నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

Friday, January 12, 2018

స్ధిత ఊర్ధ్వపాదవిస్తృతాసనం - Stita Urdhva pada vistrtasana


స్ధిత ఊర్ధ్వపాదవిస్తృతాసనం చేయు విధానము మరియు ఉపయోగాలు…

స్ధిత ఊర్ధ్వపాదవిస్తృతాసనం:-
  • - కూర్చొని కాళ్ళను సగం చాపి మడమలు నేలకు ఆనించాలి.  
  • - చేతులతో బొటనవేళ్ళను పట్టుకోవాలి.  
  • - చేతుల సాయంతో కాళ్ళను నేలకు కొంచెం పై భాగానికి తీసుకురావాలి.  
  • - పిరుదులు భాగం మాత్రమే నేలమీద ఉండాలి.  
  • - సుదీర్ఘ శ్వాస తీసుకుంటూ కాళ్ళను వెడల్పు చేసి చేతులు, కాళ్ళు నిటారుగా ఉంచి చేయాలి.  
  • - ఉండగలిగినంత సేపు ఉండి పూర్వపుస్ధితికి రావాలి.(3 లేదా 5 సార్లు)  
స్ధిత ఊర్ధ్వపాదవిస్తృతాసనం - Urdhva pada vistrtasanaఉపయోగం: 
1. కాళ్ళు, తొడలు, చేతులు, జబ్బలు, భుజాలు, కండరాలు, ఎముకలు పుష్టివంతంగా తయారవుతాయి.
2. వెన్నెముక చివరిభాగం బలోపేతమై మూలాధారచక్రం సక్రమమగును.
3. సయాటికా, పక్షవాతం లాంటి వ్యాధులు రాకుండా ఉపయోగపడుతుంది.
4. మూలశంక వ్యాధి తొలగును జననేంద్రియ సమస్యలు నివారించుకోవచ్చు.
5. ఋతుక్రమము సక్రమమగును.

హెచ్చరిక:
పైన నుదహరించిన యోగ-విధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ సూత్రాలు మాత్రమే, పూర్తి యోగాసనాలు నేర్చుకొనుటకు యోగ అధ్యాపకుడిని సంప్రదించగలరు !  ...

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

« PREV
NEXT »

GAU NATURALS - Swadesi Products

Cow Based Cultivated Rice,Dals,Spices.Hand Churned DESI COW GHEE,Panchgavya Products,Ayurvedic Products..
స్వదేశీ గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయం లో పండించిన పంట ఉత్పత్తులు, చేతితో విసిరిన పప్పులు,గానుగ నూనె లు, గోశాల లో తయారు చేసిన ఆవు నెయ్యి, పళ్ళపొడి సబ్బు లు షాంపూలు,ఫినాయిల్ మరెన్నో స్వదేశీ ఉత్పత్తుల సమాహారమే - గౌ నాచురల్స్. www.gaunaturals.com