క్రైస్తవ మాఫియాపై విల్లునెక్కుపెట్టిన మహావీరుడు బిర్సా ముండా - Birsa Munda great hero who has set a bow on the Christian Mafiaక్రైస్తవ మిషనరీల అకృత్యాలపై జార్ఖండు ప్రాంతంలోని బిర్సా కొండల్లో విప్లవోద్యమాన్ని రేకెత్తించిన బిర్సా ముండా భగవాన్ బిర్సా ముండాగా ప్రసిద్దుడు. 

ఈయన 1875 నవంబరు 15న జార్ఖండు ప్రాంతంలోని చోటా నగర్ సమీపాన ఓ కుగ్రామంలో జన్మించాడు. తండ్రి సుగ్లా ముండా క్రిష్టియన్ మతం పుచ్చుకున్నాడు. బిరసా స్వతహాగా తెలివితేటలున్నవాడు. పలు భాషలలో ప్రవేశం వుంది. గణిత శాస్త్రంలో దిట్ట. ఒక క్రైస్తవ మత గురువు బిరసాను కూడా మతం మార్చాడు. అయినా బిరసాలో స్వధర్మాభిమానం చావలేదు. ఒకసారి పాఠశాల హాష్టలులో ఆవు మాంసం వడ్డించారు. దానిని తినడానికి బిరసా తిరస్కరించాడు. ఆ ప్రదేశంలో ఉండటానికి మనస్కరించక చదువు మానేసి వచ్చేశాడు. “ఊహ తెలిసిన కొద్దీ వనవాసీ ప్రాంతంలోని వనవాసీలను మతం మార్చడంలో మిషనరీలకున్న శ్రద్ధ సహజ సిద్దంగా వారికి సంక్రమించిన హక్కులను కాపాడటంలో లేదని తెలుసుకున్నాడు. వనవాసీల హక్కులను కాలరాసే ప్రభుత్వ చట్టాలను కూడా వాళ్ళు సమర్దిస్తున్నారని గ్రహించాడు. వెంటనే ఉద్యమానికి శ్రీకారం చుట్టాడు. బిర్సాకు ఒక వైష్ణవాచార్యుడు అండగా నిలిచాడు.

అడవి బిడ్డల జీవితాలలో వెలుగులు నింపేందుకు నిరంతరం శ్రమించాడు బిర్సా ముండా. సాంఘిక సంస్కరణల ఆవశ్యకత గురించి వివరించాడు. బాధితులైన తోటివారిని ఆడుకోవడం ఉత్తమ ధర్మం అన్నాడు. వాటిని తన జీవితంలో ఆచరణలోనికి తెచ్చాడు. తెల్లవారిపై తిరుగుబాటు చేశాడు. మిషనరీల కార్యకలాపాలను అడ్డుకున్నాడు. బిర్సా మూలికా వైద్యం కూడా చేసేవాడు. క్రైస్తవ మతాధికారుల ప్రోద్బలంతో ఆంగ్లేయులు బిర్సాను కారాగారంలో బంధించారు. ఆయన విడుదలకై పెద్ద ఎత్తున ఉద్యమం నడిచింది. జైలు నుంచి విడుదలై వచ్చాక మిషనరీల దేశద్రోహ చర్యలకు వ్యతిరేకంగా విప్లవ శంఖం పూరించాడు. తన ఆశయాల ప్రచారానికి ఒక జెండాను కూడా రూపొందించాడు.

నుదుట బొట్టు, మెడలో జంధ్యం దహరించిన బిర్సా వనవాసీలు సంప్రదాయాలను విడిచిపెట్టరాదని, నైతిక వర్తన కలిగివుండాలని బోధించేవాడు. బిరసా ప్రభావం రోజురోజుకూ ఎక్కువవుతుండడంతో క్రైస్తవ మత మార్పిడులకు ఆటంకం ఏర్పడింది. మిషనరీలు కుట్రపన్ని మరళా జైల్లో వేయించారు. ఆంగ్ల ప్రభుత్వం అతని మీద విషప్రయోగం చేసి కలరావల్ల చనిపోయాడని నిర్లజ్జగా ప్రకటించింది. ఆంగ్ల ప్రభుత్వం, క్రైస్తవ మిషనరీల కుట్ర కారణంగా క్రీ.శ.1900 సంవత్సరం జూన్ 9న బిరసా ముండా అశువులు బాశాడు. భారత దేశ స్వాతంత్ర్యం కోసం, స్వధర్మం కోసం, కన్న భూమి కోసం బలిదానం చేసిన భగవాన్ బిరసా ముండా చిరస్మరణీయుడు. నేడు భగవాన్ బిర్సా ముండా వర్ధంతి.

మూలము: విశ్వ సంవాద కేంద్రము

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top