నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

పండుగలు

పండుగలు
Showing posts with label శాస్త్రవేత్త. Show all posts
Showing posts with label శాస్త్రవేత్త. Show all posts

Thursday, September 24, 2020

మోక్షగుండం విశ్వేశ్వరయ్య: మాతృభూమి ఋణం తీర్చుకున్న సఫల సాధకుడు - Mokshagundam Vishweshwaraiah

మోక్షగుండం విశ్వేశ్వరయ్య: మాతృభూమి ఋణం తీర్చుకున్న సఫల సాధకుడు - Mokshagundam Vishweshwaraiah

“మాతాపృధ్వీ పుత్రోహం పృథివ్యాః “ అన్నది వెదోక్తి. భూమి నాకు తల్లి. నేను ఆమె పుత్రుడను, పుడమి మొత్తం ఈ వైదిక సంస్కారంతో నిండిన ప్రజలతో నిండి ఉన్నది. కృత యుగంలో ఇలా భారతదేశమే ప్రపంచం, ప్రపంచమే భారతదేశం అయి ఉన్నది. కృతయుగంలోని మనుష్యుల సంస్కారాలు ఈ కలియుగంలోనూ ఉండాలనుకోవటం ఉత్త భ్రమే. అయితే పుడమిని తల్లిగా భావించేవారు ఈనాడు లేరని అనలేము. చాలా మందిలో మాతృభక్తి ఇప్పటికి నిండుగా ఉంది.


ఈ భూమిని తన తల్లిగా భావించి తన అమూల్య సేవలనందించిన మోక్షగుండం విశ్వేశ్వరయ్యగారి గురించి తెలుసుకోవడం ప్రతి భారతీయుని కర్తవ్యం. ఆయనకు మాతృభూమి మీదనే కాదు, మాతృభాష కన్నడం మీద కూడా పల్లమాలిన అభిమానం. ఒక సనాతన కుటుంబంలో శ్రీ మోక్షగుండం శ్రీనివాసశాస్త్రి, శ్రీమతి వేంకటలక్ష్మమ్మ పుణ్య దంపతులకు ముద్దుబిడ్డగా విశ్వేశ్వరయ్య 1881 సెప్టెంబర్ 15న జన్మించాడు. ఆనాటి మైసూరు రాష్ట్రం కోలారు జిల్లా నుండి విడిపోయిన చిక్కబల్లాపూర్ జిల్లాలోని ముద్దెనహళ్ళి గ్రామంలో ఆయన జన్మించాడు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది. ఎదుగుతున్న కొద్దీ ఆ బాలునిలోని సంస్కారాలు, దేశ ప్రేమ పొటమరించసాగాయి.

12 ఏళ్ల బాల్యంలోనే తండ్రిని కోల్పోయాడు, ప్రాథమిక విద్య అదే గ్రామంలో అభ్యసించి, బెంగళూరులో హైస్కూలు చదువు పూర్తి చేశాడు. మద్రాసు యూనివర్సిటీ పరిధిలోని సెంట్రల్ కాలేజి, బెంగళూరులో బి.ఏ.వరకు చదివాడు. ఆ తరువాత ప్రఖ్యాతిగాంచిన కాలేజ్ ఆఫ్ పూణేలో ఇంజనీరింగ్ చదివాడు. తొలుత ముంబైలోని ఇరిగేషన్ కమీషన్లో పనిచేస్తూ, డకను ప్రాంతంలో నీటిపారుదల వ్యవస్థను నిర్మాణం చేశాడు. తమంతట తాముగా తెరుచుకుని మూసుకుపోయే ఫ్లడ్గేట్ల నిర్మాణం ఫణీకు దగ్గరలోని ఖడ్క వాస్లా రిజర్వాయర్లో 1903లో నిర్మాణం చేశాడు. అటువంటి నిర్మాణాలనే గ్వాలియర్లోని తిగ్రాడ్యామ్లోనూ, కర్నాటకరాష్ట్రం మాండ్యాలోని కృష్ణరాజసాగర్ డ్యామ్లోను చేసి విశ్వప్రసిద్ధి పొందాడు.

మంచి నీటి సరఫరా, మురికి నీటి కాలువల తీరు తెన్నులను అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఆయనను 1906-07లలో ఏడెన్ పంపింది. ఆయన రూపొందించిన పథకాన్నే ఏడెన్ ప్రభుత్వం అమలుచేసింది. అంతేకాకుండా హైదరాబాదు నగరం కోసం వరద నివారణ పథకాన్ని తయారుచేశాడు. సముద్ర జలాల కోతకు గురికాకుండా విశాఖపట్నం ఓడరేవును సుదృఢం చేయడంలో కార్యదక్షతను చూపించాడు. బీహార్లో గంగానదిమీద మోకామ బ్రిడ్జిని నిర్మించారు. ఇలా చెప్పుకుంటూపోతే అది ఒక గ్రంథమే అవుతుంది, 1912 నుంచి 1916 వరకు విశ్వేశ్వరయ్య మైసూరు రాజా వారి కొలువులో దివానుగా పనిచేశాడు.

ఆయన నిజాయితీకి సంబంధించిన ఒక సంఘటన….. విశ్వేశ్వరయ్య ఒకనాటి రాత్రి తన ఇంటిలో లాంతరు ముందు కూర్చుని ఏదో వ్రాసుకుంటున్నాడు. ఇంతలో ఒక మిత్రుడు వచ్చాడు. విశ్వేశ్వరయ్య ఆ లాంతరును ఆర్పేసి ఒక దీపపు బుడ్డిని వెలిగించాడు. “అలా ఎందుకు చేశావు. ఇప్పుడంత వెలుతురు లేదే” అన్నాడా మిత్రుడు, “అది రాజావారి సొమ్ముతో కొన్న కిరసనాయిల్, ఈ బుడ్డీలోనిది నా స్వంతం, నేను దివాణం పని అయితేనే లాంతరు వాడుతాను” అన్నాడు విశ్వేశ్వరయ్య. బ్రిటీషు ప్రభుత్వం నైట్ కాట్రేడ్ ఆఫ్ బ్రిటిష్ ఇండియన్ ఎంపైర్ అను బిరుదు ప్రదానం చేసింది.

1955లో భారత ప్రభుత్వం ఆయనకు భారతరత్న అన్న సర్వోచ్చ బిరుదును ఇచ్చి సత్కరించింది. ఆయనను ఆధునిక మైసూరు రాష్ట్రపు తండ్రిగా ప్రజలు అభిమానించేవారు. ఆయనను ముప్పై సంవత్సరాల వయస్సులో ఆంగ్లేయ ప్రభుత్వం ‘సర్’ బిరుదుతో సత్కరించింది. అంతటి ప్రతిభా వ్యుత్పత్తులు గల భారతమాత ముద్దుబిడ్డ, శతాధిక వత్సరాలు జీవించి భారతమాతకు నిస్వార్ధంగా సేవలు చేసి, ఆ తల్లి చరణాల చెంత 1962 ఏప్రిల్ 12వ తేదీన ఆఖరి శ్వాసను వదిలాడు. విశ్వేశ్వరయ్య జ్ఞాపకార్థం ప్రతి ఏటా ఆయన జన్మదినం (15 సెప్టెంబర్ )ను ఇంజనీర్ల దినంగా జరుపుకుంటారు.

– రాజశేఖర్ నన్నపనేని.
_విశ్వ సంవాద కేంద్రము

Wednesday, July 8, 2020

ఆర్యభట - Aryabhata


ఆర్యభట - Aryabhata
ర్యభట ప్రాచీన భారతదేశ అత్యున్నత గణిత, ఖగోళ శాస్త్రవేత్తలలో అగ్రగణ్యుడు. ఆర్యభట్టు కుసుమపురము (ఈనాటి పాట్నా) లో నివసించాడు. ఇతను ఆర్యభట్టీయం, ఆర్య సిధ్ధాంతం, సూర్య సిద్ధాంతం, గోళాధ్యాయం, సంస్కృత గణిత సంఖ్యా శాస్త్రాన్ని రచించాడు. ఇవే కాక ఆర్యభట్టు పై విలువను సుమారుగా కనుక్కున్నట్లు చెప్తారు. ఆధునిక గణితంలోని సైన్, కొసైన్ లను ఇతను "జ్యా" ,"కొ జ్యా"గా నిర్వచించాడు. భారతదేశపు తొలి కృత్రిమ ఉపగ్రహానికి ఇతని పేరు (ఆర్యభట్ట) పెట్టారు.

