నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

పండుగలు

పండుగలు
Showing posts with label శరీరము. Show all posts
Showing posts with label శరీరము. Show all posts

Tuesday, June 2, 2020

శరీర దుర్వాసన, నోటి దుర్వాసన నుండి విముక్తి - Sarira Durvasana, Noti Durvasa - Free from body Bad smell, , mouth Bad smell,


దుర్వాసనలు పోవడానికి జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి.నోటి దుర్వాసన పోవడానికి ప్రతి దినము దంతాలు శుభ్రం చేసుకోవడమొక్కటే కాకుండా పీచుపదార్థం ఉన్న ఆహార పదార్థాలు తినడం వల్ల పళ్లు శుభ్రంగా ఉండి చెడు బ్యాక్టీరియా ఫాం కాకుండా చేస్తుంది.

నోటి దుర్వాసన - పరిష్కార మార్గాలు:
 • ➢ పీచుపదార్థం అరుగుదలకు ఉపయోగపడుతుంది. మలబద్ధకం నివారిస్తుంది. దీనివల్ల జీర్ణకోశం ఆరోగ్యంగా ఉంటుంది. 
 • ➣ అరుగుదల సవ్యంగా లేనప్పుడు ,ఆలస్యమైనప్పుడు పొట్ట నుంచి నోటిలోకి దుర్వాసన వెలువడుతుంది, అందువల్ల మన ఆహారం పీచుపదార్థంతో పాటు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. 
 • ➢ ఎక్కువ నూనె ఉండే ఆహారపదార్థాలు అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది. 
 • ➣ ఎప్పుడు కూడా తాజాగా ఉండే ఆహారం భుజించడం ఆరోగ్యానికి మేలు.
శరీర దుర్వాసన - పరిష్కార మార్గాలు:
శరీర దుర్గంధం అపొక్రైన్ అనే గ్రంధుల ద్వారా వెలువడుతుంది. ఈ గ్రంధులు ప్రత్యేకమైన సెంట్ ను విడుదల చేస్తాయి.
 • ➣ చెమటకు బ్యాక్టీరియా తోడై శరీర దుర్గంధం వస్తుంది.
 • ➣ సాధారణంగా చెమట వాసన అనేది అందరికీ ఉంటుంది, ఐతే ఇది మన శుభ్రతపైన ఎక్కువగా ఆధారపడి ఉంటుంది.
 •  మనం తీసుకునే ఆహారం కూడా ఈ వాసనలకు కారణం అవుతుంది.
 • ➣ అపొక్రైన్ గ్రంధులు కళ్లు,చంకలు,వక్షోజాలు,నాభి,చెవులు,విస్ర్జన భాగాల్లో ఉంటాయి, అందువల్ల శుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి.
 •  అల్లగే తీసుకునే ఆహారం సమతుల్యంగా ఉండాలి.తగినంత పీచుపదార్థం ఉండాలి.
 • ➣ రోజుకు కనీసం 8 నుండి 12 గ్లాసుల నీరు తాగాలి.పళ్లు,కూరగాయలు ప్రతి పూటా తీసుకోవాలి.
 • ➣ దంత సమస్యలు,చిగుళ్ల సంస్యలున్నవారు దంత వైద్యుడిని సంప్రదించాలి.
గమనిక:
పై నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

సంకలనం: కోటేశ్వర్

Monday, April 6, 2020

స్థూల, సూక్ష్మ, కారణ శరీరములు - Sthula, Sookshma Shareeramulu

స్థూల, సూక్ష్మ, కారణ శరీరములు
 • ⧫ శరీరము మజ్జ, ఆస్థి, క్రొవ్వు, రక్తము, శుక్లము, మాంసము, చర్మము అను సప్త ధాతువులచే ఏర్పడినది.
 • ⧫ పాదములు, తొడలు, వక్షస్థలము, భుజములు, వెన్ను, మస్తకము అనే అవయవాలు ఉపాంగములుగా కల్గి, మలమూత్ర భరితమై నేను, నాదను అహంకార మమకారములకు ఆశ్రయమైనది స్థూల దేహము.
ఇది పంచ భూతముల కలయికచే ఏర్పడటం చేత పంచభూతాత్మకమని చెప్పబడింది. ఈ భూతముల తన్మాత్రలే జీవునికి శబ్ద స్పర్శాది విషయాలుగా సుఖమును కలిగించి, వాటి యందు రాగ బధ్ధులను చేసి కర్మానుసారముగా సంసారమున త్రిప్పుతుంది. అవిద్య వల్ల విషయానురాగము, పరమార్ధమును వదలి శరీర పోషణకే నిమగ్నమయేటట్లు మనలను చేస్తుంది. కాలము మ్రింగివేయని వస్తువేదీ ఈ ప్రపంచంలో లేదు.

