మీకు తెలుసా నెదర్లాండ్ దేశం గ్రేడ్-5 డచ్ విధ్యార్థులకు భగవద్గీత తప్పనిసరి అని - Bhagavad gita studies in netherlands

నెదర్లాండ్ దేశం గ్రేడ్-5 డచ్ విధ్యార్థులకు భగవద్గీత క్లాసులు ఖచ్చితంగా ఉండాలి అనే విధంగా చట్టం తీసుకువచ్చింది అనే వార్త కొన్ని సంవత్సరాల క్రితం చాలా వైరల్ అయింది!

అయితే అది ప్రభుత్వ నిర్ణయం కాదు,కొన్ని ప్రైవేటు పాఠశాల యాజమాన్యం తీసుకున్న నిర్ణయం అని తరువాత తెలిసింది ! ఏదైతేనేం ప్రైవేటు పాఠశాలల్లో అయినా భగవద్గీతను విధ్యార్థుల జీవితాల్లోకి తేవడం చాలా గొప్ప విషయం!

ఇదే విధంగా మన దేశంలోని కొన్ని ప్రైవేటు స్కూల్లల్లో అయినా కనీసం తొమ్మిదవ తరగతిలో 9 అధ్యాయాలు,10 వ తరగతిలో 9 అధ్యాయాలు ఒక ఉపవాచకం మాదిరిగా గీతా క్లాసులు ప్రారంభిస్తే విధ్యార్థులు ఎలాంటి పరిస్థితుల్లో అయినా స్థితప్రజ్ఞతతో ఉంటారు! వారిలో ఆత్మవిశ్వాసం,మానసికస్థైర్యం పెరుగుతుంది!పరిక్షల్లో ఫెయిల్ అయితే ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కాదు కదా దాని ఊహ కూడా రాదు!మన పిల్లలు నిఖార్సయిన భావి పౌరులుగా,వజ్రసంకల్పం ఉన్నవారిలా తయారవుతారు!

హరేకృష్ణ!

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top