దేశ చరిత్రలో దేవీ అహల్యాబాయి హోల్కర్ కు  ప్రముఖ స్థానం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మూలము: విశ్వ సంవాద కేంద్రము

Sunday, May 31, 2020

వీర సావర్కర్, నేతాజీలది ఒకటే మార్గం - Veera Savarkar, Subhas Chandra Bose


వీర సావర్కర్, నేతాజీలది ఒకటే మార్గం - Veera Savarkar, Subhas Chandra Bose
మ్యూనిస్ట్, కాంగ్రెస్ మేధావులు, చరిత్రకారులు 70 ఏళ్లుగా ఏ చారిత్రక సత్యాలను ప్రజల నుంచి దాచిపెడుతూ వచ్చారో ఆ నిజాలు క్రమంగా బయటకు వస్తున్నాయి. నిజాలను ఎక్కువ కాలం దాచిపెట్టలేరని, వక్రీకరించలేరని దీనివల్ల స్పష్టమవుతోంది.

రాజస్థాన్ లో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం వీర సావర్కర్ ఘన చరిత్రను మరుగునపరచేందుకు చేసిన ప్రయత్నం ప్రతికూల ఫలితాలను ఇచ్చింది. అక్కడ విద్యార్ధులేకాకుండా, ప్రజానీకమంతా సావర్కర్ పాఠ్యాంశాన్ని ఎందుకు తొలగించారంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. సావర్కర్ అంటే కాంగ్రెస్ కు ఎందుకంత కోపం? 1984 సిక్కుల ఊచకోత సంఘటన గురించి అడిగితే చరిత్రలోకి వెళ్లవద్దని అనే కాంగ్రెస్ సావర్కర్ విషయంలో ఇలా ఎందుకు ప్రవర్తించిందని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా సావర్కర్ చరిత్రను మరుగు పరచలేదని, ఇంటర్ నెట్ ద్వారా అన్ని విషయాలు తెలుసుకునే వీలు ఇప్పుడు ఉందని సమాధానమిస్తున్నారు.
బ్రిటిష్ పాలకుల స్వస్థలమైన బ్రిటన్ లోనే సావర్కర్ విప్లవ శంఖాన్ని పూరించిన సంగతి ఎవరైనా మరచిపోగలరా? విప్లవకారులకు, సాధారణ ప్రజానీకానికి కూడా ఎంతో స్ఫూర్తినిచ్చిన 1857 ప్రధమ స్వాతంత్ర్య సంగ్రామం గురించిన ఆయన వ్రాసిన పుస్తకాన్ని దాచిపెట్టగలరా?
రాజకీయ ఖైదీలా ఇంగ్లండ్ నుంచి భారత్ కు తీసుకువస్తున్నప్పుడు ఫ్రాన్స్ తీరంలో ఓడలోనుంచి దూకడమేకాక ఒడ్డువరకు ఈదుకురావడం ఏ కాంగ్రెస్ నాయకుడైనా కలలోనైనా ఊహించగలడా? అయితే దురదృష్టకరమైన విషయం ఏమిటంటే కాంగ్రెస్ వల్లనే ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని చూపించడానికి, ప్రచారం చేయడానికి ఇలాంటి విషయాలను, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటివారి త్యాగాలను వామపక్ష, కాంగ్రెస్ చరిత్రకారులు ప్రజలకు తెలియకుండా చేశారు.

నేతాజీని హిట్లర్ ఏజెంటుగా అభివర్ణించిన వీళ్ళే వీర సావర్కర్ భయంతో బ్రిటిష్ వారిని క్షమాభిక్ష కోరారని ప్రచారం చేశారు. కానీ ఏడేళ్లపాటు సావర్కర్ అండమాన్ జైలులో అనుభవించిన దారుణమైన శిక్షలు ఏ కాంగ్రెస్ నాయకుడైనా, ఎప్పుడైనా ఒక్క రోజుకైనా అనుభవించాడా అని ఎవరైనా అడిగారా? నెహ్రూ ఎప్పుడైనా అరెస్ట్ అయితే వెంటనే తాను రాజకీయ ఖైదీనని చెప్పుకుని తప్పనిసరిగా `బి శ్రేణి’ వసతులు పొందేవారు. సావర్కర్ తన లేఖలో తన కోసం మాత్రమేకాక అండమాన్ జైలులో శిక్ష అనుభవిస్తున్న అందరి కోసం క్షమాభిక్ష అర్ధించారు. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది, ఎంతో `నాగరికమైన’ బ్రిటిష్ పాలకులు ఆ జైలులో స్వాతంత్ర్య యోధులకు విధించిన దారుణమైన శిక్షల వల్ల 1857 తరువాత ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారో, ఎంతమంది మతిస్థిమితం కోల్పోయారో తెలియదు. రెండవ కారణం, ఒక విప్లవ వీరుడు దారుణమైన కాలాపానీ జైలులో శిక్షలు అనుభవిస్తూ కుంగికృశించిపోవడం తప్ప ఏమి చేయలేడు.  జైలు నుంచి పారిపోవడం సాధ్యం కాదు. బయటకు వస్తే లక్ష్యసాధన కోసం ఏదైనా చేయవచ్చును. జైలు నుంచి విడుదల చేసిన తరువాత ఆయనను బ్రిటిష్ వాళ్ళు గృహనిర్బంధంలో ఉంచారనే విషయం గుర్తుచేసుకుంటే సావర్కర్ కు ఉన్న ఈ ఆలోచన వాళ్ళు గ్రహించారని తెలుస్తుంది. దీనినిబట్టి బ్రిటిష్ వారికి లేఖ వ్రాయడం కేవలం జైలు నుంచి బయటపడటం కోసమేనని, అది విప్లవకార్యకలాపాల్లో ఒక వ్యూహాత్మక ఎత్తు మాత్రమేనని స్పష్టమవుతుంది.

