నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

పండుగలు

పండుగలు
Showing posts with label శ్రీ రామనవమి. Show all posts
Showing posts with label శ్రీ రామనవమి. Show all posts

Thursday, April 2, 2020

శ్రీ సీతారాములు కల్యాణ.. వైభోగమే - Sita Raamula Kalyana Vaibhogame

శ్రీ సీతారాములు కల్యాణ.. వైభోగమే - Sita Raamula Kalyana Vaibhogame
శ్రీ సీతారాములు కల్యాణ.. వైభోగమే
శ్రీ రామక్షేత్రాలలో భద్రాచలం విలక్షణం. శ్రీరాముడు అవతారం చాలించిన తరువాత భద్రుని తపస్సు ఫలింప చేస్తూ స్వామి ఇక్కడ వెలిశాడు. తెలుగువారందరికీ శ్రీరామనవమి పేరు చెప్పగానే భద్రాద్రి కల్యాణం గుర్తుకు వస్తుంది. శ్రీరామకల్యాణ సేవ జీవితంలో శుభపరంపరలు ప్రసాదిస్తుంది. శ్రీరామ పట్టాభిషేకం విజయాలను అందిస్తుంది.

యస్తు భద్రనగే పుణ్యే
జపం కుర్యాత్ భక్తితః
సహస్ర గుణితం పుణ్యం
తస్యభూయాద్ధరాతలే

శ్రీరామ ఉపాసనకు సంబంధించిన శాస్త్రం పరాశర సంహిత. ఆ గ్రంథంలో పద్నాలుగు క్షేత్రాల్లో శ్రీరాముడు స్వయంభువుగా వెలినినట్లు ఉన్నది. అందులోని 35వ అధ్యాయం భద్రాద్రి ప్రాభవాన్ని గురించి పేర్కొన్న శ్లోకమిది.  భద్రాచల క్షేత్రంలో భక్తితో శ్రీరామమంత్రాన్ని జపిస్తే వెయ్యిరెట్లు ఫలం లభిస్తుంది అని ఈ శ్లోకానికి అర్థం.

భద్రాచల క్షేత్రంలోని మూలమూర్తులు స్వయంవ్యక్తాలని బ్రహ్మపురాణం కూడా చెబుతోంది. భద్రమహర్షి తపస్సు ఫలితంగా స్వామి ఆవిర్భవించినట్లు తెలుస్తోందే తప్ప ఆ కథ ఏకాలానిదో ఇదమిత్తంగా తెలియదు.

     శ్రీరాముడు అవతారం తరువాత మళ్లీ - భూమిపైకి వచ్చి శ్రీరామ రూపాన్ని ధరించిన సందర్భం భద్రాచలం ఒక్కటే నాలుగుచేతులలో శంఖ-చక్ర, ధనుర్బాణాలను ధరించి శ్రీరాముడు సీతా, లక్ష్మణ సమేతుడై ఇక్కడ దర్శనమిస్తాడు.
భద్రాచలలో సీతారాముల కళ్యాణం
భద్రాచలలో సీతారాముల కళ్యాణం 
సీతారాముల కల్యాణం
భద్రాద్రిలో సీతారామకల్యాణం శ్రీరామ నవమి పర్వదినాన జరుగుతుంది. అష్టమి తిథితో కూడని నవమి తిధినాడు మాత్రమే శ్రీ రామనవమిని ఆచరించడం ఇక్కడ సంప్రదాయం. ఒకవేళ సూర్యోదయానికి అష్టమి ఉన్నట్లయితే దశమినాడే శ్రీరామ నవమిని పాటిసారు.

       ఆగమశాస్త్రం ప్రకారం ఆలయాలలో అర్చామూర్తికి ఎనాడు ప్రతిష్ట జరుగుతుందో అదే ఆ మూర్తి జన్మదినం. ఎది ఆలయస్వామి జన్మదినమో ఆనాడే వార్షిక కల్యాణం చేయాలి. ఏప్పుడు వెలిశారో తెలియని మూర్తికి ప్రతిష్టాదినాన్ని ఎప్పుడని నిర్ణయిస్తారు? అందుకే త్రేతాయుగంలోని శ్రీరాముని జన్మదినవమే భద్రాద్రి రాముడు అవిర్భవించిన దినంగా పరిగణించి శ్రీరామ నవమినాడే నీతారామ కళ్యాణం జరగాలని రామదాసు కాలంలోనే నిర్ణయించారు.

గోత్రప్రవరలు:
రామాయణం ప్రకారం, శ్రీరామునిది వాశిష్ఠ గోత్రం. సీతమ్మవారిది గౌతమ గోత్రం. 

భద్రాద్రి రాముడు వైకుంఠ నారాయణుడు కనుక ఇక్కడ కల్యాణంలో శ్రీరామునికి అచ్యుత గోత్రంగా చెబుతారు. శ్రీమహాలక్ష్మి గోత్రమైన సౌభాగ్యగోత్రాన్ని సీతమ్మ తల్లికి కల్యాణవేళ చెబుతారు.

నాలుగు చేతులు, శంఖుచక్రాలు ఉన్నాయి కనుక ఈ రాముణ్ణి రామనారాయణుడని పిలవాలని వైఖానసులు వాదిస్తున్నారు. మూర్తి ఏవిధంగా మలచబడినప్పటికీ రామునికి వాల్మీకి ఇచ్చిన గోత్ర ప్రపర్లే చెప్పాలని ఉద్యమాలు జరుగుతున్నాయి. ఈ చర్చలు గత కొంతకాలంగా తెలుగునాట అయోమయాన్ని సృష్టిస్తున్నాయి. అయినప్పటికీ రామనారాయణుడనే వ్యవహరించడమే ప్రస్తుతం కొనసాగుతోంది. తాను నరుడినే అని చెప్పుకున్న రాముడైనా, వైకుంఠాన్ని వీడివచ్చి భద్రగిరిపై వెలిసిన నారాయణుడైనా మన మొక్కులు నెరవేర్చి, ఆపదలు గట్టెక్కిస్తే అంతే చాలు కదా!

