నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

పండుగలు

పండుగలు
Showing posts with label సేవ. Show all posts
Showing posts with label సేవ. Show all posts

Thursday, October 29, 2020

నిస్వార్థ సేవకు నిజమైన రూపం: సోదరి నివేదిత - Sister Niveditha - A true form of selfless service


వివేకానందుని స్ఫూర్తితో నివేదిత
స్వామి వివేకానందుని స్ఫూర్తితో మనదేశంలో అడుగుపెట్టి వ్యక్తి, జాతి నిర్మాణానికి జీవితాన్ని నివేదించి భారతీయుల మనసులలో ‘సోదరి’గా చిరస్థానం సంపాదించిన స్ఫూర్తిప్రదాత సిస్టర్ నివేదిత. మహిళలకు విద్య ద్వారానే సాధికారత సాధ్యమవుతుందని నమ్మి, ప్రచారం చేసి, దానిని సాకారం చేసిన మహనీయురాలు ఆమె. 1867 అక్టోబర్ 28న ఐర్లండులో మార్గరెట్ నోబుల్ జన్మించింది. పదిహేడేళ్ల వయసులో ఉపాధ్యాయ వృత్తిలో చేరింది. అనతికాలంలోనే విద్యావేత్తగా ఎదిగి జార్జ్‌బెర్నార్డ్ షా వంటి ప్రముఖులుండే సాహిత్య మండలిలో సభ్యురాలైంది. జర్నలిస్టుగా పేరుప్రఖ్యాతలు సాధించి చర్చి ద్వారా ధార్మిక కార్యక్రమాలలోనూ పాల్గొనేది. అయినా ఆమెకు జీవితంలో ఏదో లోటు ఉన్నట్లు అనిపించేది. ఆ తరువాత స్వామి వివేకానందను కలుసుకున్న తరువాత ఆ వెలితి తొలగిపోయింది.
    స్వామి వివేకానందుని వ్యక్తిత్వంతో ప్రభావితురాలైన ఆమె ఆయనను గురువుగా భావించింది. ఆయన ప్రేరణ వల్లే భారత్‌కు సేవే చేయాలన్న తపన పెరిగిందని ఆమె స్వయంగా రాసుకున్నారు. తన దేశాన్ని, వృత్తిని, బంధువర్గాన్ని మిత్రులను వదులుకుని 1898 జనవరి 28న ఆమె భరతగడ్డపై కాలుమోపారు. కలకత్తా నౌకాశ్రయంలో ఆమె అడుగుపెట్టినపుడు వివేకానందుడు స్వయంగా వెళ్లి ఆమెకు స్వాగతం పలికారు. అంతేకాదు, మరణానికి రెండు రోజుల ముందు ఆమెను తన నివాసానికి ఆహ్వానించి తానే ఆమెకు భోజనం వడ్డించి, భోజనానంతరం చేతులు కడుక్కోవడానికి నీళ్లు పోసి, తుడుచుకోవడానికి తువ్వాలు అందించారు. భారతదేశంలో ఆమె చేయబోయే వ్యక్తి నిర్మాణ కార్యంపై ఆయన విశ్వాసానికి అవి సంకేతాలు. అదే ఏడాది మార్చి 25న ఆమె జీవితాన్ని భగవంతునికి నివేదిస్తున్నట్లు భావించి ఆమె పేరును ‘నివేదిత’గా మార్చారు.
భారత్‌కు మేలు జరిగితే ప్రపంచానికి మేలు జరుగుతుందన్నది వివేకానందుని మాట. ఆ బోధనతోనే నివేదిత భరతమాత సేవకే జీవితాన్ని అంకితం చేసింది. విద్యతోనే మూఢ నమ్మకాలు దూరం అవుతాయని, సాధికారత సాధ్యమవుతుందని ఆమె విశ్వసించింది. అప్పట్లో బాలికలు విద్యాభ్యాసం చేయడం కష్టం. అయినా చైతన్యం తీసుకువచ్చి, ఇంటింటికి వెళ్లి బాలికలను పోగుచేసి పాఠశాలను ప్రారంభించింది. అయితే నిర్వహణ, బోధకులకు జీతభత్యాలు ఇవ్వడం కష్టమైంది. ప్రభుత్వ సహాయాన్ని వద్దనుకున్నారు. జాతీయవిద్య అభివృద్ధికి విదేశీ ప్రభుత్వ సహాయం మంచిదికాదన్నది ఆమె భావన. స్వయంగా వీలునామాలో ఆమె ఆ విషయాన్ని పేర్కొన్నారు కూడా. కష్టనష్టాలను భరించి బాలికలను విద్యావంతులను చేస్తూ క్రమశిక్షణ, సంస్కారం నేర్పుతూ చారిత్రక, పుణ్య క్షేత్రాలకు తీసుకువెళుతుండేవారు. ఇప్పుడు ప్రచారం, నినాదాలు, పథకాలకే మహిళలకు విద్య పరిమితమవుతున్నది. ఆమె దశాబ్దాల క్రితమే స్ర్తివిద్యకు ప్రాధాన్యం ఇచ్చారు.

