స్త్రీ రజస్వల అగుట - శుభ మరియు అశుభ ఫలితములు? - Stri Rajaswalaguta

0
/stri-rajaswala-ante-ardham-girl-becoem-Menarche
 రజస్వల..!!🍁

రజోదర్శనము అనగా స్త్రీ రజస్వల అగుట. ప్రధమ రజోదర్శనమునకు వాడుకలో సమర్థ, పుష్పవతి, పెద్దమనిషి అయినదని కూడా అంటారు. నెల నెల రజోదర్శనమును బహిష్టు అంటారు.

ప్రధమ రజస్వల ప్రాతః కాలము నుంచి మధ్యాహ్నము లోపు అయిన శుభము. మిగిలిన కాలము అశుభము.

రజస్వలకు దుష్ట తిధులు:
 • అమావాస్య,
 • ఉభయ పాడ్యమిలు,
 • షష్టి,
 • అష్టమి,
 • ద్వాదశి తిదుల యందును
 • పరిఘ యోగముల పూర్వార్ధమునందును,
 • వ్యతీపాత,
 • వైధృతి యోగములందును,
 • సంధ్యా కాలమునందును,
 • ఉప్పెన, భూకంప మొదలైన ఉపద్రవ కాలమందును
 • భద్ర కరణము నందును
 • మొదటిసారి రజస్వల అయిన శుభకరము కాదు.
/stri-rajaswala-ante-ardham-girl-becoem-Menarche
వారఫలము:.
సోమ, బుధ, గురు, శుక్ర వారములందు ప్రధమ రజస్వల అయిన శుభ ఫలము, ఆది, మంగళ, శని వారములందు అశుభ ఫలము కలుగుతుంది.

శుభ నక్షత్రములు: ✶
 1. అశ్విని,
 2. రోహిణి, 
 3. మృగశిర, 
 4. పుష్యమి, 
 5. ఉత్తర, 
 6. హస్త, 
 7. చిత్త, 
 8. స్వాతి, 
 9. విశాఖ, 
 10. అనూరాధ, 
 11. మూల, 
 12. ఉత్తరాషాఢ ,
 13. శ్రవణం, 
 14. ధనిష్ఠ, 
 15. శతభిషం, 
 16. ఉత్తరాభాద్ర, 
 17. రేవతి 
యీ నక్షత్రములందు ప్రధమ రజస్వల అయిన సౌభాగ్యము, సౌఖ్యము, సంతానము, ఆయువు, ధనము కలుగుతుంది.

మిగిలిన నక్షత్రములు అశుభ ఫలములు ఇచ్చును. కావున శాంతి చేయాలి. రజస్వల కాకుండానే వివాహాలు జరిపించే పూర్వపు రోజుల ప్రకారము భర్త యొక్క జన్మ నక్షత్రము నాడు హాని అని చెప్పబడినది.

దుష్ట నక్షత్రములందు ప్రధమముగా రజస్వల అయినపుడు హోమయుక్తమైన శాంతి జరిపించి దానాదులు నిర్వహించి తిరిగి షుహ నక్షత్రములో రజోదర్శనమైన తదుపరి శుభ ముహూర్త కాలమందు గర్భాదానము చేయాలి. ఆ విధంగా చేసిన యెడల సంతాన ప్రాప్తి కలుగుతుంది మరియు..
గ్రహణ సమయములందు,
సంక్రాంతి యందు,
అశుభమైన నిద్రా సమయములందు,
అర్ధరాత్రి యందు
ప్రధమ రజస్వల అయినచో యుక్తమైన శాంతులు నిర్వహించాలి.

శుభ తిధులు: 
తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి, పౌర్ణమి తిధులు శుభము.

లగ్న గ్రహ ఫలము:
ప్రదమ రజోదర్శన సమయమున..
కేంద్ర, కోణ, లాభ స్థానములందు శుభ గ్రహములు, తృతీయ, షష్ట లాభ స్థానములందు క్రూర గ్రహములు శుభ ఫలములిస్తాయి.
చంద్రుడు అష్టమ స్థానమునందు వుండిన పతి నాశనము కలుగజేస్తాడు. కాని చంద్ర తారాబలములు సంపన్నమైనపుదు పుత్ర, ధన సంపత్తులు కలుగుతాయి. కుజుడైనను లేక చంద్రుడైనను లగ్నమునకు 3, 6, 10 స్తానములన్డున్నచో సంపంన్నులగు కుమారులు కలుగుతారు.

నక్షత్ర గ్రహ ఫలము:
రజస్వలా సమయ నక్షత్రమందు గురుడుగాని, శనిగాని వున్నాను, యే గ్రహము లేకున్నను శుభము. రజస్వలా సమయ నక్షత్రము నందు కుజుడున్నను బుధ శుక్రులు కలిసి వున్నను, రవి వున్నను రాహు కేతువులున్నను అశుభము.