ప్రపంచ వ్యాప్తంగా ఆధునిక శాస్త్రజ్ఞులంతా ఆర్యభట్టు ఖగోళ శాస్త్రానికి, గణిత శాస్త్రానికి చేసిన సేవలు ఎనలేనివని గుర్తించారు. గ్రీకులు ఆయన్ను ఆర్డువేరియస్ అనీ, అరబ్బులు అర్జావస్ అనీ వ్యవహరించే వారు. ఒకానొక కాలంలో ఆయన సిద్ధాంతాల గురించి భారతీయ పండితులు విరివిగా చర్చించుకొనే వారు. సుమారు వేయి సంవత్సరాల క్రితం భారత్ ను సందర్శించిన అల్-బెరూనీ అనే అరబ్బు పండితుడు ఆయన రచనల్లో ఆర్యభట్టు గురించి ప్రస్తావించాడు. ఆ రచనల్లో ఒక చోట "కుసుమపురానికి చెందిన ఆర్యభట్టు తన పుస్తకంలో మేరు పర్వతం హిమాలయాల్లో సుమారు యోజనం ఎత్తున ఉందని ప్రతిపాదించాడు" అని రాశాడు. దీన్ని బట్టి ఆర్యభట్ట అతను సూత్రీకరించిన కొన్ని సమీకరణాల సాయంతో పర్వతాల ఎత్తును కొలిచాడని అర్థమవుతుంది.
జననం:
ఆయన జన్మస్థలం పూర్వం పాటలీపుత్రంగా పిలవబడిన పాట్నాకు సమీపంలో ఉన్న కుసుమపురం. కొద్ది మంది ఆయన్ను విక్రమాదిత్యుని ఆస్థానంలో పనిచేసిన ప్రముఖ ఖగోళ శాస్త్రజ్ఞుడు, గణిత శాస్త్రవేత్త అయిన వరాహ మిహురుడికి సమకాలికుడిలా భావిస్తున్నారు. విక్రమాదిత్యుడు పండితులను బాగా ఆదరించేవాడు. ఆయన ఆస్థానంలో నవరత్నాలు అనబడే తొమ్మిది మంది కవులుండే వాళ్ళు. వాళ్ళలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కాళిదాసు కూడా ఒకడు. ఆర్యభట్టు ఈ తొమ్మిది మందిలో లేకుండా ఉన్నాడంటే ఆయన ఆలోచనలను ఆయన సమకాలికులు అంతగా పట్టించుకునే వారు కాదని తెలుస్తోంది. వరాహమిహిరుడి ఆలోచనలు కూడా కొన్ని ఆర్యభట్టు ఆలోచనలతో విరుద్ధంగా ఉన్నాయి. కానీ ఆయన ఈ నవరత్నాలు ప్రాచుర్యంలోకి రాకమునుపే జీవించి ఉంటాడనీ, లేకపోతే అతడు తక్కువ సమయంలో అంత ప్రాముఖ్యత సంపాదించుకొనే వాడు కాదనీ కొంత మంది భావన. అతని పుస్తకం ఆర్యభట్టీయం కూడా 23 ఏళ్ళ వయసులో వ్రాసి ఉన్నట్లుగా భావిస్తున్నారు. కలియుగం 3600 వ సంవత్సరం నాటికి (అంటే సా.శ. 499) తన వయసు 23 సంవత్సరాలను అతడు ఆర్యభట్టీయంలో రాసాడు.

ఆర్యభట్టుడు అతని గ్రంథాలలో శాలివాహన శకాన్నిగానీ, విక్రమాదిత్య శకాన్నిగాని ఉపయోగించలేదు. యుధిష్టర యుగాన్నే (కలియుగం) చెప్పేడు. అందువల్ల ఈయన యుధిష్టర యుగం వాడుకలో ఉండేటప్పుడే జన్మించి వుంటాడు. వరాహమిహిరుడు తనగ్రంధాల్లో శకభూపాలకాలమని, శకేంద్రకాలమని ఉపయోగించాడు. ఇదే విక్రమాదిత్యకాలమని భట్టోత్పలు డన్నాడు. భాస్కరుడు కూడా తన సిద్ధాంత గ్రంథాల్లో శాకనృప సమయమని ఉపయోగించాడు. ఇదే శాలివాహన శకమని కొందరు పెద్దలు చెబుతారు. ఈ రెండు శకాలు వాడుక లోనికి ఎప్పుడు వచ్చాయో అన్న విషయం చెప్పడం కష్టం. కాని ఇవి రెండూ వాడుక లోనికి రాక పూర్వమే ఆర్యభట్టుడు జన్మించాడు. ఆర్యభట్టుడు బ్రహ్మగుప్తుడికి పూర్వుడు. అనేక వందలసార్లు బ్రహ్మగుప్తుడు ఆర్యభట్టు నామాన్ని ఉదహరించాడు. వరాహమిహిరుని కన్నా పూర్వుడని అనేక ఆధారాలు ఉన్నాయి. ఎందుచేతనంటే, వరాహమిహిరుని గ్రంథాలు శ్రీసేనుడి రోమక సిద్ధాంతం మీదా, విష్ణుచంద్రుడి వశిష్ట సిద్ధాంతం మీదా అధారపడి ఉన్నాయి. ఈ రెండు సిద్ధాంతాలు ఆర్యభట్టుని సిద్ధాంతాలను ఆధారంగా చేసుకొని వ్రాయబడినవని బ్రహ్మగుప్తుదు సూచించాడు. కాబట్టి ఆర్యభట్టుడు బ్రహ్మగుప్తుడికి, వరాహమిహిరునికి పూర్వుడన్నమాటను నమ్మవచ్చు. బ్రహ్మగుప్తుడు శాలివాహన శకంలో ఆరవ శతాబ్దానికి చెందినవాడు.

వరాహమిహిరులు ఇద్దరున్నారు. రెండవ శతాబ్దంలో ఒకడు, ఐదవ శతాబ్దంలో ఒకడు. ఈ రెండవ వరాహమిహిరునికి పూర్వులైన విష్ణుచంద్ర శ్రీసేన దుర్గసింహులకు కూడా ఆర్యభట్టుడు పూర్వుడు. ఈ విషయాలన్నీ పరిశీలిస్తే, ఆర్యభట్టుడు నిస్సందేహంగా శాలివాహనశకం ఐదవ శతాబ్దానికి కొన్ని సంవత్సరాలు ముందుగానే ఉన్నాడని నిర్ధారణకు రావచ్చును. ఇంకా సూక్ష్మంగా చర్చిస్తే ఆర్యభట్టుడు క్రీ.శ.426లో జన్మించాడని, ఆర్యభట్టీయమనే గ్రంథాన్ని క్రీ.శ.499లో వ్రాసాడని చెప్పవచ్చును.

దశ గీతిక:
ఆర్యభట్టుడు ఎప్పుడూ కూడా ఆకాశంవైపు చూస్తూ కంటికి కనబడ్డవాటికి, అప్పటికి ఉన్నట్టి సిద్ధాంతాల వలన ఫలితాలకూ గల వ్యత్యాసాన్ని గుర్తించి, చాలా విచారించి దేవుని గూర్చి తపస్సు చేసేడట. దాని ఫలితమే దశ గీతిక అనే చిన్న గ్రంథం. ఈయన రచించిన ఆర్యభట్టీయమనే గ్రంథంలోని భాగాలు రెండు -దశగీతిక, ఆర్యాష్టోత్తరశతకము. ఈ దశగీతికలో పదమూడు శ్లోకాలున్నాయి. ఇవన్నీ వ్యాకరణ సూత్రాల్ని పాటించకుండా వ్రాయబడ్డవి. ఈ గ్రంథంలో చిన్నచిన్న సూత్రాల్లో గూఢంగా అనంతమైన శాస్త్రజ్ఞానాన్ని ఇమిడ్చి పెట్టాడు. గణితపాదం, కాలక్రియపాదం, గోళార్ధ ప్రకాశిక అనే మూడూ ఆర్యాష్టోత్తరశతకంలో ప్రకరణాలు. ఆర్యభట్టుని గ్రంథాలకు వ్యాఖ్యానకారులు చాలామంది ఉన్నారు. వారిలో ముఖ్యులు దశకగీతిప్రకాశిక వ్రాసిన సూర్యదేవదీక్షితుడు, కేరళకు చెందిన నీలకంఠ సోమయాజి.

రచనలు
ఆర్యభట్ట ఖగోళ శాస్త్రం, గణిత శాస్త్రంలో అనేక రచనలు చేశాడు. ప్రస్తుతం వాటిలో కొన్ని అలభ్యం. అతని ముఖ్యమైన రచన ఆర్యభట్టీయం గణిత, ఖగోళ శాస్త్రాల సంగ్రహము. భారతీయ గణిత రచనల్లో దీని గురించి విస్తారంగా ప్రస్తావించడమే కాకుండా ఈ రచన కాలపరీక్షకు తట్టుకుని నిలబడగలిగింది. ఆయన శిష్యుడైన భాస్కరుడు దాన్ని అష్మకతాంత్ర అని పిలిచే వాడు. ఆర్యశతాష్ట (108 శ్లోకాలు కలిగినది అని అర్థం)అని కూడా వ్యవహరించబడేది.
 • 1. గీతికాపాద
 • 2. గణితపాద
 • 3. కళాక్రియపాద
 • 4. గోళపాద
ఈ ఆర్యభట్టీయం అనే రచనకు ఆయన స్వయంగా పేరేమీ పెట్టలేదు. ఇది తరువాత భాష్యకారులు చేసిన పదప్రయోగమే. అత్యంత క్లుప్తంగా రాసిన ఈ గ్రంథానికి ఆయన శిష్యుడైన భాస్కరుడు అనేక భాష్యాలు రాసి విస్తరించాడు.

