దైవ నిద్ర - Daiva Nidra


దైవ నిద్ర - Daiva Nidra
హా విష్ణువు ఆషాఢ మాసంలో ఏకాదశి రోజున పడుకుంటాడు. కార్తీక మాస శుక్లపక్ష ఏకాదశి వరకు నిద్రపోతాడు. క్షీరాబ్ది ద్వాదశినాడు మళ్లీ నిద్ర లేస్తాడు. నిద్ర లేచి తులసి బృందావన ప్రవేశం చేస్తాడు. అందుకే ఆ రోజు తులసి చెట్టుకు, ఉసిరిచెట్టుకు పూజలు చేస్తారు. ఈ మాటలు విన్న వెంటనే మీలో కొందరికి మహావిష్ణువు నిద్రపోతే లోకాల్ని ఎవరు పరిపాలిస్తారు? అయినా దేవుడు నిద్రపోవటమేమిటి? ఇలాంటి ప్రశ్నలు తలెత్తి ఉంటాయి. "కృతఘ్నఘ్నాయ దేవాయ బుద్ధిషాం పతయే నమః..". ఉదయాన్నే ఈశ్వరుడు వచ్చే సమయానికి లేచి స్వాగతం చెప్పాలి. ఎవరైతే లేవరో వారు కృతఘ్నులే. ఈశ్వరుడికి స్వాగతం చెప్పకుండా నిద్రపోతే జీవుడు పరమేశ్వర స్వరూపం కాలేడు. అలాంటిది- దేవుడే నిద్రపోతే? కానీ, మహావిష్ణువు నిద్రపోడు. కేవలం నిద్రపోయినట్లు నటిస్తాడు. అందరినీ భ్రమింపచేస్తాడు. కానీ అనుక్షణం కనిపెట్టుకొనే ఉంటాడు. అయినా వాసుదేవుడు, వామదేవుడు ఒకరేనని ముందే చెప్పుకున్నాం. అందుకే కార్తీక మాసాన్ని వైష్ణవులు కూడా జరుపుకుంటారు. కార్తీక దామోదరుడిని కోలుస్తారు. అసలు కార్తిక దామోదరుడు అంటే ఏవరు? " ఉదరే దామ యస్యేతి.." అని అమరకోశం చెబుతుంది.

కడుపు మీద తులసిమాల ఉన్నటువంటివాడిని దామోదరుడు అని పిలుస్తారు. అలాంటి వాడు ఎవరు? దీనికి కూడా "దామ్యే ఉదర మాత్రా బద్ధ ఇతి దామోదరః" అని అమరకోశంలో ఒక శ్లోకం ఉంది. " అమ్మతో, ఒక తాటితో కట్టబడి నడుం ఒరిసిపోయినవాడు దామోదరుడు." అంటే శ్రీకృష్ణుడు. అయితే ఇదంతా విన్న తర్వాత "అసలు పరమేశ్వరుడికి అమ్మ ఎవరు?" అనే అనుమానం కూడా రావచ్చు. పరమేశ్వరుడు లేనినాడు ఈ లోకాలే లేవు. ఆయన ఎప్పుడు పుట్టాడో కూడా ఎవరికి తెలియదు. అలాంటి వాడికి తల్లేమిటి? ఈ భూమిపైకి వచ్చిన తర్వాత పరమేశ్వరుడికి తల్లి ప్రేమ తెలిసి వచ్చింది. ఆయన ఆ ప్రేమబంధంలో చిక్కుకుపోయాడు. అప్పటి దాకా ఆయనకు అమ్మ తెలియదు. అమ్మ పాలు తెలియదు. యశోద పాలు తాగటం మొదలుపెట్టిన తర్వాత ఆ బంధంలో చిక్కుకుపోయాడు. ఈ మొత్తం వ్యవహారాన్ని పోతన తన భాగవతంలోని దామోదర లీలలో అత్యద్భుతంగా వర్ణించారు. దామోదర లీల విశేషమేమిటంటే- బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, సన్యాసులు- ఈ నాలుగు ఆశ్రమాల్లో ఉన్నవారు దీనిని వింటారు.

రచన: కళ్యాణ్

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top