నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

పండుగలు

పండుగలు
Showing posts with label మీకు తెలుసా?. Show all posts
Showing posts with label మీకు తెలుసా?. Show all posts

Monday, April 27, 2020

మీకు తెలుసా నెదర్లాండ్ దేశం గ్రేడ్-5 డచ్ విధ్యార్థులకు భగవద్గీత తప్పనిసరి అని - Bhagavad gita studies in netherlands

నెదర్లాండ్ దేశం గ్రేడ్-5 డచ్ విధ్యార్థులకు భగవద్గీత క్లాసులు ఖచ్చితంగా ఉండాలి అనే విధంగా చట్టం తీసుకువచ్చింది అనే వార్త కొన్ని సంవత్సరాల క్రితం చాలా వైరల్ అయింది!

అయితే అది ప్రభుత్వ నిర్ణయం కాదు,కొన్ని ప్రైవేటు పాఠశాల యాజమాన్యం తీసుకున్న నిర్ణయం అని తరువాత తెలిసింది ! ఏదైతేనేం ప్రైవేటు పాఠశాలల్లో అయినా భగవద్గీతను విధ్యార్థుల జీవితాల్లోకి తేవడం చాలా గొప్ప విషయం!

ఇదే విధంగా మన దేశంలోని కొన్ని ప్రైవేటు స్కూల్లల్లో అయినా కనీసం తొమ్మిదవ తరగతిలో 9 అధ్యాయాలు,10 వ తరగతిలో 9 అధ్యాయాలు ఒక ఉపవాచకం మాదిరిగా గీతా క్లాసులు ప్రారంభిస్తే విధ్యార్థులు ఎలాంటి పరిస్థితుల్లో అయినా స్థితప్రజ్ఞతతో ఉంటారు! వారిలో ఆత్మవిశ్వాసం,మానసికస్థైర్యం పెరుగుతుంది!పరిక్షల్లో ఫెయిల్ అయితే ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కాదు కదా దాని ఊహ కూడా రాదు!మన పిల్లలు నిఖార్సయిన భావి పౌరులుగా,వజ్రసంకల్పం ఉన్నవారిలా తయారవుతారు!

హరేకృష్ణ!

Friday, April 3, 2020

శ్రీ రామజన్మభూమి గురించి ప్రశ్నలు.. వాటికి సమాధానాలు - Sri Raama Janmabhoomi


శ్రీ రామజన్మభూమి గురించి ప్రశ్నలు.. వాటికి సమాధానాలు - Sri Raama Janmabhoomi
ప్ర : శ్రీ రాముడిని హిందువులంతా  దేవుడిగా ఎందుకు పూజిస్తారు?
జ: హిందూ సంప్రదాయం ప్రకారం, శ్రీ రాముడు  శ్రీ మహా విష్ణువు ఏడవ అవతారం. నాలుగు యుగాలలో రెండవదైన త్రేతాయుగంలో 3000 సంవత్సరాల క్రితం శ్రీ మహా విష్ణువు ధర్మాన్ని రక్షించడానికి శ్రీ రాముడిగా  అవతరించారు.  భారతదేశంలోనే కాదు, అనేక దక్షిణాసియా దేశాలే కాక, ప్రపంచంలోని దక్షిణ వైపు చాలా ప్రాంతాలలో,  అనేక మంది  శ్రీ రాముడిని పురాణ పురుషుడిగా, విష్ణువు ప్రతిరూపంగా కొలుస్తారు. పురావస్తు ఆధారాలు కూడా, శ్రీ రాముడి జీవితంలోని  అనేక ముఖ్యమైన అంశాలను  ధృవీకరించాయి. హిందూ సాహిత్యంలోని పవిత్ర పుస్తకం రామాయణం కూడా శ్రీరాముడి  ప్రాచీనతను  నిర్ధారించడానికి తగిన సాక్ష్యాలను అందిస్తుంది. ఇటీవల తవ్వకాలలో బయటపడ్డ ద్వారకా నగరం  కూడా శ్రీ రాముడి ఉనికిని ధృవీకరిస్తుంది.

ప్ర: ఆ ప్రదేశమే శ్రీ రామజన్మభూమి అనడానికి ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా?
జ: 1975-80లో, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తరపున, ప్రొఫెసర్ బి బి లాల్ నేతృత్వంలోని బృందం  రామాయణంలో పేర్కొన్న వివిధ ప్రదేశాలను  ధృవీకరించడానికి అయోధ్యలో విస్తృతమైన తవ్వకాలు జరిపింది. శ్రీ రామ జన్మభూమిని క్రీస్తుపూర్వం 7 వ శతాబ్దానికి ముందే  ఆక్రమించారని  ఈ బృందం నిర్ధారించారు.

బాబ్రీ కట్టడం దగ్గర తవ్విన రెండు గుంతలు, ధ్వంసం చేసిన ఆలయం స్తంభాల పునాదులను కనుగొనటానికి ఉపయోగపడ్డాయి. ఇవి బాబ్రీ నిర్మాణంలో  ఉపయోగించిన పద్నాలుగు కసౌటి-రాతి స్తంభాలతో పోలి ఉన్నాయి. ఈ స్తంభాలపై  12 వ శతాబ్దానికి చెందిన హిందూ శిల్పాలు ఉన్నాయి. అంతే కాక  1528 లో  ధ్వంసం చేసిన మందిరపు శిధిలాలు కూడా కనుగొన్నారు. వాటిలో ముఖ్యమైనది నాగరిలిపిలో 20 పంక్తులను చెక్కి ఉన్న 1.10 × 0.56 మీటర్లు ఉన్న ఒక పలక. ఇక్కడ  అందమైన విష్ణు – హరి ఆలయం ఉండేదని ఆ పంక్తులు పేర్కొంటున్నాయి.

ప్ర: క్రీ.శ. 1528 లో రామ మందిరం ధ్వంసం చేయబడిందని చెప్పడానికిఆధారాలేమైనా ఉన్నాయా ?
జ: భవ్యమైన ఆలయాన్ని ధ్వంసం చేసినట్లు ముస్లిం రికార్డులు ధృవీకరిస్తున్నాయి.  బ్రిటిష్ పాలన ప్రారంభం కావడానికి ముందు ఇక్కడకు వచ్చిన యూరోపియన్ సందర్శకులు కూడా ఈ  విధ్వంసం జరిగిందని పేర్కొన్నారు.  పురావస్తు అధ్యయనాలు బాబ్రీ నిర్మాణానికి ముందు ఆలయం ఉండేదని నిర్ధారిస్తున్నాయి.

బ్రిటిష్ వారు నిర్వహించిన భూ ఆదాయ రికార్డులలో  ఆ  స్థలాన్ని శ్రీరామజన్మ భూమిగా గుర్తించారు. 1886 నాటి ఒక తీర్పులో  కూడా  హిందువులకు పవిత్రమైన ఆ  స్థలంలోనే  బాబ్రీ నిర్మాణం జరిగిందని పేర్కొన్నారు.

ప్ర: అయోధ్యలో రామ మందిరాన్ని బాబర్ ధ్వంసం చేసాడని ఎలా చెప్పగలరు?
జ: బాబర్  పెర్షియన్ డైరీ ‘బాబర్ నామా’ ఆంగ్ల అనువాదంలో అన్నెట్ సుసన్నా బెవెరిడ్జ్ ప్రత్యేకంగా శ్రీ రామ మందిర ధ్వంసాన్ని ప్రస్తావించారు. శ్రీ రామ జన్మభూమి వద్ద ఉన్న ఈ పురాతన హిందూ మందిరపు ఠీవి, పవిత్రత బాబర్ ను ఎంతో ఆకట్టుకున్నాయని ఆమె వ్రాశారు. మొహమ్మద్ కు విధేయుడైన అనుచరుడిగా ఒక మసీదును ఆలయానికి  ప్రత్యామ్నాయంగా నిర్మించడం ముఖ్యమైన పనిగా బాబర్ భావించాడని ఆమె పేర్కొంది. ఆలయం  ధ్వంసం చేసినప్పుడు బాబర్ అయోధ్య చుట్టుపక్కలలోనే ఉన్నాడనడానికి  బాబర్ నామాలో అనేక ఆధారాలున్నాయి.  హిందువులను కాస్త శాంతింపచేయడానికి 50 సంవత్సరాల తరువాత, అక్బర్ యధాస్థానంలో సీతా కి రసోయి, గర్భగుడి సమీపంలో రామ్ చాబూతార్ నిర్మాణాన్ని పూర్తి చేసాడు. 1700 నుండి ఈ ప్రదేశంలో శ్రీ రామ నవమిని జరుపుకున్నారనే వాస్తవం అనేక ఆధారాల ద్వారా తెలుస్తోంది.

ప్ర. శ్రీ రామ జన్మ భూమిని పాత కాలంలోనే ఎందుకు స్వాధీనం చేసుకోలేదు ?
జ: శ్రీ రామ జన్మభూమి ఆలయ రక్షణ కోసం పదివేల మంది ప్రజలు తమ ప్రాణాలను అర్పించారు. ఈ ప్రాంతంలో బలమైన ఇస్లామిక్ పాలన ఉన్నప్పటికీ, హిందూ రాజులు ఈ స్థలాన్ని విముక్తం చేయడానికి చాలా ప్రయత్నించారు.  1947 కు ముందు, శ్రీ రామ జన్మభూమిని, ముస్లింల నుండి తిరిగి పొందడానికి 77 ప్రయత్నాలు జరిగాయని రికార్డులలో ఉంది.

ప్ర: బ్రిటీష్ పాలనలో శ్రీ రామ జన్మభూమిని తిరిగి పొందటానికి హిందువులు ఏదైనా ప్రయత్నం చేశారా?
జ: హిందువులు 1885 లో ఒక కేసు ద్వారా న్యాయస్థానం తలుపులు తట్టారు. 1886 లో కోర్ట్ ఇచ్చిన తీర్పు ముఖ్యమైన భాగం ఈ విధంగా ఉంది. “హిందువులకు పవిత్రంగా భావించే స్థలంలో మసీదు నిర్మించబడటం చాలా దురదృష్టకరం.  కాని ఈ సంఘటన 356 సంవత్సరాల క్రితం జరిగినందున ఈ సమస్యను పరిష్కారించడం సాధ్యంకాదు.  యథాతథ స్థితిని కొనసాగించడమే ఏకైక మార్గం. ఇప్పుడు ఇతరత్రా ఏదైనా చర్యలకు పూనుకుంటే వాటివల్ల తాభంకంటే నష్టం ఎక్కువగా జరుగుతుంది. ”

ప్ర: స్వాతంత్య్రానంతరం ఏవైనా ప్రయత్నాలు జరిగాయా?
జ: డిసెంబర్ 1949 తరువాత, బాబ్రీ కట్టడంలో శ్రీ రాముని  విగ్రహాలు కనిపించినప్పుడు హిందువులు  నిరంతర పూజలను జరుపుకోవడానికి కోర్టులు అనుమతించాయి. విగ్రహాల తొలగింపును కోర్టులు తిరస్కరించడమే కాక  విగ్రహాలకు  200 అడుగుల దూరం వరకు రాకుండా ముస్లింలను నిషేధించాయి. ఫిబ్రవరి 1986 లో కోర్టు ఆదేశాల  మేరకు, శ్రీ రామ జన్మభూమికి  వేసి ఉన్న తాళాలను తొలగించి, శ్రీ రామ్ లల్లాను ఆరాధించడానికి హిందువులకు పూర్తి అవకాశం కల్పించారు. ముగ్గురు ప్రధానమంత్రుల పాలనలో – శ్రీ వి పి సింగ్, శ్రీ చంద్రశేఖర్, శ్రీ నర్సింహారావు- ఈ సమస్యను పరిష్కరించడానికి కొన్ని ప్రయత్నాలు జరిగాయి. శ్రీ చంద్రశేఖర్ ప్రధానిగా ఉన్న కాలంలో అత్యంత వ్యవస్థీకృతమైన, పటిష్టమైన ప్రయత్నం జరిగింది.

ప్ర: శ్రీ రామ జన్మభూమి ఆలయాన్ని పునర్నిర్మించినట్లయితే, ఇది మరింత మత విభజనకు దారితీయదా?
జ: పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలోనేకాదు భారత్ లో కూడా  శ్రీ రామ జన్మభూమి ఉద్యమానికి ముందు అనేక హిందూ దేవాలయాలు ధ్వంసమయ్యాయి.