సీతారాముల పెళ్లివేడుక:
భద్రాద్రిలో కల్యాణోత్సవం వనంత నవరాత్రి ప్రయుక్తంగా నిర్వహిస్తారు. నప్తమి నుంచి అహ్నికం మొదలవుతుంది. పౌర్ణమి నాటికి పూర్ణాహుతి జరుగుతుంది. ఈ నందర్భంగా ప్రధానమైన పన్నెండురకాల అరాధనలు జరుగుతాయి. వనంత నవరాత్రాలకు, బ్రహ్మోత్సవాలకు మధ్యలో జరిగే కమనీయమైన సేవ భద్రాద్రి కల్యాణంలో ఎన్నెన్నో విశేషాలు ఉన్నాయి. వాటిలో ఒకటి కల్యాణ ప్రవరలు.

        అలాగే భద్రగిరి సీతారామ కల్యాణంలో మూడు మాంగల్యాలు ఉంటాయని శ్రీరామ భక్తులందరికీ తెలిసిన విషయమే. కల్యాణంలో మరో సంప్రదాయం ఏమిటంటే గులాం కలిపిన గులాబీరంగు అక్షతలను వినియోగిస్తారు. తెలుగువారికే సొంతమైన జీలకర్ర, బెల్లం, తలంబ్రాలు పోసుకోవడం వంటివి కల్యాణ ప్రకరణ శాస్త్రానికి విరుద్ధం కాని రీతిలో సీతారామకల్యాణంలో చేరింది. అలాగే 'వారణ మాయిరం' అనే తమిళ పాశురాలతో జరిగే బంతులాట కూడా సంప్రదాయ సిద్దమైన వేడుకే. ఇరవైనాలుగు వైదిక అంశాలతో మూడు గంటలపాటు నయన మనోహరంగా జరిగే సీతారామ కల్యాణం సామాన్యునికి మధురానుభూతులను కలిగిస్తుంది.

పట్టాభిషేక ప్రాభవం:
భద్రాచలంలో కల్యాణ మహేోత్సవం తరువాత అంతటి వైభవంగా జరిగే మరో ఉత్సవం శ్రీరామపట్టాభిషేకం. ఈలోకానికి మళ్లీ రామరాజ్యం రావాలని మహా ఆశ దేశ పాలకులలో శ్రీరాముని సుగుణాలు నిండాలనే భద్రాచలం దేవాలయం ఉద్దేశ్యంతో శ్రీరామ పట్టాభిషేకాలు విరివిగా చేయమని పెద్దల ఆదేశం. పట్టాభిషేకాలు జరిగే వేదికలపై రాజధర్మాలు, న్యాయపద్ధతులు పాలకుల మంచిగుణాలను వ్రకటించే అవకాశం ఉంటుంది.

ఆదర్శ పాలకుడైన శ్రీరామ వట్టాభిషేకమే నేటి పాలకులకు నీతిపాఠాలు నేర్పించే వేదికగా మారుతుంది.  శ్రీరామాయణ పారాయణకు అనుగుణంగా పట్టాభిషేక నిర్వహణ విధిని పెద్దలు నిబంధించారు. రామాయణాన్ని పారాయణ చేసి, దానికి నమావనగా వట్టాభి షేకం జరపాలని తెలియచేశారు.

      ఆ నియమం ఆధారంగా భద్రాచల క్షేత్రంలో వట్టాభిషేక మహెూత్సవాలు జరుగుతాయి. మండల త్రయార్చన, పాదుకాది మకుటాంత సమర్పణం, ఆంజనేయ సమ్మానం వంటి ముఖ్య ఘట్టాలతో శ్రీరామ పట్టాభిషేకం కమనీయం.

వెన్నెల వేళ... ఇనకుల తిలకుడి కల్యాణం:
      రామపాదం సోకిన నేల ఒంటిమిట్ట, జాంబవంతుని పూజకోసం ఇక్కడ స్వామి కోదండరాముడై వెలిశాడు. అన్ని రామాలయాల్లో వలె శ్రీరామనవమినాటి మధ్యాహ్నం కాకుండా పున్నమి వెలుగుల్లో కోదండ రామయ్యకు కల్యాణం నిర్వహించడం ఆనవాయితీ దీనిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది.

       శ్రీ సీతారామలక్ష్మణులు ఒకే శిలలో కొలువుదీరిన క్షేత్రం ఒంటిమిట్ట. పూర్వం దీనినే ఏకశిలానగరం అని పిలిచేవారు. అరణ్యవాస కాలంలో సీతాలక్ష్మణ సమేతుడై శ్రీరాముడు ఇక్కడ కొంతకాలం గడివినట్లు కథనం. ఆ సమయంలో సీతాదేవి దావాంకోనం శ్రీరాముడు, లక్ష్మణుడు వేర్వేరుగా బాణాలతో తీర్థాలు తవ్వారు. వాటినే నేడు |రామతీర్థం, లక్ష్మణ తీర్థం అనేపేర్లతో పవిత్రంగా భావిస్తారు.  తదనంతర కాలాల్లో జాంబవంతునికి తొలుత ఈ క్షేత్రంలో సీతారామలక్ష్మణ మూర్తులు లభించడంతో ఆయనే ప్రతిష్టించి పూజించినట్లు స్థలపురాణం చెబుతోంది.
ఒంటిమిట్ట రామాలయం
ఒంటిమిట్ట రామాలయం
చరిత్రలో ఒంటిమిట్ట:
పూర్వం దొంగతనాలు చేస్తూ జీవనం సాగించే ఒంటోడు, మిట్టడు అనే సోదరులు స్వామి దర్శనంతో మారిపోయారు. వారికి కనిపించిన విగ్రహాలను పాలకులకు చూపించి ఆలయం నిర్మింవ చేశారు. తరువాత ఈ క్షేత్రానికి ఆ సోదరుల పేరుమీదుగా ఒంటిమిట్ట అనే పేరు వచ్చింది. ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణం

