కొరియా మహారాణిగా మారిన అయోధ్య ఆడపడుచు - Korea Mahaarani Ayodhya tho anubhandamకొరియా అయోధ్య‌ అనుబంధం
కొరియా, అయోధ్య‌ మ‌ధ్య ప్ర‌త్యేక అనుబంధం ఉంది. అయోధ్య‌కు చెందిన ఓ మ‌హారాణి.. 48వ శ‌తాబ్ధంలో కొరియాకు వెళ్లిన‌ట్లు చ‌రిత్ర‌కారులు వెల్ల‌డిస్తున్నారు. కొరియా దేశ పురాణాల ప్ర‌కారం.. అయోధ్య‌కు చెందిన ప‌ద‌హారేళ్ల యువ‌రాణి సూరిర‌త్న కొరియాకు వెళ్లింది. రాముడు పుట్టిన నేల నుంచి కొరియాకు వెళ్లిన ఆ యువ‌రాణి అక్క‌డ ఓ చిన్న రాజ్యాన్ని ఏలిన‌ట్లు చ‌రిత్ర‌కారులు చెబుతున్నారు. సుమారు రెండు వేల ఏళ్ల క్రితం క‌ర‌క్ సామ్రాజ్యాన్ని ఆమె పాలించారు. కొరియాలోని రెండ‌వ అతిపెద్ద న‌గ‌ర‌మైన బుసాన్ స‌మీపంలో ఈ సామ్రాజ్యం ఉన్న‌ది.
మ‌హారాణి హీరో హ‌వాంగ్ ఓకుగా - శ్రీరాముడు
మ‌హారాణి హీరో హ‌వాంగ్ ఓకుగా (సూరిర‌త్న‌) - శ్రీరాముడు 
అయోధ్య‌కు చెందిన‌ సూరిర‌త్న‌ను .. కొరియా ప్ర‌జ‌లు మ‌హారాణి హీరో హ‌వాంగ్ ఓకుగా పిలుస్తారు. తండ్రి ఆదేశాల ప్ర‌కారం సూరిర‌త్న త‌న సోద‌రుడితో క‌లిసి కొరియా వెళ్తుంది. ఈ ఘ‌ట‌న క్రీస్తు శ‌కం 48వ శ‌తాబ్ధంలో చోటుచేసుకుంద‌ని కొరియా చ‌రిత్ర‌కారులు చెబుతున్నారు. ఆ స‌మ‌యంలో కింగ్ కిమ్ సురో ఆమెకు ఆహ్వానం ప‌లికారు. పెళ్లి చేసుకున్న ఆ ఇద్ద‌రూ ఆ త‌ర్వాత క‌ర‌క్ సామ్రాజ్యాన్ని స్థాపించారు. కొరియా రాజు సూరిర‌త్న‌ను ఎంత‌గా ఇష్ట‌ప‌డ్డాడంటే.. వాళ్లు క‌లుసుకున్న మొద‌టి ప్రాంతంలో ఆమె కోసం ఓ ఆల‌యాన్ని నిర్మించాడు. సూరిర‌త్న 189 ఏళ్లు జీవించింద‌ని కొరియా గ్రంథాలు వెల్ల‌డిస్తున్నాయి. అయితే అయోధ్య రాజ‌వంశీకుల ఆన‌వాళ్లు ఉన్న వారు ఇప్ప‌టికీ కొరియాలో ఉన్నారు. సుమారు 60 ల‌క్ష‌ల మంది ఆ లిస్టులో ఉన్న‌ట్లు తెలుస్తోంది. మాజీ అధ్య‌క్షుడు కిమ్ డే జంగ్‌, మాజీ ప్ర‌ధాని కిమ్ జాంగ్ పిల్‌లు.. సూరిర‌త్న వంశానికి చెందిన‌వారేన‌న్న అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.
అయోధ్య దీపావళి వేడుకకు ప్రత్యేక అతిథిగా రాణి కిమ్‌ జుంగ్‌ సూక్‌
అయోధ్య దీపావళి వేడుకకు ప్రత్యేక అతిథిగా రాణి కిమ్‌ జుంగ్‌ సూక్‌, ఎడమవైపు యోగి ఆదిత్యనాథ్
క్రీస్తు శకం 48నాటి ప్రేమకథ..
అయోధ్య దీపావళి వేడుకకు ప్రత్యేక అతిథిగా కిమ్‌ జుంగ్‌ సూక్‌ రావడం వెనుక పూర్వకాలం నాటి ఓ ప్రేమకథ ఉందట. ఆనాటి అయోధ్య యువరాణి సూరిరత్న క్రీస్తు శకం 48వ సంవత్సరంలో కొరియా వెళ్లి అక్కడి యువరాజు కిమ్‌ సురోను వివాహామాడారని అయోధ్య ప్రజలు నమ్ముతారు. కొరియా యువరాజును పరిణయమాడిన తర్వాత సూరిరత్న పేరును హియో హ్వాంగ్‌ ఓక్‌గా మార్చారట. ఈ దంపతులు దక్షిణ కొరియాలోని గిమ్‌హాలో కరక్‌ వంశాన్ని స్థాపించి సుపరిపాలన అందించారని సంగూక్‌ యూసా అనే కొరియన్‌ పుస్తకంలో పేర్కొన్నారు. అంతేకాదు పాలనలో తనదైన ముద్రవేసిన కారణంగా సూరిరత్న జన్మస్థానమైన అయోధ్య పేరు మీద ‘ఆయుథ’ అనే రాజ్యాన్ని కూడా నెలకొల్పారని తెలుస్తోంది.
ఉత్తరప్రదేశ్ లో నిర్మిస్తున్న సూరిరత్న స్మారక చిహ్నం
ఉత్తరప్రదేశ్ లో నిర్మిస్తున్న సూరిరత్న స్మారక చిహ్నం
కాగా దక్షిణ కొరియాలోని గిమ్‌హా పరిసర ప్రాంతాల్లో సూరిరత్న స్మారక చిహ్నాలు అనేకం దర్శనమిస్తాయి. ఈ నేపథ్యంలో అయోధ్యలో ఆమెకు తగిన గుర్తింపు లభించాలని భావించిన దక్షిణ కొరియా ప్రభుత్వం.. సూరిరత్న స్మారక చిహ్నం నిర్మించాలని కోరగా యూపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఇరుదేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు బలపడాలనే ఉద్దేశంతో హియో హ్వాంగ్‌ ఓక్‌ పేరు మీద అయెధ్యలో సూరిరత్న స్మారకాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చింది. సుమారు 300-400 కోట్ల రూపాయలతో చేపట్టిన ప్రాజెక్టు ఖర్చును ఇరుదేశాలు సమంగా పంచుకున్నాయి. ఇన్ని ప్రత్యేక కారణాలు ఉన్న కారణంగానే రాణి సూరిరత్న స్మారక సందర్శనతో సూక్‌ తన అయెధ్య పర్యటనను ప్రారంభించారు.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌
అంతేకాదు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి స్మారక సుందరీకరణ పనులకు భూమి పూజ కూడా చేశారు. కాగా తమ ఆడపడుచు అత్తింటి బంధువుకు రాముడు, సీత వేషం వేసుకున్న కళాకారులు సరయూ నది ఒడ్డున ప్రత్యేక ఆహ్వానం పలికారు.

అనువాదము: శ్రీ 

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top