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన దారుణాలను ‘లజ్జ’ అనే నవల వివరించింది. 1986 లో కాశ్మీర్‌ రాష్ట్రంలో ఉగ్రవాద ప్రారంభ రోజుల్లో అనేక హిందూ దేవాలయాలపై  దాడి చేసి,  ధ్వంసం చేశారు.

శ్రీ రామ జన్మభూమి ఆలయ స్థలంలో హిందువులు చట్టబద్ధమైన హక్కును కలిగి ఉన్నారు. చట్టబద్ధత ఉన్నందున, హిందువులు తమ వాదనను వివరించడం, ఇతరులు దానిని ఆ విధంగానే అర్ధంచేసుకోవడం తప్పనిసరి అయింది.  చర్చల ద్వారా సమస్యను పరిష్కరించడానికి హిందువులు హృదయపూర్వక ప్రయత్నాలు ఎన్ని చేసినా ఆ  ప్రయత్నాలు ఎన్నోసార్లు  విఫలమయ్యాయి.

ప్ర: శ్రీ రామ జన్మభూమి, సోమనాథ్ దేవాలయాల మధ్య ఏదైనా పోలిక ఉందా?
జ: రెండు దేవాలయాలు ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేయబడ్డాయి. హిందువుల దృష్టిలో  దేవాలయాలకు మాత్రమే కాకుండా ఆయా స్థలాలకు కూడా ఎంతో ప్రత్యేకత, పవిత్రత ఉంటాయి. అందుకనే ఆ స్థలాలను తిరిగి పొందడానికి  శాంతియుత ప్రయత్నాలు అనేకం చేశారు.

అయితే సోమనాధ దేవాలయం విషయంలో ఉన్న ఒకేఒక్క  వ్యత్యాసం ఏమిటంటే అక్కడ ధ్వంసమైన ఆలయ శిధిలాలపై మరే ఇతర మతపరమైన కట్టడం నిర్మించలేదు. అయితే  పురాతన హిందూ ప్రార్థనా స్థలం శిధిలాల పక్కన, ఆలయ ఆవరణలోనే ఒక చిన్న మసీదు మాత్రం  నిర్మించబడింది.

ప్ర: బాబ్రీ కట్టడాన్ని ముస్లిం ప్రార్థనా స్థలంగా ఉపయోగించారా?
జ: 1930 నుంచి  ముస్లింలు శ్రీ రామ జన్మభూమి స్థలంలో నమాజ్ చేయడం మానేశారని రికార్డులు చెపుతున్నాయి. అదే సమయంలో, బాబ్రీ కట్టడపు ఆవరణలో ఉన్న రామ్ చబూతర్,  సీతా-కి-రసోయి వద్ద హిందువులు పూజలు కొనసాగించారు. ఇది 16 వ శతాబ్దం చివరి నుండి నిరంతరం కొనసాగుతోంది. డిసెంబర్ 1949 నుండి  హిందువులు కట్టడంలో రామ్ లల్లా (బాలరాముడు) కు పూజలు చేయడం ప్రారంభించారు.  ఈ పూజలు  న్యాయవ్యవస్థ పూర్తి అనుమతితోనే సాగాయి. ఆ విధంగా  అది నిరంతర పూజలు జరిగే ఆలయంగానే ఉంది.  అయితే ఇప్పుడు  శ్రీ రాముని  కీర్తిని పూర్తిగా ప్రతిబింబించేలా ఆలయ పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టడమే మిగిలింది.

మూలము: విశ్వ సంవాద కేంద్ర

Wednesday, April 1, 2020

రామాయణం, అప్పటి ప్రాచీన ప్రదేశాలు - ఇప్పటి ఆధునిక క్రొత్త పేర్లు - Ramayanam appati pradesalu, Ippati Adhunika Perlu

ramayanamlo-ippati-aadhunika-perlu
 • భగీరథుడు గంగను భువికి దింపిన స్థలం - గంగోత్రి, ఉత్తరాఖండ్
 • కపిల మహర్షి ఆశ్రమం,(శ్రీరాముని పూర్వీకులు సగర చక్రవర్తి తనయులు 60,000 మంది కాలి బూడిదైన స్థలం.గంగానది వారి భస్మరాసుల మీద ప్రవహించి వారికి పుణ్యలోకాలు ప్రసాదించి బంగాళాఖాతంలో కలుస్తుంది) - గంగాసాగర్, వెస్ట్ బెంగాల్
 • కాంభోజ రాజ్యం - ఇరాన్ ( శ్రీరాముని ముత్తాత రఘు మహారాజు సామ్రాజ్యం ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్, కజఖిస్తాన్, దాటి యింతవరకూ విస్తరించింది).
 • రక్షస్థలం (రావణుడు తన పది తలలు నరికి శివున్ని పూజించి వరాలు పొందిన చోటు) - లాంగకో, టిబెట్, చైనా
 • పరమశివుని ఆత్మలింగాన్ని గణేశుడు నేలవైచిన చొటు - గోకర్ణ, కర్ణాటక
 • సీతాదేవి భూమిలో లభించిన చోటు - సీతామర్హి, బీహార్
 • మిథిల (సీతాదేవి పుట్టినిల్లు) - జనక్ పూర్, నేపాల్
 • కోసలదేశం - రాజధాని అయిన అయోధ్య నుండి నేపాల్ లోని కొన్ని ప్రాంతాల వరకు ఉన్న ప్రదేశం
 • దశరథుడు పుత్రకామేష్ఠి యాగం చేసిన స్థలం - ఫైజాబాద్,ఉత్తర్ ప్రదేశ్.
 • సరయూ నది (ఈ నదీ తీరంలోనే అయోధ్య నిర్మితమైనది) - ఘాఘర నది.
 • ఆయోధ్య / సాకేతపురం (శ్రీరాముని జన్మస్థలం,బంగారు సీతతో అశ్వమేధ యాగం చేసిన స్థలం,సరయూ నదిలో మునిగి వైకుంఠం చేరిన స్థలం) - అయోధ్య,ఉత్తర్ ప్రదేశ్.
 • తాటక వధ జరిగిన ప్రదేశం - బక్సర్, బీహార్
 • అహల్య శాపవిమోచన స్థలం - అహిరౌలి,బీహార్
 • కుశనాథపురం (విశ్వామిత్రుడు యాగం చేసిన స్థలం) - సుల్తాన్ పూర్, ఉత్తర్ ప్రదేశ్
 • గుహుడు సీతారామలక్ష్మణులను కలిసిన చోటు - శృంగబేరిపురం, అలహాబాద్ దగ్గర
 • దండకారణ్యం - చత్తీస్ ఘడ్ లోని బస్తర్ జిల్లా, ఆంధ్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు.
 • చిత్రకూటం (సీతారామలక్ష్మణులు వనవాసం చెసిన చోటు) - సాత్న జిల్లా, మధ్యప్రదేశ్.
 • పంచవటి (శూర్పణఖ ముక్కూచెవులు కోసిన స్థలం) - నాసిక్, మహరాష్ట్ర.
 • కబంధాశ్రమం - కర్దిగుడ్, బెల్గావి, కర్ణాటక.
 • శబరి ఆశ్రమం - సర్బన్, బెల్గావి, కర్ణాటక.
 • హనుమంతుడు రామలక్ష్మణులను మొదటిసారి గా కలసిన ప్రదేశం - హనుమాన్ హళ్ళి, కొప్పాళ, కర్ణాటక.
 • ఆంజనేయ పర్వతం (హనుమంతుడి జన్మస్థలం), కిష్కింద (సుగ్రీవుని రాజ్యం), ఋష్యమూక పర్వతం - తుంగభద్ర నదీతీర ప్రాంతం, హంపి దగ్గర,కర్ణాటక
 • విభీషణుడు రాముని శరణు కోరిన స్థలం - ధనుష్కొటి, తమిళనాడు.
 • శ్రీరాముడు వానరసైన్యం తో వారధి నిర్మించిన చోటు - రామేశ్వరం,తమిళనాడు
 • రత్నద్వీపం / సింహళం / లంక - శ్రీలంక.
 • అశోకవనం (సీతాదేవి బందీగా ఉన్న ప్రదేశం) - కాండీ దారిలోని సీత ఏళియ, శ్రీలంక
 • శ్రీరాముడు రావణుని వధించిన చోటు - దునువిల్ల, శ్రీలంక
 • సీతాదేవి అగ్నిప్రవేశం చేసిన ప్రాంతం - దివిరుంపోల, శ్రీలంక.
 • వాల్మీకి ఆశ్రమం / సీతాదేవి కుశలవులకు జన్మనిచ్చిన స్థలం / భూదేవిలో ఐక్యమైన స్థలం - ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ నుంచి 30 మైళ్ళ దూరంలోని బితూర్.
 • కుశపురం (సీతారాముల పెద్ద కుమారుడు కుశుడు కట్టించిన నగరం) - కుశార్, పాకిస్తాన్.
 • లవపురం (సీతారాముల చిన్న కుమారుడు లవుడు కట్టించిన నగరం) - లాహోర్, పాకిస్తాన్
 • తక్షశిల (శ్రీరాముని తమ్ముడైన భరతుని పెద్దకొడుకు తక్షుడు నిర్మించిన నగరం) - తక్షశిల, పాకిస్తాన్
 •  పుష్కలావతి / పురుషపురం (శ్రీరాముని తమ్ముడైన భరతుని రెండవ కొడుకు పుష్కరుడు నిర్మించిన నగరం) - పెషావర్, పాకిస్తాన్.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

Saturday, January 25, 2020

బాలబాలికలు తప్పనిసరిగా నేర్చుకోవాలిసిన అరుదైన సమాచారం - Baala balikalu Nerchukovalasina Samacharamఈ తరం పిల్లలకు నేర్పించండి. చదివించండి మరియు మనం కూడా మరోసారి మననం చేసుకుందాం.