       ఉదయగిరి ప్రాంత పాలకుడైన కంపరాయలు ఈ గుడిని నిర్మించాడు. తరువాతి విజయనగర చక్రవర్తులు ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ఆంధ్రవాల్మీకి వావిలికొలను సుబ్బారావు (1863-1936) ఒంటిమిట్ట రామాలయాన్ని పునరుద్ధరించారు. శ్రీరామ సేవా కుటీరం, రథం, రథశాల నిర్మింపచేశారు.  పురావస్తుశాఖవారు ఒంటిమిట్ట ఆలయాన్ని అతిప్రాచీన కట్టడంగా గుర్తించి సంక్షిస్తున్నారు.

        శ్రీమదాంధ్ర భాగవత కర్త బమ్మెర పోతన ఒంటిమిట్టలోనే ఉండి స్వామివారిని సేవించి భాగవతాన్ని రచించాడు. పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమయ్య, కాలజ్ఞాన కర్త పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, అయ్యలరాజు రామభద్రుడు, ఉప్పుగుండూరు వెంకటకవి, వరకవి, ఇమాంబేగ్, భవనాసిమాల ఓబన్న, వావిలికొలను సుబ్బారావు, సాయం వరదాసు, విజయరాఘవాచార్యులు వంటి. కవివండితులెందరో అవోవ రచనా: కుసుమాలతో ఒంటిమిట్ట రామయ్యను సేవించి తరించారు.
ఒంటిమిట్ట సీతారామ కల్యాణం
ఒంటిమిట్ట సీతారామ కల్యాణం 
కల్యాణ వైభోగమే:
శ్రీరామక్షేత్రాలు అన్నింటా సీతారామ కల్యాణం మిట్టమధ్యాహ్న సమయంలో అభిజిత్ల గ్నంలో చేయడం సంప్రదాయం. అందుకు విరుద్ధంగా ఒంటిమిట్టలో శుక్ల పక్ష చతుర్ధశినాటి రాత్రి పండువెన్నెల్లో రామకల్యాణం నిర్వహిస్తారు. అలా రాత్రిపూట వెన్నెల్లో స్వామివారి కల్యాణం నిర్వహించడానికి ఆసక్తికరమైన గాథ ఒకటి ప్రచారంలో ఉంది. చిన్నతనం నుంచి శ్రీరాముడికి చంద్రుడంటే అత్యంత ఇష్టం,  చిన్నతనంలో ఆకాశంలో చందమామను చూపిస్తే కానీ అన్నం తినే వాడు. కాదు.. చందమామ అచ్చంగా కావాలని మారాం చేసిన బాలరాముడికి అద్దంలో చందమామను చూపెట్టిన గాథ అందరికీ తెలిసనినదే అటువంటి శ్రీరాముడి కల్యాణం మధ్యాహ్నం జరిగింది. దీనితో చంద్రుడు శ్రీరామ కల్యాణం చూడలేకపోయాడు. తీవ్రమైన దుఃఖానికి బాధకు లోనయ్యాడు. ఈ విషయం శ్రీరాముడికి తెలిసి చంద్రుడిని ఓదార్చి మూడువరాలు ప్రసాదించాడు.

ఆ వరాలేమిటంటే,
 • 🌝 రామభద్రుడు ఆనాటి నుంచి శ్రీరామచంద్రుడిగా ప్రసిద్ధుడు కావడం. తరువాతి జన్మలో శ్రీకృష్ణునిగా రాత్రిపూట జన్మించడం. 
 • 🌝కలియుగంలో రాత్రిపూట కల్యాణం చేసుకోవడం. 
అలా చంద్రుడికిచ్చిన మూడోవరంలో భాగంగా రాత్రి సమయంలో చైత్ర పౌర్ణమికి ముందురోజు. చంద్రుడు ఆకాశం నుంచి చూస్తూ పండువెన్నెల కురిపిస్తూ ఉండగా ఒంటిమిట్టలో రామయ్య కల్యాణం జరగుతుంది,

ఉత్సవానికి ముందుగా నిర్వహించే ఎదుర్కోలు నన్నివేశం ఉల్లానభరితంగా ఉంటుంది. ఆలయం పక్కనే చలువ పందిళ్ల కింద ఏర్పాటు చేసిన వివాహ వేదికపైకి కల్యాణ మూర్తులను ఊరేగింవుగా తీసుకువస్తారు. సర్వాంగ సుందరంగా ముస్తాబైన సీతమ్మ, రామయ్య కల్యాణ వేదిక పై ఆసీనులవుతారు. ఒకపక్క పండితుల కల్యాణ వ్యాఖ్యానాలు కొనసాగుతుండగా, వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య జరిగే వేడుక తన్మయత్వంలో ముంచెత్తుతుంది.

