నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

17, జనవరి 2018, బుధవారం

అన్నవరము శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి - Annavaram Sri Vervankata Satyanarayana Swami

అన్నవరము శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి - Annavaram Sri Vervankata Satyanarayana Swami

అన్నవరము:
ఈ క్షేత్రం తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. రాజమండ్రికి దాదాపు 80 కి. మీ., అన్నవరం స్టేషను నుండి 3 కి.మీ. దూరంలో పంపానదీ తీరంలో ఉన్న అన్నవరం కొండ రత్నగిరి, ఇక్కడ రత్నగిరిపై వెలిసిన శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి ఆలయం "అన్నవరం సత్యనారాణ దేవాలయం" గా ప్రసిద్ధిచెందింది. సామూహిక సత్యనారాయణ వ్రతాలు ఇక్కడ ఆచరింపబడతాయి. కొండ క్రింది నుండి పైకి నేరుగా దేవస్థానం తరపున బస్సులున్నాయి. ఓపిక ఉంటే మెట్లెక్కి కూడా వెళ్ళ వచ్చును. క్రింది నుండి పైకి చేరటానికి నడిచి మెట్లెక్కి వెళితే సుమారు 20 నిమిషాలు పట్టవచ్చు. అంధ్రదేశం హైందవులు కుల విచక్షణ లేకుండా తమ ఇంట ఏ శుభకార్యము జరిగినా - వివాహం, గృహనిర్మాణం జరిగిన, గృహప్రవేశ మహొత్సవము లేక మరేదైన శుభ సందర్భాలన్నింటికీ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఒక ముఖ్య భాగంగా ఆచరించుతారు. అది ఈ స్వామి వ్రతమే, అంటే తెలుగువారికి ఎంత ప్రియాతిప్రియమైన దేవుడో అర్థం చేసుకోవచ్చు. కొండ క్రింది దేవస్థానం సత్రములు, హొటళ్ళు ఉన్నాయి. కొండపైన కూడా విడిదికి సత్రాలు దేవస్థానం తరపున గదులతో కూడినవి ఉన్నాయి.

దేవస్థానం అమరియున్న గుట్ట పేరు రత్నగిరి. పంపానదీ తీరాన ఉన్న రత్నగిరికి విశేష ప్రభావం ఉందని తెలుస్తుంది. పురణకధల్లో- మేరువు ఇద్దరు కుమారులు భద్రుడు, రత్నకరుడుగా పేర్కునబడింది. భద్రుడు పెద్దవాడు. రత్నాకరుడు చిన్నవాడు. ఇద్దరు కూడా తమ పేరు చిరస్థాయిగా ఉండాలని తపస్సు చేయ సంకల్పించినవారు. భద్రుడే - భద్రగిరి, భద్రాచలంగాను, రత్నాకరుడు - రత్నగిరిగాను శాశ్వతత్వాన్ని సాధించారు. రెండు కొండల మీద విష్ణు స్వరూపాలే ప్రతిష్ఠత మవటం గమనార్హం. ఇక్కడి స్వామి త్రిపాద్విభూతి మహానారాయణుడు. నారాయణస్త్రంలో అలంకరించబిడిన వాడై, హిరణ్య గర్భాత్మకుడై తనదేవేరి శ్రీ అనంతలక్ష్మీ సత్యవతీ అమ్మవారి సమేతుడై శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వెలసి భక్తులకనుగ్రహం ప్రసాదిస్తున్నాడు- భక్త జన శరణ్యుడిగా సాక్షాత్కరిస్తున్నాడు. ఆలయం కూడా రెండతస్తులుగా ఉంటుంది. ఆగమశాస్త్ర విధిగా క్రింది భాగంలో యంత్ర ప్రతిష్ఠ జరిగింది. స్వామివారి దివ్య మంగళమూర్తిని రెండవ అంతస్థులో దర్శించగలము.