సావర్కర్ అనేకమందిని బ్రిటిష్ సైన్యంలో చేర్చారని, అలా చేరడానికి ప్రోత్సహించారని కొందరు చేసే మరో ఆరోపణ. కానీ మొదటి ప్రపంచయుద్ధ సమయంలో గాంధీజీ కూడా అనేకమందిని బ్రిటిష్ సైన్యంలో చేరమని కోరారన్న సంగతి వాళ్ళు మరచిపోతారు.

జాతీయ అభిలేఖాగారం(ఆర్కైవ్స్) ఫైళ్లలో ఉండిపోయిన ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు చెపుతాను. 1940లో సావర్కర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ల మధ్య చర్చలు జరిగాయని అందరికీ తెలుసు. అయితే కాబూల్ నుంచి బయలుదేరి జర్మనీకి వెళ్ళే ముందు నేతాజీ తన సహచరులకు ఒక లేఖ వ్రాసారు. అందులో ఈశాన్య ప్రాంతంలో ఉన్న బ్రిటిష్ సేనలపై దాడి చేయాలనే ప్రణాళికను ఆయన అందులో వెల్లడించారు. అలాగే బ్రిటిష్ వారిని తరిమికొట్టడానికి చేపట్టవలసిన అనేక కార్యక్రమాల గురించి కూడా ఆయన పేర్కొన్నారు. అయితే ఆ లేఖ భారత్ లో ఆయన సహచరులకు చేరనేలేదు.

1948లో ఆ లేఖను ప్యారిస్ లో నేతాజీ పెద్దన్నగారైన శరత్ బోస్ కు ఆఫ్ఘనిస్తాన్ లో ఇటలీ రాయబారిగా పనిచేసిన క్వాత్రోని అందజేశారు. ఆ లేఖలో నేతాజీ మరొక  ముఖ్యమైన  విషయం ప్రస్తావించారు. బ్రిటిష్ సైన్యంలో జరుగుతున్న భర్తీని ఉపయోగించుకుని దేశభక్తులైన, విశ్వసనీయులైన యువకులను సైన్యంలో చేర్చాలని, అవసరమైనప్పుడు వాళ్ళే బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేస్తారని ఆయన పేర్కొన్నారు. ఆజాద్ హింద్ ఫౌజ్ లో ఇలాగే జరిగింది కూడా. నిజానికి హింద్ ఫౌజ్ లో ప్రవాసీ భారతీయులతోపాటు ఇలా బ్రిటిష్ సైన్యాన్ని వదిలిపెట్టిన వారే ఉండేవారు.

ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికులు
ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికులు 
సావర్కర్ కూడా భారతీయ యువకులను బ్రిటిష్ సైన్యంలో చేరమని ఇందుకోసమే ప్రోత్సహించారా? ఇది నేతాజీ, సావర్కర్ ల మధ్య జరిగిన రహస్య చర్చల ఫలితమా? ఈ ప్రశ్నలకు ఆజాద్ హింద్ ఫౌజ్ లో పనిచేసిన ఒక సైనికుడు ఐ ఎన్ ఏ కమిటీకి వ్రాసిన ఒక లేఖలో లభించాయి. ఈ లేఖ బ్రిటిష్ గూఢచారి విభాగపు ఫైళ్ళలో ఉంది. తాను సావర్కర్ ఆదేశం మేరకే బ్రిటిష్ సైన్యంలో చేరానని, ఆ తరువాత ఆయన సూచన ప్రకారమే ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికుడిని అయ్యానని  సైనికుడు ఆ లేఖలో వెల్లడించాడు. అయితే ఇలాంటి పత్రాలను చరిత్రకారులమని చెప్పుకునే అనేకమంది అసలు పట్టించుకోలేదు. ఇక కాంగ్రెస్ నాయకులైతే తమ రాజకీయ ప్రయోజనాలకు భంగకరం కాబట్టి వాటిని జాగ్రత్తగా మరుగుపరచారు.

ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికులు ఖండిత భారతదేశం కోసం పోరాడలేదు. పదవి కోసం మౌంట్ బాటన్ చెప్పినట్లు విన్న నెహ్రూ దేశ ప్రజానీకపు మనోభావాలు, విశ్వాసాలతోపాటు గాంధీజీ మాటలను కూడా లెక్కచేయకుండా దేశాన్ని రెండు ముక్కలు చేయడానికి అంగీకరించారు. చరిత్రను వివిధ ఆధారాలు, సాక్ష్యాల ద్వారా రచించుకోవాలికానీ రాజకీయ ప్రయోజానాలకు తగినట్లుగా వక్రీకరించకూడదు.

మూలము: విశ్వ సంవాద కేంద్రము

Friday, May 29, 2020

అగ్నికణం వీర సావర్కర్‌ - Agnikanam Veer Savarkar


అగ్నికణం వీర సావర్కర్‌ - Agnikanam Veer Savarkar

– క్రాంతి దేవ్‌ మిత్ర

వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌..ఈ పేరు వినగానే భారతీయులందరి మదిలో దేశభక్తి ఉప్పొంగుతుంది. బ్రిటిష్‌ అధికారాన్ని ధిక్కరించి స్వాతంత్య్ర పోరాటాన్ని వారి దేశ రాజధాని నడిగడ్డ మీదకు తీసుకెళ్లిన విప్లవవీరుడు..

ఎందరో విప్లవకారులకు, స్వాతంత్య్ర సమర యోధులకు స్పూర్తినిచ్చిన వీరుడు.. రెండు యావజ్జీవ కారాగార శిక్షలు పడి అండమాన్‌ జైలులో 27 ఏళ్లు దుర్భర జీవితం గడిపినా చలించని ధీరుడు వీర సావర్కర్‌.

దేశం కోసం జీవితాన్ని అర్పించుకున్న సావర్కర్‌ బ్రిటిష్‌ పాలనపై పోరాటానికి మాత్రమే పరిమితం కాలేదు. ఒక కవిగా, రచయితగా, వక్తగా, చరిత్ర కారునిగా, సంఘ సంస్కర్తగా హైందవ సమాజాన్ని జాగత పరిచారు.

1857 స్వాతంత్య్ర సంగ్రామం తర్వాత ఈస్టిండియా కంపెనీ నుంచి బ్రిటిష్‌ వారు భారత్‌ను స్వాధీనం చేసుకొని పాలనపై పట్టు బిగించారు. భారతీయుల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్లైంది. వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ జన్మించే నాటికి దేశం కఠోర బానిసత్వంలో మగ్గుతూ అష్టకష్టాలు పడుతోంది. దీనికితోడు సామాజిక కట్టుబాట్లు, మూఢ విశ్వాసాలలో మునిగిపోయిన భారత సమాజాన్ని సంస్కరించేందు ఎన్నో సాంఘిక, మత ఉద్యమాలు వచ్చాయి. మరోవైపు బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా శాంతియుత పోరాటాలకు తోడు రహస్య విప్లవోద్యమాలు కూడా ప్రారంభ మయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో జన్మించిన సావర్కర్‌ స్వాతంత్య్రం కోసం పోరాడే రహస్య విప్లవ యోధుడిగా మారాడు. అదే సమయంలో ఆయన సాహితీవేత్తగా, చరిత్ర కారునిగా, సంఘ సంస్కర్తగా భిన్న కోణాల్లో సేవలు అందించారు.

దేశం కోసమే జీవితం
వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ జీవితాన్ని రెండు భాగాలుగా ఆవిష్కరించవచ్చు. ఇందులో ముందుగా ప్రథమార్ధాన్ని చూద్దాం. 1883 మే 28న నాసిక్‌ జిల్లా భాగూరు గ్రామంలో దామోదర్‌ పంత్‌, రాధాబాయి దంపతులకు జన్మించారు వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌. సావర్కర్‌ అన్న గణేష్‌ దామోదర్‌ సావర్కర్‌, తమ్ముడు నారాయణ రావు సావర్కర్‌. ఈ ముగ్గురు సోదరులు చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్నారు.