ఆగమ పద్ధతిలో విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్పం, రక్షాబంధనం,  యజ్ఞోపవీత ధారణ, ప్రవరలు, కన్యాదానం శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.

రచన: జాగృతి వారపత్రిక

Wednesday, April 1, 2020

శ్రీరామ నవమి పండుగ - భారతీయులందరి పరమ పవిత్రమైన దినం, Srirama Navami festival

Srirama Navami festival

శ్రీ రామ నవమి మహిమ మరియు ప్రాముఖ్యత

శ్రీరామ నవమి హిందువులకు అత్యంత ముఖ్య మైన పండుగ. హిందువులు ఈ పండగను అత్యంత భక్తి శ్రద్దలతో ఈ పండగను జరుపుకుంటారు.
 • శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించినాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది. ఈ చైత్ర శుద్ధ నవమి నాడు ఆంధ్రప్రదేశ్ లో గల భద్రాచలమందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు. 
 • రామా అనే రెండక్షరాల రమ్యమైన పదం పలుకని జిహ్వ-జిహ్వే కాదు. శ్రీరామ నవమి పండుగను భారతీయులందరూ పరమ పవిత్రమైన దినంగా భావించి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అతి వైభవంగా పట్టణంలో, పల్లెపల్లెల్లోనూ రమణీయంగా జరుపుకోవడం ఓ సంప్రదాయం. భక్తుల గుండెల్లో కొలువై, సుందర సుమధుర చైతన్య రూపమై, కోట్లకొలది భక్తుల పూజలందుకొంటున్నాడు శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడిని తెలుగువారు ప్రతి ఇంటా ఇంటి ఇలవేలుపుగా కొలుస్తారు. నేటికి భ్రధ్రాచలంలో శ్రీరాముడి పర్ణశాల భక్తులకు దర్శనమిస్తూవుంటుంది. భధ్రాచలంలో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి లక్షలాది భక్తులు తరలి వస్తారు. కళ్యాణంలో పాల్గొని దానిని తిలకించి శ్రీరాముని దర్శించి ఆ దేవ దేవుడి ఆశీస్సులు పొందుతారు. శ్రీ రామ నవమి మహిమ మరియు ప్రాముఖ్యత సీతారామ కళ్యాణం లోక జీవన హేతుకం, సకల దోష నివారణం, సర్వ సంపదలకు నిలయం, సకల జన లోక సంరక్షణమే శ్రీరామనవమి పండుగ పరమార్థం.
 • శ్రీరామచంద్రుని క్షేత్రాలలో అత్యంత వైశిష్ట్య ప్రాధాన్యత ప్రాశస్త్యముగల క్షేత్రం భద్రాచలం దివ్య క్షేత్రం. భద్రుడు అనగా రాముడు అని అచలుడు అంటే కొండ అని అందుకే రాముడు కొండపై నెలవై ఉన్న దివ్య ధామము కనుక ఈ క్షేత్రం భద్రాచలంగా ప్రసిద్ధిచెందిన పుణ్య క్షేత్రం. 
 • శ్రీరామచంద్రుడు తన వనవాస జీవితం ఇక్కడే గడపడమే ఈ పుణ్య క్షేత్రం యొక్క వైశిష్ట్యం. శ్రీరామ నామము సకల పాపాలను పోగొడుతుందని సకల శాస్త్రాలూ చెబుతున్నాయి. భక్త రామదాసు చెరసాలలో ఉండిపోయిన కారణంగా పూర్వము సీతారాముల కళ్యాణము మార్గశిర శుద్ధ పంచమినాడు జరిగినట్లుగా, అయితే తాను చెరసాలనుండి తిరిగి వచ్చాక చైత్రశుద్ధ నవమినాడు శ్రీరామ చంద్రుని పుట్టినరోజు వేడుకలు, కళ్యాణ వేడుకలు ఒకేసారి జరిపించారు. 
 • శ్రీ సీతారామ కళ్యాణము, రాముడు రావణున్ని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చింది 
 • శ్రీరామనవమినాడే. ఆ మరునాడు దశమి శ్రీరామ పట్ట్భాషేకం రామునికి జరిగింది. కోదండ రామకళ్యాణాన్ని చూసేందుకు మనమే కాదు సకల లోకాల దేవతలు దివి నుంచి భువికి దిగివస్తారంటా....శ్రీరామచంద్రుని దివ్య దర్శనం మహనీయంగా, నేత్ర పర్వంగా పట్ట్భాషేక సమయాన తిలకించి పులకితులవుతారట. ఆంజనేయుని పదభక్తికి మెచ్చి, హనుమ గుండెల్లో కొలువైన శ్రీరాముని భక్త పోషణ అనన్యమైనదై గ్రామగ్రామాన రామాలయం నెలకొని ఉన్నాయి. 
 • శ్రీరాముడు సత్యపాలకుడు ధర్మాచరణం తప్పనివాడు, ఏకపత్నీ వ్రతుడు, పితృ, మాతృ, భాతృ, సదాచారం, నిగ్రహం, సర్వ సద్గుణాలు మూర్త్భీవించిన దయార్ద హృదయుడు. 
శ్రీరామనవమి రోజున సీతారాముని, లక్ష్మణ, భరత, శతృఘ్న, ఆంజనేయ సమేతముగా ఆరాధించి, వడ పప్పు, పానకము నైవేద్యముగా సమర్పించుకుంటారు. ప్రతియేడు భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామ కళ్యాణము చూసి తరించిన వారి జన్మ సార్థకం చెందుతందనేది భక్తుల విశ్వాసం.


రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

Saturday, April 13, 2019

శ్రీరామ నవమి ఉత్సవంలో విశేషాలు - Sri Rama Navami Ustava Vishesalu

శ్రీరామ నవమి ఉత్సవంలో విశేషాలు - Sri Rama Navami Ustava Vishesalu
శ్రీరామ నవమి
శ్రీరాముడు త్రేతాయుగము నందు వసంత ఋతువులో చైత్ర శుద్ద నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నము సరిగ్గా అభిజిత్ ముహూర్తములో అనగా మధ్యాహ్నము 12-00 గంటలు సమయమునందు జన్మించాడు. ఆమహనీయుని జన్మదినమును ప్రజలు శ్రీరామ నవమి పండుగగా జరుపు కుంటారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము అనంతరము శ్రీరాముడు సీతా సమేతముగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైన శుభ సమయము కూడా చైత్ర శుద్ద నవమి అనే చారిత్రక ఆదారము. అంతే కాకుండా చైత్ర శుద్ద నవమి రోజునే సీతారాముల కళ్యాణము జరిగినది. కావున చైత్ర శుద్ద నవమి రోజు భద్రాచలమునందు సీతారాముల కళ్యాణమును వైభవోపేతంగా జరుపుకుంటారు.
శ్రీరామ నవమి ఉత్సవంలో విశేషాలు - Sri Rama Navami Ustava Vishesalu

ఉత్సవము 
ఈ పండగ సందర్భంగా హిందువులు సాధారణంగా తమ గ్రామాలలో సీతా రాముల విగ్రహాలకు కల్యాణోత్సవం నిర్వహిస్తుంటారు. చివరగా విగ్రహాలను వీధుల్లో ఊరేగిస్తారు. తొమ్మిది రోజులు పాటు సాగే ఈ ఉత్సవాలను వసంతోత్సవం తో ముగిస్తారు. భద్రాచలం లో రామదాసు చే కట్టబడిన రామలయంలో, ప్రతి సంవత్సరం ఈ ఉత్సవం వైభవంగా చేస్తారు. ప్రభుత్వం తరఫున, రాష్ట్ర ముఖ్యమంత్రి తన తలమీద పట్టు వస్త్రాలు, సీతారామ కళ్యాణ సందర్భంగా తలంబ్రాలకు వాడే ముత్యాలను తీసుకుని వస్తాడు.

శ్రీరామ నవమి ఉత్సవంలో విశేషాలు - Sri Rama Navami Ustava Vishesalu
ఇస్కాన్ దేవాలయం వారు ఈ వేడుకలను నానాటికీ ఎక్కువవుతున్న భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఇంకా ఘనంగా నిర్వహిస్తోంది. కొన్ని చోట్ల స్వామి నారాయణ్ జయంతిని కూడా దీనితో కలిపి జరుపుకుంటారు.

శ్రీరామ నవమి ఉత్సవంలో విశేషాలు - Sri Rama Navami Ustava Vishesalu

ఉత్సవంలో విశేషాలు 
 • శ్రీరామ దేవాలయాలను, శ్రీరామ మందిరాలను అందంగా విద్యుద్దీపపు కాంతులతో అలంకరిస్తారు. 
 • పండితులచే సీతారాముల కల్యాణం జరిపిస్తారు. 
 • బెల్లం, మరియు మిరియాలు కలిపి తయారు చేసేపానకం,వడ పప్పు లను స్వామి వారి ప్రసాదంగా భక్తులకు పంచి పెడుతారు. 
 • ఉత్సవ మూర్తుల ను వీధులలో ఊరేగిస్తారు. 
 • ఈ సందర్భంగా హిందువులు ఉపవాస దీక్షను పాటిస్తారు. 
 • రామాయణాన్ని పారాయణం చేస్తారు. 

 • శ్రీరాముని తో బాటు సీతాదేవిని, లక్ష్మణుని, ఆంజనేయుని కూడా ఆరాధించడం జరుగుతుంది. 
 • రంగు నీళ్ళు చల్లుకుంటూ ఉల్లాసంగా సాగే వసంతోత్సవం తో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. 
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

శ్రీ రామనవమి: రాముని ఔన్నత్యం, సత్యమార్గం గురించి తెలుసుకోండి - Sri Ramanavami: Learn about the Rama Eunthi and Satya Rama


ఎంతోమంది భారతీయులు శ్రీరాముణ్ణి కొలుస్తారు. జీవితంలో ఆయన ఎదురుకున్న పరిస్థితులనీ, జీవితం ఆయన పట్ల వ్యవహరించిన తీరుని పరికించి చూస్తే ఆయన వివత్తుల వలయంలో చిక్కుకున్నట్లు అనిస్పిస్తుంది. తనదైన రాజ్యాన్ని కోల్పోయి, అడవిపాలౌతాడు. అది చాలదనట్టు ఆయన భార్యని అపహరించిన వానితో ఆయనఉ ఏమాత్రం ఇష్టంలేని ఘోరయుద్ధం చేస్తాడు. తీరా అర్ధాంగిని రాజ్యానికి తీసుకునివచ్చిన తరవాత ఆమెను గూర్చి ఆయన రాజ్య ప్రజలే అప్రతిష్ట పలుకులను పలకడం విని ఎంతో నొచ్చుకున్నాడు. విషాద హృదయంతో ప్రాణప్రదమైన సీతని నిండు చూలాలని కూడా చూడకుండా , అడవిలో విడిచిపెడతాడు.ఇవన్నీ చాలవనట్టు, తనకు తెలియకుండానే తన పుత్రులతో యుద్ధం చేసి , చివరికి భార్యను కోల్పోతాడు. ఇలా ఆయన జీవితమంతా ఎడతెగని అనర్ధాలే.