 దిక్కులు మూలలు
1. తూర్పు,
2. దక్షిణం,
3. పడమర,
4. ఉత్తరం
1. ఆగ్నేయం,
2 .నైరుతి,
3. వాయువ్యం,
4. ఈశాన్యం
 వేదాలుపురుషార్ధాలు
1. ఋగ్వే దం,
2. యజుర్వేదం,
3. సామవేదం,
4. అదర్వణ వేదం
1 ధర్మ,
2 అర్థ,
3 కామ,
4 మోక్షా
 పంచభూతాలు
పురుషార్ధాలు
1. గాలి,
2. నీరు,
3. భూమి,
4. ఆకాశం,
5. అగ్ని.
1. కన్ను,
2. ముక్కు,
3. చెవి,
4. నాలుక,
5. చర్మం.
  లలిత కళలు
పంచగంగలు
1. కవిత్వం,
2. చిత్రలేఖనం,
3. నాట్యం,
4. సంగీతం,
5. శిల్పం.
1. గంగ,
2. కృష్ణ,
3. గోదావరి,
4. కావేరి,
5. తుంగభద్ర.
  దేవతావృక్షాలు
పంచోపచారాలు
1. మందారం,
2. పారిజాతం,
3. కల్పవృక్షం,
4. సంతానం,
5. హరిచందనం.
1. స్నానం,
2. పూజ,
3. నైవేద్యం,
4. ప్రదక్షిణం,
5. నమస్కారం.
  పంచామృతాలు
పంచలోహాలు
1. ఆవుపాలు,
2. పెరుగు,
3. నెయ్యి,
4. చక్కెర,
5. తేనె.
1. బంగారం,
2. వెండి,
3. రాగి,
4. సీసం,
5. తగరం.
  పంచారామాలు
షడ్రుచులు
1. అమరావతి,
2. భీమవరం,
3. పాలకొల్లు,
4. సామర్లకోట,
5. ద్రాక్షారామం
1. తీపి,
2. పులుపు,
3. చేదు,
4. వగరు,
5. కారం,
6. ఉప్పు.
    అరిషడ్వర్గాలు షడ్గుణాలు
సప్త ఋషులు
1. కామం,
2. క్రోధం,
3. లోభం,
4. మోహం,
5. మదం,
6. మత్సరం.
1 కాశ్యపుడు,
2. గౌతముడు,
3. అత్రి,
4. విశ్వామిత్రుడు,
5. భరద్వాజ,
6. జమదగ్ని,
7. వశిష్ఠుడు.
 తిరుపతి సప్తగిరులు
సప్త వ్యసనాలు
1. శేషాద్రి,
2. నీలాద్రి,
3. గరుడాద్రి,
4. అంజనాద్రి,
5. వృషభాద్రి,
6. నారాయణాద్రి,
7. వేంకటాద్రి.
1. జూదం,
2. మద్యం,
3. దొంగతనం,
4. వేట,
5. వ్యభిచారం,
6. దుబారఖర్చు,
7. కఠినంగా మాట్లాడటం.
 సప్త నదులు
నవధాన్యాలు
1. గంగ,
2. యమునా,
3. సరస్వతి,
4. గోదావరి,
5. సింధు,
6. నర్మద,
7. కావేరి.
1. గోధుమ,
2. వడ్లు,
3. పెసలు,
4. శనగలు,
5. కందులు,
6. నువ్వులు,
7. మినుములు,
8. ఉలవలు,
9. అలసందలు.
 నవరత్నాలు
నవధాతువులు
1. ముత్యం,
2. పగడం,
3. గోమేధికం,
4. వజ్రం,
5. కెంపు,
6. నీలం,
7. కనకపుష్యరాగం,
8. పచ్చ (మరకతం),
9. ఎరుపు (వైడూర్యం).
1. బంగారం,
2. వెండి,
3. ఇత్తడి,
4. రాగి,
5. ఇనుము,
6. కంచు,
7. సీసం,
8. తగరం,
9. కాంతలోహం.
 నవరసాలు
నవదుర్గలు
1. హాస్యం,
2. శృంగార,
3. కరుణ,
4. శాంత,
5. రౌద్ర,
6. భయానక,
7. బీభత్స,
8. అద్భుత,
9. వీర.
1. శైలపుత్రి,
2. బ్రహ్మ చారిణి,
3. చంద్రఘంట,
4. కూష్మాండ,
5. స్కందమాత,
6. కాత్యాయని,
7. కాళరాత్రి,
8. మహాగౌరి,
9. సిద్ధిధాత్రి.
 నవరసాలు
దశ సంస్కారాలు
1. హాస్యం,
2. శృంగార,
3. కరుణ,
4. శాంత,
5. రౌద్ర,
6. భయానక,
7. బీభత్స,
8. అద్భుత,
9. వీర.
( 1 ) వివాహం,
( 2 ) గర్భాదానం,
( 3 ) పుంసవనం ,
( 4 ) సీమంతం,
( 5 ) జాతకకర్మ,
( 6 ) నామకరణం,
( 7 ) అన్నప్రాశనం,
( 8 ) చూడకర్మ,
( 9 ) ఉపనయనం,
(10) సమవర్తనం
 దశావతారాలు
( 1 ) మత్స్య,
( 2 ) కూర్మ,
( 3 ) వరాహ,
( 4 ) నరసింహ,
( 5 ) వామన,
( 6 ) పరశురామ,
( 7 ) శ్రీరామ,
( 8 ) శ్రీకృష్ణ,
( 9 ) బుద్ధ,
(10) కల్కి.
జ్యోతిర్లింగాలు:
 • 卍 హిమలయపర్వతం ~ కేదారేశ్వరలింగం .
 • 卍 కాశీ ~ కాశీవిశ్వేశ్వరుడు .
 • 卍 మధ్యప్రదేశ్ ~ మహాకాలేశ్వరలింగం, ఓంకారేశ్వరలింగం. (2)
 • 卍 గుజరాత్ ~ సోమనాధలింగం, నాగేశ్వరలింగం. (2)
 • 卍 మహారాష్ట్ర ~ భీమశంకరం, త్ర్యంబకేశ్వరం,    ఘృష్ణేశ్వరం, వైద్యనాదేశ్వరం. (4)
 • 卍 ఆంధ్రప్రదేశ్ ~ మల్లిఖార్జునలింగం (శ్రీశైలం)
 • 卍 తమిళనాడు ~ రామలింగేశ్వరం
 తెలుగు వారాలు
తెలుగు నెలలు
1 ఆది,
2 సోమ,
3 మంగళ,
4 బుధ,
5 గురు,
6 శుక్ర,
7 శని.
 1. చైత్రం,
 2. వైశాఖం,
 3. జ్యేష్ఠం,
 4. ఆషాఢం,
 5. శ్రావణం,
 6. భాద్రపదం,
 7. ఆశ్వీయుజం,
 8. కార్తీకం,
 9. మార్గశిరం,
10. పుష్యం,
11. మాఘం,
12. ఫాల్గుణం.
 రాశులు
తిథులు
 1.మేషం,
 2.వృషభం,
 3.మిథునం,
 4. కర్కాటకం,
 5. సింహం,
 6. కన్య,
 7. తుల,
 8. వృశ్చికం,
 9. ధనస్సు,
10. మకరం,
11. కుంభం,
12. మీనం.
 1. పాఢ్యమి,
 2. విధియ,
 3. తదియ,
 4. చవితి,
 5. పంచమి,
 6. షష్ఠి,
 7. సప్తమి,
 8. అష్టమి,
 9. నవమి,
10. దశమి,
11. ఏకాదశి,
12. ద్వాదశి,
13. త్రయోదశి,
14. చతుర్దశి,
15. అమావాస్య /పౌర్ణమి.

 నక్షత్రాలు
1. అశ్విని,
2. భరణి,
3. కృత్తిక,
4. రోహిణి,
5. మృగశిర,
6. ఆరుద్ర,
7. పునర్వసు,
8. పుష్యమి,
9.  ఆశ్లేష,
10. మఖ,
11. పుబ్బ,
12. ఉత్తర,
13. హస్త,
14. చిత్త,
15. స్వాతి,
16. విశాఖ,
17. అనురాధ,
18. జ్యేష్ఠ,
19. మూల,
20. పూర్వాషాఢ,
21. ఉత్తరాషాఢ,
22. శ్రావణం,
23. ధనిష్ఠ,
24. శతభిషం,
25. పూర్వాబాద్ర,
26. ఉత్తరాబాద్ర,
27. రేవతి.
తెలుగు సంవత్సరాల పేర్లు

1. ప్రభవ
1927, 1987, 2047, 2107

2. విభవ
1928, 1988, 2048, 2108

3. శుక్ల
1929, 1989, 2049, 2109

4. ప్రమోదూత
1930, 1990, 2050, 2110

5. ప్రజోత్పత్తి
1931, 1991, 2051, 2111

6. అంగీరస
1932, 1992, 2052, 2112

7. శ్రీముఖ
1933, 1993, 2053, 2113

8. భావ.
1934, 1994, 2054, 2114

9. యువ.
1935, 1995, 2055, 2115

10. ధాత.
1936, 1996, 2056, 2116

11. ఈశ్వర.
1937, 1997, 2057, 2117

12. బహుధాన్య
1938, 1998, 2058, 2118

13. ప్రమాది.
1939, 1999, 2059, 2119

14. విక్రమ
1940, 2000, 2060, 2120

15. వృష
1941, 2001, 2061, 2121

16. చిత్రభాను.
1942, 2002, 2062, 2122

17. స్వభాను.
1943, 2003, 2063, 2123

18. తారణ.
1944, 2004, 2064, 2124

19. పార్థివ.
1945, 2005, 2065, 2125

20. వ్యయ.
1946, 2006, 2066, 2126

21. సర్వజిత్తు.
1947, 2007, 2067, 2127

22. సర్వదారి.
1948, 2008, 2068, 2128

23. విరోధి.
1949, 2009, 2069, 2129

24. వికృతి.
1950, 2010, 2070, 2130

25. ఖర.
1951, 2011, 2071, 2131

26. నందన.
1952, 2012, 2072, 2132

27. విజయ.
1953, 2013, 2073, 2133,

28. జయ.
1954, 2014, 2074, 2134

29. మన్మద.
1955, 2015, 2075 , 2135

30. దుర్మిఖి.
1956, 2016, 2076, 2136

31. హేవళంబి.
1957, 2017, 2077, 2137

32. విళంబి.
1958, 2018, 2078, 2138

33. వికారి.
1959, 2019, 2079, 2139

34. శార్వారి.
1960, 2020, 2080, 2140

35. ప్లవ
1961, 2021, 2081, 2141

36. శుభకృత్.
1962, 2022, 2082, 2142

37. శోభకృత్.
1963, 2023, 2083, 2143

38. క్రోది.
1964, 2024, 2084, 2144,

39. విశ్వావసు.
1965, 2025, 2085, 2145

40. పరాభవ.
1966, 2026, 2086, 2146

41. ప్లవంగ.
1967, 2027, 2087, 2147

42. కీలక.
1968, 2028, 2088, 2148

43. సౌమ్య.
1969, 2029, 2089, 2149

44. సాధారణ .
1970, 2030, 2090, 2150

45. విరోధికృత్.
1971, 2031, 2091, 2151

46. పరీదావి.
1972, 2032, 2092, 2152

47. ప్రమాది.
1973, 2033, 2093, 2153

48. ఆనంద.
1974, 2034, 2094, 2154

49. రాక్షస.
1975, 2035, 2095, 2155

50. నల
1976, 2036, 2096, 2156,

51. పింగళ               
1977, 2037, 2097, 2157

52. కాళయుక్తి       
1978, 2038, 2098, 2158

53. సిద్ధార్ధి             
1979, 2039, 2099, 2159

54. రౌద్రి               
1980, 2040, 2100, 2160

55. దుర్మతి
1981, 2041, 2101, 2161

56. దుందుభి
1982, 2042, 2102, 2162

57. రుదిరోద్గారి       
1983, 2043, 2103, 2163

58. రక్తాక్షి               
1984, 2044, 2104, 2164

59. క్రోదన                 
1985, 2045, 2105, 216

60. అక్షయ             
1986, 2046, 2106, 2166.

ఈ తరం పిల్లలకు నేర్పించండి. చదివించండి మరియు మనం మరోసారి మననం చేసుకుందాం..