ఆనాటి బ్రిటిష్‌ పాలనలో భారతీయులు పడుతున్న కష్టాలను చూసి చలించిపోయిన సావర్కర్‌ సోదరులు తమ కుల దేవత అష్టభుజాదేవి ముందు దేశ స్వాతంత్య్రం కోసం తమ జీవితాన్ని సమర్పిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ ఆశయ సాధన కోసం ‘రాష్ట్ర భక్త సమూహ్‌, మిత్ర మేళా, అభినవ భారత్‌’ అనే సంస్థలను స్థాపించారు.

పుణే పెర్గ్యుసన్‌ కాలేజీలో బిఎ పూర్తి చేసుకున్న వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ ‘బార్‌-ఎట్‌-లా’ చదువు కోసం 1906లో లండన్‌ బయలుదేరారు. న్యాయవిద్య పైకి ఒక సాకు మాత్రమే. అప్పటికే సావర్కర్‌కు వివాహమైంది. ఒక కుమారుడు కూడా. తెల్లవారి గడ్డ లండన్‌ నుంచి విప్లవోద్యమం నడపాలనే కృత నిశ్చయంతో అక్కడికి వెళ్లారు. విప్లవ కారులతో కలిసి పని చేశారు. వారందరికీ సావర్కర్‌ రూపంలో ఒక మార్గదర్శి కనిపించాడు.
అండమాన్‌లో కారాగార శిక్ష
అండమాన్‌లో కారాగార శిక్ష
సావర్కర్‌ లండన్‌లో ఉన్న సమయంలోనే అన్న గణేష్‌ సావర్కర్‌కు బ్రిటిష్‌ ప్రభుత్వం అండమాన్‌లో కారాగార శిక్ష విధించింది. సావర్కర్‌ న్యాయ విద్య పూర్తి చేసినా, బ్రిటిష్‌ రాణికి విధేయత ప్రకటించడానికి నిరాకరించినందుకు బార్‌ ఎట్‌ లా పట్టా నిరాకరించారు. సావర్కర్‌ కుడి భుజం మదన్‌లాల్‌ ధింగ్రా బ్రిటిష్ ఆర్మీ అధికారి సర్ విలియం హట్ కర్జన్‌ విల్లేని హతమార్చాడు. గణేష్‌ సావర్కర్‌కు శిక్ష విధించిన జాక్సన్‌ అనే అధికారిని అనంత లక్ష్మణ కర్హరే అనే విప్లవ యోధుడు కాల్చి చంపాడు. ఈ రెండు ఘటనల తర్వాత వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌పై నిఘా పెరిగింది. చివరకు ప్యారిస్‌ నుంచి లండన్‌ వచ్చిన సావర్కర్‌ను రైల్వేస్టేషన్‌లో బంధించారు. స్టీమర్‌లో భారత్‌కు తీసుకొస్తుండగా సముద్రంలో దూకి తప్పించుకునే ప్రయత్నమూ ఫలించలేదు.

వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌కు న్యాయస్థానం అండమాన్‌ జైలులో రెండు యావజ్జీవ కారాగార శిక్షలు (50 ఏళ్లు) విధించింది. న్యాయమూర్తి ఆ తీర్పును ప్రకటిరచగానే. ‘బ్రిటిష్‌ వారికి పునర్జన్మ మీద నమ్మకం ఉందన్నమాట’ అని చమత్కరించారు ధీశాలి అయన సావర్కర్‌. అంతేకాదు ఆయన యావదాస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీనికి స్పందిస్తూ ‘దేశమంతా నాదైనప్పుడు సొంత ఆస్తి లేకపోతేనేం’ అని వ్యాఖ్యానించిన మహనీయుడు సావర్కర్‌. 1911 జూలై 4 నుంచి ప్రారంభమైన అండమాన్‌ కారాగార శిక్ష ఎంతో కఠినంగా సాగింది. కొబ్బరి పీచు వలవడం, గానుగ ఆడించి నూనె తీయడం వంటి కఠిన పనులు చేయించారు.