రాముని ఔన్నత్యం, జీవితంలో ఆయన ఎదురుకున్నపరిస్థితుల్లో లేదు, ఆయన తన జీవితాన్ని ఎంతటి సామరస్యంతో , హుందాతనంతో నిర్వహించుకున్నారన్నదానిలో ఉంది. ఎటువంటి విపత్తు వచ్చిపడినా ఆయనెప్పుడూ కూడా ఏ ఒక్కరినీ దూషించడంగానీ, పరిస్థితి విషమించిందని అందరిపై విరుచుపడటం గానీ, చేయలేదు. ఎటువంటి పరిస్థితిలోనైన హుందాగాగానే ఉండేవారు.
జీవితంలో ఎటువంటి విపరీతాన్నైనా , చెక్కుచెదరకుండా , సత్యమార్గాన్ని వీడకుండా  స్వధర్మాన్ని ఆచరిస్తూ వచ్చాడు. తన జీవితాన్ని అత్యంత సమతుల్యతతో నిర్వహించుకున్నాడు.
ముక్తినీ, అనుగ్రహపూర్వకమైన జీవితాన్ని ఆకాంక్షించే వారెప్పుడూ రాముడినే ఆరాధించేవారు, ఎందుకంటే, బాహ్య పరిస్థితులెప్పుడూ కూడా మన చేతుల్లో లేవనీ,అవెప్పుడైనా , ఎలాగైనా తారుమారవ్వొచ్చునన్న జ్ఞానం వారికుంది గనక , వారు రాముణ్ణి కొలిచారు. మీరు బాహ్య పరిస్థితులని ఎంతో నైపుణ్యతతో నిర్వహించుకున్నప్పటికీ, ఎదో తప్పు జరిగి తీరుతుంది. ఉదాహరణకి ఏ క్షణాన్నైనా తుఫాను రాబోతున్నదని తెలిసి , మీరు ఇంట్లోకి కావలసినవన్నీ ముందుగానే అమర్చుకున్నారనుకోండి . ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా అమాంతంగా తుఫానొచ్చి మీ ఇంటిని ఈడ్చుకుని వెళ్ళిపోతే..?, ఎంతో మందికి ఇలా జరగడం చూస్తూనే ఉన్నాం. మీకిప్పటి వరకూ ఇలా జరిగి ఉండకపోవచ్చు. ‘నాకసలలాంటి దుర్ఘటనలు జరగవు’ అనుకోవడం అవివేకం. ఒకవేళ ఇలాంటి పరిస్థితి ఎదురైనా నేను దాన్ని స్థైర్యంగా , సౌమ్యంగా ఎదుర్కుంటాను అని అనుకోవడం వివేకవంతుల లక్షణం . ఇటువంటి అద్భుతమైన వివేకాన్నీ, సుజ్ఞానాన్నీ రాముడిలో చూసారు గనకే ఆయననే కోరుకుని, ఆయన్నే కొలిచారు రామభక్తులు. జీవితంలో ఎటువంటి విపరీతాన్నైనా , చెక్కుచెదరకుండా , సత్యమార్గాన్ని వీడకుండా  స్వధర్మాన్ని ఆచరిస్తూ వచ్చాడు. తన జీవితాన్ని అత్యంత సమతుల్యతతో నిర్వహించుకున్నాడు.

ఆ మాటకొస్తే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు విపత్తులని కోరుకునే ఆనవాయతీ కూడా ఉంది.
ఎంతో మంది ఆధ్యాత్మిక పిపాసకులు తమ జీవితం మరీ అంత సవ్యంగా , సజావుగా సాగకూడదని , సమస్యల్ని కోరుకుంటారు. ఇటువంటి సమస్యల ద్వారా భగవంతుడు వారికి పరీక్ష పెడితే, మరణించే ముందు వారంటే ఏమిటో వారికి పూర్తిగా తెలుసుకునే అవకాశముంటుందని నమ్ముతారు . వారి సాధనా క్రమలో పరిపక్వాన్ని పరీక్షించుకోవడానికి ఎన్ని విపత్తులనైనా  ఆనందంగా ఎదురుకుంటారు. ఐతే మరణం ఆసన్నమైనప్పుడు ఈ సమతుల్యాన్ని కోల్పోయే ప్రమాదముంది. ఈ సమయంలో వేటినైతే నిజాలని అప్పటిదాకా నమ్ముతూ వచ్చామో, మన కళ్ళ ముందే అవన్నీ పటాపంచలౌతుంటే,నియంత్రణ పట్టుతప్పుతుంది . ఇలా జరిగిన ఉదాంతాలెన్నో ఉన్నాయి. ఇలా చేయడం వలన ఆపదల్ని కోరితెచ్చుకున్నారు ఎంతో మందున్నారు.