కళ్యాణోత్సవాలు:
శ్రీ వారి దివ్య కళ్యాణోత్సవాలు వైశాఖ శుద్ధ దశమీ విశేషోత్సవాలకు తోడు, ఉగాది, శ్రీరామనవమి, వినాయక చాతుర్థి - గణపతి నవరాత్రోత్సవాలు, శరన్నవరాత్రులు, సంక్రాంతి, శుద్ధ ఏకాదశి, భీష్మైకాదశి వగయిరా పర్వదినోత్సవాలు వైభవంగా జరుగుతాయి. ప్రతి నిత్యమూ జరిగే అర్చనలు, పూజలు, భక్తుల సామూహిక వ్రాతాలు నిత్య కళ్యాణం పచ్చతోరణ వైభవాలు మనకు అన్నవరంలో కనిపిస్తాయి. ఈ ప్రాంతంలో గల సంపన్న ఆలయాల్లో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చును. నిరంతరం భక్తులు యాత్రికులు వస్తూ సందడిగా వుంటుంది.
అన్నవరం...... ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా శంఖవరం మండలానికి చెందిన గ్రామము. అన్నవరం కలకత్తా - మద్రాసు జాతీయ రహదారి పై రాజమండ్రి నుండి దాదాపుగా 70 కి.మీ, కాకినాడ కి 45 కి.మి. దూరంలో ఉంది. ఈ గ్రామం లోని అన్నవరం రైల్వే స్టేషన్ విశాఖపట్టణం-విజయవాడ రైలుమార్గం లో వస్తుంది. అన్నవరం ఒక సుప్రసిద్ద పుణ్యక్షేత్రం. శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వారి దివ్యక్షేత్రం. తూర్పు గోదావరి జిల్లా లో శంఖవరం మండలానికి చెందిన గ్రామము. ఈ ప్రాంతం ప్రతినిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది. హిందువులు పవిత్రంగా భావించే కార్తీకమాసంలో ఇచ్చట కనీవినీ ఎరుగని రీతిలో భక్తులు వస్తుంటారు. అన్నవరం లో రత్నగిరి పర్వత శ్రేణి కొండపై శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయం వున్నది.

అన్నవరం- పిలిస్తే పలికే దైవంగా పేరుపొందిన శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయాన్ని రత్నగిరి అనే కొండపై అన్నవరంలో నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణం అయి ఒక శతాబ్దము పైగా మాత్రమే ఐనా చాలా ప్రాశ్యస్త్యాన్ని, ప్రాముఖ్యతను పొందింది. సమీపంలో పంపా నది హోయలొలుకుతూ పారుతుంటుంది. కొండపై నెలకొని ఉన్న ఈ దేవాలయంలో వేంచేసి ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి ని దర్శించేందుకు గుడివరకు ఘాట్ రోడ్డు నిర్మించారు. మెట్లు గుండా కూడ వెళ్ళవచ్చు. ఇక్కడ సామూహికంగా వందలాది దంపతులు కూర్చుని ఒకేసారి సత్యనారాయణస్వామి వ్రతాన్ని కనుల పండువగా చేసికొంటూ ఉండటం ఒక ప్రత్యేకత; చూచి తీరవలసిన సుందర దృశ్యం. ఇతిహాసాల ప్రకారం అడిగిన (అనిన) (వరం)వరాలను తీర్చే దేవుడు కాబట్టి ( అనిన+ వరం = అన్నవరం) "అన్నవరం దేవుడు" అంటారు.

స్థలపురాణం ప్రకారం పర్వతశ్రేష్ఠులలో ఒకడైన మేరు పర్వతం ఆయన భార్య మేనక శ్రీమహావిష్ణువు గురించి తపం ఆచరించి విష్ణువు అనుగ్రహం తో ఇద్దరు కొడుకులను పర్వతాలుగా పొందుతారు. ఒకడేమో భద్రుడు, ఇంకొకడు రత్నకుడు. భద్రుడు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తి కి నివాస స్థానమైన భద్రాచలం గా మారుతాడు. రత్నకుడు అనే ఇంకో కొడుకు కూడా విష్ణువు గురించి తపమాచరించి మెప్పించి మహావిష్ణువు శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి గా వెలసే రత్నగిరి, లేదా రత్నాచలం కొండ గా మారుతాడు.
తూర్పు గోదావరి జిల్లాలో పిఠాపురంకి సమీపంలో గోరస గ్రామ ప్రభువు శ్రీ రాజా ఇనుగంటి వేంకటరామారాయణిం బహద్దరు వారి ఏలుబడిలో అరికెంపూడి దగ్గర అన్నవరం అనే గ్రామం ఉంది. అక్కడ ఈరంకి ప్రకాశరావు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన మహా భక్తుడు. ఒకనాడు శ్రీమహావిష్ణువు వీరికీ, శ్రీ రాజా ఇనుగంటి వేంకటరామారాయణిం బహద్దరు వారికీ ఏక కాలంలో కలలో కనపడి "రాబోవు శ్రావణ శుక్ల విదియా మఖా నక్షత్రములో గురువారము నాడు రత్నగిరిపై వెలుయుచున్నాను. నీవు నన్ను శాస్త్రనియమానుసారము ప్రతిష్టించి సేవించుము" అని చెప్పి మాయమయ్యారు.