జైలులో ఉన్న రోజుల్లో సావర్కర్‌ తన రచనా వ్యాసాంగాన్ని సాగించారు. తోటి ఖైదీలకు చదువు చెప్పారు. కులమత బేధాలు పాటించకుండా సంస్కరించారు. దేశంలోని వివిధ వర్గాల నుంచి వచ్చిన వత్తిడి కారణంగా 1923 డిసెంబర్‌లో సావర్కర్‌ను అండమాన్‌ నుంచి మహారాష్ట్రలోని ఎరవాడ జైలుకు తరలించారు బ్రిటిష్‌వారు. అనంతరం 1924 జనవరి 6న రత్నగిరి జిల్లా దాటిపోవద్దు, రాజకీయాల్లో పాల్గొనరాదనే షరతులతో బ్రిటిష్‌ ప్రభుత్వం వీర సావర్కర్‌ను పూర్తిగా విడుదల చేసింది.
 వీర సావర్కర్‌
 వీర సావర్కర్‌ 
సంఘ సంస్కర్తగా పునర్నిర్మాణం
సుధీర్ఘకాలం కారాగార జీవితం తర్వాత ఆంక్షలతో విడుదలైన సావర్కర్‌ జీవితం ద్వితీయార్థమంతా హిందూ సమాజ సంస్కరణలో సాగిపోయింది. నాటి హిందూ సమాజం అనైక్యత, అంటరానితనం, సాంఘిక దురాచారాలతో కష్టాలు పడుతోంది. సమాజంలోని ఈ అసమానతలు రూపుమాపి జాతిని సమైక్యం చేసేందుకు నడుం బిగించారు సావర్కర్‌. సావర్కర్‌ తన గ్రామంలోని హరిజనుడి ఇంట టీ తాగడం సనాతన ఆచార పరాయణులకు ఆగ్రహం తెప్పించింది. అంటరానితనం కారణంగానే మన హిందూ సమాజంలో అనైక్యత, మత మార్పిడులు జరుగుతున్నాయని గుర్తు చేశారు సావర్కర్‌. హిందువులు అంతా బంధువులేనని చాటి చెప్పారు.

1929లో రత్నగిరిలోని విఠలేశ్వరాలయంలోకి హరిజనులకు ప్రవేశం కల్పించారు వీర సావర్కర్‌. మహారాష్ట్ర అంతటా ఈ కార్యక్రమం ఒక ఉద్యమ రూపంలో కొనసాగింది. పాఠశాలల్లో అన్ని కులాల విద్యార్థులు కలిసి చదువుకునేలా ప్రోత్సహించారు. 1931లో పతిత పావన మందిరాన్ని నిర్మించి శంకరాచార్యులచే ప్రారంభించారు సావర్కర్‌. సమాజంలోని వివిధ వర్గాల మధ్య ఐక్యత తీసుకురావడానికి సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేశారు. హిందూ సమాజం నుంచి కొన్ని వర్గాలను దూరం చేసుకోవడం అంటే మనకు శత్రువులను పెంచుకోవడమేనని గుర్తు చేసేవారు సావర్కర్‌. అన్యమతం స్వీకరించిన వారిని శుద్ధి ఉద్యమాల ద్వారా తిరిగి హిందూ సమాజంలోకి తీసుకొచ్చే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. హిందూ సంఘటన కోసం సామూహిక గణేష్‌ ఉత్సవాలు, శివాజీ ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించారు.
 వీర సావర్కర్‌ 
హిందుత్వం, జాతీయ వాదం:
హిందుత్వ పేరు వినగానే ఏదో రూపంలో వీర సావర్కర్‌ గుర్తుకు వస్తారు. స్వాతంత్య్ర ఉద్యమ కాలంలోనే హిందువు అనే పదానికి స్పష్టమైన నిర్వచనం ఇచ్చారు సావర్కర్‌.

‘ఆసింధు సింధు పర్యంతా యస్యభారత భూమికా
పితభూః పుణ్యభూశ్చైవ సవై హిందురితి స్మతాః’

‘సింధూ నది మొదలు హిందూ మహా సముద్రం వరకూ ఉన్న ఈ భారత భూమిని మాతభూమిగా, పితృభూమిగా, పుణ్యభూమిగా భావించిన వారంతా హిందువులే..’ హిందువులు అంటే ఎవరనే ప్రశ్నకు వినాయక దామోదర్‌ సావర్కర్‌ ఇచ్చిన స్పష్టమైన సమాధానం ఇది.

హిందువనే పదం సాంస్కృతిక జీవితానికి సంబంధించినది. దేశంలో నివసించే ప్రతి వ్యక్తి ప్రాంతం, భాష, మతాలకు అతీతంగా తాను భారతీయుడినని భావించాలి. అదే మన జాతీయత అని చెప్పారు సావర్కర్‌. హిందుత్వం అనేది మన జాతీయతను సూచిస్తుంది. దేశంలో మతాలు ఎన్ని ఉన్నా జాతీయత ఒక్కటే. జాతీయత అనే నదిలో అన్ని మతాలు, వర్గాలు సెలయేర్లలా కలిసిపోవాలి అని కోరుకున్నారు సావర్కర్‌. ఏ మతం వారైనా భారతీయులే. వారు ముస్లింలైతే భారతీయ ముస్లింలు, క్రైస్తవులైతే భారతీయ క్రైస్తవులు. అంతేకాని ‘ఏ మతం ప్రత్యేక జాతి కాదు’ అని చెప్పారు సావర్కర్‌.