ఈ ప్రపంచంలో అన్నపానాదులు, స్త్రీ పురుష సంగాది ఇంద్రియ విషయాలే తప్ప ఏ పురుషార్ధమూ లేదు. ముల్లోకాలనబడే పాతాళ, భూ, స్వర్గ లోకాల్లో పంచ భూతాలే తప్ప ఆరవ వస్తువేదీ లేదు. శరీరం నేడో రేపో నశించి పోయేదని తెలిసినా, అజ్ఞానం వల్ల ఆ శరీర హితము కోసమే ప్రయత్నిస్తున్నాం. ఎలాంటి వ్యక్తైనా దృశ్య పదార్ధాల మీద ఆశ చేతనే బంధించబడుతున్నాడు. భోగ విషయాలపై వాంఛ బంధము. వాంఛలు త్యజించడం మోక్షమని యోగ వాశిష్టం చెబుతోంది.

పంచీకృత మహా భూతములతో స్థూలదేహము ఏర్పడింది. శరీరం ఆత్మకు భోగస్థానం. దీంతో తాదాత్మ్యం చెందటం వల్ల శరీరమే తాననుకొని, వివిధ విషయాలను బాహ్యేంద్రియాల ద్వారా సేవిస్తున్నాడు, అనుభవిస్తున్నాడు.

స్థూలశరీరం వల్లే జీవుడికి బాహ్యజగత్తు కలుగుతోంది. ఈ స్థూల శరీరానికే జననము, వార్ధక్యము, మరణమనే ధర్మాలుంటాయి. బాల్య యౌవన కౌమారాది అవస్థలు, అనేక వర్ణాశ్రమ నియమాలు, మానావమానాలు, పూజ బహుమానము వంటివి కలుగుతున్నాయి. ఈ స్థూల శరీరమే జాగ్రదావస్థలో కనిపించేది. దీని యందు అభిమానమున్న చైతన్యము విశ్వుడు లేక వైశ్వానరుడు. బుధ్ధి జాగ్రదావస్థ యందు వివిధ వాసనలతో కలసి కర్తృత్వ భావంతో భాసిస్తుంటుంది. సాక్షికి బుధ్ధి ఉపాధిగా ఉన్నా, బుద్ధిచే చెయ్యబడే కర్మలు సాక్షికి అంటవు. ఎందుకంటే సాక్షి అసంగమైనది.

సూక్ష్మశరీరం పంచ ప్రాణాలు, పంచ కర్మే౦ద్రియములూ, జ్ఞానేంద్రియములు, మనస్సు, బుద్ధితో కలసి 17 తత్వములతో కలసి లింగశరీరము / సూక్ష్మ శరీరము ఏర్పడుతుంది. (వేదాంత పంచదశి). స్థూల శరీరం పంచీకృత మహాభూతాలచే ఏర్పడగా , సూక్ష్మ శరీరం అపంచీకృత భూతములతో ఏర్పడుతోంది. అంటే సూక్ష్మ భూత తన్మాత్రలతో ఏర్పడుతోంది. (కొన్ని చోట్ల దశేంద్రియాలు, పంచప్రాణాలు, పంచభూతాలు, అంతఃకరణంతో కలసి 21 తత్వాలతో సూక్ష్మశరీరం ఏర్పడుతున్నట్లుగా చెబుతారు.