రచన: శ్రీనివాస్

Thursday, January 9, 2020

దైవసంభూత నామముల నిఘంటువు - Devatalu Naamaaluదైవసంభూత నామముల నిఘంటువు - Devatalu Naamaalu
 • 卍 అంబిక: విచిత్ర వీర్యుని భార్య.  దృతరాష్ట్ర పాండు రాజులకు తల్లులు.
 • 卍 అంబాలిక: విచిత్ర వీర్యుని ఇద్దరు భార్యలలో మరోకరు.
 • 卍 అక్రూరుడు: శ్రీకౄష్ణుని మేనమామ.
 • 卍 అకర్కారుడు: కద్రువ కొడుకు. ఒక సర్పం.
 •  అక్షసూత్ర ఆపస్తంభుడి భార్య. ఈమె కూమారుడు కర్కి.
 •  అగజాత: పార్వతి పరమేశ్వరుని భార్య.అగస్త్యకూటం: అగస్త్యుడ్ తపస్సు చేసిన ప్రదేశము.
 •  అగ్నిదేష్యుడు: ద్రోణాచార్యుడు ఇతని వల్లనే ధనుర్వీధ్యాపారంగతుడైనాడు.
 •  అగ్నిశౌచం: కర్కోటకుడు నలునికి ఇచ్చిన మాయా వస్త్రము.
 •  అఘుడు: రాక్షసులైన, పూతన, బకాసురుల సోదరుడు. కంసుడి అనుచరుడు.
 • 卍 అగ్ని: వేదములలో పేర్కొన్న ఓక దేవత. అతని భార్య స్వాహాదేవి.
 • 卍 అచల: కుమారస్వామి మాతౄగణములోని ఓక స్త్రీమూర్తి.
 • 卍 అంజన: కుంజరుడి కుమార్తె వానర స్త్రీ. కేసరి భార్య. వాయుదేవునితో సంగమము వల్ల అంజనేయుని కన్నది.
 • 卍 అనంత విజయం: ధర్మరాజు శంఖం.
 • 卍 అనంత: స్వయంభువుని భార్య. ప్రియవత, ఉత్తానపాదుల తల్లి.
 • 卍 అనసూయ: అత్రిమహాముని భార్య.  దెవహూతి కర్దముల కుమారై. త్రిమూర్తులను శిశువులుగా మార్చిన ప్రతివ్రత.
 • 卍 అనాదౄష్యుడు: గాంధారి దౄతరాష్టౄల కూమారుడు.
 • 卍 అలకవంద: దేవలోకములోని గంగానది. పితౄలోకాలలో ప్రవహించేటప్పుడు దీనిని వైతరణి అంటారు.
 • 卍 అతికాయుడు: రావణుని కుమారుడు. లక్ష్మణునిచే చంపబడతాడు.
 • 卍 అత్రి: బ్రహ్మమానసపుత్రులో ఒకడు. అనసూయ ఈయన భార్య.
 • 卍 అనిరుద్దుడు: శ్రీ కౄష్ణుని మనుమడు. ప్రద్యుమ్నుని కొడుకు. బాణాసురుని కుమార్తె ఉషకు భర్త.
 • 卍 అభిమన్యుడు: అర్జునుడు – సుభద్రల కుమారుడు. కురుక్షేత్ర సంగ్రామంలో పద్మవ్యుహం లోపలకు వెళ్ళీ బయటకు రావడం తెలియక మరణించాడు.
 • 卍 అర్జునుడు: పాండవ మధ్యముడు. పాండురాజు భార్య కుంతికి దేవేంద్ర ప్రసాదమున జన్మించిన కుమారుడు. ఫల్గునుడు, పార్ధుడు, కిరీటి, విజయుడు, సవ్యసాచి, ధనంజయుడు, శ్వేత వాహనుడు వంటి పేర్లు కలవాడు.
 • 卍 అర్ధనారీశ్వరుడు: శివుని సగం శరీరం ఆక్రమించిన ఈశ్వరి. పార్వతీ పరమేశ్వరులు.
 • 卍 అశ్వద్ధామ: ద్రోణుని కుమారుడు. కౄపి ఇతని తల్లి. ఇతడు చిరంజీవి. పాండవద్వేషి.
 • 卍 అష్టావక్రుడు: ఏకపాదుడు – సుజాతల పుత్రుడ్.
 • 卍 అహల్య: గౌతముని భార్య.
 • 卍 అక్షయపాత్ర: అరణ్యవాసం చేస్తున్న ధర్మరాజు తన వెంట బ్రాహ్మణుల భోజనార్ధం సూర్యుణ్ణీ ప్రార్ధించి ఒక పాత్ర సంపాదిస్తాడు. దాంట్లో కొంచెం వండినా ఐ అక్షయమౌతుంది. దాంతో ధర్మరాజు నిరతాన్నదానం చెయ్యగల్గుతుంది.
 • 卍 ఆంజనేయుడు: అంజనాదేవి కుమారుడు. హనుమంతుడు, పవనుడు, మారుతి ఇతర పేర్లు. రామాయణంలో శ్రీరామునికి నమ్మిన బంటు. వీరాధివీరుడు చిరంజీవి.
 • 卍 ఆయతి: మేరువు కుమార్తె దాత భార్య. ఈమె కొడుకు ప్రాణుడు.
 • 卍 ఇంద్రుడు: స్వర్గానికి అధిపతి. తూర్పు దిక్కుకు పాలకుడు.
 • 卍 ఇంద్రజిత్తు: రావణుడి పెద్దకొడుకు. మరోపేరు మేగనాధుడు. ఇంద్రున్ని జయించాడు కాబట్టి ఇంద్రజిత్తు అనే పేరు వచ్చినది. ఇతని భార్య సులోచన.
 • 卍 అగజాత: పార్వతి పరమేశ్వరుని భార్య.
 • 卍 అగస్త్యకూటం: అగస్త్యుడ్ తపస్సు చేసిన ప్రదేశము.
 • 卍 అగ్నిదేష్యుడు: ద్రోణాచార్యుడు ఇతని వల్లనే ధనుర్వీధ్యాపారంగతుడైనాడు.
 • 卍 అగ్నిశౌచం: కర్కోటకుడు నలునికి ఇచ్చిన మాయా వస్త్రము.
 • 卍  అఘుడు: రాక్షసులైన, పూతన, బకాసురుల సోదరుడు. కంసుడి అనుచరుడు.
 • 卍 అగ్ని: వేదములలో పేర్కొన్న ఓక దేవత. అతని భార్య స్వాహాదేవి.
 • 卍 అచల: కుమారస్వామి మాతౄగణములోని ఓక స్త్రీమూర్తి.
 • 卍 అంజన: కుంజరుడి కుమార్తె వానర స్త్రీ. కేసరి భార్య. వాయుదేవునితో సంగమము వల్ల  అంజనేయుని కన్నది.
 • 卍 అనంత విజయం: ధర్మరాజు శంఖం.
 • 卍 అనంత: స్వయంభువుని భార్య. ప్రియవత, ఉత్తానపాదుల తల్లి.
 • 卍 అనసూయ: అత్రిమహాముని భార్య.  దెవహూతి కర్దముల కుమారై. త్రిమూర్తులను శిశువులుగా మార్చిన ప్రతివ్రత.
 •  అనాదౄష్యుడు: గాంధారి దౄతరాష్టౄల కూమారుడు.
 • 卍 అలకవంద: దేవలోకములోని గంగానది. పితౄలోకాలలో ప్రవహించేటప్పుడు దీనిని వైతరణి అంటారు.
 • 卍 అతికాయుడు: రావణుని కుమారుడు. లక్ష్మణునిచే చంపబడతాడు.
 • 卍 అత్రి: బ్రహ్మమానసపుత్రులో ఒకడు. అనసూయ ఈయన భార్య.
 • 卍 అనిరుద్దుడు: శ్రీ కౄష్ణుని మనుమడు. ప్రద్యుమ్నుని కొడుకు. బాణాసురుని కుమార్తె ఉషకు భర్త.
 • 卍 అభిమన్యుడు: అర్జునుడు – సుభద్రల కుమారుడు. కురుక్షేత్ర సంగ్రామంలో పద్మవ్యుహం లోపలకు వెళ్ళీ బయటకు రావడం తెలియక మరణించాడు.
 • 卍 అర్జునుడు: పాండవ మధ్యముడు. పాండురాజు భార్య కుంతికి దేవేంద్ర ప్రసాదమున జన్మించిన కుమారుడు. ఫల్గునుడు, పార్ధుడు, కిరీటి, విజయుడు, సవ్యసాచి, ధనంజయుడు, శ్వేత వాహనుడు వంటి పేర్లు కలవాడు.
 • 卍 అర్ధనారీశ్వరుడు: శివుని సగం శరీరం ఆక్రమించిన ఈశ్వరి. పార్వతీ పరమేశ్వరులు.
 • 卍 అశ్వద్ధామ: ద్రోణుని కుమారుడు. కౄపి ఇతని తల్లి. ఇతడు చిరంజీవి. పాండవద్వేషి.
 • 卍 అష్టావక్రుడు: ఏకపాదుడు – సుజాతల పుత్రుడ్.
 • 卍 అహల్య: గౌతముని భార్య.
 • 卍 అక్షయపాత్ర: అరణ్యవాసం చేస్తున్న ధర్మరాజు తన వెంట బ్రాహ్మణుల భోజనార్ధం సూర్యుణ్ణీ ప్రార్ధించి ఒక పాత్ర సంపాదిస్తాడు. దాంట్లో కొంచెం వండినా ఐ అక్షయమౌతుంది. దాంతో ధర్మరాజు నిరతాన్నదానం చెయ్యగల్గుతుంది.
 • 卍 ఆంజనేయుడు: అంజనాదేవి కుమారుడు. హనుమంతుడు, పవనుడు, మారుతి ఇతర పేర్లు. రామాయణంలో శ్రీరామునికి నమ్మిన బంటు. వీరాధివీరుడు చిరంజీవి.
 • 卍 ఆయతి: మేరువు కుమార్తె దాత భార్య. ఈమె కొడుకు ప్రాణుడు.
 • 卍 ఇంద్రుడు: స్వర్గానికి అధిపతి. తూర్పు దిక్కుకు పాలకుడు.
 • 卍 ఇంద్రజిత్తు:  రావణుడి పెద్దకొడుకు. మరోపేరు మేగనాధుడు. ఇంద్రున్ని జయించాడు కాబట్టి ఇంద్రజిత్తు అనే పేరు వచ్చినది. ఇతని భార్య సులోచన.
 • 卍 ఇంద్రమాల: ఒక కమలమాలిక ఎన్నడూ వాడనిది. మాల ధరించినవారిని ఏ అస్త్రమైన ఏమి చేయలేదు.
 • 卍 ఉశన: భౄగువు భార్య. శుక్రుడి తల్లి.
 • 卍 ఉచ్చైశ్రవము: ఇంద్రుని గుర్రము.
 • 卍 ఉలూచి: నాగకన్య. వాసుకి కూతురు. అర్ణునుడు ఈమె యందు ఇలావంతుని కన్నాడు.
 • 卍 ఉగ్రకుడు: ఒక సర్పం, కద్రువ కుమారుడు.
 • 卍 ఉష: బాణాసురుని కూతురు. అనిరుద్ధుని మోహించి చిత్రలేఖ సహాయంతో పెళ్ళాడింది.
 • 卍 ఉత్తరుడు: విరాటరాజు కొడుకు.
 • 卍 ఊర్మిళ: లక్ష్మణుని భార్య. జనకమహారాజు జ్యేష్ట పుత్రిక. భర్త లక్ష్మణుడు అన్న రాముని వెంట అరణ్యాలకు పోయినప్పుడు ఈమె నిద్రించుచూనే ఉండెనట. (ఊర్మిళాదేవి నిద్ర)
 • 卍 ఊర్వశి: ఒక అప్సరస, మోహగాంగి (ఇంద్రుని సభలోణి నర్తకి)
 • 卍 ౠష్యశౄంగుడు: విభాండక ౠషి కుమారుడు.
 • 卍 ఏతశం: సూర్యుని గుర్రాలలో ఒకదాని పేరు.
 • 卍 ఏకలవ్యుడు: ద్రోణాచార్యుని గురువుగా భావించి అతని బొమ్మ పెట్టుకొని ధరుర్విద్య నేర్చుకున్న బోయవాడు.
 • 卍 కంక: ఉగ్రసేనుడి కూతురు, వసుదేవుడి భార్య.
 • 卍 కంసుడు: ఉగ్రసేనుని కూమారుడు. శ్రీకౄష్ణుని మేనమామ.
 • 卍 కణ్వుడు: ఒక ౠషి, శకుంతలను పెంచిన తండ్రి.
 • 卍 కబంధుడు: దండకారణ్యంలో నివసించే రాక్షసుడు. రామలక్ష్మణులు ఈతని చేతులు నరికివేశారు.
 • 卍 కర్కోటకుడు: వాసుకి తమ్ముడు. అతిక్రూరుడు.
 • 卍 కల్పవృక్షం: (కల్పవల్లి) కోరిన కోర్కెలు తీర్చే చెట్టు. క్షీరసాగర మథన సమయంలో హాలహలం తర్వాత వెలువడినది.
 • 卍 కశ్యపుడు: ఒక ప్రజాపతి. కళ మరీచిలకు పుట్టినవాడు.
 • 卍 కాళి: పార్వతి అవతారాలలో ఒకటి. ఉమ, కాత్యాయిని, గౌరి, ఈశ్వరి, భావాని దుర్గ, సర్వమంగళ, చాముండి – ఇతర పేర్లు.
 • 卍 కామధేనుడు: కోరిన కోరికల్ని తీర్చేదివ్య శక్తులు గలగోవు. మరొక  పేరు సురభి.
 • 卍 కుంతి: మహాభారతంలోని ధర్మరాజు. భీముడు, అర్జునులకు తల్లి, కర్ణునికి కూడా తల్లి.
 • 卍 కుమారస్వామి: శివుని కుమారుడు సుబ్రహ్మణ్యస్వామి. తారకజిత్తు. పార్వతీ నందనుడు ఇతర పేర్లు. దేవతలకు సేనానాయకుడు. వాహనం నెమలి. అయుధం శక్తి.
 • 卍 కౄష్ణుడు: దేవకి వసుదేవుల పుత్రుడు. కౄష్ణుడు కారాగారంలో పుట్టాడు. కంసునికి మేనల్లుడు. కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడు మొరాయించగా ‘గీతోపదేశం’ చేస్తాడు. శిశుపాలుణ్ణీ కంసుణ్ణీ వధిస్తాడు. ఈయనకు ఎనిమిదిమంది భార్యలు అందులో రుక్మిణి సత్యభామ ప్రముఖులు.
 • 卍 కృష్ణద్వెపాయనుడు: వ్యాసునికి మరొక పేరు.
 • 卍 కేదారేశ్వరుడు: శివునికి మరొక  పేరు.
 • 卍 కైకేయి: దశరథుని మూడవ భార్య. భరతుని తల్లి.
 • 卍  కైలాస పర్వతం: శివుని నివాసము. హిమాలయాల వెనుకనున్న కొండ.
 • 卍 కౌరవులు: కురువంశ రాజులు, మహాభారతంలో దుర్Yఓధనాదులు నూరు మంది.
 • 卍 కౌశికుడు: ధర్మవ్యాధుని వల్ల ధర్మ విశేషాలను తెలుసు కున్నవాడు.
 • 卍 ఖాండవం: ఇంద్రుని వనం. అగ్ని దేవుడు ప్రార్థింపగా కౄష్ణార్జునులు దానిని అతనికి అహారంగా సమర్పించారు.
 • 卍 గాండీవం: అర్జునుని ధనస్సు. దీనిని అగ్నిదేవుడు ఖాండవ దహనమప్పుడు అర్జునునికి ఇచ్చాడు.
 • 卍 గాంధారి: ధౄతరాష్ట్రుని భార్య. మహపతివ్రత. భర్త అంధుడు కనుక తానును పరుపురుష దర్శనం చేయకూడదను నియమముచే తాను ఎల్లప్పుడూ కళ్ళకు గంతలు కట్టుకొని ఉండును.
 • 卍 గోదాదేవి: శ్రీ విల్లిపుత్తురులోని విష్ణుచిత్తుని తులసి వనంలో ఆమె లభించగా పెరియాళ్వార్ పెంపకంలో పెరిగి చూడికొడుత్తళ్ ఆళ్వారు అయింది.
 • 卍 గోవింద భగవత్పాదులు: శంకరాచార్యులు వారి గురువు. గౌడపాదాచార్యుల శిష్యులు.
 • 卍 గౌతమ సూత్రాలు: గౌతమ మహర్షి ప్రోక్తమైన ధర్మశాస్త్రం.
 • 卍 ఘటోత్కచుడు: భీముడు – హిడింబల పుత్రుడు.
 • 卍 ఘౄతాచి: ఒక అప్సరస. భరద్వాజ మహర్షి ఈమెను చూచినప్పుడు వీర్య స్ఖలనమైంది. ద్రోణుడు పుట్టాడు.
 • 卍 జ్ణ్జాన ప్రసూనాంబ: పరాశక్తి అవతారం. కాళహస్తీశ్వరుని భార్య.
 • 卍 చంద్రమతి: యమలోకంలో పాప పుణ్యాలను లెక్కకట్టే వాడు.
 • 卍 చిత్రరేఖ: బాణాసురుని కూతురు ఉషకు చెలికత్తె.
 • 卍 చిత్రాంగద: అర్జునుని భార్య. చిత్రవాహనుని కూమార్తె. ఈమె కుమారుడు బభ్రువాహనుడు.
 • 卍 జంబుమాలి: ప్రహస్తుని కుమారుడు. రావణుని సేనాధిపతుల్లో ఒకడు అశోకవన భంగ సమయంలో హనుమంతుడు రావణుడు చంపాడు.
 • 卍 జటాయువు: సంపాతి తమ్ముడు. సీతాపహరణ్ సమయాన రావణుడు చంపాడు.