హిందుత్వాన్ని భారత జాతీయతతో సమానంగా నిర్వచించారు సావర్కర్‌. ప్రపంచంలో ఎన్నో దేశాలు, జాతులు, మతాలు, సాంస్కృతులు ప్రత్యేక అస్తిత్వంతో ఉన్నట్లే హిందూ జాతీయత తనదైన గుర్తింపుతో మనుగడ సాగిస్తుంది. హిందూ సంఘటన అంటే జాతి సంరక్షణ అని చెప్పారు సావర్కర్‌. హిందువుల ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఎవరు ప్రవర్తించినా ఘర్షణ తప్పదు. ఈ స్వీయ రక్షణ కోసం హిందూ సంఘటనోద్యమాన్ని ప్రారంభించారు వీర సావర్కర్‌. స్వాతంత్య్రంతో పాటు దేశ విభజన కూడా తప్పదని చాలా ముందుచూపుతో గ్రహించారు సావర్కర్‌. ఆనాటి బ్రిటిష్‌ ఇండియా సైన్యంలో హిందువులు చాలా తక్కువ. అందుకే హిందువులు సైన్యంలో చేరాలని ప్రోత్సహించారు సావర్కర్‌. సావర్కర్‌ ఈ పిలుపు ఇవ్వడాన్ని తప్పు పట్టిన వారంతా, తర్వాత కాలంలో ఆయన దూరదష్టిని అభినందించారు.

1938 నాటికి బ్రిటిష్‌ ప్రభుత్వం వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌పై అన్ని ఆంక్షలను ఎత్తేసింది. తరువాత హిందూ మహాసభకు ఆయనను అధ్యక్షునిగా ఎన్నుకున్నారు.

చరిత్రకారుడు, సాహితీవేత్తగా..
వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ స్వాతంత్ర యోధునిగానే కాక చరిత్రకారునిగా, సాహితీవేత్తగా కూడా ప్రసిద్ధులు. ఆయన గ్రంధాలు ప్రజల్లో దేశభక్తిని రగిలించేవి. ఈ కారణం వల్లే బ్రిటిష్‌ ప్రభుత్వం ఆయన రచనలపై గట్టి నిఘా పెట్టింది. చాలా ఏళ్ల పాటు నిషేధం కూడా అమలులో ఉంది. భారతదేశంతో పాటు విదేశీ చరిత్రలను కూడా ఎంతో లోతుగా అధ్యయనం చేసి మనకు సాహిత్య సష్టి చేశారు సావర్కర్‌.

సావర్కర్‌ 1908లో లండన్‌లో చదువుకుంటున్న రోజుల్లోనే ‘1857 స్వాతంత్య్ర సంగ్రామ చరిత్ర’ను రాశారు. ఆనాడు జరిగిన ఉద్యమాన్ని బ్రిటిష్‌ చరిత్రకారులు కేవలం సిపాయిల తిరుగుబాటుగా అభివర్ణించారు. కానీ అది స్వాతంత్య్ర సంగ్రామమని స్పష్టంగా లోకానికి చాటి చెప్పారు సావర్కర్‌. దీన్ని ప్రపంచంలోని పలు భాషల్లోకి అనువదించారు. బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రచురణకు ముందే ఈ గ్రంధాన్ని నిషేధించింది. దీన్ని ముద్రణ కోసం భారత్‌ లోని తన అన్న గణేష్‌ సావర్కర్‌కు పంపగా, బ్రిటిష్‌ వారు పసిగట్టారు. ఆయన్ను ఆరెస్టు చేసి అండమాన్‌కు పంపింది ఈ కేసులోనే. మహారాష్ట్రలోని అన్ని ముద్రణాలయాలపై ముందు జాగ్రత్తగా దాడులు జరిపారు. అయినప్పటికీ విదేశాల్లో ముద్రించిన ‘1857 స్వాతంత్య్ర సంగ్రామ చరిత్ర’ రహస్యంగా భారతదేశం చేరింది. ఈ గ్రంథం ఎంతో మంది స్వాతంత్య్ర సమర వీరులకు, విప్లవ యోధులకు స్పూర్తినిచ్చింది.

సావర్కర్‌ అండమాన్‌ జైలులో బందీగా ఉన్నప్పుడు అక్కడ విధించిన కఠిన శిక్షలకు చింతిస్తూ కూర్చోలేదు. చేతులకు, కాళ్లకూ బేడీలు వేసి శరీరాన్ని బంధించారు, కానీ మనసును కాదు అనుకునేవారు. స్వతహాగా ఆయన కవి. శిక్ష సమయంలో జైలు గోడల మీదే కవితలు రాశారు. వీటిని కంఠస్థం చేసి, గుర్తు పెట్టుకొని, తర్వాత కాలంలో గ్రంథస్తం చేశారు. కొద్ది నెలల తర్వాత జైలు సిబ్బంది ఆయనకు కాగితాలు, కలం సమకూర్చారు. అండమాన్‌ జైలులో ఉన్న సమయంలోనే కమల, గోమాంతక్‌, మహాసాగర్‌ తదితర గొప్ప కావ్యాలు వచ్చాయి.

