నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

26, నవంబర్ 2017, ఆదివారం

ఆంజనేయుడి గురించి మీకు తెలియని సత్యాలు ! - Unknown Facts About Lord Anjaneya

unknown-facts-about-lord-anjaneya

వనపుత్రుడు హనుమంతుడు పరమశివుని అవతారమని మనందరికీ తెలుసు. ఆయన శ్రీరామునికి పెద్ద భక్తుడు. అనేక టివి సిరీస్ లలో చూపించినా హనుమంతుడి జీవితంలో ఇంకా చాలామందికి తెలియని వాస్తవకథలు ఉన్నాయి.

1.హనుమంతుడి జననం
బ్రహ్మదేవుడి భవంతిలో ఉన్న అందమైన అప్సర అంజన, తను ఎవరిని ప్రేమిస్తే ఆ క్షణంలో కోతిరూపాన్ని పొందుతుందని ఒక మునిచే శపించబడింది.బ్రహ్మ ఆమెకి సాయపడాలని భావించి ఆమెను భూమిపైకి పంపించాడు.అక్కడ అంజన వానరరాజైన కేసరిని కలిసి పెళ్ళాడింది. ఆమె పరమశివుని భక్తురాలు పైగా తీవ్ర తపస్సు కూడా చేసింది. ఫలితంగా శివుడు ఆమెకి కొడుకుగా జన్మించటమే కాక,ఆమెను శాపవిముక్తురాలిని కూడా చేసాడు.

మరోవైపు, శివుడి సూచన మేరకు దశరథ మహారాజు తన సభలో యజ్ఞం నిర్వహిస్తున్నప్పుడు, ఒక ముని పాయసం ఉన్న గిన్నెతో అక్కడికి వచ్చాడు. ఆయన దశరథునికి ఆ పాయసాన్ని తన ముగ్గురు భార్యలకి తినిపించమని చెప్పారు.కౌసల్య తినవలసిన భాగం ఒక గద్ద తన్నుకుపోయి ధ్యానం చేస్తున్న అంజన వద్దకు వెళ్ళింది. శివుడి సూచనల ప్రజారం వాయుదేవుడు ఆ పాయసాన్ని అంజన చేతుల్లో పడేలా వీచాడు. అది పరమశివుని ప్రసాదంగా భావించిన అంజన దాన్ని తినటం వలన- శివుని అవతారమైన, పవనపుత్రుడని కూడా పిలవబడే హనుమాన్ పుట్టాడు.

2. శ్రీరాముని దీర్ఘాయుష్షు కోసం హనుమంతుడు ఒకసారి సింధూరాన్ని శరీరమంతా రాసుకున్నాడు.

హనుమంతుడు ఒకసారి సీతమ్మ సింధూరం పెట్టుకుంటుంటే చూసాడు.ఆమెని దాని ఉపయోగం ఏంటని అడిగాడు. దానికి సీతామాత శ్రీరాముని దీర్ఘాయుష్షుకోసం పెట్టుకుంటారని తెలిపింది. చిన్నపిల్లల మనస్సున్న హనుమంతుడు చిటికెడు సింధూరమే అన్ని అద్భుతాలు చేయగలిగితే శరీరం మొత్తం రాస్తే ఏం జరుగుతుందని ఆలోచించాడు. అందుకని, ఒళ్ళంతా సింధూరం రాసుకొని శ్రీరాముడి పూర్తి ఆయుష్షు కోసం ప్రార్థించాడు.


3. ఒక గొప్ప చేప హనుమంతుడి కొడుకును కన్నది – మకరధ్వజ లంకని తన తోకతో కాల్చేసాక, ఆంజనేయుడు సముద్రంలో ఒళ్ళు చల్లబర్చుకోడానికి స్నానం చేసాడు. అప్పుడు ఆయన చెమట సముద్రపునీరుతో కలిసి ఆ నీరును ఒక చేప తాగింది. ఈ పెద్ద చేప మకరధ్వజను కన్నది.ఈ మకరధజాన్ని రావణుడి సోదరుడు,పాతాళలోక రాజు అహిరావణుడు తర్వాత బంధించాడు. మకరధ్వజ పెద్దయ్యాక అహిరావణుడు తన బలం మరియు శక్తిని చూసి మెచ్చి,తన సైనికుడిగా మార్చుకున్నాడు.

అహిరావణుడు రాముడిని,లక్ష్మణుడిని బంధించినప్పుడు, హనుమంతుడు వారిని రక్షించటానికి వెళ్ళి మకరధ్వజతో పోరాటంలో ఓడిపోయాడు.తర్వాత హనుమంతుడు అహిరావణుడిని చంపేసాక, తన కొడుకు మకరధ్వజుడిని పాతాళలోకానికి రాజుగా ప్రకటిస్తాడు మరియు రామలక్ష్మణులను ఎటువంటి హాని లేకుండా తీసుకొని వస్తాడు. తన భర్తపై అపరిమిత భక్తికి గుర్తుగా సీతామాత ఒక ముత్యాలహారం ఆంజనేయుడికి బహుమతిగా ఇచ్చింది. ఆయన హుందాగా శ్రీరాముని పేరు లేనిది ఏదీ తీసుకోనని తిరస్కరించాడు. ఆయన వాదన సమర్థించుకోటానికి తన హృదయాన్ని చీల్చి మరీ తనలో ఉన్న సీతారాముల చిత్రాన్ని చూపించాడు.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి


« PREV
NEXT »