మరునాడు ఇరువురు కలసి, తమకు వచ్చిన కలను చెప్పుకొని, ఖరనామ సంవత్సర శ్రావణ శుక్ల పాడ్యమి నాటికే అందరు అన్నవరం చేరుకున్నారు. అక్కడ స్వామివారి కొరకు వెదుకుతుండగా ఒక అంకుడు చెట్టు(సం. కృష్ణకుటజము, కింద పొదలో స్వామి వారి పాదముల మీద సూర్యకిరణములు పడ్డాయి. వెంటనే వారు ఆ పొదను తొలగించి, స్వామి విగ్రహాన్ని రత్నగిరి కొండ పైకి తీసుకొని పోయి, కాశీ నుండి తెచ్చిన శ్రీమత్రిపాద్విభూతి మహావైకుంఠనారాయణ యంత్రాన్ని విష్ణుపంచాయతన పూర్వకంగా సాధారణ శకం 1891, ఆగష్టు 6 వ తేదీని (శాలివాహన శకం 1813) ప్రతిష్టించారు.
అన్నవరం సత్య దేవుని ఆలయ సముదాయము.
ఆలయాన్ని సా. శ. 1934 లో నిర్మించారు. పంచాయతనం ఉండటం చేత దానికి ప్రతీకగా ముందు గణపతి, శంకరుల చిహ్నములు గలవి, శూల శిఖరములతో ఉన్నవి అయిన రెండు చిన్న విమాన గోపురాలు, మధ్యగా ప్రధాన విమాన గోపురం, వెనుకగా ఆదిత్య దేవతా, అంబికా దేవతా ప్రతీకలగు చక్రశిఖరములు ఉన్న మరి రెండు విమాన గోపురాలూ ఉన్నాయి. ఒకే చోట ఇన్ని విధములైన భిన్న దేవతా చిహ్నాలు ఉండటం అపురూపం. పంపా నది ఒడ్డున ఉన్న రత్నగిరి మీద ఈ ఆలయం సముద్ర మట్టానికి 300 అడుగుల ఎత్తులో ఉన్నది. ఈ గుడికి పాదచారులు చేరు కోవడానికి 460 మెట్లు ఉన్నాయి.ప్రధాన ఆలయం రథాకారం లో ఉండి, నాలుగు దిక్కులలో నాలుగు చక్రాల తో ఉంటుంది. ప్రధాన ఆలయానికి ఎదురుగా కళ్యాణ మండపం ఉంటుంది. ఈ కళ్యాణ మండపం ఆధునిక నిర్మాణ చాతుర్యానికి ఒక మచ్చుతునక. వనదుర్గ ఆలయం, రామాలయాలు ప్రక్కన కనిపిస్తూ ఉంటాయి.

ఈ ఆలయం ఆ ప్రకారం రెండు అంతస్థులలో నిర్మింపబడింది.క్రింది భాగం లో యంత్రం, పై అంతస్థులో స్వామి విగ్రహాలు ఉన్నాయి. స్వామి విగ్రహం 4 మీటర్ల ఎత్తు ఉంది. క్రింద గర్భగుడి ఉన్న భాగాన్ని విష్ణు మూర్తి గా అర్చిస్తారు, మధ్యభాగం లో ఉన్నదానిని శివునిగా పూజిస్తారు. మూలవిరాట్టు అంతా ఏక విగ్రహంగా ఉండి త్రిమూర్తులు గా పూజింప బడడం ఇక్కడి విశేషం. త్రిపాద విభూతి నారాయణ ఉపనిషత్తు లో వర్ణింపబడిన యంత్రం ఇక్కడ ఉన్నది.
1970 లో ఈ ఆలయంపై పిడుగు పడగా ఆలయానికి బీటలు ఏర్పడ్డాయి. విమాన గోపురం వద్ద పగుళ్లు ఏర్పడ్డాయి. సుమారు నాలుగు కోట్ల రూపాయలను వెచ్చించి ఆలయాన్ని పునర్ నిర్మించారు. పునర్ నిర్మిగం తర్వాత స్వామి వారి విగ్రహాని పూర్తిగా దర్శించుకునే అవకాశం ఏర్పడింది. ఇంతకు ముండు గర్బాలయం ఇరుకుగా ఉండేది. ఇప్పుడు విశాలంగా వున్నది. ప్రధాన ద్వారానికూడ పెంచారు. దిగువన వున్న యంత్రాలయాన్ని కూడ విశాలంగా తీర్చి దిద్దారు. శిఖరాలను స్వర్ణ మయం చేశారు. కలశాలకు బంగారు తాపడం చేశారు. ఇలా ప్రస్తుత అన్నవర దేవుడు స్వర్ణ కాంతు లీనుతు దర్శనమిస్తున్నాదు.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి
« PREV
NEXT »