వాస్తు ప్రకారం ఇంటి అలంకరణ - Vastu Prakaram Inti Alankarana - Vastu Home Decor

0
వాస్తు ప్రకారం ఇంటి అలంకరణ - Vastu Prakaram Inti Alankarana - Vastu Home Decor
ఇంటి అలంకరణలో వాస్తు ప్రకారం వస్తువులు ఎలా పెట్టుకోవాలి?

ఇంటి నిర్మాణంలోనే కాదు ఇంటీరియర్‌ డిజైనింగ్‌లో కూడా వాస్తును పాటించడం ద్వారా ఇంట్లో సానుకూల శక్తి ప్రవహించేలా చేసుకోవచ్చు. మనం ఉండే ఇంట్లో మనకు సానుకూలమైన దిక్కులు, ప్రతికూల దిక్కులూ ఉంటాయి. సానుకూలమైన వాటిని సాధ్యమైనంత తేలికగా ఉంచడం మంచిది. ఇంట్లో ఫర్నిచర్‌ సర్దుకునేప్పుడు భారీగా ఉండే దానిని ప్రతికూల ప్రాంతంలోనూ, తేలికపాటివి సానుకూల ప్రాంతాల్లోనూ సర్దుకోవడం మంచిది. సాధారణంగా ప్రతికూల జోన్లు ఇంటికి దక్షిణంలో, పశ్చిమంలో, నైరుతిలో ఉంటాయి. కనుక ఇంట్లో సామాన్లు ఏవి ఎక్కడ సర్దుకుంటే మంచిదో వాస్తు శాస్తవ్రేత్తలు కొన్ని టిప్స్‌ ఇస్తున్నారు.
 • డ్రాయింగ్‌ రూంలో సోఫాను వేసేటప్పుడు గదిలోని పడమర లేక దక్షిణ దిక్కులో వేసుకోవాలి. ఆ సోఫాలో కూర్చున్న వ్యక్తి తూర్పు లేక ఉత్తర ముఖంగా ఉండాలి.
 • బెడ్‌రూంలో మంచాన్ని నైరుతి మూలను వదిలేసి నైరుతి దిక్కులో వేసుకోవాలి.
 • విలువైన నగలు, డబ్బులు పెట్టే బీరువాలను నైరుతి దిక్కుని వదిలి నైరుతిలోనే పెట్టుకోవాలి. దాని తలుపులు ఉత్తరముఖంగా ఉండేలా పెట్టుకోవాలి.
 • వంటింట్లో కానీ, డైనింగ్‌ హాల్లో కానీ డైనింగ్‌ టేబుల్‌ వేసుకునేటప్పుడు దానిని గదికి వాయువ్య దిక్కులో ఉండేట్టుగా చూసుకోవాలి.
 • స్టడీ టేబుల్‌ను గదికి ఉత్తర లేదా తూర్పు దిక్కున వేసుకోవాలి.
 • అలాగే డ్రాయింగ్‌ రూంలో పెట్టుకునే అక్వేరియంను ఉత్తరం, తూర్పు లేదా ఈశాన్య దిక్కులలో పెట్టుకోవాలి. ఎందుకంటే అందులో నీరు ఉంటుంది కనుక...  పైన పేర్కొన్న దిక్కులు నీటికి సంబంధించినవి కనుక.
1. పెయింటింగ్స్‌, శిల్పాలు: ఇంట్లో ప్రకృతి సహజమైన సూర్యోదయం, జలపాతం వంటి చిత్రాలు పెట్టుకోవడం మంచిదని వాస్తు చెప్తుంది. యుద్ధాలకు సంబంధించిన, హింసాత్మకంగా ఉండే చిత్రాలను ఇంట్లో ఉంచకపోవడమే మంచిది. అలాగే బెడ్‌రూంలో దేవుని పటాలు పెట్టుకోకూడదు. చాలామంది వినాయకుడి బొమ్మలను డెకొరేటివ్‌ పీసులుగా వాడుతుంటారు. ఈ బొమ్మలను దేవుని గది లేదా పూజ కోసం ప్రత్యేకంగా నిర్దేశించిన స్థలంలో ఉంచడం మంచిది. అలాగే ఇంట్లో ఏ గదిలోనైనా ఈశాన్యంలో భారీ శిల్పాలను పెట్టుకోకపోవడమే మంచిది.