గణిత శాస్త్రం:
'పై' విలువ కచ్చితంగా 3.1416 అని ప్రకటించారు.

క్షేత్రగణితం, త్రికోణమితి:
ఆరవ గణిత పాదంలో త్రిభుజం యొక్క వైశాల్యాన్ని ఆర్యభట్ట ఈ విధంగా వివరించాడు.

"త్రిభుజస్య ఫాలాశరీరం సమదలకోటి భుజార్ధ సంవర్గం"
దీని అర్థం త్రిభుజం యొక్క వైశాల్యం దాని భూమి, ఎత్తుల లబ్దంలో అర్ధ భాగానికి సమానం.

బీజ గణితం:
ఆర్యభట్టీయంలోనే శ్రేణుల మొత్తాన్ని గణించడానికి ఈ క్రింది సూత్రాలు ప్రవేశ పెట్టాడు.
ఖగోళ శాస్త్రం:
భూమి నీడ చంద్రుని మీద పడడం వల్లే గ్రహణాలు వస్తాయని వాదించాడు. కానీ అతని వాదనను అప్పట్లో ఎవరూ నమ్మలేదు. ఆర్య భట్ట బోధనలు గ్రీకు శాస్త్రవేత్తలను కూడా ప్రభావితం చేసాయి. భూమి నీడ చంద్రుని మీద గోళాకారం (elliptical shape) లో పడుతుంది కనుక భూమి గుండ్రంగా ఉన్నట్టు గ్రీకు శాస్త్రవేత్తలు కనిపెట్టింది ఆర్యభట్ట సిధ్ధంతాల ఆధారంగానే. కానీ అప్పట్లో ఈ సిధ్ధాంతాలని నమ్మేంత జ్ఞానం ప్రజలలో వృధ్ధి చెందలేదు.

ప్రపంచంలో చాలా మంది ప్రముఖ గణిత శాస్త్రవేత్తల కష్టాలకు కారణమైన భూమి యొక్క ఆకారాన్ని గోళాకారంగా ఆనాడే తన గోళాధ్యాయంలో నిర్వచించాడు. అంతేకాదు మన గ్రహాల యొక్క ప్రకాశం స్వయంప్రకాశం కానే కాదని, అది కేవలం సూర్యకాంతి పరివర్తన వలన వచ్చినదని చెప్పాడు. సూర్య గ్రహణాలను కచ్చితంగా లెక్క కట్టాడు.
భూమి తన చుట్టూ తాను తిరగటానికి (భూభ్రమణం) పట్టే సమయం 23 గంటల, 56 నిమిషాల, 4.1 సెకనులుగా లెక్కగట్టాడు. ఈనాటి ఆధునిక లెక్కల ప్రకారం అది 23 గంటల, 56 నిమిషాల, 4.091 సెకనులుగా తేలింది. భారతదేశపు తొలి కృత్రిమ ఉపగ్రహానికి ఇతని పేరే పెట్టారు.
ఆర్యభట్టు యొక్క జన్మ సంవత్సరం ఆర్యభట్టీయంలో స్పష్టంగా ఉదహరించబడింది కానీ ఈయన పుట్టిన ప్రదేశం యొక్క ఉనికి గురించి మాత్రం పండితులలో ఏకాభిప్రాయం లేదు. కొంతమంది పండితులు ఆర్యభట్టు నర్మద, గోదావరి మధ్య ప్రాంతమైన అశ్మకలో పుట్టాడని నమ్ముతారు. వీరి దృష్టిలో అశ్మక మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లో భాగమైన మధ్య భారతదేశం. తొలి బౌద్ధ గ్రంథాలు అశ్మక మరింత దక్షిణాన ఉన్న దక్కన్ ప్రాంతమని వర్ణిస్తున్నాయి. అయితే ఇతర గ్రంథాలు అశ్మక ప్రజలు అలెగ్జాండర్ పై పోరాడారని ప్రస్తావిస్తున్నవి. అదే నిజమైతే అశ్మక మరింత ఉత్తరాన ఉండి ఉండాలి.

ఆర్యభట్టుడు భూగోళః సర్వతోవృత్తః అని వ్రాసాడు. భూగోళ మనే మాటలో ఇమిడి ఉంది, భూమియొక్క వర్తులత్వం (Sphericity). భూమి నక్షత్రగోళానికి మధ్యగా నిరాధారంగా ఉందని చెప్పాడు. ఆర్యభట్టుడు భూభ్రమణం, భూమి తనచుట్టూ తాను తిరుగుతూ సూర్యునిచుట్టూ తిరుగుతోందని ఈ క్రింద శ్లోకంలో చెప్పాడు.
" భప్ంజరః స్థిరో భూరేవావృత్యావృత్య ప్రాతిదైశికా ఉదయాస్తమయో సంపాదయతి నక్షత్రగ్రహణాం"
నక్షత్రగోళం స్థిరంగా ఉంది. ఈ భూమే తిరుగుతూ నక్షత్రాల యొక్క, గ్రహాల యొక్క ఉదయాస్తమయాల్ని కలగజేస్తోంది అని దీని అర్థం. కాని ఈ సిద్ధాంతం అప్పటి ప్రజాభిప్రాయానికి, ప్రాచీన సిద్దంతాలకూ వ్యతిరేకంగా ఉండడం చేత భయపడో, లేక ఊరికే గణితానికి అనుకూలంగా ఉండే కొరకో, ఎందుకోగానీ వెంటనే మళ్ళీ భూమి తిరక్కుండా మధ్యనుందనీ, నక్షత్రాలూ, గ్రహాలూ భూమిచుట్టూ తిరుగుతున్నాయనీ వ్రాసాడు. ఆర్యభట్టుని భూభ్రమణ సిద్ధాంతం ఆ రోజుల్లోనే బ్రహ్మగుప్తునిచే ఆక్షేపింపబడింది.
"ప్రాణేనైతి కలాం భూర్యదితత్కుతో వ్రజేత్కనుధ్వానుం, ఆవర్తన మర్వాక్చే న్నపతంతి సముచ్ఛ్హాయాః కస్మాత్"
భూమి ఒకప్రాణంలో ఒకకల కనక కదలినట్లైతే, ఎక్కడికి వెళుతోంది? అది తిరుగుతోంటే ఎత్తైన వస్తువులు పడిపోవెందుచేత? అని అతడు ప్రశ్నించాడు. కానీ దీనిని బ్రహ్మగుప్తుని భాష్యకారుడగు ప్రీతూదకస్వామి ఖండిస్తూ, ఆర్యభట్టుని సూత్రాన్నే సమర్ధించాడు. కాబట్టి భూభ్రమణం తెలిసినవారూ, ఒప్పుకున్నవారూ కూడా ప్రాచీన భారతీయుల్లో ఉన్నారు అని తెలుస్తోంది.

భూమి మొదలగు గ్రహాలయొక్క చలన కక్ష్య, పూర్తి వృత్తాకారంలో లేదని, దీర్ఘవృత్తంగా (elliptical) ఉందనీ తెలియజేసిన వారిలో మొదటి వాడు ఆర్యభట్టుడే. సూర్యచంద్ర గ్రహణాలకి కారణంగా చెప్పబడే రాహుకేతువుల్ని ఆర్యభట్టుడు ఒప్పుకోలేదు చంద్రుడు భూఛాయ లోనికి వెళ్ళినప్పుడే చంద్రగ్రహణం కలుగుతోంది అన్న విషయాన్ని తెలియపరిచాడు. ఇదీకాక, ఈ చంద్రుడు మొదలయిన గ్రహాలు స్వయంప్రకాశములు కావనీ, సూర్యకాంతి వల్లనే ప్రకాశిస్తున్నాయని చెప్పినవాడు కూడా ఆర్యభట్టుడే. కాని నక్షత్రాలని కూడా వాటితో చేర్చాడు.

భూమికి ఆకర్షణశక్తి కలదని, అన్ని మాటల్లో చెప్పకపోయినా, అతని కావిషయం తెలుస్తున్నట్లుగా రెండుమూడు చోట్ల, ఆ శక్తిని గురించి ఆతడు చేసిన సూచనల వల్లన ఊహించవచ్చునని కొందరంటారు. భాస్కరుడు మాత్రం ఆకర్షణశక్తి అనే పదాన్ని వాడాడు.

భూమి చుట్టుకొలత, వ్యాసమూ మొదలైనవి, ఆర్యభట్టుడు ఇచ్చిన కొలతలు, ఆధునిక శాస్త్రవేత్తల కొలతలకు దగ్గరగా ఉన్నాయి.

ఆర్యభట్టుడు చెప్పిన సంపాతము (precession of the equinoxes) అనే విషయం, జ్యోతిశ్శాస్త్రజ్ఞల్లో శిరోమణిగా పూజింపబడ తగిన గౌరవాన్ని ఇస్తుంది.

