నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

13, ఏప్రిల్ 2019, శనివారం

శ్రీరామ నవమి ఉత్సవంలో విశేషాలు - Sri Rama Navami Ustava Vishesalu

శ్రీరామ నవమి ఉత్సవంలో విశేషాలు - Sri Rama Navami Ustava Vishesalu
శ్రీరామ నవమి
శ్రీరాముడు త్రేతాయుగము నందు వసంత ఋతువులో చైత్ర శుద్ద నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నము సరిగ్గా అభిజిత్ ముహూర్తములో అనగా మధ్యాహ్నము 12-00 గంటలు సమయమునందు జన్మించాడు. ఆమహనీయుని జన్మదినమును ప్రజలు శ్రీరామ నవమి పండుగగా జరుపు కుంటారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము అనంతరము శ్రీరాముడు సీతా సమేతముగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైన శుభ సమయము కూడా చైత్ర శుద్ద నవమి అనే చారిత్రక ఆదారము. అంతే కాకుండా చైత్ర శుద్ద నవమి రోజునే సీతారాముల కళ్యాణము జరిగినది. కావున చైత్ర శుద్ద నవమి రోజు భద్రాచలమునందు సీతారాముల కళ్యాణమును వైభవోపేతంగా జరుపుకుంటారు.
శ్రీరామ నవమి ఉత్సవంలో విశేషాలు - Sri Rama Navami Ustava Vishesalu

ఉత్సవము 
ఈ పండగ సందర్భంగా హిందువులు సాధారణంగా తమ గ్రామాలలో సీతా రాముల విగ్రహాలకు కల్యాణోత్సవం నిర్వహిస్తుంటారు. చివరగా విగ్రహాలను వీధుల్లో ఊరేగిస్తారు. తొమ్మిది రోజులు పాటు సాగే ఈ ఉత్సవాలను వసంతోత్సవం తో ముగిస్తారు. భద్రాచలం లో రామదాసు చే కట్టబడిన రామలయంలో, ప్రతి సంవత్సరం ఈ ఉత్సవం వైభవంగా చేస్తారు. ప్రభుత్వం తరఫున, రాష్ట్ర ముఖ్యమంత్రి తన తలమీద పట్టు వస్త్రాలు, సీతారామ కళ్యాణ సందర్భంగా తలంబ్రాలకు వాడే ముత్యాలను తీసుకుని వస్తాడు.

శ్రీరామ నవమి ఉత్సవంలో విశేషాలు - Sri Rama Navami Ustava Vishesalu
ఇస్కాన్ దేవాలయం వారు ఈ వేడుకలను నానాటికీ ఎక్కువవుతున్న భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఇంకా ఘనంగా నిర్వహిస్తోంది. కొన్ని చోట్ల స్వామి నారాయణ్ జయంతిని కూడా దీనితో కలిపి జరుపుకుంటారు.

శ్రీరామ నవమి ఉత్సవంలో విశేషాలు - Sri Rama Navami Ustava Vishesalu

ఉత్సవంలో విశేషాలు 
  • శ్రీరామ దేవాలయాలను, శ్రీరామ మందిరాలను అందంగా విద్యుద్దీపపు కాంతులతో అలంకరిస్తారు. 
  • పండితులచే సీతారాముల కల్యాణం జరిపిస్తారు. 
  • బెల్లం, మరియు మిరియాలు కలిపి తయారు చేసేపానకం,వడ పప్పు లను స్వామి వారి ప్రసాదంగా భక్తులకు పంచి పెడుతారు. 
  • ఉత్సవ మూర్తుల ను వీధులలో ఊరేగిస్తారు. 
  • ఈ సందర్భంగా హిందువులు ఉపవాస దీక్షను పాటిస్తారు. 
  • రామాయణాన్ని పారాయణం చేస్తారు. 

  • శ్రీరాముని తో బాటు సీతాదేవిని, లక్ష్మణుని, ఆంజనేయుని కూడా ఆరాధించడం జరుగుతుంది. 
  • రంగు నీళ్ళు చల్లుకుంటూ ఉల్లాసంగా సాగే వసంతోత్సవం తో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. 
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

« PREV
NEXT »