1922లో జైలు గోడల మధ్యే హిందుత్వ గ్రంధ రచనకు పూనుకున్నారు సావర్కర్‌. హిందుత్వకు సమగ్ర నిర్వచనం ఇచ్చిన గ్రంథం ఇదే.

సావర్కర్‌ తన ఆరోగ్యం క్షీణిస్తున్న దశలో కూడా రచనా వ్యాసాంగాన్ని వదిలిపెట్టలేదు. 1963లో ఆయన రాసిన ‘భారత ఇతిహాసంలో ఆరు స్వర్ణపుటలు’ మన చరిత్రలోని ముఖ్య ఘట్టాలను ఉల్లేఖిస్తూ స్వాభిమానాన్ని చాటి చెప్పింది. అండమాన్‌ జైలులో తాను గడిపిన దుర్భర జీవితంపై రాసిన ఆత్మకథ మరాఠా సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచి పోతుంది. దీని ఆధారంగా ఎన్నో రంగస్థల నాటకాలు కూడా వచ్చాయి.

ఆధునిక భారతీయ రాజనీతిజ్ఞులలో సావర్కర్‌ ఒకరు. ఆయన మహోన్నత ఆదర్శవాది, మానవతా వాది, హేతువాది కూడా. అభ్యుదయ, వైజ్ఞానిక, శాస్త్రీయ దృక్పథాలు ఆయన రచనలు, ఉపన్యాసాల్లో కనిపిస్తాయి.
 వీర సావర్కర్‌ - అఖండ భారత్
స్వదేశీ ప్రభుత్వ నిర్దయం:
సావర్కర్‌ జీవితం అంతా సంఘర్షణలతోనే సాగింది. బ్రిటిష్‌ ప్రభుత్వంతో పాటు స్వదేశీ ప్రభుత్వం కూడా ఆయనపట్ల నిర్దయగానే వ్యవహరించింది. మహాత్మాగాంధీ హత్యోదంతంలో ఆయనను అన్యాయంగా అరెస్టు చేశారు. అనంతరం నిర్దోషిగా విడుదల చేశారు. దేశం కోసం జీవితాన్ని అర్పితం చేసిన ఆ మహానీయునికి దక్కాల్సిన గౌరవాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇవ్వలేదు. అయితే 1964లో మహారాష్ట్ర ప్రభుత్వం ‘అప్రతిహతీ స్వాతంత్య్ర వీర’ అనే బిదురుతో గౌరవించింది. జీవిత చివరి దశలో తన 86వ ఏట జీవితం చాలించదలచి ఆహారాన్ని త్యజించారు సావర్కర్‌. 1966 ఫిబ్రవరి 26న ఈ లోకం నుంచి విముక్తి పొందారు. ఆ మహనీయుడు అందించిన స్ఫూర్తి కోట్లాది మంది భారతీ యుల్లో అగ్నికణమై చిరస్థాయిగా నిలిచిపోతుంది.

వీర సావర్కర్‌ జీవితంలోని ముఖ్య ఘట్టాలు
 • – 1883 మే 28 – మహరాష్ట్ర నాసిక్‌ జిల్లా భాగూరు గ్రామంలో రాత్రి 10 గంటలకు వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ జననం
 • – 1892 – తల్లి రాధాబాయి మరణం
 • – 1898 – దేశ స్వాతంత్య్రం కోసం జీవితాన్ని సమర్పిస్తానని కుల దేవత అష్టభుజాదేవి ముందు ప్రతిన
 • – 1899 సెప్టెంబర్‌ – తండ్రి దామోదర్‌ పంత్‌ మరణం, ‘రాష్ట్రభక్త సమూహ్‌’ రహస్య సంస్థ ప్రారంభం
 • – 1900 – ‘మిత్రమేళా’ అనే రహస్య సంస్థ ప్రారంభం
 • – 1901 మార్చి – యమునా బాయితో వివాహం’
 • – 1902 – పూణే ఫెర్గ్యూసన్‌ కాలేజీలో చేరిక
 • – 1904 మే – ‘మిత్ర మేళా’ పేరు ‘అభినవ్‌ భారత్‌’ గా మార్పు
 • – 1905 డిసెంబర్‌ – బిఎ ఉత్తీర్ణత
 • – 1906 జూన్‌ 9 – ‘బార్‌ ఎట్‌ లా’ చదువు కోసం ఇంగ్లాడ్‌ చేరిక
 • – 1908 మార్చి – ‘1857 స్వాతంత్య్ర సంగ్రామ చరిత్ర’ రచన