రజోదర్శన స్థాన ఫలితము:
తన యింటి యందును,
గొడ్డల చావిడియందును,
స్వగ్రామ మధ్యమందు,
జల సమీపమున,
ఇంటి ఆవరణ మధ్య..
ప్రధమ రజస్వల అయిన శుభము. గ్రామము బయట, ఇతర గ్రామములందు, నగ్నముగా వున్నపుడు ఇతరుల యిండ్లలోను ప్రదమ రజస్వల అయిన అశుభము.

వేళా విశేషములు:
 • ప్రాతః కాలం..చిర సౌభాగ్యం,
 • ఉషః కాలం..సౌభాగ్యలోపం,
 • పూర్వాహ్నం..పుణ్య క్షేత్ర దర్శనం,
 • మధ్యాహ్నం..ధనవతి, పుత్రవతి,
 • సాయంత్రం..జారగుణం,
 • సంధ్యలందు..చెడుప్రవర్తన కలది,
 • అర్ధరాత్రి..బాల వైధవ్యం కలుగును.
రాత్రి వేళ నిర్ణయం:
రాత్రి రజస్వల అయినచో రాత్రిని మూడు భాగాలుగా చేసి రెండు భాగముల కాలము పూర్వదినము, మూడవ భాగకాలమున తదుపరి దినమునకు చెందుతుంది.

వస్త్రఫలము:
 • తెల్లబట్ట కట్టుకొని రజస్వల అయిన సౌభాగ్యవతి,
 • గట్టి బట్ట కట్టుకొని రజస్వల అయిన పతివ్రతయు, దుకూల వస్త్ర దారియైన పట్టపురాణి యగును,
 • నూతన వస్త్రము ధరించగానే శుభ సంపన్నురాలగును, చిరిగిన బట్ట కట్టుకొనిన దౌర్భాగ్య రాలగును,
 • యెర్రని బట్టకట్టుకోనిన వ్యాధి గ్రస్తురాలగును,
 • నల్లని వస్త్రము ధరించినదైన దరిద్రురాలగును.
రజస్వలా శుద్ధి:
రజోవతి అయిన స్త్రీ..
మొదటి దినమునందు చండాల స్త్రీ సమానురాలు, రెండవ దినమందు పతితురాలితో సమానురాలు, మూడవ దినమునందు చాకలి స్త్రీతో సమానము, నాలుగవ దినమున కూడా శూద్ర స్త్రీ సమానురాలు, అయిదవ దినమందు దేవ పితృ కార్యములందు పరిశుద్దురాలూ అన్నారు.

నాలుగవ దినమందు స్నాముచేత శుచి కాగలదు. బహిష్టు అయిన స్త్రీ మూడు రోజుల తరువాత శుద్ధి అవుతుంది. తిరిగి మళ్ళీ పంతొమ్మిది రోజులలో బహిష్టు అయిన ఒక దినముతో శుద్ధి అట్లుగాక ఇరవై రోజుల అనంతరము ఎప్పుడైనా బహిష్టు అయిన మూడు రోజుల తరువాత శుద్ధి అగును.

ప్రధమ రజస్వల అయిన కన్యకు అక్షతలు తలపై వేసి ఆసనమేసి కూర్చుండ బెట్టాలి. దీపమున్న గదిలోనే కన్యను ఉంచాలి. సువాసినులకు శ్రీ గంధము, పుష్పములను,తాంబూలములను లవణము, పెసలు మొదలగునవి ఇవ్వాలి.

ప్రధమ రజస్వల అయిన వస్త్రముతోనే మూడు రోజులు ఉంచాలి. ఎవరిని తాకకుండా జాగ్రత్త గా, ప్రశాంతముగా, ఉండునట్లు చూడాలి. భోజన విషయంలో పులగము, నెయ్యి, పాలు వంటి సాత్విక ఆహారము ఉప్పు, పులుపు, కారము లేకుండా ఇచ్చుట మంచిది, నాలుగవ రోజు స్నానము చేయించి నూతన వస్త్రములు కట్టించాలి.

సర్వ ఋతువులకు సాధారణ నియమములు:.💐
మూడు దినములు ఎవరిని తాకకూడదు. అభ్యంగనము, కాటుక, స్నానము, పగలు నిద్రించుట , అగ్ని ముట్టుట, ప్రాసనము, సూర్యావలోకనము, భూమిపై గీతాలు గీయుట చేయుట చేయకూడదు. క్రింద పడుకోవాలి, ఆవుపాలు, పెరుగు, మజ్జిగ, తాంబూలము, గంధమాల్యములు ఉపయోగించరాదు. ఇవన్నీ ఆరోగ్యము కొరకు పాటించే నియమములు..

సర్వే జనా సుఖినో భవంతు..!!


రచన: కోటి మాధవ్ బాలు చౌదరి


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
Translate this post ⬇

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top