9 రోజులు పాటు శ్రీరామదీక్ష, అందరూ ఆహ్వానితులే - SriRaama Deeksha14-03-2019 తేది శనివారం శ్రీ మహావిద్యాపీఠం మరియు ధర్మజగరణ ఆధ్వర్యంలో 25 మార్చి ఉగాది నుండి ఏప్రిల్ నాలుగోవ తేదీవరకు 9 రోజులు పాటు #శ్రీరామదీక్ష అనే కార్యక్రము గురించి విజయవాడలోని ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశం జరిగింది ఈ కార్యక్రమంకి #ధర్మధ్వజం తరుపున మన ఉమాశంకర్ గారు మరియు కలిదింది సురేష్ రాజుగారు పాల్గొన్నారు.


కార్యక్రమ వివరాలలోకి వెళితే శ్రీ రామచంద్రుని న్యాయపరిపాలనను ఆయన జన్మభూమి అయోధ్యలో శ్రీ రామచంద్రుని ఆలయాన్ని కాంక్షిస్తూ ఈ నెల 25 మార్చి ఉగాది నుండి ఏప్రిల్ నాలుగోవ తేదీవరకు 9 రోజులు పాటు శ్రీ రామ దీక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది.
9 రోజులు పాటు శ్రీ రామనవమి వరకు అత్యంత శ్రద్దలతో నియమనిష్ఠలతో శ్రీ సీతారాములు పూజించి అనంతరం నవమి రోజున అయోధ్యకు, భద్రాచలం లేదా ఒంటిమిట్టకు వెళ్లి సీతారాములు దర్శించుకొని దీక్ష విరమణ చెయ్యాలి...అలా వెళ్ళటం విలుకాని వారి వారి ప్రాంతాలలోని రామలయాలలో వెళ్లి సీతారాములు దర్శించి దీక్ష విరమణ చెయ్యాలి

దీక్షలో పాటించలిసిన నియమాలు...
  • దీక్షకాలంలో ఉభయసంధ్యలో స్నానం చేసి దీపారాధన చేసి శ్రీ రామరక్ష స్తోత్రం పాటించడం భగవంతునికి ఏదైనా నివేదన చేసి శక్తి కొలది కుదిరితే రామకోటి వ్రాయటం
  • ఎల్లపుడు కుంకము చందనం ధరించటం మరియు మెడలో మాలను ధరించటం 9 రోజులు మాలను తియ్యరాదు
  • 9 రోజులు శ్రీ రామ పంచదశి మంత్రం జపించటం, భజన కార్యక్రమాలు చెయ్యటం
  • కుదిరితే 9 రోజులు దేవాలయాని దర్శించటం, శాకాహారం భుజించటం ప్రత్యేకమైన దుస్తువులు ధరించాలి అని ఏ నియమం లేదు.
శ్రీ రామ దీక్షకు సంబంధించిన శ్రీ రామ రక్ష స్తోత్ర కరపత్రాలు,జపమాలలు,బ్యానర్లు,జెండాలను రాష్టం లోని అన్ని ప్రదేశాలకు పంపడం జరిగింది ......మిగతా వివరాలకు ఫోన్ నెంబర్ 8985357724 ను సంప్రదించండి

మూలము: ధర్మ ధ్వజం - హిందు చైతన్య వేదిక

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top