 • – 1909 – సావర్కర్‌ కుమారుడు ప్రభాకర్‌ మరణం, అన్న గణేష్‌ సావర్కర్‌కు అండమాన్‌ జైలు శిక్ష. బ్రిటిష్‌ రాణికి విధేయత చూపనందుకు సావర్కర్‌కు బార్‌-ఎట్‌-లా డిగ్రీ నిరాకరణ
 • – 1909 – లండన్‌లో కర్జన్‌ వైలీని హతమార్చిన సావర్కర్‌ అనుచరుడు మదన్‌లాల్‌ ధింగ్రా
 • – 1910 మార్చి 13 – లండన్‌ రైల్వే స్టేషన్‌లో సావర్కర్‌ అరెస్టు
 • – 1910 జూలై 18 – స్టీమర్‌లో భారత్‌ తీసుకువస్తుండగా సముద్రంలో దూకి తప్పించుకునే యత్నం
 • – 1910 డిసెంబర్‌ 24 – సావర్కర్‌కు అండమాన్‌ యావజ్జీవ కారాగార శిక్ష విధింపు
 • – 1911 జనవరి 31 – సావర్కర్‌కు రెండో యావజ్జీవ కారాగార శిక్ష విధింపు
 • – 1911 జూలై 4 – అండమాన్‌ కారాగార శిక్ష ప్రారంభం
 • – 1918 – సావర్కర్‌కు తీవ్ర అనారోగ్యం
 • – 1922 – ‘హిందుత్వ’ గ్రంధ రచన
 • – 1923 డిసెంబర్‌ – ఎరవాడ జైలుకు సావర్కర్‌ బదిలీ
 • – 1924 – రాజకీయాల్లో పాల్గొనరాదు, రత్నగిరి వదిలి పోరాదు అనే షరతులతో సావర్కర్‌ విడుదల
 • – 1924 – ‘గోమంతక్‌’ గ్రంథ రచన
 • – 1925 – కుమార్తె ప్రభ జననం, అస్పశ్యతకు వ్యతిరేకంగా ఉద్యమం
 • – 1927 – రత్నగిరిలో మహాత్మా గాంధీజీతో సమావేశం, అండమాన్‌ అనుభవాలపై పుస్తక రచన
 • – 1931 ఫిబ్రవరి – రత్నగిరిలో పతిత పావన మందిర ప్రారంభం
 • – 1937 – సావర్కర్‌పై ఆంక్షల ఎత్తివేత, పూర్తిస్థాయి విడుదల.. హిందూ మహాసభ అధ్యక్షునిగా ఎన్నిక
 • – 1938 అక్టోబర్‌ – హైదరాబాద్‌ విముక్తి సత్యాగ్రహం
 • – 1943 – సావర్కర్‌ షష్టిపూర్తి
 • – 1945 మార్చి – సావర్కర్‌ అన్న గణేష్‌ సావర్కర్‌ మరణం
 • – 1946 ఏప్రిల్‌ – సావర్కర్‌ సాహిత్యంపై నిషేధం ఎత్తివేత
 • – 1948 ఫిబ్రవరి 5 – గాంధీ హత్య కేసులో అరెస్టు
 • – 1949 మే 10 – నిర్దోషిగా విడుదల
 • – 1949 అక్టోబర్‌ – తమ్ముడు నారాయణరావు మరణం
 • – 1958 – సావర్కర్‌కు 75 ఏళ్ల సందర్భంగా అమతోత్సవం
 • – 1959 – పూణె విశ్వ విద్యాలయం ద్వారా గౌరవ డాక్టరేట్‌
 • – 1963 – ‘భారతీయ ఇతిహాస్‌ కే ఛే స్వర్ణిమ పష్ట్‌’ పుస్తక ప్రచురణ
 • – 1963 మే – సావర్కర్‌ భార్య యమునాబాయి మరణం
 • – 1966 ఫిబ్రవరి 26 – వీర సావర్కర్‌ శాశ్వత నిష్క్రమణ
(మే 28 సావర్కర్‌ జయంతి)

మూలము: జాగృతి

GAU NATURALS - Swadesi Products

Cow Based Cultivated Rice,Dals,Spices.Hand Churned DESI COW GHEE,Panchgavya Products,Ayurvedic Products..
స్వదేశీ గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయం లో పండించిన పంట ఉత్పత్తులు, చేతితో విసిరిన పప్పులు,గానుగ నూనె లు, గోశాల లో తయారు చేసిన ఆవు నెయ్యి, పళ్ళపొడి సబ్బు లు షాంపూలు,ఫినాయిల్ మరెన్నో స్వదేశీ ఉత్పత్తుల సమాహారమే - గౌ నాచురల్స్. www.gaunaturals.com