వివేక చూడామణిలో ఆదిశంకరులు:
 • 1) జ్ఞానేంద్రియాలు, 
 • 2) కర్మేంద్రియాలు, 
 • 3) ప్రాణ పంచకము, 
 • 4) పంచభూతాలు, 
 • 5) అంతఃకరణ చతుష్టయము, 
 • 6) అవిద్య
 • 7) కామము, 
 • 8) కర్మ కలసి - ఈ 8 తత్వాలూ సూక్ష్మ శరీరాన్ని ఏర్పాటు చేస్తాయంటారు.
సూక్ష్మశరీరం స్థూలశరీరానికి లోపల ఉంటుంది. కంటికి కన్పించదు. శరీరం ఏర్పడటంలో ముందుగా కారణశరీరము, పిదప సూక్ష్మశరీరము, ఆ తర్వాత స్థూలశరీరము ఏర్పడతాయి. ఒకదాని కొకటి లోపలగా స్థూలశరీరంలో సూక్ష్మ శరీరమూ, సూక్ష్మశరీరంలో కారణ శరీరమూ ఉంటాయి. ప్రాణమే పంచప్రాణాలుగా సూక్ష్మ శరీరాన్ని స్థూల శరీరంతో అనుసంధానం చేస్తుంది. తైజసుడు దీని అభిమాని. స్వప్నావస్థలో వ్యక్తమవుతుంది. స్వప్నావస్థలో ఇంద్రియాలు పనిచెయ్యవు.

స్వప్నావస్థలో తైజసుడు 17 తత్వాలతోను అనేక క్రియలను జరుపుతూంటాడు. జాగ్రత్తులో చూసినదీ, చూడనిదీ, విన్నవీ, విననివీ, అనుభవించినవీ, అనుభవించనివీ, నిజమైనవీ, నిజంకానివీ, గత జన్మల అనుభవాలనూ స్వప్నంలో చూస్తుంటాడు.

కంఠస్థానము ఆశ్రయం.
 • ⭄ ఇది వాసనలతో కూడి ఉండటం వల్ల, కర్మ ఫలాలను అనుభవింప జేస్తుంది. ఆత్మ, సంగ రహితమైనది.
 • ⭄ ఈ సూక్ష్మ శరీరం/లింగ శరీరం చిదాత్మ రూపుడైన పురుషుని వ్యాపార సాధనకు కరణమై ఉంటుంది (అంటే సాధనము).
 • ⭄ మరణానంతరం వివిధ లోకాల్లోకి, శరీరాల్లోకి ఇదే ప్రయాణం చేసేది. స్థూల శరీరం పడిపోగానే జీవుడు ఈ సూక్ష్మ శరీరంతో యాతాయాతాలు చేస్తుంటాడు. వాస్తవంగా ఇవి జీవుడికి లేవు. ఇవి సూక్ష్మ శరీరానికే.
 • ⭄ సూక్ష్మ శరీరం ఎక్కడికి వెడితే అక్కడ ఆత్మ ఉంటుంది. అక్కడ ఆ శరీరంతో సంబంధ పడుతుంది. దేశ , కాల , మాన , పరిస్థితులను అధిగమించి ఈ సూక్ష్మ శరీరం పయనించ గల్గుతుంది.
 • ⭄ ఇది మరణానికి ముందు చేసిన తప్పొప్పులను బేరీజు వేసుకొని, చేసిన పనులకు పశ్చాత్తాపం పడి, తనంత తానే ఒక నిర్ణయానికి వస్తుందని అంటారు. స్వచ్చందంగా;తానేలాంటి తల్లితండ్రులకు పుడితే ఉద్ధరించ బడుతుందో, ఎలాంటి జీవితాన్ని గడపాలో, ఎలాంటి శరీరాన్ని పొందాలో ఇవన్నీనిర్ణయించు కొంటుంది.
తిరిగి జన్మించగానే తాను తీసుకున్న నిర్ణయాలు మరచి , దృశ్య ప్రపంచం వేపు అనురాగంతో ఈ జనన మరణ చక్రంలో పరిభ్రమిస్తూంటుంది. అంటే మన తల వ్రాతను మనమే వ్రాసుకొంటున్నా మన్నమాట.

