తిరుమల సమాచార వేదిక - Tirumala Contact Info


తిరుమల టీటీడీ సమాచారం వేదికలు - Tirumala Contact Info
టీటీడీ సమాచారం తెలుసుకునేందుకు:
  • టీటీడీ కాల్‌సెంటర్‌లో శ్రీవారి ఆర్జిత సేవలు, వసతి సమాచారం కోసం 
  • 👉సంప్రదించాల్సిన నెంబర్లు: 0877–22 33333, 2277777, 2264252
  • 👉టీటీడీ వెబ్‌సైట్‌ : www.tirumala.org
  • 👉ఈ–మెయిల్‌:  webmaster@.tirumala.org
  • 👉సేవలు, వసతి ఆన్‌లైన్‌ బుకింగ్‌: www.ttdsevaonline.com
  • 👉టీటీడీ దాతల విషయ వివరాల కేంద్రం: 0877–2263472
  • 👉ఉచిత సేవలకు డబ్బులు అడిగితే టీటీడీ విజిలెన్స్‌ టోల్‌ఫ్రీ నెం: 18004254141 సంప్రదించవచ్చు
ప్రతి నెల మొదటి శుక్రవారం ‘డయల్‌ యువర్‌ ఈవో’ కార్యక్రమంలో  0877–2263261 ఫోన్‌ చేసి నేరుగా కార్యనిర్వహణాధికారితో భక్తులు మాట్లాడవచ్చు. టీటీడీ పరిధిలో తమకు ఎదురైన  సమస్యలు, సంఘటనలపై ఫిర్యాదులు, పరిష్కార మార్గాలపై సూచనలు చేయవచ్చు.

ఇక్కడ ఫిర్యాదులు చేయొచ్చు
అసౌకర్యానికి గురైన భక్తులు తమ ఫిర్యాదులను యంత్రాంగానికి తెలియజేసేలా కూడా టీటీడీ చర్యలు చేపట్టింది.

విచారణ కార్యాలయం
  • వైకుంఠం క్యూకాంప్లెక్స్, అన్నదానం, కళ్యాణకట్ట, కాటేజీ విచారణ కార్యాలయాల వద్ద ఈ ఫిర్యాదుల పెట్టెలు ఏర్పాటు చేశారు 
  • ఎక్కడైనా ఉచిత సేవలకు, ఇతర కార్యక్రమాలకు డబ్బులు అడిగితే విజిలెన్స్‌ టోల్‌ఫ్రీ నెం: 18004254141 సంప్రదించవచ్చు. 
  • ప్రతి నెల మొదటి శుక్రవారం ‘డయల్‌ యువర్‌ ఈవో’ కార్యక్రమంలో నేరుగా కార్యనిర్వహణాధికారికి భక్తులు ఫిర్యాదులను, సలహాలను అందజేసే సౌకర్యం కూడా ఉంది.
దాతల విరాళాల విభాగం:
టీటీడీ నిర్వహిస్తున్న ట్రస్టులు, స్కీముల కోసం విరాళాలు ఇచ్చే భక్తులు నేరుగా తిరుమలలో ఆదిశేషు అతిథి గృహంలోని దాతల విభాగంలో అందజేయవచ్చు. ఈవో, టీటీడీ పేరుతో తీసిన డీడీ, చెక్‌లు మాత్రమే తీసుకుంటారు. నేరుగా నగదు స్వీకరించరు. రూ.లక్ష ఆపైన విరాళం అందజేసిన దాతలకు బస, దర్శనం, ఇతర బహుమానాలను టీటీడీ అందజేస్తోంది. దాతలకు పాస్‌ పుస్తకాలు ఇస్తారు. పోస్టులో పంపే డీడీలు కూడా స్వీకరిస్తారు. అదనపు సమాచారం కోసం... 087722–63472, 2263727కు సంప్రదించవచ్చు.

నిత్యాన్న ప్రసాదానికి కూరగాయల విరాళం
అన్నప్రసాదాల తయారీ కోసం రోజూ టన్నుల కొద్దీ కూరగాయలు వాడతారు. వాటిలో టమోటాలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వంటి కూరగాయల్ని భక్తులు విరాళంగా ఇస్తే టీటీడీ అధికారులు స్వీకరిస్తారు. అదనపు వివరాల కోసం 0877–226458 నెంబరుకు సంప్రదించవచ్చు.

విరాళాలిచ్చే దాతలకు బస, దర్శనం
టీటీడీ నిర్వహిస్తున్న ట్రస్టులు, స్కీముల కోసం విరాళాలు ఇచ్చే భక్తులు నేరుగా తిరుమలలో ఆదిశేషు అతిథి గృహంలోని  దాతల విభాగంలో అందజేయవచ్చు. ఈవో, టీటీడీ పేరుతో తీసిన డీడీ, చెక్‌లు మాత్రమే తీసుకుంటారు. నేరుగా నగదు స్వీకరించరు. రూ.1 లక్ష ఆ పైన విరాళం అందజేసిన దాతలకు బస, దర్శనం, ఇతర సత్కారాలను టీటీడీ అందజేస్తోంది. పోస్టులో పంపే డీడీలు కూడా స్వీకరిస్తారు. అదనపు సమాచారం కోసం ఫోన్‌: 087722–63472, 2263727 నంబర్లకు సంప్రదించవచ్చు.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top