ప్రకృతి అందించిన గురువులు ఎవరో మీకు తెలుసా ? - who are the teachers of nature?

0
ప్రకృతి అందించిన గురువులు ఎవరో మీకు తెలుసా ? - who are the teachers of nature?

ప్రకృతి అందించిన గురువులు

సద్గురువులు కావాలని ఈరోజుల్లో ఎందరో ఎదురుచూస్తున్నారుకాని మనం పుట్టిన నాటి నుండి చనిపోయే వరకు నిత్యం క్షణకాలం పాటు మనల్ని విడువకుండా ఉండే గురువులును ఎందుకు గుర్తించలేకపోతున్నారు?

ప్రకృతి ఇచ్చిన గురువులు: నేల, నింగి, గాలి, నీరు, నిప్పు, పంచభూతాలు. ప్రకృతి లో ఉన్న ఈ పంచభూతాలతో నిర్మితమైనదే మానవదేహం.
  1. నేల : ఎందరు ఎన్నిరకాలుగా వాడుకున్నా సహిస్తుంది. నేలకు సహనం సహజగుణం. పుట్టిన దగ్గర నుండి నిన్ను మోసి, చివరికి తనలో కలుపుకుంటుంది. ఇలాంటి నేలను చూసి మీరు ఏమి నేర్చుకున్నారు?
  2. నీరు : ఎన్ని మలినాలు చేసినా సహజంగా శుద్ధి చేసుకుంటుంది. అలానే కాక శుబ్రం చేసే గుణం కలిగి ఉంది. మనషి ఎల్లప్పుడూ శుచిగా ఉండాలనే జ్ఞానాన్ని సూచిస్తుంది. దీనిని చూసి ఏమి నేర్చుకున్నావు?
  3. నిప్పు : మలినాలను పోగొడుతుంది. దేవతలకు మనం చేసే యజ్ఞంయాగాది క్రతువుల నుండి ఆహారాన్ని అందిస్తుంది. లోకాలకే వెలుగులు ప్రసాదిస్తుంది. నిప్పులో నిర్మలత్వం ఉంది. దీని వలన ఏమి నేర్చుకున్నావు?
  4. గాలి : ఎప్పుడూ నిరాపేక్షంగా ఉపకారం చేస్తుంది. పువ్వులలో ఉండే పుప్పొడిని తీసుకెళ్ళి పరపరాగ సంపర్కం గావించి వృక్ష సంపదను వృద్ది పొందిస్తుంది. మనిషికి నిరంతరం చెట్లనుండి ఆక్సిజన్ అందిస్తుంది. ఇలా గాలిని పరోపకార బుద్ది నేర్పుతుంది. దేనిలో ఉన్న పరోపకార బుద్దిని అలవరచుకున్నారా?
  5. ఆకాశం : ఎన్ని కారుమబ్బులు కమ్ముకున్నా ఆకాశం ఎప్పటికీ నిర్మలంగానే ఉంటుంది. మనిషి జీవితం మాయ ప్రపంచం చుట్టూ తిరుగుతూ మనస్సుకు అనేక మాయలు కల్పిస్తుంది. ఈ మాయల మబ్బుల నుండి వివడటానికి నిర్మలత్వాన్ని చూపిస్తున్న ఆకాశం నుండి ఏమి తెల్సుకున్నారు?
తుమ్మెద పువ్వులలో ఉన్న తేనెను మాత్రమే ఆస్వాదిస్తుంది. మనిషికూడా విషయంలో ఉన్న సారాన్ని మాత్రమే గ్రహించాలి. కాని మనిషి మాత్రం విషయాన్నే వక్రీకరణ బుద్దితో ఆలోచిస్తున్నాడు.

చేపను చూసి జిహ్వ చాపల్యం చంపుకోవాలి. ఎరను చూసి పట్టుకోవాలని ప్రయత్నించి చివరికి చనిపోతుంది. మనిషి కోరికల ఎరకు చిక్కి ఆయుష్షుని తగ్గించేసుకున్తున్నాడు.
చివరికి అమ్మాయి చేతికి ఉన్న గాజు కూడా గురువే. ఒక్కగాజు నిశబ్దంగా ఉంటే నాలుగు గాజులు గోలచేస్తాయి. ఒంటితనం తోనే మనిషి ఏదైనా సాధించడానికి అవకాశం కలిగిస్తుంది. నలుగురిలో ఉంటే విషయం మీద ధ్యాస తగ్గిపోతుంది.

ఇలా ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్కటీ మనకు అనేకరకాలుగా భోదిస్తుంటే మనం మాత్రం పట్టించుకోవడం లేదు.
మరి గురువులు చెప్పే విషయాలు వింటారా?
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top