ప్రపంచములోనే ఎక్కువ పాపాలు చేస్తున్న దేశం.. - Papalu Yekkuva chese desam - Most Sinful Country in this world

0
"ఆస్ట్రేలియా" ప్రపంచములోనే ఎక్కువ పాపాలు చేస్తున్న దేశం........పరిశోధనలో వెళ్ళడి
భూమండళములో ఎక్కువ పాపాలు చేస్తున్న దేశం "ఆస్ట్రేలియా" అని ఒక పరిశొధనలో తేలిందట.

మొత్తం 7 పాపాలో, అన్ని పాపాలలోనూ మొదటి స్థానం సంపాదించి ఎక్కువ పాపాలు చేస్తున్న దేశముగా "ఆస్ట్రేలియా" ప్రకటించబడింది.

కామవాంఛ, అత్యాశ, అహంకారం, తిండిపోతు తనం, సోమరితనం, ఆగ్రహము మరియూ అసూయ అను 7 పాపాలను లెక్కకట్టి ఈ పరిశొధన చేయబడుతుందట.

ఈ సారి ఈ పరిశొధనలో ఎక్కువ పాపాలు చేస్తున్న దేశముగా "ఆస్ట్రేలియా" మొదటి స్థానం చేపట్టిందని బి.బి.సీ వారి ఫోకస్ పత్రికలో ప్రకటించబడిందని కొరియర్ మైల్ దిన పత్రిక తెలిపింది. బి.బి.సీ వారు ఈ ఫోకస్ పత్రికలో సైన్స్, టెక్నాలజీ మరియూ భవిష్యత్తు గురించి రాస్తారట. అలాంటి పత్రికలో అవమానకరమైన గౌరవం "ఆస్ట్రేలియా" పొందిందని తెలిపేరు.


ఆస్ట్రేలియా వారి పెద్ద బలహీనం "అసూయ" పడటంట. అందుకనే ఆ దేశం ఎక్కువ పాయింట్లతో అమేరికా, కెనడా, ఫిన్లాండ్, మరియూ బ్రిటన్ కన్నా ఎక్కువ స్థానాలు ఎదిగి మొదటి స్థానం సంపాదించిందట.

ఈ పరిశోధనా వ్యాసంలో "మానవులు ప్రక్రుతిగా మంచివారు కారు" అని వాదిస్తూ, ఈ 7 పాపాలలో ప్రతి మనిషీ ఏదో ఒక పాపానికి లోనవుతాడని, అలా ఒక పాపము కంటే ఎక్కువ పాపములను చేసే విధానాన్ని గమనించి ఈ పరిశోధన జరపబడుతోందని తెలియపరిచేరు.

ఈ పాపాలు చేసే దేశాల పట్టీలో తిండిపోతుతనంలో అమేరికా, కామ వాంఛలో దక్షిణ కోరియా, అహంకారం మరియూ సోమరిపోతుతనంలో ఐస్లాండ్, అత్యాశలో మెక్సికో మొదటి స్థానం వహిస్తున్నట్లు పరిశొధనా ప్రకటనలో వెలువడించేరు


రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top