వారసత్వం
ఆర్యభట్టు రచనలు భారతదేశపు ఖగోళ శాస్త్రాన్ని విశేషంగా ప్రభావితం చేశాయి. అనువాద రచనల ద్వారా పక్క దేశాల సంస్కృతిని కూడా ప్రభావితం చేశాయి. ఇస్లామిక్ స్వర్ణ యుగంలో ఈ రచనలకు అరబ్బీ అనువాదాలు వెలువడ్డాయి. అల్-ఖోవారిజ్మి, అల్-బెరూని తమ రచనల్లో ఆర్యభట్ట రచనల గురించి ప్రస్తావించారు. ఈతని కుమారుని పేరు దేవరాజు.

మూలము: Heidi Roupp (1997)

Saturday, May 23, 2020

ఐన్ స్టీన్ సాపేక్షతా సిద్ధాంతం - హైందవ దృక్కోణం - Einstein's theory of relativity and the Vedic viewpoint


ఐన్ స్టీన్ సిద్ధాంతం - హైందవ దృక్పథం

1915 లో ఐన్ స్టీన్ ప్రతిపాదించిన “సాధారణ సాపేక్షతా సిద్ధాంతం” శాస్త్రీయ ప్రపంచంలో విప్లవాత్మకమైనది. ఈ సిద్ధాంతం - శున్యాకాశము, కాలము, గురుత్వాకర్షణ వంటి అంశాలపై అప్పటిదాకా ఉన్న శాస్త్రీయ అవగాహనను విప్లవాత్మకంగా మార్చివేసింది. అప్పటికి దాదాపు రెండు శతాబ్దాల పాటు భౌతిక శాస్త్రానికి, ఖగోళ శాస్త్రానికి ఆధారంగా ఉన్న న్యూటన్ ప్రతిపాదించిన “యాంత్రిక జగద్భావం” అన్న భావనను ఐన్ స్టీన్ సిద్ధాంతం పూర్తిగా తుడిచి పెట్టింది.

దీనికి ముందు 1905 లో ఐన్ స్టీన్ ప్రతిపాదించిన ‘ప్రత్యేక సాపేక్షతా సిద్ధాంతం’ లోని ముఖ్యాంశాలు :
 • ➣ కాంతి కంటే వేగంగా ఏదీ ప్రయాణించలేదు. వివిధ పరిశీలకుల వేగాలతో సంబంధం లేకుండా కాంతి వేగం ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది.
 • ➣ ఏ వస్తువు నిశ్చలంగా ఉందో, ఏ వస్తువు కదులుతోందో చెప్పడం వీలు కాదు. అంతా సాపేక్షమే.
 • ➣ మన ప్రయాణ వేగానికి సాపేక్షంగా కాలం ఉంటుంది. మనం ఎంత వేగంగా ప్రయాణీస్తామో కాలం అంత తక్కువగా కదులుతుంది. కాంతి వేగంతో ప్రయాణిస్తే కాలం కదలక నిలిచి పోతుంది.
ఐన్ స్టీన్ “ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతం” సమాన వేగంతో ఒకే దిశలో ప్రయాణించే రెండు వస్తువులకే వర్తిస్తుంది. అన్ని రకాల వస్తువులకు, అన్ని రకాల పరిస్థితులలో వర్తించే విధంగా ఐన్ స్టీన్ 1915 లో తాను ప్రతిపాదించిన ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతాన్ని విస్తరించి “సామాన్య/సాధారణ సాపేక్ష సిద్ధాంతాన్ని” ప్రతిపాదించాడు.
 ‘దేశ కాలాలు’ (Space – time)
 ‘దేశ కాలాలు’ (Space – time) 
“సాధారణ సాపేక్ష సిద్ధాంతం” ప్రకారం ‘శూన్యాకాశం’ (Space) అనేది న్యూటన్ చెప్పినట్లు మూడు నిరూపకాలు కలది కాదు. కాలం (Time) అనేది ప్రత్యేకమైన సత్యం కాదు. ‘స్థల కాలాలు’ లేదా ‘దేశ కాలాలు’ (Space – time) కలిసి నాలుగవ నిరూపకం (ఒకే సామూహిక పరంపర) అవుతుంది. అంటే కాలంతో ప్రమేయం లేకుండా స్థాన బేధాన్ని, స్థాన బేధంతో సంబంధం లేకుండా కాలాన్ని గురించి చెప్పలేము. అంటే కాలం స్వత: సిద్ధమైన ప్రకృతి ధర్మం కాదు. ఈ సిద్ధాంతం వల్ల విశ్వమంతా ఒకే రీతిన కొనసాగే కాలమనేది లేనేలేదని తేలింది.

న్యూటన్ ‘యాంత్రిక జగద్భావం’ ప్రకారం మూడు నిరూపకాలతో కూడిన శూన్యకాశము మరియు కాలము అనేవి ఈ జగన్నాటకానికి రంగస్థలం లాంటివి. వివిధ గ్రహాలూ, నక్షత్రాలు, గురుత్వాకర్షణ శక్తి, వివిధ జీవరాశులు  మొదలైనవి ఇందులో పాత్రధారులు.

కానీ ‘సాధారణ సాపేక్షతా సిద్ధాంతం’ ప్రకారం స్థలకాలాలు విడదీయరానివి. ఇవి పదార్థం పై ప్రభావం చూపుతాయి. తిరిగి పదార్థంతో ప్రభావితమవుతాయి. అంటే రంగస్థలం కూడా పాత్రధారులతో కలిసి ఒక పాత్రధారిగా మారింది. ఈ ‘విశ్వ నృత్యం’ (కాస్మిక్ డాన్స్) అనే జగన్నాటకానికి ప్రేక్షకులంటూ ఎవరూ లేరు. అందరూ పాత్రధారులే. గత 30 సంవత్సరాలుగా జరిపిన ఎన్నో శాస్త్రీయ పరీక్షలు ఈ సాపేక్షతా సిద్ధాంతాన్ని నిజమని ఋజువు చేశాయి.

న్యూటన్ కాలాన్ని ఒక నదీ ప్రవాహం గా భావించాడు. అది వింటిని వదిలిన బాణంలాగా గతము నుండి, వర్తమానం గుండా, భవిష్యత్తు వైపుకు అవిచ్ఛిన్నంగా, ఏకరూపంగా ప్రయాణిస్తుందనీ, దాని గతి ఏ కారణంగాను మారదనీ చెప్పాడు.

కానీ, ఐన్ స్టీన్ కాలమనే నదీ ప్రవాహం ఏకరీతిగా సాగదని, గ్రహాలూ, నక్షత్రాలు, గెలాక్సీల వంటి వాటి సమక్షంలో అది వంపు తిరుగుతుందని, వాటి చుట్టూ కాలం వేగంగా సాగడమో లేక నిదానంగా సాగడమో జరుగుతుందని తెలిపాడు. సముద్రంలో ఈదే చేప తన చుట్టు ప్రక్కల ఉన్న నీటిని ఎలా వెనక్కి నెడుతుందో అలాగే ఒక నక్షత్రము లేదా తోకచుక్క లేదా గ్రహము తను ప్రయాణించే అంతరిక్షంలో దాని దిక్కాలాలలో మార్పును తీసుకు వస్తుంది. దిశ: కాలాలు వేర్వేరు కావు. అవి ఒకటి లేకుండా ఒకటి మనలేవు.

వివిధ వేగాలతో ప్రయాణించే వ్యక్తులు ఒకే సంఘటనల పూర్వాపరాలను విభిన్నంగా గుర్తిస్తారు. ఒక పరిశీలకుడిని ఒకే సమయంలో జరిగినట్లుగా కనిపించే రెండు సంఘటనలు వేరొక పరిశీలకునికి వేరొక విధంగా కనిపించవచ్చని ఐన్ స్టీన్ నిరూపించారు.

‘దేశ కాలాలు’ అనేవి ప్రకృతి క్రియలను వర్ణించడానికి ఒక పరిశీలకుడు వాడే భాషలోని అంశాలు మాత్రమే. (ఈ విషయాలను శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు తాను వ్రాసిన "విజ్ఞాన వీచికలు" అనే గ్రంథంలో పొందుపరిచారు.)
Albert Einstein E=MC2
ఐన్ స్టీన్ E=MC2
ఐన్ స్టీన్ తన విశిష్ట సాపేక్షతా సిద్ధాంతంలో పదార్ధాన్ని మరియు శక్తిని ఏకీకృతం చేశాడు. పదార్థం అనేది శక్తిగా మారుతుందని, శక్తి అనేది పదార్థంగా మారుతుందని తన E = mc2 సమీకరణం ద్వారా తెలియజేశాడు. ఇంతకు ముందు పదార్థము, శక్తి వేర్వేరు అని భావించేవారు. “పదార్థము – శక్తి” ని ఒకదాని నుండి మరొకదానిని వేరు చేయలేమని, శక్తి యొక్క అభివ్యక్తీకరణమే పదార్థమని ఐన్ స్టీన్ చెప్పాడు. ద్రవ్యరాశిత్వం కూడా శక్తి యొక్క రూపమేనని, స్థిరంగా ఉన్న వస్తువులోని శక్తి దాని ద్రవ్యరాశి రూపంలో ఉంటుందని, ఆ వస్తువు కాంతి వేగంతో ప్రయాణిస్తే అది ‘కాంతి’ అనే శక్తి రూపం ధరించి, దాని ద్రవ్యరాశిత్వం నశిస్తుందని ఐన్ స్టీన్ తెలిపాడు.

