నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

Wednesday, April 1, 2020

శ్రీరాముడి జాతకం వివరాలు - Sri Rama Jatakam

శ్రీరాముని  జాతకం.
వాల్మికి మహర్షి రామాయణంలో బాలకాండలో 18 వ సర్గ లో 8. 9. 10  శ్లోకాలలో శ్రీరాముని జనము అప్పటి గ్రహస్తితిని, లగ్నాన్ని ఇలా చెప్పాడు.  లగ్నం కర్కాటకం ,లగ్నములో గురు చంద్రులు. మరియు  రవి మేషంలోను, మకరంలో కుజుడు, కర్కాటకంలో గురువు.  మీనంలో శుక్రుడు, తులలో శని. ఈ ఐదు గ్రహములు  ఉచ్చ స్తితి పొందియున్నవి. మిగిలిన గ్రహముల స్తితి వాల్మీకి చెప్పలేదు.  ఇలా గ్రహములు ఉన్నచో  ఫలాలు ఎలా ఉండునో , శాస్త్రమున ఏమి చెప్పిరో  వివరించెదను. ఈ గ్రహములు  కుడా లగ్నమునుండి , 1 వ  4 వ, 7 వ, 9 వ  10 వ  స్తానాలలో ఉన్నారు.  ఇందులో 1, 9,  కొణములుగను, 4,7,10 కేంద్రములగను  శాస్త్రమున చెప్పబడినవి.  
    శ్రీరాముడి జాతకం వివరాలు - Sri Rama Jatakam
  • లగ్నము కర్కాటకము - ఈ రాశికి అధిపతి చంద్రుడు  లగ్నములో నున్నాడు. మరియు వృద్ధి చంద్రుడు ఫలములు.  దృఢ శరీరము కలవాడు, చిరంజీవి, నిర్భయుడు, బలిష్టుడు, అగును.
  • రవి మేషమున ఉచ్చస్తితి  పొందిన. - భూములు, ధనము, భార్య పుత్రులు, కీర్తి, శౌర్యము, పరాక్రమము, కలుగును. కాని విరోధము, దేశము విడిచిపోవుట,సంచార వినోదము కలుగును. 
  • కుజుడు మకరమున  ఉచ్చస్తితి పొందిన - రాజ్యము, రాజస్నేహము, భూమి ధనము, వాహనములు, విదేశ యానము, రాజ సన్మానము, భార్యవలన దుఃఖము,  కలాహము, జయము కలుగును.ఇక్కడ కొంచం కుజదోషముచెప్పాలి  7 వ ఇంట కుజుడు బలదోషమైనా, కర్కాటక లగ్నం వలన, చంద్ర, గురు దృష్టి వలన కొంత  దోషం నివృత్తి అయినది.   అందుచే కొంత కాలము భార్యతో ఎడబాటు తప్పలేదు.
  • గురుడు కర్కాటకమున ఉచ్చస్తితి పొందిన - రాజ్యము, మహా సౌఖ్యము, కీర్తి, మనోవిలాసము, రాజ్యాభిషేకము, స్వకులమునకు అధిపతి అగుట, విదేశయానము, కృశించిన శరీరము, దుఃఖము కలుగును.
  • శుక్రుడు మీనమున ఉచ్చస్తితి పొందిన -  స్తీ మూలమున నష్టము, లోకవిరుద్ధమైన ధర్మాచరణము, తల్లి తండ్రులకు దుఃఖము,  రాజ సన్మానము, భార్యతో భోగములు, భోజనము,,  భార్యా పుత్రులతో సుఖము కలుగును.  ఈ శుక్రుడు ఉచ్చలో ఉన్నను శత్రువు ఇంట నున్నాడు.  అందుచే  అంత శుభములు కలుగవు.
  • శని తులలో ఉచ్చలో నున్న ఫలములు -   గ్రామములకు సభలకు అధిపతి. వినోద శీలము, పిత్రునాశనము, బంధువులతో కలహము, దేశాటన చేయుట, దుఃఖము, రోగభయము, రాజులతో వైరము, యుద్ధము సంభవించును. 
జ్యోతిష శాస్త్రమున చెప్పిన ఈ ఫలములు శ్రీరాముని జీవితమున  ఎక్కువ భాగము కనిపించును.


రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

« PREV
NEXT »

GAU NATURALS - Swadesi Products

Cow Based Cultivated Rice,Dals,Spices.Hand Churned DESI COW GHEE,Panchgavya Products,Ayurvedic Products..
స్వదేశీ గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయం లో పండించిన పంట ఉత్పత్తులు, చేతితో విసిరిన పప్పులు,గానుగ నూనె లు, గోశాల లో తయారు చేసిన ఆవు నెయ్యి, పళ్ళపొడి సబ్బు లు షాంపూలు,ఫినాయిల్ మరెన్నో స్వదేశీ ఉత్పత్తుల సమాహారమే - గౌ నాచురల్స్. www.gaunaturals.com