తొలి తిరుపతి - శ్రీ వేంకటేశ్వరుడు" మొదటిగా వెలసిన క్షేత్రము - Tholi Tirumala


తొలి తిరుపతి - శ్రీ వేంకటేశ్వరుడు" మొదటిగా వెలసిన క్షేత్రము - Tholi Tirumala

"శ్రీ వేంకటేశ్వరుడు" మొదటిగా వెలసిన క్షేత్రము ఎక్కడవుందో తెలుసుకుందామా !! తొలి తిరుపతి"..

తిరుపతి అనగానే మనకు గుర్తుకువచ్చేది చిత్తూరు జిల్లాలోని "తిరుమల తిరుపతి దేవస్థానం".

అయితే తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురం టౌన్లో కు అతిచేరువులో తిరుపతి వుందని, అదే తొలి తిరుపతి అని, అది సింహాచలం 8000 సంవత్సరాలు, తిరుమల తిరుపతి 6000 సంవత్సరాలు ... మరియు దేశంలోని ఇతర ప్రసిద్ది చెందిన నూట ఎనిమిది వైష్ణవ క్షేత్రాల కంటే మిక్కిలి పురాతనమై , పరమ పవిత్రమై న చిరుమందహాస చిద్విలాస శ్రీ శృంగార వల్లభ స్వామి శోభాయమానంగా స్వయంభువుగా కొలువుదీరిన దేవాలయానికి 9000 (తొమ్మిది వేల సంవత్సరాల) చరిత్ర వుందని చాలా మందికి తెలియదు.

విష్ణుమూర్తి శిలా రూపంలో మొదట ఇక్కడే వెలసినందుకు ఈ తిరుపతిని తొలితిరుపతి అని పిలుస్తారు..

స్వయంభువుగా స్వామి వారు వెలసిన ప్రతి చోటా ఆళ్వారులు వుంటారు అలాగే ఇక్కడ కూడా గర్బాలయం పక్కన ఎడమ వైపు ఆళ్వారుల విగ్రహాలు వున్నాయి.

ఆలయ చరిత్ర:

ఒకానొకప్పుడు ఇప్పుడు తొలి తిరుపతి ఉన్న గ్రామమంతా కీకారణ్యం ధృవుని సవతి తల్లి అయిన సురుచి ధృవునికి సింహాసనం దక్కకుండా కుతంత్రాలు నడుపుతున్నసమయంలో, ధృవుని తల్లి అయిన సునీతి నువ్వు సింహాసనం అధిష్టించి రాజ్యపాలన చేయాలంటే శ్రీ మహావిష్ణువుని ప్రసన్నం చేసుకోమని చెప్పిందట.

అప్పుడు ధృవుడు తపస్సు చేయడానికి ఈ కీకారణ్యం చేరుకున్నాడట.
అదే సమయంలో అక్కడ శాండిల్య మహాముని ఆశ్రమం ఉందట. అప్పుడు ధృవుడు శాండిల్య మహాముని దర్శనం చేసుకుని శ్రీ మహా విష్ణువు యొక్క తపస్సు విధానం అడుగగా, ఆ ముని " నాయనా విష్ణుమూర్తి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని తలుచుకుంటూ తపస్సు చేయి" స్వామి ప్రత్యక్షమై నీ కోరిక నేరవేరుస్తాడు అని చెప్పి తపస్సుకి కావాల్సిన ఏర్పాటు చేసాడట.

ఆ మహాముని చెప్పినట్లే "దివ్య కాంతులతో శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించాడట" అయితే ఆ కాంతిని చూడలేక ధృవుడు బయపడ్డాడట. అప్పుడు విష్ణుమూర్తి నాయనా భయమెందుకు నేనూ నీ అంతే వున్నాను కదా అని నవ్వుతూ ధృవుని తలనిమిరి అతని భయాన్ని పోగొట్టాడట. ఆ తరువాత స్వామి ధృవునికి దర్శనమిచ్చిన చోటే శిలా రూపంలో వెలిసాడట.

స్వామి..నీ అంతే వున్నాను కదా అని చెప్పినందుకు ఆలయ ప్రవేశ ద్వారం వద్ద గచ్చు మీద ఉన్న పుష్పం పైనుంచుని చూసిన వాళ్ళు ఎంత ఎత్తులో వుండి చూస్తే అంత ఎత్తులోనే దర్శనమిస్తాడు (చిన్న వాళ్లకు చిన్నవాడిగా పెద్దవాళ్ళకు పెద్ద వాడిగా) అనమాట..

ఆ అరణ్య ప్రాంతం లో వెలిసిన స్వామి ఎండకు ఎండి వానకు తడవడం చూసి దేవతలే స్వయంగా స్వామికి ఆలయాన్ని నిర్మించారు.

ఆ తరువాత శ్రీ లక్ష్మీ దేవి వారిని - నారద మహర్షి ప్రతిష్టించారట. తరువాత శ్రీ కృష్ణ దేవరాయల వారు భూదేవి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు (దీనికి శిలా శాసనాలే ఆధారం).

ఆలయ విశిష్టత:
  • 1) చిద్విలాస వేంకటేశ్వరుడు (నవ్వుతున్నట్టుగా వుండే విగ్రహం )
  • 2) విగ్రహం చిన్న పిల్లలకు చిన్నగానూ పెద్దవారికి పెద్దగానూ (ఎంత ఎత్తులో ఉండేవారికి అంతే ఎత్తులో కన్పిస్తుంది )
  • 3) తిరుమల తిరుపతి వేంకటేశ్వరుని విగ్రహానికి పూర్తి విభిన్నంగా శంఖ – చక్రాల స్థానం మారి వుంటాయి.
  • 4) ఆలయ ప్రాంగణం లోనే శివాలయం వైష్ణవాలయం రెండూ వున్నాయి.
  • 5) సంతానం లేని దంపతులు ఆలయం వద్ద నూతిలో స్నానం చేసిన సంతాన ప్రాప్తి లబిస్తుంది.
  • 6) ఏకశిలా కళా ఖండాలు... విగ్రహమూర్తి .. ఉత్సవ మూర్తి ... ప్రదాన ఆకర్షణ.
ఈ దేవాలయం సామర్లకోటకు 10 కిమీ దూరంలో పెద్దాపురం టౌన్ కు అతి చేరువలో వున్నది. సామర్లకోట నుంచి ప్రత్తిపాడు వెళ్లే దారిలో దివిలి వస్తుంది. ఈ దివిలి కి 1 కిమీ దూరం లోనే ఈ ఆలయం ఉంది.

ఆలయ విశేషాలు తెలుసుకున్నారు కదా !! మరి మీకు వీలున్నప్పుడు తప్పక స్వామివారిని దర్శించుకుంటారని ఆసిస్థూ..

"ఓం నమో.. శ్రీ వేంకటేశ్వరాయ నమః"..
"ఓం నమో.. శ్రీ విష్ణువే నమః"..

అనువాదం: కోటి మాధవ్ బాలు చౌదరి 

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top