కలకత్తాలో ప్లేగు వ్యాధి చుట్టిముట్టినప్పుడు రోగులను కాపాడవలసిన వైద్యులు ఊరు వదలిపారిపోయే పరిస్థితుల్లో ఆమె ప్రజలను అంటిపెట్టుకుని ఉండిపోయారు. పరిసరాలను స్వయంగా శుభ్రం చేశారు. రోగులను ఒడిలోకి తీసుకుని ఓదార్చారు. ఆమె నిరుపమాన సేవలను చూసిన అప్పటి ప్లేగు నివారణ కమిటీ చైర్మన్ మిస్టర్ బ్రెత్ నివేదిత అకుంఠిత దీక్షను చూసి ఆశ్చర్యపోయారు. రోగులను ఆదుకునేందుకు భోజనం ఖర్చు తగ్గించుకున్న నివేదిత రోజుకు గ్లాసుడు పాలతోనే గడిపారని ప్రత్యక్ష సాక్షి డాక్టర్ రాధా గోవింకర్ పేర్కొన్నారు. 
     1906లో తూర్పు బెంగాల్‌లో కరవు విలయతాండవం చేసినప్పుడు, భారీ వరదలు వచ్చినప్పుడు ప్రజలు సర్వస్వం కోల్పోయారు. కుంగుబాటుకు గురయ్యారు. విపత్తుల వేళ ఆమె తాటాకుతో చేసిన పడవలపై ఇల్లిల్లు తిరుగుతూ వారిని ఓదార్చారు. వారి సేవలో గడిపారు. స్ర్తివిద్య, సేవా కార్యక్రమాలలో ఆమె తలమునకలై ఉన్నా సగటు భారతీయునిలో ఆత్మవిశ్వాసం సడలిపోకుండా ప్రజల వెన్నంటి ఉన్నారు. ప్రఖ్యాత శాస్తవ్రేత్త జగదీశ్ చంద్రబోస్ ఆవిష్కరించిన పరిశోధనలను బ్రిటన్‌లో అవమానపరుస్తున్నప్పుడు ఆయనకు మద్దతుగా నివేదిత నిలిచారు. ఆయన పరిశోధనా పత్రాలు, వ్యాసాలు ముద్రించకుండా అడ్డుపడుతున్న వారిని ఢీకొన్నారు. 1902 నుంచి 1907 వరకు ఆయన రాసిన వ్యాసాలను సరిచేస్తూ, కొత్త రచనలకు తోడ్పడుతూ వాటిని ప్రచురించేందుకు ఆర్థిక సహాయం చేస్తూ దేశీయ పరిశోధనలను ప్రోత్సహించేందుకు కలకత్తాలో ఒక పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని బోస్‌ను ఉత్సాహపరిచారు. 1917నాటికి ఆ లక్ష్యం నెరవేరినా అప్పటికి ఆమె లేకపోవడం బోస్‌ను కుంగదీసింది. జె.సి.బోస్‌కు ఇంగ్లండ్‌లో అవమానం జరగడం, భారతీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని జమ్‌షెడ్జీ టాటా, కాశీలో హిందు కళాశాలను ఏర్పాటు చేయాలని అనిబిసెంటు పెట్టుకున్న అర్జీలను బ్రిటిష్ ప్రభుత్వం తిరస్కరించడం ఆమెను దిగ్భ్రాంతికి గురిచేశాయి.