 • 卍 జనమేజయుడు: పరీక్షిత్తుని కుమారుడు.
 • 卍 జమదగ్ని: పరశురాముని తండ్రి.
 • 卍 జయవిజయులు: వైకుంఠంలో శ్రీ మహా విష్ణువు ద్వార పాలకులు. భాగవత పురాణంలోని పాత్రలు. హిరాణ్యాక్ష్య హిరణ్య కసిపులు. రావణ కుంభ కర్ణులు, శిశుపాలుడు దంతవ్రక్తులుగా అవతార మెత్తుతారు.
 • 卍 జరాసంధుడు: బౄహద్రధుని పుత్రుడు జరాయువు రాక్షసిచే సంధింపబడినవాడు. భీముడు ఇతడి చంపాడు.
 • 卍 జాంబవంతుడు: సుగ్రీవుని మంత్రి. రామ, రావణ యుద్ధంలో రామునికి సాయపడ్డాడు.
 • 卍 జాంబవతి: జాంబవంతుని కూతురు. శ్రీకౄష్ణుని అష్ట భార్యలలో ఒకరు.
 • 卍 ఢాకిని: మంత్రాల ద్వార లీలలు అద్భుతాలు చేసే ఒక స్త్రీ.
 • 卍 తపతి: సూర్యుని కుమారై. ఈమె నర్మదా నదిగా మారినది.
 • 卍 తాటక: మారీచ సుబాహుల తల్లి. అతి క్రూరురాలు రాక్షశి.
 • 卍 తార: తారుని కుమార్తె వాలి భార్య. అంగదుని తల్లి. వాలి మరణానంతరం వాలి సోదరుడు సుగ్రీవుడు ఈమెను పెండ్లాడాడు.
 • 卍 త్రిశుంకుస్వర్గం: సత్యవంతునికై విశ్వామిత్రుడు సౄష్టించినది.
 • 卍 దత్తాత్రేయుడు: అత్రిమహర్షి, అనసూయ దంపతుల కుమారుడు.
 • 卍 దమయంతి: నలమహారాజు భార్య. పతి యందు అత్యంత అనురాగం గలది.
 • 卍 దశరథుడు: అయోధ్య మహారజు. శ్రీరాముని తండ్రి. కౌసల్య, సుమిత్ర, కైకేయి ఈయన భార్యలు.
 • 卍 దామోదరుడు: కౄష్ణుడు. బాల్యమున తల్లి యశోద ఇతని నడుమున తాడువేసి రోటికి కట్టుటచే ఈ పేరు వచ్చినది.
 • 卍 ధుర్యొధనుడు: ధౄతరాష్ట్రునకు గాంధారికి కలిగిన నూరుగురు కుమారులలో (కౌరవ) జ్యేష్టుడు.
 • 卍 దుర్వాసుడు: అత్రి మహర్షి అనసూయలకు పుట్టినవాడు. మహాకోపిష్టి. ఇతడు శపించి నట్టు ఇతివౄత్తం గల కథలు అనేకం ఉన్నాయి.
 • 卍 దుష్యంతుడు: శకుంతల భర్త. భరతుని తండ్రి.
 • 卍 దుస్సల: దౄతరాష్ట్రునకు గాంధారికి పుట్టిన ఏకైక కుమార్తె. ధుర్యొధునాదుల సోదరి.
 • 卍 దేవకి: కౄష్ణుని కన్నతల్లి. వసుదేవుని భార్య.
 • 卍 దేవదత్తం: అర్జునుడికి దేవేంద్రుడు ఇచ్చిన శంఖం.
 • 卍 దేవాంతకుడు: రావణుని కూమారుడు. హనుమంతుడు ఇతనిని చంపాడు.
 • 卍 ద్రుపదుడు: పాంచాలరాజు. ద్రౌపది తండ్రి. ఈయన కుమారులు ద్రుష్టద్యుమ్నుడు. శిఖండి.
 • 卍 ద్రోణుడు: మహాభారతంలో కురువౄద్ధుడు. భరద్వాజ మహర్షి ఘౄతాచి అనే అప్సరసను చేస్తే వీర్యస్ఖలైంది. ఆ వీర్యాన్ని ఒక ద్రోణ (కుండ) లో ఉంచగా ద్రోణుడు పుట్టాడు. ధనుర్వద్యలో దిట్ట. కౄపాచార్యుని బావమరిది. అశ్వత్థామ పుత్రుడు. కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవ పక్షంలో పోరాడాడు.
 • 卍 ద్రౌపతి: పాంచాల రాజైన ద్రుపదుని కూతురు. మహాభారతంలో ప్రముఖపాత్ర. అర్జునుడు మత్స్యయంత్రాన్ని కొట్టగా ఆమె పాండవులకు భార్య అయింది. ద్రౌపది మాహా పతివ్రత.
 • 卍 ధన్వంతరి: క్షీరసాగర మథన సమయంలో పుట్తిన అనేకములలో ఒకటి. ఆయుర్వేదానికి అధిష్టాన దేవత.
 • 卍 ధర్మరాజు: మహాభారతంలోని పంచపాండవులలో ప్రథముడు. యుధిష్ఠిరుడు మరోకపేరు. సద్గుణాలకు పేరొందినవాడు. జూదంలో ఓడిపోయి విరాట కొలువులో కంకుభట్టుగా ఉంటాడు.
 • 卍 ధర్మవ్యాధుడు: మిథిలా నగరంలో ఉండే ఎరుకలవాడు. సమస్త ధర్మాల్ని చక్కగ తెలిసినవాడు.
 • 卍 ధౄతరాష్ట్రుడు: కురువంశరాజు అయిన విచిత్రవీర్యుని కుమారుడు.పుత్తు గుడ్ది.గాందారి ఈయన  భార్య. దుర్యోధనాది నలుగురు ఈయన పుత్రులు.వీరినే కౌరవులు అంటారు.
 • 卍 నకులుడు: పంచపాండవులలో నాల్గవ వాడు.
 • 卍 నటరాజు: తాందవ భంగిమలో ఉన్న శివుడు.సౄష్తి,స్థితి,లయ,త్రయూభవ(ఖ్యాతి) అనుగ్రహ (మోక్షతి) అను పంచ మహాకార్యాల్ని తందవం ద్వార పరమశివుదు ప్రదర్శిస్తాడు.
 • 卍 నరలోకం : యముని కొలువు.పురానలను బట్టి 22 నరక లొకములు ఉన్నయి.
 • 卍 నారదుడు: బ్రహ్మ కుమారుడు.హరి నారాయణ గాథలు గానం చేయువాడు.త్రిలోక సంచారి.కలహప్రియుడీగా ప్రతీతి.
 • 卍 పంచవటి: రముడూ వనవాస సమయాన దండకారన్యం లోని ఆశ్రమం పేరు.
 •  పరశురాముడు:జమదగ్ని కుమారుడు.తల్లి రేణుక.అస్త్ర విద్య యందు ఆరి తేరిన వాడు.
 • 卍 పరాశరుడు: శక్తి మహర్షి పుత్రుడు,వశిష్ట మహర్షి పౌత్రుడు.ఈయన సంపర్కం వల్లే మత్స్యగంధికి వ్యాసమహర్షి పుడతాడు.
 • 卍 పరీక్షిత్తు: అభిమన్యు-ఉత్తర లకు పుట్టిన వాడు.అర్జునునికి మనుమడు.జనమేజయుడు ఈయన పుత్రుడు.పరీక్షిత్తు అంటే అంతటా దర్శించగల వాడని అర్ధం.
 • 卍 పాంచజన్యం: శ్రీ మహాష్ణువు శంఖం.
 • 卍 పాసుపతాస్త్రము: శివుని గురించి తపస్సు చేసి అర్జునుడు పొందిన అస్ర్తం.
 • 卍 పుష్పకము: కుబేరుని విమానము. పిదప రావణుడు, శ్రీరాముడు పొందారు. దీనిలో ఎంత మంది అయినా కూర్చోవచ్చును.
 • 卍 పూతన: ఒక రాక్షసి. బాలకౄష్ణునిచే చంపబడినది.
 • 卍 ప్రవరాఖ్యుడు: ‘మనుచరిత్రా లో పాత్ర బ్రహ్మచారి.
 • 卍 బలరాముడు: శ్రీ కౄష్ణునికి అన్న.
 • 卍 బాణుడు: బలిచక్రవర్తి కూమారుడు. ఉషకు తండ్రి.
 • 卍 బుద్ధుడు: బౌధ్ధమత స్థాపకుడు. లుంబిని అతని జన్మస్థలి. ‘షగభిజ్ణ్జుడూ అని ప్రసిద్ధి. అనగా దివ్యదౄష్టి, దివ్యశ్రోత్రము, పూర్వనివాసానుస్మౄతి, పరచిత్త జ్ణ్జానం, అప్రత్యక్షవిషయజ్ణ్జానము, వియద్గమనాగమన వ్యూహాదిలక్షణ బుద్ధి అను ఆరింటిని ఎరిగినవాడు.
 • 卍 బౄందావనం: యమునానదీ తీరాన మథురలో ఉన్నవనం. ఇచ్చటీ గోకులంలో శ్రీకౄష్ణుడు గోపికలతో అనేక లీలలు సల్పాడు.
 • 卍 భద్రకాళి: పార్వతీ దేవి మరొక నామం.
 • భరతుడు: భరతుడు పేరు గలవారు ముగ్గురు కలరు. 1. దశరథ -కైకేయి కుమారుడ్. శ్రీరాముని సోదరుడు. 2. ౠషభుని జ్యేష్ఠ పుత్రుడు. ఇతని పేరు మీదనే ‘భారతదేశా మని పేరు వచ్చింది. 3. శకుంతల దుష్యంతులకు పుట్టినవాడు.
 • 卍 మత్యయంత్రం:  ద్రౌపదీ స్వయంవరంలొ పైన ఒక మత్స్య యంత్రాన్ని నిర్మించి దాని కింద ఉన్న నీటిళో ఆ యంత్ర  ప్రతిబింబాన్ని చూస్తూ ఆ యంత్రాన్ని చేదించగలిగినవాడే తన కుమార్తెకు తగిన వరుడని ద్రుపద మహారాజు ప్రకటిస్తాడు. దానిని అర్జునుడు చేదించి ద్రౌపదిని పరిణయమాడుతాడు.
 • 卍 మన్మధుడు: విష్ణువు కు మానస పుత్రుడు.రతీదేవి ఈయన భార్య.పుష్పధన్యుడు.మంచి రూపం కలిగిన వాడు.
 • 卍 మహిషాసుర మర్దిని: మహిషాసురుడు అనే రక్షస్శుణ్ణి చంపడం వల్ల పార్వతికి ఈ పేరు వచ్చింది.
 • 卍 మానస సరోవరం : పవిత్ర తటాకం.ఇది హిమాలయ పర్వతసిఖరాల.మధ్య టిబెట్టులో ఉన్నది. హిందువులకు పవిత్ర తిర్థస్థలి.
 • 卍 మారీచుడు: రక్షసి తాటక కుమారుడు.రావనునిచే సితపహరన సమయం లో ఎతడు బంగారు జింకగా మాయరూపం దాల్చాడు.
 • 卍 మేనక: విస్వామిత్రుని తపోభంగానికి ఇంద్రుదు నియమించిన అప్సరస.వీరెకలయిక వల్ల శకుంతల జన్మించింది.
 • 卍 మేరుపర్వతం : గొప్ప పర్వతం. ధైర్యసహసాల్ని సాదరనంగా దీనితో పోలుస్తారు.
 • 卍 మోహిని: క్షీరసాగర మధనమప్పుడు ఫలించిన అమౄతం అసురులకు దక్కకుండా మోసం చేయడానికి విష్ణువు ధరించిన స్త్రీ  వేషం.
 • 卍 యశోద: శ్రీ కౄష్ణుని పెంపుడు తల్లి నందుని భార్య.
 • 卍 యాజ్ణ్జవల్క్యం : అష్టాదశ స్మౄతులలో ఒకటి.
 • 卍 యాజ్ణ్జవల్క్యుడు: యజుర్వేద ధురందురుడు ఇన వైశంపాయుని శిష్యుడు.
 • 卍 యుధిష్ఠరుడు: ధర్మరాజుకు మరొక పేరు.
 • 卍 రంభ: ఒక అప్సరస.ఇంద్ర సభలో రూపురేఖా లావణ్యాలు గల స్త్రీ.
 • 卍 రతీదేవి: మన్మధుని భార్య.
 • 卍 రాధ: శ్రీకౄష్ణుని ప్రియురాలు.నందుని చెల్లెలు.
 • 卍 రావణుడు: లంకాధిపతి.రామయనం లో ప్రతినాయకుడు. విశ్వవసుని పుత్రుడు. దశకంఠుడు. మండోదరి ఈయన భార్య. ఇంద్రజిత్తు, మేఘనాదుడు ఇతని కొడుకులు.
 • 卍 రుక్మిణి: శ్రీకౄష్ణుని  పెద్ద భార్య.ప్రద్యుమ్నుడు తల్లి.
 • 卍 లక్ష్మిదేవి: విష్ణుమూర్తి భార్య. క్షీరసాగర మధనం సమయం లో పుట్టినది.
 • 卍 లవకుశులు: సీతారాముల కవల పిల్లలు.
 • 卍 లేలావతి: హిరణ్యకశివుని భార్య.ప్రహలాదుని తల్లి.
 • 卍 లోపాముద్ర: అగస్త్యుని భార్య.మహాపతివ్రత.
 •  వజ్రదమ్ష్ర్టుడు: రావణుని భటుడు.వీనిని అంగదుడు చంపుతాడు.
 • 卍 వరూధిని: ఒక గంధర్వ స్త్రీ.మనుచరిత్ర లో నాయక శౄంగారనయక.
 • 卍 వశిస్ఠుడు: సప్తమహర్షులల్లో ఒకరు.ఇతని భార్య అరుంధతి. దశరథునికి గురువు.
 • 卍 వసుదేవుదు: శ్రీ కౄష్ణుని తండ్రి.
 • 卍 వాలి: సుగ్రీవుని అన్న.అంగదుడు ఈయన పుత్రుడు.తార ఈయన భార్య.
 • 卍 వాల్మీకి: వాల్మీకం అంటే పుట్ట.పుట్టలోంచి పుట్టిన వాడు వాల్మీకి.సంస్కౄత భాషలో మహాకవి.రామాయణ కర్ర్త. మొట్టమొదట కావ్యకర్ర్త.
 • 卍 వికర్ణుడు: గాంధరి-దౄతరాష్ర్టుల కుమారుడు.ద్రౌపదీ వస్త్రపహరనకు ముందు సభలో దుర్యోధనుని చర్య గ్రహించినవాదు.
 • 卍 విచిత్రవీర్యుడు: దౄతరాష్ర్ట,పాండురాజుల తంద్రి.
 • 卍 విద్యుత: అలకాపురి దీవకన్య,అస్టావక్రుడి గౌరవార్ర్ధం నౄత్యం చేస్తుంది.
 • 卍 విదురుడు : వ్యాసమహర్షికి అంత:పురంలోని దాసి (అంబిక యొక్క దాసీ) యందు పుట్టినవాడు. నీతి విద్యాపారంగతుడు. దృతరాష్ట్రునికి నీతీని బోదిస్తూ ఉంటాడు.
 • 卍 విభీషణుడు : రావణుని సోదరుడు. ఇతడు రావణునికి నీతిబోధచేయగా వినిపించు కోలేదు.
 • 卍 విప్రుడు : దౄవుడి వంశంలోని రాజు సుచ్హాయ శిష్టుల కుమారుడు.
 • 卍 విశ్వపతి : మనువు అనే అగ్ని రెండవ కుమారుడు.
 • 卍 విశ్వరూపుడు : విశ్వకర్మ కుమారుడు సూర్యుని కుమార్తె, విష్టి ఇతని భార్య.
 • 卍 వేదవ్యాసుడు : సత్యవతి పరాశరుల కుమారుడు. మహాభరత కర్త.
 • 卍 వేది : బ్రహ్మదేవుని భార్య.
 • 卍 శకుంతల : మేనక విశ్వామిత్రుల కుమార్తె. దుష్యంతుని గాంధార వివాహం చేసుకుంటుంది. వీరి కుమారుడు భరతుడు ఇతని పేరే భారత దేశానికి వచ్హినది.
 • 卍 శరవణం : పర్వతీపరమేశ్వరుల రహస్యంగా విహరించే ఒక అరణ్యం.
 • 卍 శివగంగ : అగ్ని పెద్దకుమారుడైన అంగిరసుడి భార్య.
 • 卍 షష్టీదేవి : మూల ప్రకౄతిలోని ఆరవ భాగము నుండి జన్మించిన దేవత.
 • 卍 సత్యభామ : సత్రాజిత్తు కుమార్తె, శ్రీ కౄష్ణుని భార్య.
 • 卍 సత్యలోకం : బ్రహ్మలోకాన్ని సత్యలోకమంటారు.
 • 卍 సాలగ్రామం : మహావిష్ణు స్వరూపమైనరాయి, గండకి నదిలో ఉంటుంది.
 • 卍 సాంబుడు : జాంబవతి ,  శ్రీ కౄష్ణుల కుమారుడు.
 • 卍 సుదర్శనం : శ్రీ మహావిష్ణువు చక్రం సూర్యరేణువులతో విశ్వకర్మ చేశాడు.
 • 卍 సురభి : దేవతల గోవు .
 • 卍 హంసగీత : హంసరూపధరుడైన బ్రహ్మ సాధ్యులకు ఉపదేశించిన ధర్మప్రకారాన్ని తెలిపే ఒక గ్రంధం.
 • 卍 హోమధేనువు : యజ్ణ్జానికి కావలసిన పాలు ఇచ్హే ఆవు.
 • 卍 హ్లాదుడు : హిరణ్యకశిపుడి కుమారుడు, దమని ఇతని భార్య, వాతాపి ఇల్వలులు వీరి కుమారుడు.
రచన: నాగవరపు రవీంద్ర