ఈ విధంగా ఐన్ స్టీన్ పదార్థము శక్తి దిక్కులు కాలము లను ఏకీకరణం చేశాడు.
కణాద మహర్షి - Acharya Kanada
కణాద మహర్షి - Acharya Kanada
ప్రాచీన భారతీయ వైజ్ఞానికుడు కణాదుడు తాను వ్రాసిన  “వైశేషిక శాస్త్రం” లో  కాలాన్ని ఒక " ప్రాధమిక " పదార్ధంగా పేర్కొన్నాడు.

అకాశం, కాలం, దిక్ అనేవి అనంతాలు.  వీటికి అంతం లేదు.

దిక్, కాలం - ఈ రెండూ సర్వ వ్యాప్త పదార్ధాలు.

కణాద మహర్షి ఇలా చెప్పాడు :  “ పదార్ధానికి రెండు స్థితులున్నాయి. ఒకటి ‘అణు స్థితి’ అయితే రెండవది ‘మహత్ స్థితి’. మెదటిది సూక్ష్మతమమైనదైతే రెండవ స్థితి అతి విశాలతమ బ్రహ్మాండమంతటిది. ద్రవ్యము (పదార్థము) యొక్క స్థితి ఒకేతీరుగా సమానంగా ఉండదు.

కణాదుని సిద్ధాంతం ప్రకారం ఈ విశ్వం లో ఆరు రకాల ధర్మాలు ఉంటాయి.  అవి ద్రవ్యం(Matter), గుణం(Quality), కర్మ(Action),సామాన్యము(Universal), విశేషము(Special), సమవాయము లేక సామూహికము(Inherence).

ఈ ఆరింటినీ కణాదుడు జ్ఞానవిషయాలుగా చెప్పాడు.

‘పదార్థం’ లేక ‘ద్రవ్యం’ అనేది  తొమ్మిది రకాల అస్తిత్వాలను కలిగి ఉంటుందని కణాదుడు చెప్పాడు. 

అవి : పృథ్వి (ద్రవ్యం యొక్క ఘన రూపం), జలము (ద్రవ రూపం), వాయు (వాయు రూపం), తేజస్సు (శక్తి రూపం), ఆకాశము (ఈథర్), కాలము, దిక్కులు, ఆత్మ మరియు మనస్సు.
కణాదుడు
కణాదుడు
‘తేజస్సు’, అంటే శక్తి అనేది కూడా ద్రవ్యమేనని కణాదుడు చెప్పాడు. “పదార్థము – శక్తి” అనేవి ఒకటే అనే జ్ఞానం 20వ శతాబ్దం లోనే కలిగింది. కానీ ఈ విషయాన్ని కణాదుడు సుమారు 2,600 సంవత్సరాలకు పూర్వమే చెప్పాడు. అంతే కాక దిక్కులు, కాలాలు కూడా ద్రవ్యాలేనని కణాద మహర్షి చెప్పాడు. పాశ్చాత్య ప్రపంచంలో ఐన్ స్టీన్ సాపేక్షతా సిద్ధాంతం తర్వాతనే ఈ పరిజ్ఞానం ప్రచారంలోకి వచ్చింది.

కణాద మహర్షి అభిప్రాయం ప్రకారం మనస్సు, ఆత్మ కూడా ద్రవ్యాలే. అయితే దీనిని నిరూపించే పరిజ్ఞానం ఇప్పటి ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో లేదు.
శివతాండవం - Shivatandavam
శివతాండవం - Shivatandavam 
శివతాండవం:
భాగవతం ప్రకారం పదార్థమనేది రెండు స్థితులలో ఉంటుంది : ఒకటి వ్యక్త స్థితి. రెండవది అవ్యక్త స్థితి. పదార్థం వ్యక్త రూపంలోకి మారినప్పుడు ఈ విశ్వం సృష్టి అవుతుంది. ఈ విశ్వం నాశనమైనప్పుడు పదార్థం తిరిగి అవ్యక్త స్థితిలోకి వెళ్తుంది.

సర్వ ప్రాణుల, జడ పదార్థాల జనన మరణాలు, సృష్టిలయాలకు సంకేతంగా ఉన్న 'శివతాండవం' లో ఐన్ స్టీన్ యొక్క పదార్థము - శక్తి యొక్క సమత్వభావన కనబడుతుంది. 
 • 🝒 శివుడు తన శక్తి నృత్యం ద్వారా జడమైన ప్రకృతిని మేల్కొలిపేలా శబ్దం (డమరుక ధ్వనిగా సూచితం) చేస్తాడు. 
 • 🝒 ఇలా తన నృత్యం ద్వారా పదార్థ రూపంలో వివిధ ప్రకృతి క్రియలను కొనసాగిస్తాడు.
 • 🝒 కాలాంతరంలో ఆయన తన నృత్యం ద్వారానే నామరూపాలనింటినీ నశింపజేసి, ప్రకృతికి విశ్రాంతినిస్తాడు.
 • 🝒 బ్రహ్మకు రాత్రి అయి నిద్రలోకి వెళ్ళినపుడు శివుడు రుద్ర తాండవం మొదలుపెడతాడు.  
 • 🝒 అప్పుడు ఈ విశ్వం నాశనమై, కుంచించుకు పోయి, శూన్య స్థితికి చేరుతుంది. 
 • 🝒 బ్రహ్మకు పగలు అయి, మేలుకున్నప్పుడు శివుడు ఆనంద తాండవం మొదలుపెడతాడు. అప్పుడు బ్రహ్మ సృష్టిని ప్రారంభిస్తాడు.
 • 🝒 సృష్టి అయిన దానిని ధ్వంసం చేయాలని ప్రయత్నిస్తే అందులో నుండి అఖండమైన శక్తి వెలువడుతుంది. 
 • 🝒 ఈ భావన శివుడి రుద్రతాండవంలో కనబడుతుంది. 
 • 🝒 ఈ విధంగా పదార్థము - శక్తి ఒకదానిలోకి ఒకటి రూపాంతరం చెందుతాయన్న విషయాన్ని శివతాండవం తెలియజేస్తోంది.
“ఇండియా : లివింగ్ విస్ డమ్ సిరీస్” అనే గ్రంథంలో రిచర్డ్ వాటర్ స్టోన్ ఇలా అంటారు : “నటరాజు యొక్క శక్తివంతమైన భంగిమలో సృష్టి లయలనబడే  అంతులేని గతిశీల ప్రక్రియ ప్రకటితమవుతోంది. శివ తాండవం వ్యక్త పరుస్తున్న ‘పదార్థము - శక్తి యొక్క సమత్వాని’కీ, ‘ఒక ఉపపరమాణు కణంలో నిబిడీకృతమై ఉన్న శక్తి దానియొక్క  ద్రవ్యరాశి మరియు కాంతివేగం యొక్క లబ్దం తో సమానమని’  చెప్పిన ఐన్ స్టీన్ సమీకరణానికి (E=mc2) ఆశ్చర్యకరమైన పోలికలున్నాయి.”

“క్రీ.ఫూ. 700 కి పూర్వమే హిందూ ఋషులు ‘నేతి, నేతి’ (ఇది కాదు, ఇది కాదు) అని ఉచ్ఛరిస్తూ బాహ్య ప్రపంచం యొక్క అంతిమ వాస్తవికతను మిథ్య గా తెలుసుకున్నారు. దానికి బదులుగా వారు అన్ని జీవుల్లోనూ ఉన్న ఆత్మరూపంలోని  బ్రహ్మము యొక్క శాశ్వతమైన తేజ: కణము కోసం అన్వేషించారు.”
పరాశక్తి - Parashakti
పరాశక్తి - Parashakti 
“ట్రావెల్స్ త్రూ సేక్రెడ్ ఇండియా” అనే గ్రంథంలో రోజెర్ హౌస్డెన్ ఇలా అంటారు : “ ఉదాహరణకు కాలం అనేది కాళికాదేవితో అన్యోన్య సంబంధం కలిగి ఉంది. ఆమె యొక్క సంహారకారక స్వభావంలో కొంతవరకు అది కనిపిస్తుంది. ఐన్ స్టీన్ సమీకరణంలోని ‘శక్తి’ (E) అనేది భారతదేశంలో ‘పరాశక్తి’ యొక్క అనేక రూపాలలో ప్రకటమవుతోంది.”