భారతదేశానికి రాజకీయ స్వాతంత్య్రం ఎంత అవసరమో అప్పుడు ఆమె గుర్తించారు. వివేకానందుడి సోదరుడు, యుగాంతర పత్రిక ఉపసంపాదకుడు భూపేంద్రనాథ్, బారిష్ ఘోష్ వంటి విప్లవ సంస్థల సమావేశాలకు వెళ్లేవారు. దీంతో ఆమెపై బ్రిటిష్ ప్రభుత్వం నిఘాపెట్టింది. ఆమె స్వల్పకాలమే జీవించారు. కానీ భారతజాతికి ఆమె ఇచ్చిన ప్రేరణ అనంతం. ఆమెను దేశ ప్రజలకు మాతృమూర్తి అని రవీంద్రనాథ్ ఠాగూర్ అంటే భారతీయులకు ఆమె నిస్వార్థ సేవ చేసిన మహనీయురాలని గోపాలకృష్ణ గోఖలే కీర్తించారు. ఇక తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి ఆమెను తన ఆధ్యాత్మిక గురువుగా కొనియాడారు. ఆమె సేవలు ఆమెను ‘సోదరి’గా భారతీయులు భావించారు. 1911 అక్టోబర్ 13న ఆమె పరమపదించారు. అయినా ఇప్పటికీ ప్రజలు ‘సిస్టర్ నివేదిత’ను స్మరిస్తూనే ఉన్నారు.

వినండి: Real and True Social Worker Sister Nivedita సేవ చేయడం అంటే మత మార్పిళ్లు చేయడం కాదని నిరూపించిన… అసలు సిసలు క్రిస్టియన్ సిస్టర్ నివేదిత(అసలు పేరు మార్గరెట్ ఎలిజబెత్ నోబెల్) భారత దేశాన్ని మాతృభూమిగా భావించిన విదేశీయురాలు.. దేశానికి, ధర్మానికి ఎంతో సేవ చేసిన సోదరి నివేదిత. భారత్-టుడే సౌజన్యంతో....

-శ్రీరామ్

Monday, May 18, 2020

దానాలు చేయడం వలన కలిగే ఫలితాలు - Danadharmalu, Danalu, Danamదానాలు చేయడం వలన కలిగే ఫలితాలు - Danadharmalu, Danalu, Danam

దానాలు చేయడం వలన కలిగే ఫలితాలు

 •  1. బియ్యాన్ని దానం చేస్తే – పాపాలు తొలుగుతాయి.
 •  2. వె౦డిని దానం చేస్తే – మనశ్మా౦తి కలుగుతుంది.
 •  3. బ౦గారం దానం చేస్తే – దోషలు తొలుగుతాయి.
 •  4. ప౦డ్లను దానం చేస్తే – బుద్ధి. సిద్ధి కలుగుతాయి.
 •  5. పెరుగు దానం చేస్తే – ఇ౦ద్రియ నిగ్రహ౦కలుగుతుంది.
 •  6. నెయ్యి దానం చేస్తే – రోగాలు పోతాయి. ఆరోగ్య౦గా ఉ౦టారు.
 •  7. పాలు దానం చేస్తే – నిద్ర లేమిఉండదు.
 •  8. తేనె దానం చేస్తే – స౦తానంకలుగుతుంది.
 •  9. ఊసిరి కాయలు దానం చేస్తే – మతిమరుపు పోయి, జ్ఞాపకశక్తీ పెరుగుతు౦ది.
 • 10. టె౦కాయ దానం చేస్తే – అనుకున్న కార్య౦సిద్ధిస్తు౦ది.
 • 11. దీపాలు దానం చేస్తే – క౦టి చూపు మెరుగు పడుతుంది.
 • 12. గోదానం చేస్తే – ఋణ విముక్తులౌతారు ఋషుల ఆశీస్సులు లభిస్తాయి.
 • 13. భూమిని దానం చేస్తే – బ్రహ్మలోకదర్శనం లభిస్తుంది
 • 14. వస్త్రదానం చేస్తే – ఆయుష్షు పెరుగుతు౦ది.
 • 15. అన్న దానం చేస్తే – పెదరికంపోయి, ధనవృద్ధి కలుగుతుంది.
పైవన్నీమన వేదాల్లో చెప్పినవే…
వీటి‌లో మీకు సాధ్యపడేది ఒక్కటైన చేయ్యమని అర్థం. చేసే సహాయం చిన్నదైనా సరే మనస్తూర్తిగా, శ్రద్ధగా చేస్తే ఫలితం అధికంగా కలదు.

సంకలనం: భానుమతి అక్కిశెట్టి

Sunday, April 8, 2018

నూతన దేవాలయానికి ఎలాంటి దానాలు చేయాలి - ఫలితాలు ఎలా ఉంటాయి, What to donate for new temples

krotta-devalayallo-yelanti-danalu-cheyali

దేవాలయాల్లో దానం చేయాల్సినవి ఎక్కడైనా కొత్తగా దేవాలయం నిర్మిస్తుంటే.. ఆ ఆలయానికి ఏమి సాయం చేస్తే బాగుంటుందని ఆస్తికులు ఒక్కోసారి సందిగ్ధంలో పడుతుంటారు.