Wednesday, May 2, 2018

యుగములు: అసలు యుగాలు ఎన్ని ? దేవతలకు - మానవులకు మద్య సమయ వ్యత్యాసమెంత - Yugalu - Kalamu

 యుగములు: అసలు యుగాలు ఎన్ని ? దేవతలకు - మానవులకు మద్య సమయ వ్యత్యాసమెంత - Yugalu - Kalamu
దేవతల కాల ప్రమాణము మన (మానవ) కాలప్రమాణమునకు 360 రెట్లు అధికము. అనగా మన ఒక సంవత్సరకాలము దేవతలకు ఒక దివారాత్రము (పగలు + రాత్రి).
 • మన 30 సంవత్సరములు దేవతలకు ఒక నెల. 
 • మన 360 సంవత్సరములు వారికి ఒక (దివ్య) సంవత్సరము. 
 • ఇట్టి 12,000 దివ్య సంవత్సరములు వారికి ఒక దివ్య యుగము (మహాయుగము). 
 • ఇది మనకు ఒక చతుర్యుగకాలానికి సమానము.
 • ఈ విధముగా లెక్క పెడితే మన 43,20,000 సంవత్సరములు ఒక మహాయుగము అగును
 • కృత యుగము = 4,800 దివ్య సంవత్సరములు = 17,28,000 మానవ సంవత్సరములు
 • త్రేతా యుగము = 3,600 దివ్య సంవత్సరములు = 12,96,000 మానవ సంవత్సరములు
 • ద్వాపర యుగము = 2,400 దివ్య సంవత్సరములు = 8,64,000 మానవ సంవత్సరములు
 • కలియుగము = 1,200 దివ్య సంవత్సరములు = 4,32,000 మానవ సంవత్సరములు (ఇందులో 5,106 సంవత్సరాలు జరిగినది)
 • మొత్తము 12,000 దివ్య సంవత్సరములు = 43,20,000 మానవ సంవత్సరములు - ఒక దివ్య యుగము (చతుర్యుగము, మహాయుగము)
ఇలాంటి వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక పగలు. బ్రహ్మ పగలును కల్పము (సర్గము) అంటారు. మరొక వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక రాత్రి.ఈ రాత్రిని ప్రళయము అంటారు. అటువంటి 360 దివారాత్రములు బ్రహ్మకు ఒక సంవత్సరము. అటువంటి 100 సంవత్సరములు బ్రహ్మ ఆయుఃకాలము.

కృతయుగంలో ధర్మం నాలుగు పాదాలపై నడుస్తుందనీ, త్రేతాయుగంలో మూడు పాదాలపైన, ద్వాపర యుగంలో రెండు పాదాలపైన, కలియుగంలో ఒక పాదంపైన నడుస్తుందని చెబుతారు.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

Thursday, April 19, 2018

వారానికి 7 రోజులు ఎందుకు నిర్ణయించారు ? Varaniki 7 Rojulu, why seven days for a week

వారానికి 7 రోజులు ఎందుకు నిర్ణయించారు ? Varaniki 7 Rojulu, why seven days for a week

 • వారానికి 7 రోజులు ఎందుకు??
 • రోజుకు 24 hours కదా hour అనే పదం ఎక్కడిది??
 • ఆదివారం తర్వాత సోమవారం_ఎందుకు?
 • మంగళ వారం రావొచ్చుగా??

మనలో కూడా చాలా మందికి తెలియని విషయాలు తెలుసుకుందాం..

ప్రపంచంలో ఏదేశానికి లేని జ్ఞాన సంపద మన సొత్తు, ఎన్నో వేల లక్షల సంవత్సరాల నుండి
మిగతా దేశాలు వారు గ్రహాలు అంటే ఏంటో తెలియక ముందే నవ గ్రహలను గుర్తించిన ఘనత మనదే..