సంకలనం: మణికుమార్ వేమూరి
రచన: శ్రీ ఎ భరద్వాజ

Wednesday, May 20, 2020

వరాహమిహిరుడు, అత్యంత ప్రాచీన ఖగోళ శాస్త్రవేత్త - Varahamihirudu, Ancient astronomer, Khagola Sastravetta


వరాహమిహిరుడు, అత్యంత ప్రాచీన ఖగోళ శాస్త్రవేత్త - Varahamihirudu, the most ancient astronomer, Khagola Sastravetta

వరాహమిహిరుడు

ప్రాచీన భారతదేశపు అత్యంత ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్తలలో వరాహమిహిరుడు గణనీయుడు. ఈయన క్రీ.శ. 6వ శతాబ్దానికి  చెందిన వాడు. ఈయన ప్రముఖ గ్రంధం పంచసిధ్ధాంతిక 505వ సంవత్సరంప్రాంతంలో వ్రాయబడింది. పంచసిధ్ధాంతికలో క్రీ.శ. 499లో రచించబడిన ఆర్యభట్టీయాన్నివరాహమిహిరుడు  ప్రస్తావించాడు. బ్రహ్మగుప్తుడి బ్రహ్మస్ఫుట సిధ్ధాంతవ్యాఖ్యలో నవాధికపంచాసంఖ్యా శకే వరాహమిహిరాచార్యో దివంగతః అని ఉంది.   దీనిని బట్టి, ఈయన 587వ సంవత్సరంలో నిర్యాణం చెందినట్లు తెలుస్తోంది. 

వరాహమిహిరుడి బృహజ్జాతకంలో చివరన:
   ఆదిత్యదాస తనయా స్తదవాప్తబోధః
   కాపిథ్థకాః  సవితృలబ్ధవరప్రసాదః
   అవన్తికోమునిమతానై వలోక్య సమ్యక్
   హోరం వరాహమిహిరో రుచిరంకార

అని ఉండటాన్ని బట్టి వరాహమిహురుడి తండ్రి పేరు ఆదిత్యదాసుడని, ఇతను సూర్య వరప్రసాదంగా జన్మించాడనీ అనీ  తెలియ వస్తోంది.  ఆయన స్వగ్రామం కాపిథ్థకం ఉత్తరప్రదేశ్ లోని సంకాశ్యం. తరువాతి కాలంలో ఈయన అవంతి (ఉజ్జయిని)లో నివసించాడు.   మిహిర శబ్దానికి సూర్యుడని అర్థం. తదవాప్తబోధః అనటాన్ని బట్టి  వరాహమిహురుడు  తండ్రి వద్దే విద్యాభ్యాసం చేసాడని కూడా  తెలుస్తోంది.
 • ➣ వరాహమిహిరుడు విక్రమార్కుడి నవరత్నాలలో ఒకడని ప్రచారంలో ఉంది గాని  అది అంత నమ్మదగ్గ విషయం కాదు.
 • ➣ వరాహమిహిరుడు ఖగోళ శాస్త్రంలోనూ, జ్యోతిషంలోనూ ఉద్దండపండితుడు.  స్కందత్రయ జ్యోతిష విభాగాల్లోనూ విస్తారంగా రచనలు చేసాడు.   అవన్నీ చాలా పెద్దపెద్ద గ్రంధాలు కావటంతో, అంత పెద్ద వాటిని అవలోఢనం చేయలేని అశక్తుల కోసం వాటికి లఘు గ్రంధాలు కూడా తానే స్వయంగా విరచించాడు.
 • ➣ సిధ్ధాంత గణితంలో పెద్దగ్రంధమైన పంచసిధ్ధాంతిక 18 ఆధ్యాయాలు కలిగి ఉంది.  జాతకపధ్ధతికి సంబంధించిన ఆయన గ్రంధం బృహజ్జాతకంలో 26 ఆధ్యాయాలున్నాయి.  ముహూర్తాది అనేక విషయాలుకల బృహత్సంహితలో యేకంగా 106 ఆధ్యాయాలున్నాయి.
 • ➣ యుధ్ధవిషయకమైన జ్యోతిషవిభాగంలో వరాహమిహిరుడు  మహాయాత్ర(భద్రయాత్ర, బృహద్యోగయాత్ర, యక్షేస్వమేధికయాత్ర అనికూడా దీనికి పేర్లున్నాయి),  స్వల్పయాత్ర,   యోగయాత్ర అని మూడు గ్రంధాలు రచించాడు. 
 • ➣ వివాహ విషయక జ్యోతిషంపైన  వివాహపటలము, స్వల్పవివాహపటలమూ  యీయన రచించాడు.
 • ➣ ఈయన రచనలన్నీ  సుష్టువైన, అందమైన, సరళమైన భాషలో ఉంటాయి.  విషయాన్ని స్పష్టంగా చెప్పటమే కాకుండా చాలా కవితాత్మకంగా వ్రాయటం యీయన ప్రత్యేకత.     ఛందస్సుమీద అఢికారమూ మంచి  సరసత ఉన్నవాడు.  కొన్ని కొన్ని చోట్ల మంచి కవితా ధోరణిలో తాను వ్రాస్తున్న పద్యం యొక్కఛందస్సు పేరును ఆ పద్యంలో ప్రస్తావించాడు కూడా.  కొన్ని చోట్ల దండకాలు వంటివి కూడా వ్రాసాడు.
బృహజ్జాతకానికి వ్యాఖ్యరచించిన ఉత్పలుడు, దాని ప్రారంభంలో వరాహమిహిరుణ్ణి గురించి ఇలా అంటాడు.

యఛ్ఛాస్త్రం సవితా చకార విపులం స్కంధత్రయై ర్జ్యోతిషం
తస్యోఛ్ఛిత్తి  భయాత్ పునః కలియుగే సంస్రజ్య యో భూతలం
భూయాః స్వల్పతరం వరాహమిహిర వ్యాజేన సర్వం వ్యధా
ద్దిష్టం యం ప్రవదన్తి మోక్షకుశలా స్తస్మై నమో భాస్వతే
తంత్ర (గణిత), జాతక, సంహితలనే మూడు స్కందములుగాల జ్యోతిషం  సాక్షాత్తు సూర్యభగవానుడే స్థాపించాడు.  కలియుగంలో అది నాశనమౌతుందని  భయపడి,  సూర్యుడే స్వయంగా వరాహమిహిరాచార్యుడిగా అవతారం ధరించి భూమికి వచ్చి ఆ స్కంధత్రయ జ్యోతిషాన్ని మరలా సులభంగా లఘురూపంలో  మనకు అందించాడు.  ఆసూర్యుడికి మోక్షార్ధులైన వాళ్ళు నమస్కరిస్తున్నారు.  ఇదీ ఆ పై శ్లోకం యొక్క అర్థం.

సంకలనం/రచన: శ్యామలీయం

Monday, April 13, 2020

వేదాంతిగా మారిన క్వాంటం భౌతిక శాస్త్రవేత్త - ఇర్విన్ ష్రోడింగర్ - Vedic influence on Erwin Schrödinger

వేదాంతిగా మారిన క్వాంటం భౌతిక శాస్త్రవేత్త - ఇర్విన్ ష్రోడింగర్ - Vedic influence on Erwin Schrödinger
 వేదాంతిగా మారిన క్వాంటం భౌతిక శాస్త్రవేత్త - ష్రోడింగర్
ఎర్విన్ ష్రోడింగర్ ఆస్ట్రియాకు చెందిన ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త. ఇతడు క్వాంటం తరంగ సిద్ధాంతాన్ని వివరించే క్వాంటం తరంగ సమీకరణాన్ని కనుగొన్నాడు. దీనినే “ష్రోడింగర్ సమీకరణం” అంటారు. ప్రతీ క్వాంటం వ్యవస్థ ఈ సమీకరణాన్ని పాటించాల్సిందే. క్వాంటం ఫిజిక్స్ లోని వేవ్ మెకానిక్స్ పై పరిశోధనలకు గాను ష్రోడింగర్ కు 1933 లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చింది. ఇతడు “క్వాంటం భౌతిక శాస్త్ర పిత” గా పేరుపొందాడు.
 • ۞ క్వాంటం సిద్ధాంతం అనేది భౌతిక శాస్త్రంలో ఒక ముఖ్యమైన ఆవిష్కరణ. ఈ సిద్ధాంతంలోని అంశాల ఆధారం లేకుంటే నేడు సైన్స్ ఇంతగా పురోగమించేది కాదు.
 • ۞ సత్యాన్వేషణలో భాగంగా తాను చేసిన పరిశోధనల పర్యవసానంగా ష్రోడింగర్ ఒక హిందూ వేదాంతిగా మారాడు. అతడు తను పడుకొనే మంచం ప్రక్కనే హిందూ మత గ్రంథాలను ఉంచుకునేవాడు. అతనికి ఎంతో ఇష్టమైన గ్రంథాలు ఉపనిషత్తులు మరియు భగవద్గీత.
 • ۞ ష్రోడింగెర్ చాలా చిత్రమైన మనిషి. అతడు తన పెంపుడు కుక్క కు ‘ఆత్మ’ అని పేరు పెట్టాడు. బహుశా సర్వజీవుల్లోనూ ఉన్న ఆత్మ యొక్క ఏకత్వానికి గుర్తుగా అతడు అలా పేరు పెట్టి ఉండవచ్చు.
ష్రోడింగర్ తన క్వాంటం సిద్ధాంతాన్ని కనుగొనక ముందే 1925 లో ఇలా వ్రాసాడు :
“ మీరు జీవిస్తున్న ఈ జీవితం ఈ మొత్తం అస్థిత్వంలో కేవలం ఒక భాగం మాత్రమే కాదు. ఒక విధంగా చెప్పాలంటే అస్థిత్వమంతా అదే. ఇది ఎలా కూర్చబడి ఉందంటే అది ఒక్కసారి చూడగానే అర్థమయ్యేలా  ఉండదు. ఇదే విషయం బ్రాహ్మణులు చెప్పే పవిత్రమైన, భావగర్భితమైన మంత్రాలలో ఉంది. అదే “తత్వమసి” - అదే నువ్వు అయి వున్నావు. దీనినే వేరే మాటల్లో చెప్పాలంటే నేను తూర్పున, పడమరన ఉన్నాను. నేను పైనా, క్రిందా ఉన్నాను. నేను ఈ అనంత విశ్వాన్ని.”

