నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

Wednesday, April 25, 2018

శ్రీ‌కాళ‌హ‌స్తిస్వర ఆల‌య స‌మాచారం - Sri Kalahastiswara Aalaya samacharam

శ్రీ‌కాళ‌హ‌స్తిస్వర ఆల‌య స‌మాచారం - Sri Kalahastiswara Aalaya samacharam
శ్రీ‌కాళ‌హ‌స్తి  ఆల‌యంలోని వివిధ సేవ‌ల‌, అర్చ‌న‌ల స‌మాచారం:

శ్రీకాళహస్తీశ్వరాలయంలో  ఉదయం 5.00 గంటల మంగళవాయిద్యాలు, గోమాతపూజ, సుప్రభాతం పూర్తయ్యాక 6.00 గంటలకు సర్వదర్శనానికి అనుమతించనున్నారు. ద్వితీయ కాల అభిషేకానంతరం నిత్యోత్సవం, నిత్యకల్యాణం, చండీ, రుద్రహోమాలు నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రాహు, కేతు సర్పదోష నివారణ పూజలు నిర్వహించనున్నారు. ఉదయం 7.30, 9.00, 10.00 సాయంత్రం 5.00 గంటలకు స్వామి, అమ్మవార్లకు ఆర్జిత అభిషేకసేవలు జరగనున్నాయి. ముక్కంటీశుని దేవేరి అయిన జ్ఞానాంబికకు ప్రదోష కాల సమయంలో అష్టోత్తర శత స్వర్ణ కమల పుష్పార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. మనోన్మణికి ప్రత్యేక వూంజల్‌సేవ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు.

ఆలయ బసవసతి, ఆర్జిత సేవా టిక్కెట్ల విషయమై 8578222240, 08578221336 నంబర్ల్లకు డయల్‌చేసి వివరాలు తెలుసుకోవచ్చు.

ఆర్జిత సేవలు.. వాటి ధరలు సుప్రభాతసేవ రూ.50, గోమాత పూజ రూ.50, అర్చన రూ.25, సహస్రనామార్చన రూ.200, త్రిశతి అర్చన రూ.125, ప్రదోష కాల సమయంలో స్వామి, అమ్మవార్లకు మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం రూ.1500 (సోమవారం, మాసశివరాత్రి, అమావాస్య, ఆరుద్రనక్షత్రం ఉన్న రోజుల్లో) రోజువారీ సేవలుగా స్వామి, అమ్మవార్లకు క్షీరాభిషేకం రూ.100, పచ్చకర్పూర అభిషేకం (స్వామి వారికి)రూ.100, రుద్రాభిషేకం రూ.600, పంచామృత అభిషేకం రూ.300, నిత్యదిట్ట అభిషేకం రూ.100, శనేశ్వర అభిషేకం రూ.150, అఖండ దీపారాధన రూ.200, ప్రత్యేక ప్రవేశం రూ.50, వీఐపీ బ్రేక్ దర్శనం రూ.200, నిత్యోత్సవం రూ.58, నిత్య కల్యాణోత్సవం రూ.501, రుద్రహోమం రూ.1116, చండీ హోమం రూ.1116, అష్టోత్తర శత స్వర్ణ కమలార్చన (శుక్రవారం మాత్రమే)రూ.వెయ్యి, ప్రత్యేక ఆశీర్వచనం రూ.500, సాధారణ సర్పదోష పూజలు రూ.300, ప్రత్యేక సర్పదోష నివారణ రూ.750, ఆశీర్వచన, సర్పదోష నివారణ రూ.1500 (చెంగల్వరాయ స్వామి ఆలయానికి ఎదురుగా), ప్రత్యేక ఆశీర్వచన సర్పదోష నివారణ పూజలు రూ.2500 (రుద్రాభిషేక సంకల్ప మండపం వద్ద), ఏకాంతసేవ రూ.200.వాహనపూజలు (పెద్దవి) రూ.25,(చిన్నవి) రూ.20.


రచన: కోటి మాధవ్ బాలు చౌదరి


« PREV
NEXT »