దేవాలయాల్లో దానం చేయాల్సినవి

ఎక్కడైనా కొత్తగా దేవాలయం నిర్మిస్తుంటే.. ఆ ఆలయానికి ఏమి సాయం చేస్తే బాగుంటుందని ఆస్తికులు ఒక్కోసారి సందిగ్ధంలో పడుతుంటారు. దేవాలయానికి ఏ వస్తువు ఇస్తే ఎలాంటి పుణ్యం కలుగుతుందో సూటిగా వివరించి చెబుతుంది విష్ణు ధర్మోత్తర పురాణం తృతీయ ఖండం మూడు వందల నలభై ఒకటో అధ్యాయం. దేవాలయం అనేది ఒక పుణ్య వ్యవస్థ. దాని నిర్మాణ నిర్వహణలకు అందరూ సహకరిస్తేనే ఆ వ్యవస్థ చక్కగా కొనసాగుతూ ఉంటుంది. దర్శనానికి వెళ్ళిన వారికి శాంతిని ప్రసాదించేదిగానూ ఉంటుంది. అందుకే ఎవరికి చేతనైనంతలో వారు దేవాలయాలకు సహాయ సహకారాలను అందిస్తూ అవసరమైన వాటిని దానం చేయాలంటున్నాయి పురాణాలు.
 • ఆలయ గోడలకు సున్నం కొట్టించడం, ఆలయ ప్రాంగణాన్ని చక్కగా ఊడ్చి ముగ్గులు పెట్టి అందంగా తీర్చిదిద్దటంలాంటి శ్రమదానాలకు శ్రీమహావిష్ణులోక ప్రాప్తి లాంటి పుణ్యఫలాలను చెప్పాయి పురాణాలు.
 • అలాగే ఆలయానికి శంఖాన్ని దానం చేస్తే విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. ఆ తరువాత మానవజన్మ ఎత్తాల్సి వచ్చినా కీర్తిమంతుడే అవుతాడు.
 • గంటను దానం చేస్తే మహా గొప్ప కీర్తిని పొందుతాడు.
 • గజ్జలను, మువ్వలను ఇచ్చినవాడు సౌభాగ్యాన్ని పొందుతాడు.
 • చల్లదనం కోసం ఆలయ ప్రాంగణంలో పందిళ్ళు నిర్మిస్తే కీర్తి పొందటానికి, ధర్మబుద్ధి కలగటానికి కారణమవుతుంది.
 • పైన ఎగిరే పతాకాలను ఇచ్చినవాడు సకలపాపాల నుంచి విముక్తుడై వాయులోకాన్ని పొందుతాడు.
 • ఆ పతాకాలు ఆలయానికి ఎంత శోభను కూర్చుతుంటే అంత యశస్సును దాత పొందుతాడు. 
 • చాందినీలు ఏర్పాటు చేసిన వాడు గొప్ప సుఖాలకు పాత్రుడవుతాడు. 
 • ఆలయంలో వేదికను నిర్మించి ఇచ్చినవాడు పృథ్వీపతి అవుతాడు. 
 • మనోహరమైన కుంభాన్ని ఇచ్చినవాడు వరుణలోకాన్ని, నాలుగు కలశాలను దానం ఇచ్చినవాడు నాలుగు సముద్రాల పర్యంతం ఉన్న భూమి మీద, అంతసుఖాన్ని అనుభవిస్తాడు.
 • కమండలువును ఆలయానికిస్తే గోదాన ఫలితం దక్కుతుంది. 
 • వట్టివేళ్ళతో తయారు చేసిన చాపల లాంటివి ఇస్తే సర్వపాపాలు నశిస్తాయి.
 • ఆలయానికి సమకూరిన గోవులను మేపటానికి గోపాలకుడిని ఇచ్చినా పాపవిముక్తే ఫలితం.
 • చామరాలను దానం చేస్తే గొప్ప ధనప్రాప్తి కలుగుతుంది.
 • దేవుడికి ఆసనాన్ని సమకూరిస్తే సర్వత్రా ఉత్తమ స్థానం లభిస్తుంది. 
 • పాదపీఠ ప్రదానం ఉత్తమగతికి సోపానం. 
 • ధ్వజ సమర్పణం లోకంలో గొప్పకీర్తిని పొందటానికి వీలు కల్పిస్తుంది. 
 • దేవుడికి ముఖ లేపనాలను అంటే ముఖానికి అలంకిరంచే గంధ ద్రవ్యాలను ఇచ్చినవాడు ఉత్తమరూప సంపత్తిని పొందుతాడు. 
 • దర్పణం (అద్దం) దానం చేసినా మంచిరూపం లభిస్తుంది.
