దేవుళ్ళు మరియు దేవతలు జాబితా - List of Gods and Goddess

aum or oom

దేవుళ్ళు, అవతారాలు:

హిందూ పురాణాల ప్రకారం దేవతలు లేదా దేవుళ్ళు అనగా స్వర్గ లోక నివాసులు, పరమ పవిత్రులు, పూజింపదగిన వారు. హిందూ గ్రంథాల్లో వారికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. వారి గురించి ఎన్నో రకాలైన కథలు, పురాణ గాథలు, ఇతిహాసాలు ప్రచారంలో ఉన్నాయి. ఇంత మంది దేవుళ్ళు ఉన్నా పరమేశ్వరుడు ఒక్కడే. ఆయనే సృష్టి అంతటికీ మూలాధారం. ధర్మాన్ని పరిరక్షించడానికి మరియు సకల మానవాళిని సరియైన దారిలోకి మళ్ళించడానికి స్వర్గం నుంచి మానవ రూపంలో భువి పైన జన్మించిన వారిని అవతార పురుషులు లేదా అవతార మూర్తులు అంటారు. రామావతారం, కృష్ణావతారం మొదలైనవి ఇందులో ముఖ్యమైనవి.
brahma , vishnu , maheswar
(త్రిమూర్తులు) - బ్రహ్మ, విష్ణువు, శివుడు.

హిందూ దేవతలు (దేవుళ్ళు)
 1. త్రిమూర్తులు -- బ్రహ్మ , విష్ణు , మహేశ్వరుడు .
 2. త్రిశక్తులు --- సరస్వతి , లక్షీ , పార్వతి .
 3. గాయత్రీ మాత
 4. లలితా దేవి 
 5. దశావతారాలు -- 1.మత్స్యావతారము , 2.కూర్మావతారము , 3.వరాహావతారము , 4.నరసింహావతారము , 5.వామనావతారము , 6. పరశురామావతారము , 7.రామావతారము , 8.బలరామావతారము ,9.కృష్ణావతారము , 10.కల్క్యావతారము
 6. శ్రీరాముడు ,
 7. శ్రీకృష్ణుడు ,
 8. శివుడు ,
 9. ఈశ్వరుడు ,
 10. దుర్గ - నవదుర్గలు : 1.శైలపుత్రి , 2.బ్రహ్మచారి , 3.చంద్రఘంట , 4.కుష్మాండ , 5.స్కందమాత ,6.కాత్యాయని , 7.కాళరాత్రి , 8.మహా గౌరీ , 9.సిద్ధిదాత్రి ,
 11. వినాయకుడు -పార్వతి పరమేశ్వరులు పుత్రుడు ,
 12. షణ్ముఖుడు (కుమారా స్వామి),
 13. అన్నపూర్ణ ,
 14. భువనేశ్వరి ,
 15. శాకంభరి ,
 16. శతాక్షి ,
 17. గౌతమ బుద్ధ ,
 18. ధన్వంతరి ,
 19. దుమావతి ,
 20. దక్షిణామూర్తి
 21. దత్తాత్రేయ ,
 22. అయ్యప్పస్వామి ,
 23. గంగ ,
 24. గరుడ ,
 25. హనుమాన ,
 26. ఇంద్ర ,
 27. అగ్ని ,
 28. యమ ,
 29. వరుణ దవుడు ,
 30. వాయుదేవుడు ,
 31. కుబేరుడు ,
 32. కలి ,
 33. కార్తికేయ ,
 34. లక్ష్మీ ,
 35. మాతంగి ,
 36. మాయ ,
 37. శక్తి ,
 38. సీత ,
 39. నవగ్రహాలు -1.సూర్య , 2.చంద్ర , 3.కుజుడు(మంగళుడు) , 4.బుధుడు , 5.గురుడు , 6.శుక్రుడు , 7.శని ,8.రాహు , 9.కేతు .
 40. ప్రజాపతి ,
 41. సత్యన్నారాయణ స్వామి ,
 42. వెంకటేశ్వర ,
 43. నటరాజ ,
 44. శక్తి ,
 45. గోదాదేవి ,
 46. వరలక్ష్మి
 47. వాసవి కన్యకాపరమేస్వరీ

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top