కారణ శరీరము:
 • ⭄ జాగ్రదావస్థ యందు ఇంద్రియములతో చేసే కర్మల ఫలితాలను, వాసనారూపంలో కారణ శరీరంలో పొందు పరచబడి ఉంటాయి.
 • ⭄ ఇవి మరు జన్మకు కారణమవుతాయి. అలా మరుజన్మకు కారణమయ్యే వాసనలు దీన్లో ఉండటం వల్ల దీన్ని, కారణ శరీరమంటారు. కాని ఇది ఆత్మ కాదు.
 • ⭄ కారణశరీరం అవ్యక్తము. దీన్లో సత్వరజస్తమములనే మూడు గుణాలూ ఉంటాయి. ఆత్మకు కారణ శరీరమిది.
 • ⭄ శరీర పతనానంతరం కారణ శరీరం, ఆత్మతో శరీరాన్ని వదలి పోతుంది. నిష్క్రియుడైన ఆత్మ ఈ కారణశరీరంలో ఉంటుంది.
 • ⭄ సుషుప్త్యావస్థలో ఇంద్రియాలు మనస్సులో లీనమై ఉంటాయి. అంచేత అవి పనిచెయ్యక బాహ్య అనుభవాలు మనకు రావు.
 • ⭄ ప్రాణ శక్తులు మాత్రమే పనిచేస్తుంటాయి. ఈ ప్రాణమే గాఢనిద్రలో శరీరం యొక్క సమస్త వ్యాపారాలనూ నడిపిస్తుంది.
 • ⭄ ఇంద్రియవృత్తులు, మనస్సూ తనలో (ఆత్మలో) లీనమై ఉంటాయి. అలాంటి సుషుప్తిలో ఈ కారణ శరీరం మాత్రమే భాసిస్తుంది/ ఉంటుంది. సుషుప్తిలో ఏమీ తెలియదు. సుషుప్తి నుంచి లేచాక, నేను బాగా నిద్రపోయాను అని తెలుసుకొనేది మనస్సు. దీనికి అభిమాని ప్రాజ్ఞుడు.
 • ⭄ ప్రాజ్నుడిది హృదయ స్థానం. ఏమీ తెలియని స్థితి అయిన సుషుప్తిలో కేవలం అవిద్యయే ఉంటుంది. అంటే అవిద్యచేత కారణ శరీరం ఏర్పడుతుంది. ఇది వాస్తవమైనది కాదు గనుక, బ్రహ్మజ్ఞానం వల్ల అజ్ఞానం (అవిద్య) నశించగా ఇదీ నశిస్తుంది.
ఈ మూడు శరీరాలకూ ఆత్మే సాక్షి. దేనితోనూ తాదాత్మ్యం చెందదు. స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలకు భిన్నంగా; స్వప్రకాశ రూపమై కర్తగా గాని, భోక్తగా గాని కాకుండా అన్నిటికీ చైతన్యాన్ని ఇచ్చే ఆత్మయే మహాకారణ శరీరంగా చెప్పబడింది.

ఇది గాఢనిద్రలో అనుభవంలోకి వచ్చే స్థితి. ఇదే తురీయావస్థ. జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తీ అనునవి స్థూలశరీర ధర్మాలు. స్థూలశరీరం - క్రియాశక్తికీ, సూక్ష్మశరీరం- ఇచ్ఛాశక్తికీ, కారణశరీరం- జ్ఞానశక్తికీ....ఆశ్రయాలుగా చెప్పబడ్డాయి.

ఓం నమః శివాయ..!!
సర్వే జనా సుఖినోభవంతు..!!

సంకలనం: భానుమతి అక్కిశెట్టి

GAU NATURALS - Swadesi Products

Cow Based Cultivated Rice,Dals,Spices.Hand Churned DESI COW GHEE,Panchgavya Products,Ayurvedic Products..
స్వదేశీ గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయం లో పండించిన పంట ఉత్పత్తులు, చేతితో విసిరిన పప్పులు,గానుగ నూనె లు, గోశాల లో తయారు చేసిన ఆవు నెయ్యి, పళ్ళపొడి సబ్బు లు షాంపూలు,ఫినాయిల్ మరెన్నో స్వదేశీ ఉత్పత్తుల సమాహారమే - గౌ నాచురల్స్. www.gaunaturals.com