ఎప్పుడు సూర్యోదయం, సూర్యాస్తమయం, చంద్రగ్రహణం సూర్యగ్రహణం ?
 • ఏ కార్తె లో ఏ పంట పండించాలి ఇవన్నీ కూడా మన భారతీయులు చేతి వేళ్ళు లెక్కలతో వేసి చెప్పినవే..
 • ఎటువంటి పరికరాలు టెలిస్కోపులు లేకుండా సాధించినవే..
పైన ప్రశ్నకి జవాబు:-

మన వాడుకలో ప్రతి రోజుకి ఒక పేరు ఉంది. 
ఆదివారము, సోమవారము, మంగళ వారము,బుదవారము, గురువారము, శుక్రవారము, శని వారము. ఇవి ఏడు.
ఇలా ఈ ఏడు రోజులకు ఏడు పేర్లు ఎందుకు పెట్టారు, ఆ పేర్ల నిర్ణయానికి ఒక శాస్త్రీయమైన పద్ధతి వుంది.
 • నిర్ధిష్టమైన పద్ధతిలో పూర్వ కాలంలో భారత మహర్షులు ఆ పేర్లను నిర్ణయించారు.
 • ఆ పేర్ల నిర్ణయానికి శాస్త్రీయమైన కారణాలున్నందునే, ఆ పేర్లే ప్రపంచ వ్యాప్తంగా ఆచరణలో నేటికి ఉన్నాయి.
 • భారత కాలమానంలో "హోరా" అనగా ఒక గంట అని అర్థం.
 • దీని నుండి పుట్టినదే ఇంగ్లీషు #HOUR .
 • ఒక రోజుకు 24 గంటలుంటాయి, అంటే 24 హోరాలు. ఒక రోజులో ఉన్న 24 గంటలు (24 హోరాలు) కూడా ఏడు హోరాల చక్రం లో తిరుగుతాయి ఆ హోరాలకి ఏడు పేర్లున్నాయి.
 • అవి వరుసగా.. (ఈ వరుసలోనే) శని, గురుడు, కుజుడు, రవి, శుక్ర, బుద, చంద్ర హోరాలు ప్రతి రోజు వుంటాయి.
 • ఈ 7 హోరాలే ప్రతి రోజు 24 గంటల్లో ఉంటాయి..
7 గంటల కొకసారి ఈ 7 హోరాలు పూర్తీ అయ్యాక మల్లి మొదటి హోరాకి వస్తుంది.. అంటే
శని హోరా నుండి చంద్ర హోరాకి మల్లి శని హోరాకి..

ఉదాహరణకు:
 • ఆది వారము రవి హోరాతో ప్రారంభం అయి మూడు సార్లు పూర్తికాగా
 • (3 సార్లు 7 హోరాలు 3x7 = 21 హోరాలు) 
 • 22వ హోరాపేరు మళ్ళీ రవి హోరా వస్తుంది.
 • 23 వ హోరా పేరు ఆ వరుసలో శుక్ర హోరా అవుతుంది. 
 • 24 వ హోరా బుధ హోర అవుతుంది.
 • దాంతో ఒక రోజు పూర్తవుతుంది. 
 • ఆ తర్వాత హోరా 25వ హోరా.. అనగా తరువాతి రోజు మొదటి హోరా దాని పేరు చంద్ర హోరా. అనగా సోమవారము.. అనగా చంద్ర హోరాతొ ప్రారంభ మౌతుంది.
ఏరోజు ఏ హోరాతో ప్రారంభ మవుతుందో ఆ రోజుకు ఆ హోరా పేరున దానికి ఆ పేరు వుంటుంది.

చంద్ర హోరాతో ప్రారంభమైనది గాన అది సోమవారము.

ఈ విధంగానే మిగిలిన దినములు కూడా ఆయా హోరాల పేరన పేర్లు ఏర్పడతాయి
రవి(సూర్యుడు) హోరాతో ప్రారంభం = రవివారం, ఆదిత్య అన్న కూడా సూర్యుడు పేరే..సో ఆదివారం, భానుడు అన్న కూడా సూర్యుడే భానువారం (కర్ణాటక, తమిళనాడు లో భానువారం వాడుతారు) ఇలా ఆయా హోరాలు బట్టి రోజుల పేర్లు వచ్చాయి...

ఆదివారం తరవాత సోమవారం ఎందుకు రావాలి? 
మంగళ వారమ్ రాకూడదా?? 

రాదు.. ఎదుకంటే  
 • ఆదివారం రవి హోరా ప్రారంభం అయ్యింది, 
 • తరువాత రోజు అంటే సోమవారం 
 • చంద్ర హోరాతో ప్రారంభం అయ్యింది కాబట్టి ఇది మన భారతీయుల గొప్పతనం.
 • ఈ విషయాలు తెలియక మనల్ని మనం చిన్న చూపు చూసుకుంటాం..
 • ప్రపంచంలో దేశమయినా మన పద్దతి ఫాలో అవ్వాల్సిందే కానీ మనకి మాత్రం మనం అన్నా 
 • మన దేశమన్నా లోకువ.
 • ఇంత నిర్థిష్టమైన పద్ధతిలో వారమునకు పేర్లు పెట్టారు గనుకనే భారత దేశ సంప్రదాయాన్ని 
 • ప్రపంచమంతా అనుసరిస్తున్నది..
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

Monday, April 16, 2018

సంస్కృతభాషను ప్రపంచ భాషలకు తల్లి భాష అని ఎందుకు అంటారు - Samskruta Bhasa

samskruta-bhasa-nijalu
సంస్కృతభాష__ప్రపంచాన్ని_తనవైపు_తిప్పుకుంటోంది

సంస్కృతభాషను గురించి మీరు ఆశ్చర్యపోయే నిజాలు ఏమిటో చూద్దాం. ఈ నిజాలను గుర్తించిన ప్రపంచం సంస్కృతాన్ని నెత్తిన పెట్టుకోవడం ప్రారంభించింది.

1.NASA వారి ప్రకారం ప్రపంచంలోని అన్ని భాషలలో అత్యంత స్పష్టమైన ఉచ్చారణ కలిగిన భాష సంస్కృతమే

2.ప్రపంచంలోని అన్ని భాషలలోనూ ఎక్కువ శబ్దకోశం (vocabulary) ఉన్నది సంస్కృతానికే.

3. ప్రస్తుతానికి సంస్కృతభాషలో 102,78 కోట్ల 50 లక్షల శబ్దాలు ఉన్నాయి.

4.సంస్కృతమనేది ఏ పదానికైనా ఒక ఖజానా వంటిది. ఉదాహరణకు 'ఏనుగు' అనే పదానికి సంస్కృతంలో 100 పైన పదాలున్నాయి.

5.NASA వద్ద ప్రస్తుతం 60,000 తాళపత్ర గ్రంథాలున్నాయి. వాటిలోని విషయాలపై పరిశోధన జరుగుతోంది.

6.1987 లో Forbes మ్యాగజీన్ computer software కు సంస్కృతభాష అత్యంత ఉపయోగకరం అని ప్రచురించింది.

7. మిగతా భాషలతో పోలిస్తే సంస్కృతభాషలో అతితక్కువ శబ్దాలతోనే వాక్యనిర్మాణం పూర్తిచేయవచ్చు.

8. ప్రపంచంలోని అన్ని భాషల ఉచ్చారణలో, నాలుక యొక్క మాంసగ్రంథుల పూర్తి వినియోగం జరిగేది కేవలం సంస్కృత భాష మాట్లాడుటలోనే.

9. అమెరికన్ హిందూ యూనివర్సిటీ ప్రకారం సంస్కృతభాష మాట్లాడేవారికి షుగర్ వ్యాధి కానీ, రక్తపోటు ఎన్నటికీ రావు.

10. సంస్కృతసంభాషణ వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. Speech therapy కి ఈ భాష అత్యంత ఉపయోగకరం.

11.జర్మనీ లోని 14 యూనివర్సిటీ లలో సంస్కృతబోధన జరుగుతోంది.
samskruta-bhasa-nijalu

12. NASA వారు అంతరిక్షంలోని వ్యోమగాములకు సందేశాలు పంపుతుంటే అవి చేరేటప్పటికి అందులోని పదాలు అస్తవ్యస్తమవుతున్నాయట. చివరికి వారు సంస్కృతాన్ని ఆశ్రయించి వారి ప్రయత్నంలో విజయం సాధించారు. ఎందుకంటే సంస్కృతవాక్యాలలోని పదాలను ఇటూఅటూ మార్చినా వాక్యార్థమూ మారదు. ఉదాహరణకు ఈ సంస్కృతవాక్యం చూడండి. "నేను పాఠశాలకు వెళ్ళుచున్నాను" అని చెప్పాలంటే
1. అహం పాఠశాలాం గచ్ఛామి ,అని చెప్పాలి. ఇందులోని పదాలు ఇటుఅటు అయినా అర్థం మారదు. దానినే
2.పాఠశాలాం గచ్ఛామి అహం.
3 గచ్ఛామి అహం పాఠశాలాం. ఇలా చప్పినా అర్థం మారదు అన్న నిజం NASA వారిని ఆశ్చర్యచకితులను చేసింది.

13. ఇంకొక విషయం. కంప్యూటర్ ద్వారా గణితసమస్యలకు programming language లో వ్రాసే algorithms సంస్కృతభాషలోనే వ్రాయబడి ఉన్నాయి గానీ ఇంగ్లీషు లో కాదు.

14.NASA వారి ద్వారా ప్రస్తుతం 6th మరియు 7th జనరేషన్ సూపర్ కంప్యూటర్లపై పరిశోధన జరుగుతోంది. ఇవి 2034 కల్లా తయారవుతాయట. అందులో వారు ఉపయోగిస్తున్న భాష సంస్కృతమే.

15.సంస్కృత భాషాభ్యాసం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుందని, జ్ఞాపకశక్తి పెరుగుతుందని పరిశోధనలలో ఋజువు పరచుకుని ప్రస్తుతం ఇంగ్లండ్ మరియు ఐర్లాండ్ లలో సంస్కృతాన్ని compulsory language గా బోధించటం ప్రారంభించారు.

16. ప్రస్తుతం ప్రపంచంలోని 17 దేశాలలో (  కనీసం ఒక యూనివర్సిటీ లోనన్నా ) Technical Courses లో  సంస్కృతబోధన జరుగుతోంది.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

భాగవతం, మహాభారతం అప్పటి ప్రాచీన ప్రదేశాలు - ఇప్పటి ఆధునిక క్రొత్త పేర్లు - Mahabaratam Appati pradesalu, Ippati Naamadheyalu

