బ్రాహ్మణ సంక్షేమ బ్యాంకు ఆవశ్యకత - Importance of Brahmana Bank


ధునిక సమాజంలో బ్రాహ్మణ కుటుంబాలను ఆదుకునే నాదుడే కరువైనారు. ఆర్థికంగా బలహీనులైన బ్రాహ్మణ సోదర కుటుంబాలను యావత్ ప్రపంచంలో భూమి పై ఎక్కడ ఉన్న పెద్దన్నల కాపాడటానికి బ్రాహ్మణ ప్రాపంచిక సంక్షేమ బ్యాంకు స్థాపించి అ బ్యాంకు బ్రాంచిలను ప్రపంచ నలుమూలల ప్రతి పట్టణము, తాలుక, గ్రామములో ఏర్పరిచి ఆ బ్యాంకులో ప్రతివారి వొక రూపాయీ చొప్పున ప్రతిరోజు ప్రపంచం నలుమూలల డాలర్లు,పౌండులు, డినారులు,రియర్లు,ఎన్నులు చొప్పున ఆదా చేస్తే. ఆ నిల్వ ఉంచిన ధనాన్ని వడ్డీతో సహా పెంచుతూ పోతే వొక సంవస్త్తరములో ఆ సొమ్ము మల్టీ బిల్లియన్ డాలర్స్ రూపాయలు ఆవుతుంది. ఈ సొమ్మును పేద బ్రాహ్మణ సంక్షేమానికి అనగా,విద్యార్థుల చదువులకు,కంపెనీస్ పెట్టి నిరుద్యోగ అమస్య తీర్చేందుకు, అమ్మాయి మరియు అబ్బాయిల పెళ్ళిళ్ళు చేసేందుకు,వృద్ధ సంరక్షణకు సద్వినియోగ పరచవచ్చు. 

ఈ బ్రాహ్మణ ప్రాపంచిక సంక్షేమ బ్యాంకుల నిర్వహణ బాధ్యత పీటాధిపతులకు,స్వచంద సంస్థలకు, విశ్రాంతి ఉద్యోగులకు, సద్బుద్ధి కలిగిన యువకుల ఉమ్మడి భూత, వర్తమాన,భవిష్యత్ తరాల అధికార సారధ్యంలో నడిపిస్తే సలక్షణంగా ఉంటుందని నేను మనస్పూర్తిగా ఆశిస్తున్నాను. ఈ బ్యాంకులో జమ చేయ బడ్డ సొమ్మంత దాన కింద బ్రాహ్మణ సర్వ రంగ జీవన పురోభి వృద్ధికి ఉపయోగ పరుస్తారు. 

ఈ భ్రుహత్ కార్య క్రమాన్ని భారత దేశ అఖిల భారత బ్రాహ్మణ సంఘాలన్ని తు. చ తప్పకుండ అఖండంగా దిగ్విజయ పరిచేందుకు మనసా,వాచా,కర్మణా, కృషి చేయాలనీ అందుకు ఆ భగవంతుడు ఈ కలియుగ ప్రధమ పాదం లో ఏ అడ్డంకులు అడుగడుగునా కలగకుండా ఆశీర్వదించాలని యావత్ ప్రాపంచిక బ్రాహ్మణుల తరపున సృష్టి కర్తను ప్రార్థిస్తున్నాను.

సర్వేజన సుఖినోభవంతు, సర్వ మంగళానిభవంతు. 
స్వస్తి.

రచన: H.V.S.R.C. SHARMA C.ENGR.(RTD)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top