ఈ భావనను ష్రోడింగర్ ముండకోపనిషత్తు 2.2.11 నుండి గ్రహించాడు.
“ బ్రహ్మైవేదమమృతం పురస్తాద్బ్రహ్మ పశ్చద్బ్రహ్మ దక్షిణతశ్ఛోతరేణ
అధశ్చోర్ధ్వం చ ప్రసృతం బ్రహ్మైవేదం విశ్వమిదం వరిష్ఠం.”

ష్రోడింగర్ కు గల ఈ వేదాంత భావన తన క్వాంటం సిద్ధాంత పరిశోధనలపై ప్రభావం చూపింది.

ష్రోడింగర్ 1944 లొ వ్రాసిన “ వాట్ ఈజ్ లైఫ్? “ అనే గ్రంథంలో వేదాంత భావాలను పొందుపరిచాడు.  జేమ్స్ వాట్సన్ తో కలిసి డి.ఎన్.ఏ. నిర్మాణాన్ని కనుగొన్న ఫ్రాన్సిస్ క్రిక్ తన ఆవిష్కరణకు ఈ గ్రంథంలోని భావాలు ఎంతగానో ఉపయోగపడ్డాయని చెప్పాడు.
ష్రోడింగర్ జీవిత చరిత్రను వ్రాసిన వాల్టర్ మూర్ అందులో ఇలా అంటారు :
“ వేదాంతంలో ఉండే ఏకత్వం, అఖండత లాంటివే తరంగ భౌతిక శాస్త్రంలోనూ ఉన్నాయి. 1925 నాటికి ఉన్న భౌతిక శాస్త్ర భావన ప్రకారం విశ్వం అంటే విడివిడిగా ఉండే, అన్యోన్య క్రియలు జరిపే పదార్థ కణాలు గల ఒక పెద్ద యంత్రం లాంటిది. కానీ తర్వాత కొద్ది సంవత్సరాలలోనే ష్రోడింగర్, హైసెన్ బర్గ్ వంటి శాస్త్రవేత్తలు అధ్యారోహితమైన, అభిన్నములైన, కంపన పరిమితి గల సంభావ్యతా తరంగాల ఆధారంగా గల విశ్వం యొక్క భావనను పొందుపరిచారు.  ఈ భావన అన్నిటిలోనూ ఉన్నది ఒక్కటే అనే వేదాంత భావనతో సరిపోలుతోంది.”
ష్రోడింగర్ చైతన్యాన్ని ఏకత్వం కలది గా భావించాడు. అనేకమైన ఆత్మలున్నాయని చెప్పే చైతన్యం యొక్క బహుత్వవాదాన్ని ష్రోడింగర్ ఒప్పుకోలేదు.ఈ ప్రపంచం నానాత్వంతో కనబడడానికి కారణం మాయ మాత్రమేనని భావించాడు. బ్రహ్మము యొక్క మాయ చేత ఈ ప్రపంచం ఇలా కనిపిస్తోందని ఆది శంకరులు చెప్పిన అద్వైత భావాన్ని ష్రోడింగర్ సమర్ధించాడు.

తాత్విక వాదనల ద్వారా చైతన్యం యొక్క ఏకత్వాన్ని నిర్ధారించలేమని, సాదృశ్యాన్ని బోధిస్తున్న ప్రకృతితో ఏకత్వాన్ని పొందడం ద్వారా అనుభవ జ్ఞానాన్ని పొందాల్సిందేనని ష్రోడింగర్ అభిప్రాయ పడ్డాడు.

తను వ్రాసిన ఒక వ్యాసంలో ఆయన ఇలా అన్నాడు :
“అంతర్దృష్టి లేక లోచూపు అన్నది కొత్తదేమీ కాదు. భారతీయ తత్వచింతనలో ఎంతో గొప్పవైన ఉపనిషత్తుల కాలం నుండే ఆత్మ, పరమాత్మల ఏకత్వభావన ఉంది. ప్రాపంచిక విషయాలపై లోతైన అంతర్దృష్టిని ఇది సూచిస్తోంది.”

“చైతన్యం ఒక్కటేనని భారతీయ వేదాంతం చెబుతుంది. అన్ని సంఘటనలు, జనన మరణాలు ఒకే విశ్వ చైతన్యంలో సంభవిస్తాయి. చైతన్యం బహువిధమని భావించిన  పాశ్చాత్య భావాల సంఘర్షణకు స్వస్తి పలకడానికి అందుబాటులో ఉన్న ఏకైక ప్రాచీన జ్ఞాననిధి ఉపనిషత్తులు.”

   పాశ్చాత్య విజ్ఞాన శాస్త్రానికి ఉన్న ఆధ్యాత్మిక రక్తహీనత నుండి కాపాడదానికి తూర్పు నుండి పడమర దేశాలకు రక్త మార్పిడి జరగాలని ష్రోడింగర్ అభిప్రాయపడ్డాడు.
క్వాంటమ్ సిద్ధాంతం ప్రకారం ఎలక్ట్రాన్, ప్రోటాన్ లాంటి ఉపపరమాణు కణాలు ఒక కొలత ప్రకారం కణం గానూ, మరొక కొలత ప్రకారం తరంగం గానూ ప్రవర్తిస్తాయి.
మానవ తర్కం ప్రకారం ఒక అంశం అటు తరంగం గానూ, ఇటు కణం గానూ ప్రవర్తించడానికి వీలు లేదు. తరంగానికి వ్యాప్తి ఉంటుంది. కానీ కణానికి వుండదు. కణానికి పరిమితము, నిర్ణీతము అయిన స్థానం ఉంటుంది. ఒకే అంశం అటు తరంగం గానూ, ఇటు కణం గానూ ప్రవర్తించడం అనేది ఒక వైరుధ్యం (పారడాక్స్).

ఈ వైరుధ్యానికి సరైన వివరణ ఇవ్వడానికి కొందరు శాస్త్రవేత్తలు కోపెన్ హాగెన్ లో సమావేశమయ్యారు. వీరి వివరణ ప్రకారం మనం కొలతలు వేసే పరికరాలు, ప్రయోగాలు భిన్నంగా ఉండడం వల్లే ఉపపరమాణు అంశాలు అటు కణాలు గాను, ఇటు తరంగం గానూ కనిపిస్తున్నాయి. అంటే ఒక పరిశీలకుడు పరిశీలన చేసే వరకు ఒక రేణువు ఒకే సమయంలో అనేక స్థితులలో ఉంటుంది.  అంటే పరమాణు స్థాయిలోని అంశాల ధర్మాలన్నీ వాటికి పరిశీలకునిపై గల  ప్రభావాలే.

క్వాంటం ఫిజిక్స్ పై కోపెన్ హాగెన్ వివరణ ప్రకారం గణితాత్మకంగా ఒక రేణువు ఒకే సమయంలో రెండు స్థితులలో (కణంగాను, తరంగం గాను) ఉంటుంది. ష్రోడింగర్ దీనిని నిజం కాదని నిరూపించాలనుకున్నాడు. దీని కోసం ఒక ఊహాత్మకమైన ప్రయోగం చేసాడు. దీనినే “ ష్రోడింగర్స్ క్యాట్ ప్రయోగం ” అంటారు.
     ఈ ప్రయోగంలో ష్రోడింగర్ ఒక పిల్లిని ఒక సీల్ చేసిన స్టీల్ బాక్స్ లో పెట్టి అందులో రేడియో ధార్మిక పదార్ధాన్ని, ఒక విషం బాటిల్ ని పెట్టాడు.  ఈ రేడియో ధార్మిక పదార్థం లో కనీసం ఒక్క అణువు క్షయం అయినా విషం బాటిల్ పగిలి విషం బయటకు వచ్చేలా ఒక సుత్తిని ఏర్పాటు చేశాడు.