prachina-pradesalu-krotta-perlu
ప్రాచీన ప్రదేశాలు - ఆధునిక నామధేయాలు  భాగవతం, మహాభారతం
 • మహావిష్ణువు గజేంద్రున్ని మొసలి బారి నుంచి రక్షించిన స్థలం - దేవ్ ధాం,నేపాల్.
 • నృసింహస్వామి హిరణ్యకశిపుని వధించిన స్థలం - అహోబిలం,ఆంధ్రప్రదేశ్.
 • జమదగ్ని మహర్షి ఆశ్రమం - జమానియా, ఉత్తర్ ప్రదేశ్.
 • మహీష్మతి (కార్తవీర్యార్జునుని రాజధాని) - మహేశ్వర్,మధ్యప్రదేశ్
 • శమంత పంచకం (పరశురాముడు ఇరవైయొక్క మార్లు క్షత్రియులపై దండెత్తి వారి రక్తంతో 5 మడుగులు నెలకొల్పిన చోటు) మరియు దుర్యోధనుని చంపిన చోటు - కురుక్షేత్ర, హర్యానా
 • పరశురామక్షేత్రం (పరశురాముడు తన గొడ్డలిని సముద్రంలోకి విసిరి,సముద్రజలాలను వెనక్కి పంపి తనకోసం నేలను సృష్టించుకొన్న ప్రాంతం) - కేరళ,కర్ణాటక,మహరాష్ట్ర సముద్రతీర ప్రాంతం
 • మహేంద్ర పర్వతం (పరశురాముడు తపస్సు చేసిన స్థలం) - పశ్చిమ ఒరిస్సా
 • నిషాద రాజ్యం (నల మహారాజు రాజ్యం) - గ్వాలియర్ జిల్లా,మధ్యప్రదేశ్
 • వ్యాస మహర్షి పుట్టిన స్థలం - ధమౌలి, నేపాల్
 • నైమిశారణ్యం (వ్యాస మహర్షి తన శిష్యులకు వేదాలు,పురాణాలు బోధించిన ప్రాంతం) - సీతాపూర్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్
 • వ్యాస మహర్షి చెబుతుండగా, విఘ్నేశ్వరుడు మహాభారతం వ్రాసిన చోటు - మన గ్రామం, ఉత్తరాంచల్
 • ప్రతిష్టానపురం (పురూరవుని రాజధాని) - ఝున్సి,అలహాబాద్.
 • సాళ్వ రాజ్యం(సావిత్రీ,సత్యవంతుల కథలో సత్యవంతుని రాజ్యం) - కురుక్షేత్ర దగ్గర.
 • హస్తినాపురం (కౌరవుల రాజధాని) - హస్తినాపూర్, ఉత్తర్ ప్రదేశ్.
 • మధుపురం / మధువనం (కంసుని రాజధాని) - మధుర, ఉత్తర్ ప్రదేశ్.
 •  వ్రేపల్లె / గోకులం - గోకుల్, మధుర దగ్గర.
 • కుంతిపురి (పాండురాజు మొదటి భార్య కుంతిదేవి పుట్టినిల్లు) - గ్వాలియర్.
 • మద్ర దేశం (పాండురాజు రెండో భార్య మాద్రి పుట్టినిల్లు) - పంజాబ్ ప్రావిన్స్, పాకిస్తాన్.
 • ద్రోణనగరి (ద్రోణుడు నివసించిన ప్రాంతం) - డెహ్రాడూన్.
 • గురుగ్రామం (కురుపాండవులు విద్యాభ్యాసం చేసిన చోటు) - గురుగావ్, హర్యానా.
 • కర్ణుడు పరిపాలించిన అంగ రాజ్యం - కాబుల్ (ఆఫ్ఘనిస్తాన్).
 • పాండవుల లాక్షగృహ దహనం- వర్నాల్, హస్తినాపూర్.
 • కాలయవనుడు ముచికుందుని కోపాగ్ని జ్వాలలకు భస్మమైన స్థలం - గిర్నార్, గుజరాత్.
 • శ్రీకృష్ణ, బలరాముల ద్వారకా నగరం - ద్వారక,గుజరాత్.
 • హిడింబవనం (హిడింబాసురుడిని భీముడు చంపిన చోటు) -జలాన్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్.
 • విదర్భ (దమయంతి, రుక్మిణిదేవి తండ్రులు యేలిన రాజ్యం) - విదర్భ, మహరాష్ట్ర
 • కుండినపుర (రుక్మిణిదేవి జన్మస్థలం) - కుండినపుర, మహరాష్ట్ర
 • చేది రాజ్యం (శిశుపాలుడు ఏలిన రాజ్యం) - బుందేల్ ఖండ్, మధ్యప్రదేశ్.
 • కారుష రాజ్యం (దంతవక్రుడు ఏలిన రాజ్యం) - దాతియ జిల్లా, మధ్యప్రదేశ్.
 • ఖాండవప్రస్థం / ఇంద్రప్రస్థం (పాండవుల రాజధాని) - ఇంద్రప్రస్థ, ఢిల్లీ దగ్గర.
 • కుచేలుడు నివసించిన చోటు - పోర్ బందర్, గుజరాత్.
 • పాంచాల దేశం (ద్రుపద మహారాజు రాజ్యం) - ఎటాహ్, సహజహంపూర్, ఫారుఖాబాద్ ప్రాంతాలు, ఉత్తర్ ప్రదేశ్.
 • కంప్లి (ద్రౌపది పుట్టినిల్లు, మత్స్యయంత్ర బేధన స్థలం) - కంపిల్, ఉత్తర్.
 • జరాసంధుని భీముడు చంపిన చోటు - జరాసంధ్ కీ ఆఖరా / రణ్ భూమి, బీహార్.
 • కామ్యక వనం,దైత్య వనం (పాండవులు అరణ్య వాసం చేసిన ప్రాంతాలు) - పశ్చిమ హర్యానా.
 • మత్స్య దేశం (విరాట మహారాజు రాజ్యం) - ఆల్వార్,గురుగావ్ నుంచి జైపూర్ వరకు వున్న ప్రాంతం, రాజస్థాన్.
 • విరాటనగరం (పాండవులు అజ్ఞాత వాసం చేసిన స్థలం) - విరాట్ నగర్,రాజస్థాన్
 • శోణపురం (బాణాసురుడి రాజధాని) - సోనిత్ పూర్, అస్సాం.
 • ప్రాగ్జ్యోతిష్యం (నరకాసురుని రాజధాని) - తేజ్ పూర్, అస్సాం.
 • నిర్యాణానికి ముందు శ్రీకృష్ణుడు బోయవాని వేటుకి గురైన స్థలం - ప్రభాస తీర్థం, సోంనాథ్, గుజరాత్.
 • జనమేజయుడు సర్పయాగం చేసిన స్థలం - పర్హాం,ఉత్తర్ ప్రదేశ్.
 • కపిలవస్తు (బుద్ధుని జన్మస్థలం) - నేపాల్ లోని తిలార్కోట్.
 • బుద్ధునికి జ్ఞానోదయం అయిన స్థలం - బోధ్ గయ, బీహార్.
 • గౌతమ బుద్ధుడు పరినిర్యాణం చెందిన చోటు - కుశీనగర్, ఉత్తర్ ప్రదేశ్.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

Tuesday, March 13, 2018

వేదాలు - కలనైనా ఊహకందని నిజాలు - vedas and truth


వేదాలను వెక్కిరించే వెధవలకు కలనైనా ఊహకందని నిజాలు :

వేదాలను శృతి అని అంటారు. అంటే విని మరల మననం చేసి శిష్యులకు సాంప్రదాయంగా నేర్పుతారు. ఒక వేదమంత్రానికి వర్ణం, స్వరం, మాత్ర (ఎంతసేపు పలకాలో), బలం(ఎక్కడ ఒత్తి పెట్టి పలకాలో), సమం(ఏక పద్ధతి) మరియు సంతాన (ఎక్కడ విరవాలో, ఎక్కడ పోడిగించాలో) అనే 6 ముఖ్య ప్రామాణిక సూత్రాలకు లోబడి వుంటుంది. వీటిలో ఏది మారినా ఆ మంత్రానికి మొత్తం అర్ధం మారిపోతుంది. వాటి వలన అనుకున్న దానికి వ్యతిరిక్త ఫలితాలు రావచ్చును. ఈ వేదం మంత్రరాశిని కాపాడుకోవడానికి ఎన్నో పద్ధతులను మన ఋషులు వాడారు” వాక్య, పద, క్రమ, జట, మాల, శిఖా, రేఖా, ధ్వజ, దండ, రథ, ఘన” పద్ధతులలో నేర్చుకునేవారు. ఇవన్నీ అత్యంత గుహ్యమైన గొప్ప ఎర్రర్ కర్రెక్టింగ్ కోడ్స్.

వాక్య పాఠం: దీనినే సంహిత పాఠం అని కూడా అంటారు. అంటే ఒకే క్రమంతో ఉచ్చారణ, స్వరం, మాత్రలను జాగ్రత్తగా మంత్రాన్ని పఠించడం. A-B-C-D-E పద్ధతిలో చెప్పే ఈ విధానం plain data transfer లాంటిది.

పద పాఠం: దీనిలో పదాలుగా విభజించి పదాలు పదాలు గా గుర్తు పెట్టుకోవడం. దీనివల్ల తప్పు జరగడం తక్కువ అవుతుంది. ఒకొక్క పదాన్ని ఒకొక్క సెట్ గా ఉంచుకుని వాక్య, పద పాఠాలు కలిపి చదువుకుంటే తప్పులుంటే తప్పక తెలిసిపోతాయి. SECDED అనే పద్ధతి నేటి ఎర్రర్ కరెక్షన్ లో అతి సాధారణంగా మనం చూస్తూ వుంటాం. ఇది అదే పద్ధతి. ఉదాహరణకు ఒకరి ఫోన్ నెంబర్ గుర్తు పెట్టుకోవాలంటే మొత్తం పది digits గుర్తుపెట్టుకోవడం వాక్యపాఠం పద్ధతి. దాన్నే రెండు రెండు digits గా గుర్తు పెట్టుకోవడం వల్ల తప్పు జరిగే అవకాశం తక్కువ. లేదా మూడు మూడు digits గుర్తు పెట్టుకుంటే తప్పు జరిగే అవకాశం మరింత తక్కువ.

ఈ పై రెండు పద్ధతులు ప్రాకృతిక పద్ధతులు. వాటి natural order లో చదువుతాము.
అలా కాక natural order ని చేదించి artificial order లో వెళ్తే ఎర్రర్ కరెక్షన్ కి మరింత అవకాశం వుంటుంది. వీటిలో మూడు ముఖ్యమైన పద్ధతులను చూడండి.

క్రమ పాఠం: A,B; B,C; C,D; D,E – ఇది ఒక పాయింటర్ పద్ధతి ప్రకారం చైన్ కనెక్షన్ లా మొత్తం encrypt + single redundancy మెథడ్. నేటి కాలంలో మనం విరివిగా చూస్తున్న చైన్ బేస్డ్ మెమరీ టెక్నిక్ ఇదే. చూడండి నేడు కొంతమందికి వండర్ మెమరీ అని పేరు చెప్పి ఎంత పెద్ద సీక్వెన్స్ అయినా గుర్తు పెట్టుకునేలా నేర్పుతున్నారు. మధ్యనుండి అడిగినా మరల మొత్తం సీక్వెన్స్ reconstruct చెయ్యవచ్చు. A  B  C D E …చూసారా ఇంజనీరింగ్ చదివిన వారు ఇతి యిట్టె పట్టేస్తారు పాయింటర్ లాజిక్. ఇది మనం నేడు చదువుకుంటున్నాం. కానీ ఈ పద్ధతి మనం వాడుకలో ఎప్పటి నుండి వాడుతున్నామో చూడండి.

జట పాఠం: A –B – B – A – A – B; B –C – C- B – B –C; C – D – D- C- C – D; (A-B) ఒక సెట్ అయితే దాని మిర్రర్ ఇమేజ్ (B – A ) మరల (A – B ). దీన్ని redundancy, అలాగే క్రిప్టోగ్రఫీ కలగలిపిన పద్ధతి. ఇప్పుడు ఈ రకంగా డేటా పంపితే దీనినుండి మూలకమైన (A, B) ఏ రకంగాను డేటా లాస్ కి లోను కాక మొత్తం decrypt చెయ్యగలం. నేటి redundant codes, ఎన్క్రిప్షన్ methods మన జటపాఠం లో ఎలా నిబిడీకృతమై ఉన్నదో ఒకసారి చూడండి.

ఘనపాఠం: A – B – B-A – A-B-C - C-B-A- A-B-C; B-C- C-B- B-C-D – D-C-B – B-C-D; ఇదొక అడ్వాన్స్డ్ పద్ధతి. ఈ పద్ధతి ద్వారా డేటా మరింత బలంగా ఎన్క్రిప్షన్ జరుగుతుంది. అలాగే ఇటువంటి పద్ధతిలో డేటా లాస్ అనేది చాలా చాలా తక్కువ.

ఋగ్వేదం మొత్తం ఘనంలా పఠించాలంటే ఏకంగా 450 గంటలు పడుతుందిట. అంత వారు నేర్చుకుని అలా పఠించగలిగే సాధన వారికి కనీసం 25 సంవత్సరాల అభ్యాసం మీద వస్తుంది. ఇటువంటి ఘనమైన చరిత్ర, పద్ధతి మనది. తలచుకుంటేనే మన ఒళ్ళు గుగుర్పాటుకు గురవ్వక మానదు. ఇటువంటి గొప్ప పద్ధతులు పేటెంట్ అయి లేవు. వేదం జ్ఞానం అందరికీ అందాలని చెప్పింది తప్ప .....

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

GAU NATURALS - Swadesi Products

Cow Based Cultivated Rice,Dals,Spices.Hand Churned DESI COW GHEE,Panchgavya Products,Ayurvedic Products..
స్వదేశీ గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయం లో పండించిన పంట ఉత్పత్తులు, చేతితో విసిరిన పప్పులు,గానుగ నూనె లు, గోశాల లో తయారు చేసిన ఆవు నెయ్యి, పళ్ళపొడి సబ్బు లు షాంపూలు,ఫినాయిల్ మరెన్నో స్వదేశీ ఉత్పత్తుల సమాహారమే - గౌ నాచురల్స్. www.gaunaturals.com