అలా కాకూడదని , మరణం ఆసన్నమైనప్పుడు , ఏమాత్రం తొణకకుండా దాన్ని హుందాగా అక్కున చేర్చువాలన్నదే వీరి తపన. ఇది ఆకస్మికంగా జరిగితే మిమ్మల్ని మీరు నిలదోక్కుకోలేరు. అందుకే దీనికి కొంత సాధన అవసరం. అందుకే వారు పూర్తి ఎరుకతో తమ జీవితంలో కష్టాలు కావలని కోరుకుంటారు. ఇలా సానపడితేనే చివరిక్షణంలో మరణాన్ని ఓ నిండుతనంతో స్వీకరించగలుగుతారు. మీ జీవితంలో మీరేం చేసారు , ఏంత సంపాదించారు,ఏం జరిగిందీ , ఏం జరగలేదూ..ఇటువంటి వాటికి ఏ విలువా లేదు. సంకటకాలాల్లో మిమ్మల్ని మీరు ఎలా నిలదొక్కుకున్నారు, శ్రీరాముడిలా హుందాగా ఈ జీవితాన్ని సాధ్యమైనంత అవలీలగా ఎలా దాటారో… అదే అన్నిటికంటే ముఖ్యమైనది!
ఇదెలాంటిదంటే ఉరికంబం వైపు కూడా ఓ హుందాతనంతో నడిపిస్తుంది. ఇది మనిషిలోని మహత్తర లక్షణం, ఇక మిగితాది పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. 
  తమకు అవసరంలేని వాటన్నిటినీ పొందినందుకు ఆనందపడిపోయి కృతఙ్ఞతలు చెపుతూ ఉంటారు మనుషులు. ఇటువంటివి మీ జీవితాకిని ఎక్కువ విలువనేమీ ఆపాదించవు. భారతదేశంలో సర్వ సాధారణ దృశ్యం ఏమిటంటే –ఇంద్రభవనం లాంటి ఓ ఇంటిని ఆనుకుని , ఓ పూరి గుడిసె కూడా ఉంటుంది-ఐతే విషయమేమిటంటే ఈ పూరి గుడిసెలో ఉన్నవాడు ఎంతో సంతృప్తిగా , ఉన్నంతలో ఆనందంగా , తన పొరిగింటివాడంత ఐశ్వర్యం లేకపోయినా అంతే గర్వంగా ఉంటాడు! అది స్వాభిమానం నుండి వచ్చిన గర్వం, ఈ స్వాభిమానానికి పక్కింటివాడి సిరిసంపదలతో సంబంధంలేదు. ఇదెలాంటిదంటే ఉరికంబం వైపు కూడా ఓ హుందాతనంతో నడిపిస్తుంది. ఇది మనిషిలోని మహత్తర లక్షణం, ఇక మిగితాది పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది.

అంటే దీనర్ధం మన జీవితాన్ని చక్కగా నిర్వహించుకోకూడదనా? కాదు, కాదు, బాహ్య పరిస్థితులని తప్పకుండా చక్కదిద్దుకోవాలి , ఎందుకంటే ఇందులోనే మన చుట్టుపక్కల వారి శ్రేయస్సుంది కాబట్టి. పరిస్థితులని బాగా నిర్వంహించినంత మాత్రాన మీరు తబ్బిబైపోకూడదు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే మిమ్మల్ని మీరు సరిగ్గా నిర్వహించుకుంటేనే మీరు మహదానందాన్ని పొందగలరు, మీరిలా చేసేది కేవలం మీ చుట్టూ ఉన్న వారి శ్రేయస్సు కొరకే కదా!

తన బాహ్య పరిస్థితులని చక్కగా నిర్వహించుకోడానికి ఎంతో ప్రయత్నించాడు శ్రీరాముడు, కొన్ని సార్లు ఆయన విఫలమయ్యాడు కూడా. ఆపత్కాలంలో పరిస్థితులు చేయిదాటిపోతూ ఉన్నప్పుడు కూడా ఆయన తన శాంతాన్ని కోల్పోలేదు . ఇదే ఆధ్యాత్మికతలోని సారం , అందులోకి అడుగిడిన వారికెంతో ముఖ్యం కూడా . మీ ఆంతర్యం పరిమళాలు వెదజల్లే పుష్పంలా వికసించాలంటే , నిరంతరం అనుగ్రహ పూర్వకమైన వాతావరణాన్ని మీరే సృష్టించుకోవాలి!


రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

హిందువులు శ్రీ రాముణ్ణి ఎందుకు అమితంగా ఆరాధిస్తారు- Why are Hindus worshiping Sri Rama?భారతీయులలో చాలామంది రాముణ్ణి ఆరాధిస్తారు. కానీ మీరు అతని జీవిత పరిస్థితులను, అతని జీవితం నడచిన తీరును గమనిస్తే, అది అంతా ఓ విపత్తుల పరంపరగా అనిపిస్తుంది. అతను ధర్మ బద్ధంగా తనది కావలిసిన సామ్రాజ్యాన్ని కోల్పోయాడు. పైగా అడవులు పట్టి పోవలసి వచ్చింది. అంతలోనే అతని ధర్మపత్ని అపహరణం. అందుకోసం అతనికి ఇష్టం లేకపోయినా ఒక ఘోర సమరం చేయవలసి వచ్చింది. తన అర్థాంగిని కాపాడి తిరిగి తెచ్చుకోగానే, చుట్టు ప్రక్కల వారందరి నుండి అతి పరుషమైన వ్యాఖ్యానాలను భరించవలసి వచ్చింది. అందువల్ల తన ప్రాణప్రదమైన సహధర్మచారిణిని అడవులలో వదిలిపెట్టాడు. అప్పుడామె నిండు గర్భవతి. కవలలకు జన్మనీయబోతూ ఉంది. ఆ తరువాత, తన కన్నబిడ్డలే అని తెలియని పరిస్థితిలో, వారితోనే యుద్ధం చేశాడు. చివరకు తన భార్యను కూడా కోల్పోయాడు. అతని జీవితం ఒక ఎడతెగని విపత్తు.