2. విద్యుత్‌ ఉపకరణాలు: ఇంట్లో మనం అనేక ఎలక్ట్రికల్‌ వస్తువులను వాడుతుంటాం. గ్యాస్‌, ఒవెన్లు, మైక్రోవేవ్‌ వంటివాటిని ఆగ్నేయంలో పెట్టుకోవాలి. స్నానాల గదిలో గీజర్‌ను ఆగ్నేయ దిక్కులో పెట్టుకోవాలి. కూలర్‌, ఎసి, ఫ్రిడ్జ్‌ వంటి వాటిని గదికి వాయువ్య దిక్కున ఉంచడం మంచిది. టివిని ఉత్తరం లేదా తూర్పు లేదా ఆగ్నేయంలో పెట్టుకోవాలి. విద్యుత్‌ ఉపకరణాలను ఈశాన్య దిక్కున పెట్టకుండా చూసుకోవడం మంచిది.

వాస్తు ప్రకారం ఇంటి అలంకరణ - Vastu Prakaram Inti Alankarana - Vastu Home Decor
 • కర్టెన్లు: బెడ్‌రూంలో వేసుకునే కర్టెన్లు లేత రంగుల్లో ఉండేలా చూసుకోవాలి. పడకగదిలో ఎరుపు, నలుపు రంగు కర్టెన్లను వాడకపోవడమే మంచిది. ముందురు రంగు కర్టెన్లను లివింగ్‌ రూమ్‌లో వాడడం మంచిది.
 • అద్దం: అద్దాన్ని గదిలో ఉత్తరం లేదా తూర్పు గోడకు పెట్టుకోవడం మంచిదని వాస్తు చెబుతోంది. స్టడీ రూంలోనూ, బెడ్‌రూంలో పడక ఎదుట అద్దం పెట్టకపోవడమే మంచిది.
 • ఇన్‌డోర్‌ ప్లాంట్స్‌: ఇంట్లో మొక్కలను పెట్టుకోవడం ఇప్పుడు ఫ్యాషన్‌గా మారింది. అయితే మొక్కను ఎంచుకునేప్పుడు మాత్రం ముళ్ళగా ఉండే కాక్టస్‌ మొక్కలను ఎంచుకోవద్దని వాస్తు విద్వాంసులు చెప్తున్నారు. అలాగే ఇంటికి ఈశాన్య దిక్కులో పెద్ద మొక్కలను పెట్టుకోకపోవడమే మంచిది.
 • పెయింట్‌ : లేత రంగుల పెయింట్లు వాస్తు ప్రకారం మంచిది. లేత నీలం, ఆకుపచ్చ, పింక్‌, క్రీమ్‌ కలర్లను గదులకు వాడడం మంచిది. ఇరట్లో ఎరుపు, నలుపు రంగులను వాడకపోవడమే మంచిది.
 • ఫ్లోరింగ్‌: మొజాయిక్‌, సెరామిక్‌ టైల్‌, మార్బుల్‌ వంటివాటిని ఫ్లోరింగ్‌కు ఎంచుకోవడం మంచిది. గదులలో వైట్‌ మార్బుల్‌ను వేసుకోవద్దు. ఎందుకంటే దీనిని పవిత్రంగా భావిస్తారు. పూజ గదులలోను, ఆలయాలలోనూ దీనిని ఉపయోగించడం మంచిది.
 • సీలింగ్‌: ఫ్లాట్‌ సీలింగ్‌ ఆవాసాలకు మంచిది. అలాగే గది సీలింగ్‌ ఎత్తుగా ఉండకూడదు.
 • లైటింగ్‌: ఇంట్లో వెలుతురు ధారాళంగా ఉండాలి. ఇంట్లో మసక వెలుతురు ఉండడం అక్కడ నివసించే వారికి మంచిది కాదు.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top