 • దేవుడి పరిచర్యల కోసం చిన్న చిన్న పాత్రలను ఇస్తే సర్వకామ సమృద్ధమైన యజ్ఞం చేసినంత ఫలం దక్కుతుంది. 
 • ధ్యానం, సశ్యాలు, బీజాలు, బంగారం, వెండి, ఇతర లోహాలు ఇచ్చినవాడు అనంతరం పుణ్య ఫలితాన్ని పొందుతాడు. 
 • వెండి మంచి రూపానికి, బంగారం సర్వకోరికలు సిద్ధించటానికి దానం చేస్తుంటారు. 
 • పాడి ఆవును ఇస్తే గోలోకప్రాప్తి, బండిని లాగేఎద్దునిస్తే అంతకు పదింతలు పుణ్యఫలం లభిస్తాయి. 
 • మేకలు, గొర్రెలు, బర్రెలు, దున్నలు, ఒంటెలు, కంచరగాడిదలు లాంటివి ప్రదానం చేస్తే మామూలు ద్రవ్య దాన ఫలం కన్నా వేయింతల ఫలం లభిస్తుంది.
 • వన్యమృగాలు, పక్షులదానం అగ్నిష్ఠోమయాగ ఫలితాన్ని ఇస్తుంది. 
 • పచ్చని పతాకాలతో కూడిన గరుడ ధ్వజాన్నిస్తే ఇంద్రలోకప్రాప్తి కలుగుతాయి.
 • నీలపతాకాలతో కూడిన తాలధ్వజం సమర్పిస్తే ఉత్తమలోకాలు ప్రాప్తిస్తాయి.
 • ఆలయానికి మహాద్వార తోరణాలను ఇచ్చినవాడికి ఉత్తమలోకాల వాకిళ్ళు తెరచి సిద్ధంగా ఉంటాయి. 
 • శయన, ఆసనదాతకు వైకుంఠంలో శాశ్వత స్థితి ఫలం, ఉత్తరీయాన్ని సమర్పిస్తే సర్వకామ ఫలప్రాప్తి,
 • దేవాలయంలో శిల్పాలు, చిత్రాలు లాంటివి కావలసిన పదార్థాలను వాద్య పరికరాలను ప్రదానం చేసినవాడు దేవసేనలో స్థానాన్ని పొందుతాడని విష్ణు ధర్మోత్తర పురాణం పేర్కొంటోంది.
 • దేవుడిని ఆశ్రయించి ఉండేవాడికి ఏ కొద్దిపాటి ఇచ్చినా దైవానుగ్రహపాప్తికి కారణమవుతుంది. ఈ వరుసలోనే ధాన్యాలు, సశ్యాలు, రసాలు, శాకాలు, ఇచ్చిన వారికి పుణ్యంతో పాటు శోకరహితస్థితి కలుగుతుంది.
 • వంట పాత్రలను ప్రదానం చేసినా పుణ్యఫలమే. పుష్పవృక్ష, తోటల ప్రదానం గ్రామాధిపత్యానికి, జలాశయ నిర్మాణం, లాంటివన్నీ భగవత్‌కృపను పొందటానికి కారణాలవుతాయని విష్ణుధర్మోత్తర పురాణం పేర్కొంటోంది. 
 • దేవాలయం ఒక పవిత్ర స్థానం. భక్తులు అక్కడ మనశ్శాంతిని పొందేందుకు వీలుంటోంది. అంతటి ఉత్తమ వ్యవస్థకు ఎవరికి చేతనైనంతలోవారు సహకరిస్తే ఆ పవిత్ర ఉత్తమ వ్యవస్థ చిరకాలం నిలిచి ఉంటుందన్న లక్ష్యంతోనే ఇలా దేవాలయాలు దాన విశేషాలను పురాణాలు పేర్కొంటున్నాయన్నది అంతరార్థం.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

GAU NATURALS - Swadesi Products

Cow Based Cultivated Rice,Dals,Spices.Hand Churned DESI COW GHEE,Panchgavya Products,Ayurvedic Products..
స్వదేశీ గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయం లో పండించిన పంట ఉత్పత్తులు, చేతితో విసిరిన పప్పులు,గానుగ నూనె లు, గోశాల లో తయారు చేసిన ఆవు నెయ్యి, పళ్ళపొడి సబ్బు లు షాంపూలు,ఫినాయిల్ మరెన్నో స్వదేశీ ఉత్పత్తుల సమాహారమే - గౌ నాచురల్స్. www.gaunaturals.com