పెట్టెను సీల్ చేసిన తర్వాత పెట్టేలోని రేడియోధార్మిక పదార్థం క్షయం కావడం మొదలు పెట్టగానే ‘గ్రెగర్ కౌంటర్’ అనే పరికరం దాన్ని గుర్తించి సుత్తిని విడుదల చేయడంతో అది ఆ విషం బాటిల్ ను పగలగొడుతుంది. దాంతో ఆ బాటిల్ నుండి విషం బయటకు వచ్చి పిల్లిని చంపుతుంది. అయితే ఆ బాక్స్ ని తెరిచి చూసేదాకా లోపల ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. ఒక గంట తర్వాత ఆ పెట్టె ను తెరిస్తే ఆ పిల్లి బ్రతికి వుండే అవకాశం 50%, చనిపోయి వుండే అవకాశం 50% వుంటుంది.
క్వాంటం ఫిజిక్స్ మీద కోపెన్ హేగన్ లో సమావేశమైన శాస్త్రవేత్తల వివరణ ప్రకారం ఒక పరిశీలకుడు పరిశీలన చేసే వరకు ఒక రేణువు ఒకే సమయంలో అనేక స్థితులలో ఉంటుంది. అంటే ఆ బాక్స్ తెరిచి చూసేలోపల ఆ పిల్లి ఒకే సమయంలో చనిపోయి ఉండాలి మరియు బ్రతికి ఉండాలి. కానీ అది అసాధ్యం. ఏ ప్రాణీ ఒకే సమయంలో చనిపోయి మరియు బ్రతికి ఉండదు. బాక్స్ తెరిచాక పిల్లి బ్రతికే వుంది. ఈ విధంగా కోపెన్ హేగెన్ వివరణ లోని లోపాన్ని ష్రోడింగర్ ఎత్తి చూపాడు.

అంటే పిల్లి రెండు స్థితులలో ఉండడం అసాధ్యం. కాబట్టి కోపెన్ హాగెన్ వివరణ నిజం కాదని నిరూపితమైంది. మరి పరమాణు స్థాయిలో ఈ వైరుధ్యానికి కారణమేంటి? దీనికి సరైన సమాధానం ఏమిటో శాస్త్రవేత్తలకు ఇప్పటికీ అంతు చిక్కడం లేదు.

సూక్ష్మ స్థాయిలో యదార్థ స్థితి ఎలా ఉంటుందో క్వాంటం సిద్ధాంతం వివరించిన దానికీ, మన పరిశీలనలో మనం కనుగొన్న యదార్థానికి మధ్య వైరుధ్యం ఉంటోంది. ఇలాంటి వైరుధ్యాల వల్ల  పదార్ధం యొక్క క్వాంటం స్థితిలో దాగి ఉన్న రహస్యాలు ఇప్పటికీ సైన్స్ కి అర్థం కాలేదు.

క్వాంటం సిద్ధాంతం మానవ తర్కానికి అందేలా ఉండదు. ఈ సిద్ధాంతం ప్రకారం వాస్తవికత లేదా యదార్థ తత్వం అనేది అన్ని రకాల సంభావ్యతల అధిస్థాపనం లేదా కూర్పు. వేదాంత భావన కూడా ఇదే. పదార్థం యొక్క యదార్థ స్థితిని మనం రోజువారీ మాట్లాడుకునే భాషలో చెప్పలేమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మన ప్రాచీన ఋషులు కూడా ఇదే విషయాన్ని చెప్పారు.

క్వాంటం స్థాయిలోనే “చైతన్యం” లేక “ఎరుక” అనేదానికి ఆధారం ఉండొచ్చని ఇటీవల కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇదే గనుక పూర్తిగా నిర్ధారణ అయితే అదే ‘దేవుడు’ లేక ‘బ్రహ్మము’ అని చెప్పాల్సి వుంటుంది. అందుకేనేమో పదార్థ రహస్యం సైన్స్ కి అంతు పట్టకుండా ఉంది.

అందుకే "మనం చూసేదంతా మాయ" అనే అద్వైత సిద్ధాంతాన్ని ష్రోడింగర్ ఈ ప్రయోగం ద్వారా తెలియజేసినట్లయింది.. ఈ విషయంలో ష్రోడింగర్ ఆలోచనలు, ఆ రూపంలో భారతీయ వేదాంత భావనలు సైన్స్ ను ఎప్పటికీ ప్రబావితం చేస్తూనే ఉంటాయి.

కానీ ష్రోడింగర్ వంటి శాస్త్రవేత్తల పరిశోధనలపై భారతీయ వేదాంతం ప్రభావం చూపించిన విషయం భారతీయ పాఠ్య పుస్తకాలలో ఎక్కడా కనబడదు. ఇది భారతీయ విద్యా విధానం లోని లోపమని చెప్పక తప్పదు.

రచన: మణి కుమార్

Monday, March 5, 2018

అల్లోపతి వైద్యం ఆవిర్భావం మరియు చికిత్స విధానం - Allopathy treatmentఎల్లోపతీ (Allopathy): దీనిని నవీన వైద్య విధానమందురు. మొట్టమొదట హోమియో వైద్యులైన డా.సామ్యూల్ హనిమాన్ ఈ పదాన్ని వాడేరు. ఈ వైద్య విధానములో ఒక వ్యక్తికి జబ్బు వలన కలిగే బాధలను అణచి వేయుటకు(To suppress)మందులను వాడేవిధానమని ఆయన ఉద్దేశము. ఇది హోమియో వైద్యవిధానానికి వ్యతిరేక ప్రక్రియ. ఉదాహరణకి జ్వరము తగ్గడానికి ఉష్ణోగ్రతను తక్కువచేసే 'పారసిటమాల్ 'ను అల్లోపతి లో వాడుతాము. ఈ పరసిటమాల్ జ్వరము ఉన్నవారిలోను , జ్వరములేనివారిలోనూ ఉస్ణోగ్రతను తగ్గిస్తుంది. హోమియో వైద్యవిధానములో అలా కాకుండా జ్వరమునకు వాడే మందు నార్మల్ వ్యక్తులలో జ్వరమును పుట్టిస్తుంది ,జ్వరముతో బాధపడేవారిలో జ్వరమును తగ్గిస్తుంది.

అల్లొపతీ వైద్య విధానములో ఒక రోగము వలన కలిగే బాధలను తగ్గించడానికి తగిన మందులివ్వడమే కాకుండా ఆ రోగము రావడానికి గల మూలకారణము వివిధ పద్దతులద్వారా కనుగొని, కారక సూక్ష్మక్రిములను తెలుసుకొని తదనుగునముగా చికిత్స చేయుదురు. నేడు ఎన్నో రకములైన లేబొరటరీ పరీక్షలు, ఎక్షురే పద్దతులు, స్కానింగ్ పరికరాలు అందుబాటులోనికి వచ్చాయి. ఈ వైద్యవిధానము లో చికిత్స చేయు వైద్యునకు సంభందిత డిగ్రీ ఉదా: MBBS, MD, MS, MCh, DM, లాంటి చదువులు అవసరము.

అల్లోపతి వైద్యం ఆవిర్భావం
మనం ఇప్పుడు అల్లోపతి వైద్యంగా చెప్పుకునే ఆధునిక వైద్యం చరిత్ర 500 సంవత్సరాలే. భారతీయ, గ్రీకు, రోమన్‌, అరబిక్‌ వైద్యాల మధ్య వందల ఏళ్లుగా జరిగిన సమ్మేళనం ఫలితంగా, పారిశ్రామిక విప్లవం నేపథ్యంలో యూరోపులో తొలి ఆధునిక వైద్యం ఆవిర్భవించింది. ఆయుర్వేదం, సిద్ధవైద్యం మన ప్రాచీన వైద్యాలు. ఆత్రేయ (క్రీస్తు పూర్వం 800 సంవత్సరాలు), శుశ్రుతుడు, చరకుడు ( క్రీస్తు శకం 200 సంవత్సరాలు) మనకు తెలిసిన తొలినాటి గొప్ప వైద్యులు. చరకుడు 500 మందుల గురించి ఆనాడే రాశాడు. నాటి భారతీయ వైద్యులు సర్పగంధి అనే మొక్కను మందుగా వాడేవారు. రక్తపోటుకు వాడే 'రిసర్ఫిన్‌' అనే అలోపతి మందును ఈ మొక్కనుండే కనుగొన్నారు. దీన్ని రక్తపోటుకు వాడతారు. చరక సంహిత, సుశ్రుతసంహిత అనే గ్రంథాలను క్రీస్తు శకం 800 సంవత్సరంలో పర్షియన్‌, అరబిక్‌ భాషలలోకి అనువదించారు. ఇటువంటి విభిన్న వైద్య వ్యవస్థలలో జరిగిన కృషికి కొనసాగింపుగానే అలోపతి వైద్యం ఆవిర్భవించింది. అలోపతి వైద్యానికి యూరోపియన్‌ పారిశ్ర్రామిక విప్లవకాలపు ప్రోత్సాహం పెద్ద ఎత్తున లభించింది. అదేకాలంలో మన దేశంలో పాలకుల మద్దతు లేకపోవడంతో ఆయుర్వేదం క్రమేణా దెబ్బతిన్నది.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

GAU NATURALS - Swadesi Products

Cow Based Cultivated Rice,Dals,Spices.Hand Churned DESI COW GHEE,Panchgavya Products,Ayurvedic Products..
స్వదేశీ గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయం లో పండించిన పంట ఉత్పత్తులు, చేతితో విసిరిన పప్పులు,గానుగ నూనె లు, గోశాల లో తయారు చేసిన ఆవు నెయ్యి, పళ్ళపొడి సబ్బు లు షాంపూలు,ఫినాయిల్ మరెన్నో స్వదేశీ ఉత్పత్తుల సమాహారమే - గౌ నాచురల్స్. www.gaunaturals.com