ఇంత జరిగినా, ఎందుకు జనులు రాముణ్ణి ఆరాధిస్తారు ?
రాముని ప్రత్యేకత జీవితంలో అతడు ఎదుర్కొన్న పరిస్థితులలో లేదు. ఎదురైన విపత్తులలో అతను ఎంత ఉన్నతంగా నడుచుకున్నాడన్న దానిలోనే అతని ఔన్నత్యం ఉన్నది
రాముని ప్రత్యేకత జీవితంలో అతడు ఎదుర్కొన్న పరిస్థితులలో లేదు. ఎదురైన విపత్తులలో అతను ఎంత ఉన్నతంగా నడుచుకున్నాడన్న దానిలోనే అతని ఔన్నత్యం ఉన్నది. ఏనాడూ అతనిలో కోపం లేదు, ఎవరినీ నిందించటం లేదు, గగ్గోలు పెట్టడం లేదు. అతడు అన్ని సందర్భాలలోను ఉదాత్తంగా, హుందాగా నడుచుకున్నాడు.

అందువల్లనే పవిత్ర జీవనాన్నీ, ముక్తినీ సాధించాలని తపించే వ్యక్తులు రామునిలా జీవించాలని తపిస్తారు. ఎందుకంటే బాహ్య పరిస్థితులు ఏక్షణంలోనైనా విషమించగలవు అని వారు తెలుసుకున్నారు. ఆ విజ్ఞతను వారు పొందారు. ఎన్నో రకాలుగా జీవిత పరిస్థితులను చక్కదిద్దుకుంటూ ఉన్నా కూడా, బాహ్య పరిస్థితులు ఎప్పుడో ఒకప్పుడు విషమించే ఆస్కారం ఉంది. మీరు అన్నీ సక్రమంగానే నిర్వహించుకోవచ్చు. కానీ ఒక వేళ తుఫాను లాంటి సమస్య వస్తే మాత్రం అది మీ ఇంటిని, మీ సమస్తాన్ని తుడిచిపెట్టేస్తుంది. “నాకేమీ అలా జరగదులే’’ అని అనుకోవడం మూర్ఖంగా బ్రతకటమే అవుతుంది. “ఒకవేళ అదే జరిగినా కూడా నేను దానిని ధైర్యంగా ఎదుర్కొంటాను’’ అని అనుకోవడం వివేకమైన జీవనమార్గం. ఈ మహత్తరమైన విజ్ఞత రామునిలో కనిపిస్తుంది. అందుకే జనులు అతన్ని ఆరాధిస్తారు. మీ వద్ద ఎంత ఉంది, మీరు ఏం చేసారు, ఏం జరిగింది, ఏం జరగలేదు, ఇవన్నీ ప్రశ్నలు కావు. ఏది జరిగినా, మిమల్ని మీరు ఎలా నిలుపుకుంటున్నారు? అదే అసలు విషయం!
మీ వద్ద ఎంత ఉంది, మీరు ఏం చేసారు, ఏం జరిగింది, ఏం జరగలేదు, ఇవన్నీ ప్రశ్నలు కావు. ఏది జరిగినా, మిమల్ని మీరు ఎలా నిలుపుకుంటున్నారు? అదే అసలు విషయం
దీని అర్థం, మన జీవితాన్ని మనం సక్రమంగా నడుపుకోకూడదనా? కానే కాదు! మన చుట్టూ ఉన్న వ్యవహారాలను చక్కగా సరిదిద్దుకోవాలి. అది అందరికీ మంచిది. అలా ఒక పరిస్థితిని చక్కగా నిర్వహించినప్పటికీ కూడా, మనలో అది తప్పకుండా ఒక అద్భుత భావనను కలిగిస్తుందని చెప్పలేము. కాని ప్రతి పరిస్థితిలోనూ మనల్ని మనం మనోజ్ఞంగా నిలబెట్టుకోగలిగినప్పుడు, మనలో అది తప్పకుండా ఒక అద్భుత భావనను కలిగిస్తుంది. ఐనా, అందరి శ్రేయస్సు పట్లా మనకి శ్రద్ధ ఉంది కాబట్టి, మనం ఏ పరిస్థితినైనా సక్రమంగా నిర్వహించాలి.

తన జీవితంలోని పరిస్థితులను చక్కదిద్దటానికి రాముడు ప్రయత్నించాడు. కానీ అన్ని వేళలా అది వీలుకాలేదు. అనేక విషమ పరిస్థితులు అతడు అనుభవిస్తూ వచ్చాడు. పరిస్థితులు నియంత్రణను దాటిపోయాయి. కానీ ముఖ్యమైన విషయం ఒక్కటే. అతడు అన్నివేళల ఉదాత్తంగా, హుందాగా నడుచుకున్నాడు. ఇదే ఆధ్యాత్మికతలోని మౌలిక సారాంశం. మీ జీవితం ఒక సుందర పరిమళపుష్పంలా వికసించాలంటే దానికి సానుకూలమైన అంతర్గత పరిస్థితిని కల్పించుకోవాలి. అటువంటి స్థిరమైన అంతర్గత వాతావరణాన్ని మీరు ఎల్లప్పుడూ సృష్టించుకోవాలి. ఇందుకు శ్రీరాముడు ఆదర్శప్రాయుడు. అందుకే ఆయన అందరికీ ఆరాధ్యనీయుడు!


రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

GAU NATURALS - Swadesi Products

Cow Based Cultivated Rice,Dals,Spices.Hand Churned DESI COW GHEE,Panchgavya Products,Ayurvedic Products..
స్వదేశీ గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయం లో పండించిన పంట ఉత్పత్తులు, చేతితో విసిరిన పప్పులు,గానుగ నూనె లు, గోశాల లో తయారు చేసిన ఆవు నెయ్యి, పళ్ళపొడి సబ్బు లు షాంపూలు,ఫినాయిల్ మరెన్నో స్వదేశీ ఉత్పత్తుల సమాహారమే - గౌ నాచురల్స్. www.gaunaturals.com