నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

Sunday, January 19, 2020

కోతి కొమ్మచ్చి ఆట - Kothi Kommacchi Ata

కోతి కొమ్మచ్చి ఆట - Kothi Kommacchi Ata
కోతి కొమ్మచ్చి ఆట
దీన్ని పల్లెల్లో కాలు కింద కర్ర అని కూడా పిలుస్తారు. ఇది పిల్లలకు ఎంతో ఇష్టమైన ఆట. ఇందులో ఎంత మందైనా ఆడవచ్చు. చెట్లెక్కే వారు ఈ ఆట ఆడుతుంటే, ఎక్కేందుకు రాని వారు చూసి ఆనందిస్తారు. ముందుగా అందరు కలిసి చప్పట్లు వేస్తారు. చివరిగా మిగిలిన వ్యక్తి దొంగ. చెట్టు కింద సర్కిల్‌ గీసి అందులో చిన్న కర్ర వేస్తారు. 

ఇలా వృత్తాకారంలో గీచిన గీతను గిరి అని కూడా పిలుస్తారు. అలా విసరిన కర్రను దొంగ తీసుకొచ్చి గిరిలో ఉంచుతాడు. ఆ తర్వాత మిగతా వారిలో ఎవరో ఒకరిని తాకడానికి ప్రయత్నిస్తాడు. వారు అతనికి దొరకకుండా చెట్లెక్కి దాగి ఉంటారు. దొంగ వారిలో ఎవరో ఒకరిని తాకగల్గితే అలా దొరికిన అతను తర్వాత దొంగ అవుతాడు. ఒక వేళ దొంగ ఒకరిని తాకే ప్రయత్నంలో ఉండగా ఎవరో ఒకరు గిరిలో ఉన్న కర్రను తొక్కినట్లయితే మరలా అతనే దొంగగా ఉంటాడు.

ఆటగాళ్లంతా భద్రంగా చెట్లెక్కేస్తారు - ఇద్దరు తప్ప. జట్టులోని మేటి ఆటగాడొకరు చెట్టు కింది లేక సమీపంలోని ఒక వృత్తం(గిరి అంటారు) మధ్యలో ఎడమకాలిమీద నిలబడి, కుడికాలు మోకాలివరకు పైకెత్తి, ఆ కాలి కిందుగా కుడిచేత్తో ఒక మూరడు పొడుగున్న కర్రని విసరగలిగినంత దూరం విసరగానే, అతని ఎదురుగా నిలబడిన దొంగగా పిలవబడే ఆటగాడు పరుగునవెళ్లి ఆ కర్రను తెచ్చి గిరిలో పెట్టాలి. ఈ లోగా కర్ర విసిరినవాడూ చెట్టెక్కేస్తాడు. ఇప్పుడు చెట్టుమీదున్న వాళ్లలో ఎవరైనా ఒకరు దొంగకు దొరక్కుండా (అందకుండా) గిరిలోని కర్రను తాకగలిగితే దొంగ మళ్లీ దొంగావతారం ఎత్తాలి. ఎవరూ కర్రను తాకక మునుపే ఎవరైనా దొంగకు దొరికితే (చెట్టు మీదయినా కిందయినా) ఆ ఆటగాడు దొంగవుతాడు. దొంగ కర్రకు కాపలాగా గిరిలోనే వుండిపోకుండా ఎవరినైనా దొరకబుచ్చుకొనే ప్రయత్నంలో వుండాలి. 

ఈ ఆట ద్వారా శారీరకంగానూ, మానసికంగానూ వ్యాయామం పొందవచ్చు. ఈ ఆటగాళ్ళు శారీరకంగా చాలా చలాకీగా తయారు కాగలరు. పూర్తిగా ఆటలో మునిగి ఆడతారు గావున, మానసికంగానూ బలవంతులయ్యే అవకాశాలు మెండు. ఈ ఆట, ఖర్చులేని ఆట, సామూహికంగా ఆడతారు కాబట్టి, స్నేహవాతారణము అలవడుతుంది. 

సంకలనం: కోటి మాధవ్ బాలు చౌదరి
« PREV
NEXT »

GAU NATURALS - Swadesi Products

Cow Based Cultivated Rice,Dals,Spices.Hand Churned DESI COW GHEE,Panchgavya Products,Ayurvedic Products..
స్వదేశీ గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయం లో పండించిన పంట ఉత్పత్తులు, చేతితో విసిరిన పప్పులు,గానుగ నూనె లు, గోశాల లో తయారు చేసిన ఆవు నెయ్యి, పళ్ళపొడి సబ్బు లు షాంపూలు,ఫినాయిల్ మరెన్నో స్వదేశీ ఉత్పత్తుల సమాహారమే - గౌ నాచురల్స్. www.gaunaturals.com